సర్వీస్‌లు లేదా కంటెంట్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

Google Playతో కూడిన కొన్ని నిర్దిష్ట యాప్‌లలో, పెయిడ్ ప్రీమియం సర్వీస్‌లకు, ఫీచర్‌లకు మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నప్పుడు:

  • సబ్‌స్క్రిప్షన్ నిరవధికంగా కొనసాగించబడుతుంది, అంతే కాకుండా మీ సబ్‌స్క్రిప్షన్ నియమాల ప్రకారం, ప్రతి బిల్లింగ్ వ్యవధి ప్రారంభంలో, అంటే ఉదాహరణకు వారానికో, సంవత్సరానికో లేదా మరేదైనా వ్యవధికో మీకు ఛార్జీ విధించబడుతుంది.
  • మీరు ట్రయల్ ఆఫర్‌ను ఆమోదించినట్లయితే, మీ ట్రయల్ పీరియడ్ ముగుస్తున్నప్పుడు మీకు ఒక ఈమెయిల్ వస్తుంది.
    • మీ ట్రయల్ పీరియడ్ ముగిసే సమయానికి, మొదటి బిల్లింగ్ వ్యవధి ప్రారంభమవుతుంది, అలాగే మీ సబ్‌స్క్రిప్షన్‌ల నియమాల ప్రకారం మీకు ఆటోమేటిక్‌గా ఛార్జీ విధించబడుతుంది.
    • ఛార్జీలను నివారించడానికి, మీ ట్రయల్ పీరియడ్ ముగిసే లోపు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి.
  • మీరు తర్వాతి బిల్లింగ్ వ్యవధికి ముందు, 24 గంటల వరకు మీ పేమెంట్ ఆప్షన్‌లో పేమెంట్ ప్రామాణీకరణను కనుగొనవచ్చు, కానీ మీకు బిల్లింగ్ వ్యవధి రీ-యాక్టివేషన్ తేదీన మాత్రమే ఛార్జీ విధించబడుతుంది. పేమెంట్ ప్రామాణీకరణను తీసివేయడానికి, మీ తర్వాతి బిల్లింగ్ కాల వ్యవధి ప్రారంభం కావడానికి ముందే, సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి.
  • మీరు Google Playలోని సబ్‌స్క్రిప్షన్‌లలో ఎప్పుడైనా మీ సబ్‌స్క్రిప్షన్‌ను మీరు రద్దు చేయవచ్చు. మీరు రద్దు చేసినప్పుడు, మీరు పేమెంట్ ప్లాన్‌తో మీ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయకపోతే, మీ ప్రస్తుత బిల్లింగ్ వ్యవధి ముగింపులో సబ్‌స్క్రిప్షన్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు. పేమెంట్ ప్లాన్‌ల కోసం రద్దు ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి దిగువున ఉన్న "పేమెంట్ ప్లాన్ యొక్క ఆటోమేటిక్ రీ-యాక్టివేషన్‌ను ఆపివేయండి" అనే విభాగాన్ని చూడండి.
  • నిర్దిష్ట అధికారిక ప్రదేశాల పరిధిలో, మీకు ఈ ఆప్షన్‌లు ఉంటాయి:
  • మీ ప్రాథమిక పేమెంట్ ఆప్షన్ గడువు ముగిసినా లేదా విఫలమైనా మీ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌కు అంతరాయాలను నివారించడంలో సహాయపడటానికి మీరు మీ Google Play ఖాతాకు రెండవ పేమెంట్ ఆప్షన్‌ను కూడా జోడించవచ్చు. బ్యాకప్ పేమెంట్ ఆప్షన్‌ను ఎలా జోడించాలో తెలుసుకోండి.
  • ఒకవేళ మీ పేమెంట్ విజయవంతం కాకపొతే, మీ పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయడానికి మీకు అదనపు గడువు ఉండవచ్చు. అదనపు గడువు సమయంలో, మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను ఇంకా ఉపయోగించగలరు. అదనపు గడువు ముగిసినప్పుడు, లేదా అదనపు గడువు లేకపోయినట్లయితే, 60 రోజుల వరకు మీ ఖాతా నిలుపుదల చేయబడవచ్చు, ఈ సమయంలో మీరు సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించలేరు. ఏదైనా అదనపు గడువు, ఖాతా నిలుపుదల సమయంలో, Play కాలానుగుణంగా పేమెంట్ కోసం మళ్లీ ట్రై చేస్తుంది. ఏదైనా అదనపు గడువు, ఖాతా నిలుపుదల సమయం ముగిసేలోపు పేమెంట్ సమస్య పరిష్కారం కాకపోతే, సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రద్దు చేయబడుతుంది.
  • మీకు సబ్‌స్క్రిప్షన్‌లను అందించడంలో డెవలపర్‌లకు సహాయపడటానికి, మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించలేని సబ్‌స్క్రిప్షన్ డేటాను, వారికి Google షేర్ చేయవచ్చు.

