Google Driveలో ఫైళ్లను తొలగించండి, అలాగే రీస్టోర్ చేయండి

మీ Google Drive ఫైల్‌లను తొలగించడానికి, వాటిని ట్రాష్‌కు తరలించండి. ట్రాష్‌లోని ఫైల్‌లు 30 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా తొలగించబడతాయి. మీరు 30 రోజుల సమయ విండోకు ముందు మీ ట్రాష్ నుండి ఫైల్‌లను రీస్టోర్ చేయవచ్చు. మీ ట్రాష్‌ను ఖాళీ చేయడానికి మీరు వాటిని శాశ్వతంగా తొలిగించవచ్చు. ఒకవేళ మీరు ఒకేసారి బహుళ సంఖ్యలో ఫైల్‌లు లేదా ఫోల్డర్‌లను తొలగించడం, రీస్టోర్ చేయడం లేదా శాశ్వతంగా తొలగించడం చేస్తే, సంబంధిత మార్పులు కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు. 

ఫైల్‌ను ట్రాష్‌లో ఉంచండి

మీ Drive నుండి ఫైల్‌ను తీసివేయడానికి, మీరు దాన్ని మీ ట్రాష్‌లో ఉంచవచ్చు. ఆటోమేటిక్‌గా తొలగించబడటానికి ముందు, ఫైల్ 30 రోజుల పాటు మీ ట్రాష్‌లో ఉంటుంది.

ఫైల్ ఓనర్ మీరే అయితే, మీరు పైల్‌ను శాశ్వతంగా తొలగించే వరకు ఇతరులు దాన్ని వీక్షించగలరు. మీరు ఓనర్ కాకపోతే, మీ ట్రాష్‌ను ఖాళీ చేసినప్పటికీ ఇతరులు ఫైల్‌ను చూడగలరు.

  1. మీ iPhone లేదా iPadలో, Google Drive యాప్‌ను తెరవండి.
  2. మీరు తొలగించాలనుకునే ఫైల్ పక్కన, 'మరిన్ని మరిన్ని' ట్యాప్ చేయండి.
  3. దిగువున, 'తీసివేయి' ట్యాప్ చేయండి.

మీ ట్రాష్‌ను ఖాళీ చేయండి

మీరు ఒక్కో ఫైల్‌ను శాశ్వతంగా తొలగించవచ్చు లేదా మీ మొత్తం ట్రాష్‌ను ఖాళీ చేయవచ్చు. ఫైల్‌ను తొలగించిన తర్వాత, మీరు ఫైల్‌ను షేర్ చేసిన ఎవరైనా దానికి యాక్సెస్‌ను కోల్పోతారు. ఇతరులు ఫైల్‌ను ఇప్పటికీ చూడాలని మీరు కోరుకుంటే, యాజమాన్య హక్కును మరొకరికి అందించవచ్చు.

  1. ఎగువభాగంలో ఎడమవైపున, మెను మెనూ ట్యాప్ చేయండి.
  2. 'ట్రాష్' ట్యాప్ చేయండి.
  3. మీరు తొలగించాలనుకుంటున్న ఫైల్ పక్కన, 'మరిన్ని మరిన్ని' ట్యాప్ చేయండి.
  4. 'శాశ్వతంగా తొలగించు' ట్యాప్ చేయండి.

మీ మొత్తం ట్రాష్‌ను ఖాళీ చేయండి

  1. ఎగువభాగంలో ఎడమవైపున, మెను మెనూ ట్యాప్ చేయండి.
  2. 'ట్రాష్' ట్యాప్ చేయండి.
  3. మీకు తర్వాత అవసరమయ్యే ఫైల్‌లు ఏవీ లేవని నిర్ధారించుకోండి.
  4. ఎగువభాగంలో కుడివైపున, మరిన్ని మరిన్ని ట్యాప్ చేయండి.
  5. 'ట్రాష్‌ను ఖాళీ చేయి' ట్యాప్ చేయండి.

ట్రాష్ నుండి ఫైల్‌ను పునరుద్ధరించండి

మీరు ఫైల్‌ను మీ ట్రాష్‌లో ఉంచినప్పటికీ మీకు అది కావాలని నిర్ణయించుకుంటే, దాన్ని తిరిగి మీ Drive‌లోకి తరలించవచ్చు.

  1. ఎగువభాగంలో ఎడమవైపున, మెను మెనూ ట్యాప్ చేయండి.
  2. 'ట్రాష్' ట్యాప్ చేయండి.
  3. మీరు సేవ్ చేయాలనుకునే ఫైల్ పక్కన, 'మరిన్ని మరిన్ని' ట్యాప్ చేయండి.
  4. 'రీస్టోర్ చేయి' ట్యాప్ చేయండి.

గమనిక: మీరు ఫైల్ ఓనర్ కాకపోతే, దాన్ని రీస్టోర్ చేయడానికి ఓనర్‌ని సంప్రదించండి.

