యాప్‌లో కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలు

కొన్ని యాప్‌లతో, మీరు యాప్ లోపల అదనపు కంటెంట్ లేదా సర్వీస్‌లను కొనుగోలు చేయవచ్చు. వీటిని మేము "యాప్‌లో కొనుగోళ్లు" అంటాము. గేమ్‌లో ఏదైనా శక్తివంతమైన ఖడ్గం, యాప్‌నకు చెందిన మరిన్ని ఫీచర్‌లను అన్‌లాక్ చేసే కీ, లేదా కొనుగోళ్ల కోసం ఉపయోగించే వర్చువల్ కరెన్సీ వంటివి ఈ 'యాప్‌లో కొనుగోళ్ల'కు కొన్ని ఉదాహరణలు.

మీ యాప్‌లో కొనుగోలు చూపించకపోయినా, పని చేయకపోయినా లేదా డౌన్‌లోడ్ అవ్వకపోయినా, మీరు ఇవి చేయవచ్చు:

  • సమస్యను మీ అంతట మీరే పరిష్కరించడం.
  • సపోర్ట్ కోసం డెవలపర్‌ను సంప్రదించడం.
  • రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడం.

మీరు యాప్‌లో కొనుగోలు చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు, లావాదేవీ తిరస్కరించబడితే లేదా పేమెంట్ జరగకపోతే, Google Playలోని పేమెంట్ సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేయండి.

సమస్యను మీ అంతట మీరే పరిష్కరించండి

ఈ దశలు మీ సమస్యను పరిష్కరించకపోతే, డెవలపర్‌ను సంప్రదించండి. వారి యాప్‌లకు సపోర్ట్‌ను అందించడం, అవి మీకు బాగా పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడం డెవలపర్ బాధ్యత.

మీ కనెక్టివిటీని చెక్ చేయండి

యాక్టివ్‌గా ఉండి, పని చేసే Wi-Fi లేదా మొబైల్ డేటా కనెక్షన్ మీ వద్ద ఉందో లేదో చెక్ చేయండి. వెబ్‌ను సెర్చ్ చేయడం ద్వారా దీన్ని సులభంగా చెక్ చేయవచ్చు. కుక్క పిల్లల కోసం Googleను సెర్చ్ చేయడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి. కుక్క పిల్లలకు సంబంధించి మీకు సమాచారం కనిపిస్తే, బహుశా మీ ఇంటర్నెట్ కనెక్షన్‌తో సమస్య ఉండకపోవచ్చు.

ఒకవేళ సెర్చ్ పని చేయకపోతే, కనెక్టివిటీతో సమస్య ఉండవచ్చు. మీ కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి ట్రై చేయండి.

ఫోర్స్ స్టాప్ చేసి, ఆ తర్వాత యాప్‌ను లేదా గేమ్‌ను మళ్లీ తెరవండి

మీరు కొనుగోలు చేసిన యాప్‌లోని ఐటెమ్ మీకు అందకపోతే, మీరు ఉపయోగిస్తున్న యాప్ లేదా గేమ్‌ను మూసివేసి, రీస్టార్ట్ చేయండి.
  1. మీ పరికరంలో, ప్రధాన సెట్టింగ్‌ల యాప్ Settingsను తెరవండి.
  2. యాప్‌లు లేదా యాప్‌లను మేనేజ్ చేయండి (మీ పరికరాన్ని బట్టి, ఇది వేరుగా ఉండవచ్చు) ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. మీరు యాప్‌లో కొనుగోలు చేయడానికి ఉపయోగించిన యాప్‌ను ట్యాప్ చేయండి.
  4. 'ఫోర్స్ స్టాప్'ను ట్యాప్ చేయండి.
  5. మీరు యాప్‌లో కొనుగోలు చేయడానికి ఉపయోగించిన యాప్‌ను మళ్లీ తెరవండి.
  6. మీ ఐటెమ్ డెలివరీ అయ్యిందో లేదో చెక్ చేయండి.

మీ పేమెంట్ పూర్తయిందో లేదో అనేది చెక్ చేయండి

మీ లావాదేవీ పూర్తయినప్పుడు మీరు మీ యాప్‌లో కొనుగోలును అందుకుంటారు. మీరు Play Store యాప్‌లో లేదా Google Play వెబ్ పేజీలో పేమెంట్ జరిగిందో లేదో చెక్ చేయవచ్చు.

Play Store యాప్‌తో పేమెంట్‌ను చెక్ చేయండి

  1. Google Play Store యాప్ ను తెరవండి.
  2. పైన కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత బడ్జెట్ & హిస్టరీ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

వెబ్ బ్రౌజర్‌తో పేమెంట్‌ను చెక్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, మీ Google Play ఖాతాకు వెళ్లండి.
  2. ఎగువున ఉన్న, ఆర్డర్ హిస్టరీ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీ యాప్‌లో కొనుగోలును కనుగొనండి.

పరికరాన్ని రీస్టార్ట్ చేయండి

కొన్నిసార్లు పరికరాన్ని రీస్టార్ట్ చేయడం ద్వారా 'యాప్‌లో కొనుగోలు' సమస్యలను పరిష్కరించవచ్చు. రీస్టార్ట్ చేయడానికి:

  1. మీ మొబైల్ పరికరంలో, పవర్ బటన్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. పవర్ ఆఫ్ లేదా రీస్టార్ట్ (మీ పరికరాన్ని బట్టి, ఈ టెక్స్ట్ వేరుగా ఉండవచ్చు) ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. అవసరమైతే, పరికరాన్ని తిరిగి ఆన్ చేయడానికి మళ్లీ పవర్ బటన్‌ను నొక్కి, పట్టుకోండి.
  4. పరికరం తిరిగి స్టార్ట్ అయ్యే వరకు వేచి ఉండండి.
  5. మళ్లీ యాప్‌ను లేదా గేమ్‌ను తెరిచి, మీరు యాప్‌లో కొనుగోలు చేసిన ఐటెమ్ మీకు అందిందో లేదో చెక్ చేయండి.