చిట్కా: మీరు Chromebookను ఉపయోగిస్తూ దానిలో Google Play స్టోర్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే, Androidను ట్యాప్ చేయండి.

యాప్‌లలోని సర్వీస్‌లు అలాగే కంటెంట్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Play స్టోర్ యాప్ Google Playను తెరవండి.
  2. మీరు సరైన Google ఖాతాలోనే సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  3. ప్రీమియం సర్వీస్‌లను ఉచితంగా ఆఫర్ చేసే యాప్‌ను కనుగొని, తెరవండి.
  4. సబ్‌స్క్రయిబ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని, మీ సబ్‌స్క్రిప్షన్ ఇంకా ప్లాన్ వివరాలను రివ్యూ చేయండి.
  6. పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  7. సబ్‌స్క్రయిబ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: ట్రయల్ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడానికి, ఛార్జీలను నివారించడానికి, ట్రయల్ పీరియడ్ ముగిసేలోపు మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి.

ప్రోమో కోడ్‌తో యాప్‌నకు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

2 రకాల ప్రోమో కోడ్‌లు ఉన్నాయి.

మీ కోడ్ HAPPYHOLIDAYS2020 వంటి పదాలు, నంబర్‌లను ఉపయోగిస్తుంటే
  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోండి.
  2. యాప్‌లో మీ సబ్‌స్క్రిప్షన్ కోసం, మీ కోడ్ వర్తించే సబ్‌స్క్రిప్షన్‌ను కనుగొనండి.
  3. పేమెంట్ ఆప్షన్ లిస్ట్ చేసి ఉన్నట్లు కనిపించేంత వరకు చెక్‌అవుట్ ప్రాసెస్ చేస్తూనే ఉండండి.
    • మీకు పేమెంట్ ఆప్షన్ లేకపోతే: ఒక పేమెంట్ ఆప్షన్‌ను జోడించండి.
  4. పేమెంట్ ఆప్షన్ పక్కన, కుడి వైపు బాణం కుడివైపు బాణం గుర్తును ట్యాప్ చేయండి.
  5. కోడ్‌ను రిడీమ్ చేయిని ట్యాప్ చేయండి.
  6. మీ కోడ్‌ను ఎంటర్ చేయండి, ఆపై స్క్రీన్ పై సూచనలను ఫాలో అవ్వండి.
  7. మీ కొనుగోలు ప్రమోషన్‌ను ఉపయోగిస్తున్నట్లుగా నిర్ధారించుకోండి.
  8. సబ్‌స్క్రయిబ్ చేయిని ట్యాప్ చేయండి.
  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ చిహ్నాన్ని ట్యాప్ చేయండి.
  3. పేమెంట్‌లు & సబ్‌స్క్రిప్షన్‌లు ఆ తర్వాత గిఫ్ట్ కోడ్‌ను రిడీమ్ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. కోడ్‌ను ఎంటర్ చేయండి
  5. రిడీమ్ చేయిని ట్యాప్ చేయండి.
  6. మీ సబ్‌స్క్రిప్షన్ కోసం యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోండి.
  7. యాప్‌లో మీ కోడ్ వర్తించే సబ్‌స్క్రిప్షన్ రకాన్ని కనుగొనండి.
  8. మీ కొనుగోలు, ప్రోమో కోడ్‌ను ఉపయోగిస్తుందని నిర్ధారించడానికి, మీ కార్ట్‌ను చెక్ చేయండి.
  9. యాప్‌లో దశలను ఫాలో చేయండి.
  10. మీ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తి చేయడానికి, యాప్‌ను తెరవండి.