మీ తొలగించబడిన ఫైల్‌ను మీరు పునరుద్ధరించలేకపోతే

మీరు ఫైల్‌ను తొలగించి, దాన్ని తిరిగి పొందాలనుకుంటే, డిస్క్ ప్రత్యేక నిపుణుడిని సంప్రదించండి. మీ ఫైల్‌ను కనుగొనడానికి, మాకు కాల్ చేయండి లేదా మాతో చాట్ చేయండి.

మీరు ఏదో తొలగించి, దాన్ని మళ్లీ పొందాలనుకుంటున్నట్లయితే

మీరు ఇటీవల Google డ్రైవ్ లేదా Google డ్రైవ్ డెస్క్‌టాప్ యాప్‌ను ఉపయోగించి ఏదైనా తొలగించి ఉంటే, మీ అంతట మీరుగా ఫైల్‌ను పునరుద్ధరించవచ్చు.

మీ ట్రాష్ నుండి రీస్టోర్ చేయండి

  1. మీ Google Drive యాప్‌ను తెరవండి.
  2.  మీరు రికవర్ చేయాలనుకుంటున్న ఫైల్ పక్కన, మెనూ మరిన్నిను ట్యాప్ చేయండి
  3. రీస్టోర్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీరు దేనినైనా కనుగొనలేకపోతున్నారు & మీరు దానిని తొలగించారో లేదో మీకు తెలియదు

ఈ సూచనలను ప్రయత్నించండి

యాక్టివిటీ ప్యానెల్‌ను చెక్ చేయండి

  1. మీ Google Drive యాప్‌ను తెరవండి.
  2. దిగువ కుడి వైపున, Files ను ట్యాప్ చేయండి.
  3. ఎగువ ఎడమ వైపున, నా డ్రైవ్‌ను ట్యాప్ చేయండి.
  4. కిందికి స్క్రోల్ చేసి, మీ ఫైల్ కోసం వెతకండి.

అధునాతన సెర్చ్‌ను ట్రై చేయండి

  1. మీ Google Drive యాప్‌ను తెరవండి.
  2. మీ ఫైల్‌ను కనుగొనడానికి "type:spreadsheets" లాంటి అధునాతన శోధన ఎంపికలను ఉపయోగించండి.

ఎగువున అందించిన సూచనలు సహాయకరంగా లేకుంటే, ఈ ప్రత్యేక సందర్భాలను పరిగణనలోకి తీసుకోండి:

మీరు ఫైల్‌ను సృష్టించి ఉంటే

మీరు ఫైల్‌ను డ్రైవ్‌లో సృష్టించి ఉండి, అది కనుగొనబడలేదంటే, బహుశా అది ఆర్ఫన్డ్ అయి ఉండవచ్చు. ఆర్ఫన్డ్ ఫైల్ అన్నది దాని మూలాధార ఫోల్డర్‌లన్నీ కోల్పోయి ఉండవచ్చు. ఫైల్ ఇప్పటికీ ఉంటుంది, కానీ కనుగొనడం కష్టసాధ్యం.

ఫైల్‌లు ఎలా వాటి ఫోల్డర్‌ను కోల్పోతాయి

  • వేరొకరికి చెందిన ఫోల్డర్‌లో మీరు ఫైల్ క్రియేట్ చేసి ఉండవచ్చు, వారు ఆ ఫోల్డర్‌ను తొలగించి ఉండవచ్చు. ఈ ఫైల్ తొలగించబడలేదు. అది ఆటోమేటిక్‌గా మీకు సంబంధించిన 'నా డ్రైవ్'‌కు తరలించబడింది.
    ముఖ్య గమనిక: మీకు చెందిన ఫైల్‌లను కేవలం మీరు మాత్రమే తొలగించగలరు. 
  • ఫోల్డర్‌ను మీరు వేరొకరితో షేర్ చేసుకుంటే, వారు మీ ఫైల్‌ను ఫోల్డర్ నుండి తొలగించి ఉండవచ్చు. ఫైల్ తొలగించబడలేదు, అది ఆటోమేటిక్‌గా మీకు సంబంధించిన 'నా డ్రైవ్'‌కు తరలించబడింది.

మీ ఆర్ఫన్డ్ ఫైల్‌లను కనుగొనండి

  1. డ్రైవ్ శోధన ఫీల్డ్‌లో, దీనిని నమోదు చేయండి: 'is:unorganized owner:me'
  2. మీరు ఫైల్‌ను కనుగొన్నప్పుడు, దానిని 'నా డ్రైవ్'లోని ఫోల్డర్‌లోకి తరలించండి, దీని వలన మీరు తర్వాతిసారి కనుగొనడం సులభతరం అవుతుంది.

ఇప్పుడే వెతుకు

వేరెవరైనా ఫైల్‌ను సృష్టించి ఉంటే

ఎవరైనా ఫైల్‌ను సృష్టించినప్పుడు, వారు దానిని తొలగించగలరు, పేరు మార్చగలరు, పునరుద్ధరించగలరు. ఫైల్‌ను క్రియేట్ చేసిన వ్యక్తిని కాంటాక్ట్ చేసి, ఆ ఫైల్‌ను రీస్టోర్ చేయమని లేదా మీకు మళ్లీ షేర్ చేయమని అడగండి.

