Google Play నుండి పుస్తకాలను అద్దెకు తీసుకోండి

మీరు Google Play నుండి ఈ-బుక్‌లు, ఆడియోబుక్‌లను అద్దెకు తీసుకోవచ్చు.

పుస్తకాలను అద్దెకు తీసుకోండి

  1. బ్రౌజర్‌లో, Google Play Booksకు వెళ్లండి.
  2. మీరు అద్దెకు తీసుకోవాలనుకుంటున్న పుస్తకాన్ని కనుగొనండి.
  3. అద్దెకు తీసుకోండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • అద్దెకు తీసుకోండి అనే బటన్, పుస్తకం అద్దె ధరను లిస్ట్ చేస్తుంది.
    • ఒకవేళ "అద్దెకు తీసుకోండి" అనే బటన్ కనిపించకపోతే పుస్తకం అద్దెకు అందుబాటులో లేదు అని అర్థం.
  4. ధరను ఎంచుకుని, చెక్ అవుట్ చేయడానికి ప్రాంప్ట్‌లను ఫాలో చేయండి.
చిట్కా: మీరు అద్దెకు తీసుకున్న పుస్తకం, మీ లైబ్రరీలో కనిపిస్తుంది.

పుస్తకం అద్దె వ్యవధి ముగిసినప్పుడు చెక్ చేయండి

  1. బ్రౌజర్‌లో, మీ Google Play Books లైబ్రరీకి వెళ్లండి. 
  2. మీరు అద్దెకు తీసుకున్న పుస్తకానికి వెళ్లండి.
  3. అద్దె వ్యవధి పుస్తకం కవర్‌పై కనిపిస్తుంది.

అద్దె వ్యవధులతో ఉన్న సమస్యలను పరిష్కరించండి

  1. మీరు పుస్తకాన్ని అద్దెకు తీసుకోవడానికి ఉపయోగించిన Google ఖాతాకు సైన్ ఇన్ చేశారని నిర్ధారించుకోండి.
  2. మీరు Google Play Books యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేశారో లేదో చెక్ చేయండి.

పుస్తకం అద్దె వ్యవధులు ఎలా పని చేస్తాయి

  • అన్ని పుస్తకాలు అద్దెకు అందుబాటులో లేవు.
  • మీరు చెక్ అవుట్ చేసినప్పుడు అద్దె వ్యవధి ఎంతకాలం ఉంటుందో మీరు చెక్ చేయవచ్చు.
  • మీరు కొనుగోలు చేసినప్పటి నుండి, మీరు పుస్తకాన్ని తెరచినా, తెరవకపోయినా మీ అద్దె గడువు మాత్రం ప్రారంభమవుతుంది.
  • ప్రింటింగ్ వంటి కొన్ని ఫీచర్‌లు అద్దెకు తీసుకున్న పుస్తకాలకు అందుబాటులో ఉండవు.

అద్దె వ్యవధి ముగిసిన తర్వాత ఏమి జరుగుతుంది

  • పుస్తకాలు ఇప్పటికీ మీ లైబ్రరీలో "గడువు ముగిసినవి"గా కనిపిస్తాయి.
  • మీరు ఇకపై పుస్తకం డౌన్‌లోడ్ వెర్షన్‌లను ఉపయోగించలేరు.
  • మీరు పుస్తకాన్ని మళ్లీ కొనుగోలు చేసినా లేదా అద్దెకు తీసుకున్నా, మీ నోట్స్, హైలైట్‌లు ఇప్పటికీ అందుబాటులో ఉంటాయి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16110854730625574173
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false