మీ ప్రోమో కోడ్‌తో మీరు రిడీమ్ లేదా సబ్‌స్క్రయిబ్ చేసుకోలేకపోయినట్లయితే, కోడ్‌లతో సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకోండి.

సీజన్ పాస్‌తో సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

సీజన్ పాస్ అనేది రిపీట్ అయ్యే లేదా రిపీట్ కాని సబ్‌స్క్రిప్షన్, ఇది మీకు కంటెంట్ సీజన్‌కు యాక్సెస్‌ను మంజూరు చేస్తుంది. మీరు రిపీట్ అయ్యే సీజన్ పాస్‌ను కొనుగోలు చేస్తే, తదుపరి సీజన్ ప్రారంభంలో, డెవలపర్ సెట్ చేసిన తేదీలో అది ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ చేయబడుతుంది. కొన్ని సీజన్ పాస్‌లను పేమెంట్ ప్లాన్‌తో కొనుగోలు చేయవచ్చు. 

మీరు ఎప్పుడైనా సీజన్ పాస్‌ను రద్దు చేయవచ్చు. మీరు మీ సీజన్ పాస్‌ను రద్దు చేసినప్పుడు, మీ ప్రస్తుత బిల్లింగ్ వ్యవధి ముగింపులో సబ్‌స్క్రిప్షన్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు లేదా నెలవారీ పేమెంట్ ప్లాన్‌లో మీ సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేసినట్లయితే, పేమెంట్ ప్లాన్ ముగింపులో మీరు సబ్‌స్క్రిప్షన్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు. పేమెంట్ ప్లాన్‌లలో సీజన్ పాస్‌లను రద్దు చేసే ప్రక్రియ గురించిన మరింత సమాచారం కోసం, దిగువున ఉన్న “పేమెంట్ ప్లాన్‌ను ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ చేయడాన్ని ఆపివేయండి” అనే విభాగాన్ని చూడండి.

మీ సీజన్ పాస్ గురించిన మరిన్ని వివరాల కోసం, Google Playలో సబ్‌స్క్రిప్షన్‌లు లేదా యాప్ డెవలపర్‌ను సంప్రదించండి అనే విభాగానికి వెళ్లండి.

పేమెంట్ ప్లాన్‌తో సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

మీరు పేమెంట్ ప్లాన్‌ను ఉపయోగించి కంటెంట్‌కు సబ్‌స్క్రయిబ్ చేసినప్పుడు, మీరు నిర్దిష్ట సమయం వరకు మల్టిపుల్ పేమెంట్‌లు చేయాల్సి ఉంటుంది. మీరు రిపీట్ పేమెంట్ ప్లాన్‌ను కొనుగోలు చేసినట్లయితే, అది మీ రీ-యాక్టివేషన్ తేదీన ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ చేయబడుతుంది. 

పేమెంట్ ప్లాన్ లభ్యత గురించిన సమాచారం కోసం, 'సబ్‌స్క్రిప్షన్ పేమెంట్ ప్లాన్‌ల కోసం లొకేషన్ అందుబాటు'కు వెళ్లండి. మీరు పేమెంట్ ప్లాన్‌ను కలిగి ఉంటే, Google Playలో సబ్‌స్క్రిప్షన్‌లు పేజీకి వెళ్లండి లేదా మీ ప్లాన్ గురించి సమాచారం కోసం మీ ఈమెయిల్‌కు పంపిన రసీదును చెక్ చేయండి. పేమెంట్ ప్లాన్‌లు Google Play పేమెంట్ ప్లాన్ సర్వీస్ నియమాలకు అనుగుణంగా ఉంటాయి.