Play స్టోర్ యాప్‌ను అప్‌డేట్ చేయండి

యాప్‌లో కొనుగోళ్ళు అనేవి మీరు Play Store తాజా వెర్షన్‌ను రన్ చేసినప్పుడు అత్యుత్తమంగా పని చేస్తాయి. యాప్‌ను అప్‌డేట్ చేయడానికి:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play Store యాప్ ను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు Settings ఆ తర్వాత వీటి గురించిఆ తర్వాత Play Store వెర్షన్ అనే దాన్ని ట్యాప్ చేయండి.
  4. మీ వెర్షన్ అప్‌డేట్ అయ్యి ఉందని, మీకు యాప్ అప్‌డేట్ చేస్తుంది లేదా తెలియజేస్తుంది.

Androidలోని Play Store & యాప్‌లను ఎలా అప్‌డేట్ చేయాలి అనేదాని గురించి మరింత తెలుసుకోండి.

తేదీ, సమయం సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి

మీరు ఇటీవల మీ పరికరంలో తేదీ, సమయాన్ని మార్చినట్లయితే, తేదీ, సమయం సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి:

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, మీ పరికర సెట్టింగ్‌ల యాప్ Settingsను తెరవండి.
  2. 'తేదీ & సమయం' మీద ట్యాప్ చేయండి.
  3. "ఆటోమేటిక్ తేదీ & సమయం" అలాగే "ఆటోమేటిక్ టైమ్ జోన్" కోసం చూడండి, అవి ఆన్ చేయబడి ఉన్నాయో, ఆఫ్ చేయబడి ఉన్నాయో చెక్ చేయండి. ఆ తర్వాత, దిగువున ఉన్న దశలలో సంబంధితమైన వాటిని ఫాలో చేయండి. 

"ఆటోమేటిక్ తేదీ & సమయం" అలాగే "ఆటోమేటిక్ టైమ్ జోన్" ఆఫ్ చేయబడి ఉంటే

  1. తేదీ & సమయం, టైమ్ జోన్ సెట్టింగ్‌లు రెండింటినీ ఆన్ చేయండి.
  2. కొన్ని నిమిషాలు వేచి ఉండి, ఆ తర్వాత మీ సమస్య పరిష్కారం అయ్యిందో లేదో చెక్ చేయండి.
  3. పరిష్కారం కాకుంటే, మీ పరికరాన్ని రీస్టార్ట్ చేసి, మళ్లీ చెక్ చేయండి.

"ఆటోమేటిక్ తేదీ & సమయం" అలాగే "ఆటోమేటిక్ టైమ్ జోన్" ఆన్ చేయబడి ఉంటే

  • ఈ సెట్టింగ్‌లు రెండూ ఆన్‌లో ఉంటే, తేదీ అలాగే సమయం మీ సమస్యకు కారణం కాకపోవచ్చు. మీ కనెక్టివిటీని చెక్ చేసి, మీ పరికరాన్ని రీస్టార్ట్ చేయండి, లేదా ఇతర పరిష్కార ప్రక్రియలను ట్రై చేయండి.
మీ Google Play దేశాన్ని చెక్ చేయండి

యాప్ డెవలపర్ మీ Google Play దేశంలో యాప్‌ను అందుబాటులో ఉంచకపోతే, మీరు యాప్‌లో కొనుగోళ్లను చేయలేరు. మీరు కొత్త దేశానికి వెళ్లినట్లయితే, మీ Google Play దేశాన్ని మార్చుకోవచ్చు.

సపోర్ట్ కోసం యాప్ డెవలపర్‌ను సంప్రదించండి

మీకు ఇప్పటికీ యాప్‌లో చేసిన కొనుగోలుతో సమస్యలు ఉండి, మీరు ఫీడ్‌బ్యాక్‌ను అందించాలని లేదా సహాయాన్ని కోరాలని భావిస్తుంటే, మీరు యాప్ డెవలపర్‌ను సంప్రదించవచ్చు.

వీటికి సంబంధించి మీరు యాప్ డెవలపర్‌ను సంప్రదించడం ఉత్తమం:

  • యాప్ లేదా గేమ్‌కు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు సహాయం పొందడానికి.
  • యాప్‌ను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోవడానికి.
  • యాప్‌లో చేసిన కొనుగోలును మీ ఖాతాకు జోడించడానికి.
  • యాప్‌లో చేసిన కొనుగోలు అందకపోతే, దాని గురించి అడగటానికి.
  • నిర్దిష్ట యాప్‌లకు సంబంధించి యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ సైన్ ఇన్ సమస్యలకు సహాయం పొందటానికి.

యాప్ డెవలపర్ కాంటాక్ట్ సమాచారాన్ని కనుగొనండి.

రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయండి

మీ కొనుగోలుకు, సమస్యకు సంబంధించిన వివరాలను బట్టి, మీకు రీఫండ్ లభించవచ్చు. Google Playలో రిటర్నులను, రీఫండ్‌లను పొందడంపై మరింత సమాచారం కనుగొనండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
452737593653247021
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false