Google TV యాప్‌తో ప్రారంభించండి

మీరు Google TV యాప్ లో మీ స్ట్రీమింగ్ సర్వీస్‌ల నుండి సిఫార్సులను అన్వేషించవచ్చు, ఇంకా సినిమాలు, షోలను చూడవచ్చు.

Google TV యాప్‌ను పొందండి

మీ Android పరికరంలో Google TV యాప్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేయబడుతుంది.

మీకు Google TV యాప్ కనిపించకపోతే:
  1. మీ Android పరికరంలో, Google Play Store Google Playను తెరవండి.
  2. Google TV కోసం సెర్చ్ చేయండి.
  3. అప్‌డేట్ చేయండి లేదా ఇన్‌స్టాల్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

Google TV యాప్‌ను నావిగేట్ చేయండి

  • హైలైట్‌లు: మీరు ఇష్టపడే సినిమాలు, షోల గురించి మరింత తెలుసుకోవడానికి మీ కోసం వ్యక్తిగతీకరించిన గణాంకాలు, వార్తలు.
  • మీ కోసం: మీరు చూసే వాటి ఆధారంగా, మీ ఖాతాకు మీరు జోడించే స్ట్రీమింగ్ సర్వీస్‌ల ఆధారంగా సిఫార్సులు.
  • షాప్: మీరు అద్దెకు తీసుకోగల లేదా కొనుగోలు చేయగల సినిమాలు.
  • మీ ఐటెమ్‌లు: మీకు అర్హత ఉన్న పరికరాల్లో దేనిలోనైనా Google TV, Play Movies & TV, Android TV, లేదా YouTube ద్వారా మీరు ఇంతకు ముందు కొనుగోలు చేసిన సినిమాలు, షోలు. మీ వాచ్‌లిస్ట్‌కు మీరు జోడించిన సినిమాలు, షోలను కూడా మీరు కనుగొనవచ్చు.

4.27 కంటే పాత యాప్ వెర్షన్‌ను కలిగి ఉన్న Google TV యూజర్‌లు పరిమిత అనుభవాన్ని కలిగి ఉంటారు, ఇక్కడ:

  • మీ లైబ్రరీలో ఇప్పటికే ఉన్న కంటెంట్‌ను మీరు యాక్సెస్ చేయవచ్చు.
  • సర్వీస్‌లను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను మీరు క్లిక్ చేసినప్పుడు, డిస్ట్రిబ్యూటర్‌ల ఖాళీ లిస్ట్, స్పిన్నర్, లేదా ఎర్రర్ మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.

చిట్కా: మీరు యాప్‌ను అప్‌డేట్ చేయాలని సిఫార్సు చేయబడింది. మీరు యాప్‌ను అప్‌డేట్ చేయలేకపోతే, మీ ప్రస్తుత కొనుగోళ్లను యాక్సెస్ చేయడానికి YouTube యాప్‌ను ఉపయోగించండి.

 

మీ మొదటి స్క్రీన్‌కు Google TV విడ్జెట్‌ను జోడించండి

ముఖ్య గమనిక: ఈ దశలలో కొన్ని, Android 9లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్ మొదటి స్క్రీన్‌లో, ఖాళీ స్పేస్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. విడ్జెట్‌లు విడ్జెట్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. Google TV యాప్‌ను కనుగొని, ఎంచుకోండి.
  4. మీ మొదటి స్క్రీన్‌లో విడ్జెట్‌ను ఉంచడానికి, దాన్ని నొక్కి, పట్టుకోండి. 
  5. మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడికి విడ్జెట్‌ను స్లైడ్ చేయండి.
  6. మీ వేలును పైకి ఎత్తండి.

సంబంధిత రిసోర్స్‌లు

Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14141555373104964742
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
84680
false
false