పేమెంట్ ప్లాన్ ఆటోమేటిక్ రీ-యాక్టివేషన్‌ను ఆపివేయండి

పేమెంట్ ప్లాన్‌కు సంబంధించి, ఒకసారి మీ పేమెంట్ ఆప్షన్ ద్వారా ఛార్జీ విధించబడితే, ఆ పేమెంట్ ప్లాన్‌కు సంబంధించి మిగిలిన పేమెంట్‌లను రద్దు చేయలేరు. అయితే, మీరు మీ పేమెంట్ ప్లాన్ ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ చేయబడకుండా నిరోధించవచ్చు. దీని అర్థం, మీ తదుపరి రీ-యాక్టివేషన్ తేదీన మీకు ఛార్జీ విధించబడదు, (దీన్ని మీరు Google Playలో సబ్‌స్క్రిప్షన్‌లు లేదా మీ ఈమెయిల్ రసీదులో చూడవచ్చు) అంతే కాకుండా అప్పటి వరకు మీరు మీ కంటెంట్‌ను యాక్సెస్ చేయడాన్ని కొనసాగించవచ్చు. మీరు మీ పేమెంట్ ప్లాన్‌ను రీ-యాక్టివేట్ చేయకుండా ఆపాలని ఎంచుకుంటే, మీ ప్రస్తుత పేమెంట్ ప్లాన్‌లో మిగిలి ఉన్న ఏవైనా పేమెంట్‌లకు మీరు ఇప్పటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. Google Play రీఫండ్ పాలసీలో పేర్కొన్న అంశాలకు కాకుండా మరే ఇతర వాటికి Google Play, రీఫండ్‌లను జారీ చేయదు.

ప్రీపెయిడ్ ప్లాన్‌తో సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

ప్రీపెయిడ్ ప్లాన్‌లు అనేవి కొన్ని యాప్‌లు నిర్ణీత కాల వ్యవధి కోసం అందించే సబ్‌స్క్రిప్షన్‌లు, అవి ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ కావు. మీ పేమెంట్ ఆప్షన్ రిపీట్ అయ్యే సబ్‌స్క్రిప్షన్‌లను సపోర్ట్ చేయకపోతే, ప్రీపెయిడ్ ప్లాన్ మీకు ఒక మంచి ఆప్షన్ కావచ్చు.

సాధారణ సబ్‌స్క్రిప్షన్‌ల మాదిరిగా కాకుండా, ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఒక నిర్ణీత సమయం కోసం సబ్‌స్క్రిప్షన్‌ల యాక్సెస్‌ను కొనుగోలు చేయడానికి ఉపయోగించబడతాయి. గడువు ముగిసినప్పుడు, మీరు సబ్‌స్క్రిప్షన్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు.

ప్రీపెయిడ్ గడువు ముగిసిన తర్వాత కూడా, మీరు సబ్‌స్క్రిప్షన్‌కు మీ యాక్సెస్‌ను కొనసాగించాలంటే మీరు వీటిని చేయవచ్చు:

  • ప్రీపెయిడ్ ప్లాన్‌ను పొడిగించుకోవచ్చు.
  • ప్లాన్‌ను, రిపీట్ అయ్యే సబ్‌స్క్రిప్షన్‌కు మార్చుకోవచ్చు.

అన్ని యాప్‌లకు ప్రీపెయిడ్ ప్లాన్ ఆప్షన్ అందుబాటులో ఉండదు. ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఎలాంటి ఖర్చు లేకుండా ట్రయల్స్‌కు సపోర్ట్ చేయవు.

ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కోసం సైన్ అప్ చేయడానికి:

  1. Google Play యాప్ Google Playను తెరవండి.
  2. మీరు సరైన Google ఖాతాలోనే సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  3. ఫీజును చెల్లించడం ద్వారా ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించే యాప్‌ను కనుగొని తెరవండి.
  4. సబ్‌స్క్రయిబ్ చేసుకోండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. మీరు కొనుగోలు చేయాలనుకున్న ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోండి.
  6. సపోర్ట్ చేయబడే పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  7. కొనండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

వెబ్‌సైట్ నుండి సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించండి 

  1. సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేసే వెబ్‌సైట్‌లో, మీ Google ఖాతాతో సబ్‌స్క్రయిబ్ చేసుకోండి లేదా Subscribe with Google అనే ఫీచర్‌ను ఎంచుకోండి.
  2. మీరు సరైన Google ఖాతాలోనే సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  3. ప్రతి సంవత్సరం లేదా నెలవారీ వంటి సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ను ఎంపిక చేసుకోండి. ఇది వెబ్‌సైట్ అందించే సబ్‌స్క్రిప్షన్ రకాలపై ఆధారపడి ఉంటుంది.
  4. మీ పేమెంట్ ఆప్షన్, అలాగే బిల్లింగ్ అడ్రస్‌ను నిర్ధారించండి.

మీ Google ఖాతాకు ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా జోడించాలో తెలుసుకోండి.

Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3505864954608749984
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false