ఒకవేళ అది మరెవరైనా క్రియేట్ చేసిన ఫోల్డర్‌లో ఉంటే

ఎవరైనా ఆ ఫోల్డర్‌ను తొలగించి ఉంటే, మీ Driveలో ఆ ఫోల్డర్ ఇకపై కనిపించదు.

తొలగించిన ఫోల్డర్‌లలో మీరు సృష్టించిన ఫైల్‌లను కనుగొనండి

తొలగించిన ఫోల్డర్‌లలో ఉన్న అన్ని ఫైల్‌లను కనుగొనడం

భవిష్యత్తులో ఫైల్‌ను మరింత సులభంగా కనుగొనగలిగేలా చేయడానికి, దానిని "నా డ్రైవ్"లోని ఫోల్డర్‌లోకి లాగండి.

ఫైల్‌లను ఎలా కనుగొనాలో మరింత సమాచారం

మీరు అధునాతన సెర్చ్‌ను ట్రై చేశారా?

Driveలో సెర్చ్‌ను మెరుగుపరచడానికి, కింది ఆప్షన్‌లలో ఒకదానితో సెర్చ్ పదబంధాన్ని ఉపయోగించండి:

దీని కోసం వెతకండి ఉదాహరణ
ఖచ్చితమైన పదబంధం

"ఖచ్చితమైన పదబంధాన్ని కొటేషన్‌ల మధ్యలో ఉంచండి"

ఏదో ఒకటి లేదా మరొకటి

టాకోలు లేదా నాచోలు

ఒక పదాన్ని మినహాయించండి

నీరు కానీ సరస్సులు కాదు:

నీరు -సరస్సులు

ఫైల్ యజమాని

నాన్న కలిగి ఉన్న ఫైల్‌లు:

ఓనర్:dad@gmail.com

వారు ఫైల్‌లను షేర్ చేశారు

అమ్మ మీతో షేర్ చేసిన ఫైల్‌లు:

వీరి నుండి:mom@gmail.com

మీరు ఫైల్‌లను షేర్ చేశారు

అమ్మతో మీరు షేర్ చేసిన ఫైల్‌లు:

వీరికి:mom@gmail.com

నక్షత్రం ఉన్న అంశాలు

ఇవి:నక్షత్రం ఉన్నవి

తొలగించిన అంశాలు

ఇవి:ట్రాష్‌లో ఉన్నవి

రకం

స్ప్రెడ్‌షీట్ ఫైల్ రకం:

రకం:స్ప్రెడ్‌షీట్

సమయ పరిధి

జనవరి 18, 2015 ముందు లేదా దాని తర్వాత. 

ఈ తేదీకి ముందు:2015-01-18

ఈ తేదీ తర్వాత:2015-01-18

పేరు

పేరు:"పేరు ఇక్కడ అందించబడుతుంది"

యాప్

Google Driveలో తెరిచిన ఫైల్‌లు:

యాప్:"Drive"
 

ఏయే ఫైల్‌లను తిరిగి పొందవచ్చు?

మీరు వినియోగదారు ఖాతాతో (మీ కార్యాలయం, పాఠశాల లేదా ఇతర సమూహం ద్వారా రూపొందించిన ఖాతా కాకుండా) Google డ్రైవ్‌ను ఉపయోగించి, వీటిలో ఒకటి ఒప్పు అయితే ఇటీవల తొలగించిన ఫైల్‌లను పరిమిత సమయంలో పునరుద్ధరించడంలో మేము మీకు సహాయపడగలము:

  • ఫైల్‌ను క్రియేట్ చేసింది మీరే అయ్యుండాలి.
  • మీరు ఫైల్‌ను Google డ్రైవ్‌లో అప్‌లోడ్ చేశారు.
  • మీరు వేరొకరి నుండి ఫైల్ యాజమాన్య హక్కును అంగీకరించారు.

ఒకవేళ మీరు ఖాతాను మీ కార్యాలయం, పాఠశాల, లేదా ఇతర గ్రూప్ ద్వారా ఉపయోగిస్తున్నట్లయితే, సహాయం కోసం మీ అడ్మినిస్ట్రేటర్‌ను కాంటాక్ట్ చేయండి.

ఒకవేళ మీ Google ఖాతాను తొలగించినట్లయితే, మీరు మీ ఫైల్‌లను తిరిగి పొందడం సాధ్యపడకపోవచ్చు.

మీ Google Driveను ఎవరైనా వ్యక్తి మీ అనుమతి లేకుండా యాక్సెస్ చేసినట్లు భావిస్తే, మీ ఖాతాను మరింత సురక్షితం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము.

సెర్చ్ చిప్‌లను ఉపయోగించండి

Driveలో ఫైళ్ల లిస్ట్‌ను కుదించడానికి, “సెర్చ్ బార్”లో పదాన్ని ఎంటర్ చేయడానికి ముందు మీరు సెర్చ్ చిప్‌లను ఉపయోగించవచ్చు. సెర్చ్ చిప్‌లను ఉపయోగించడానికి:

  1. మీ iPhone లేదా iPadలో, Google Drive యాప్‌ను తెరవండి.
  2. ఎగువున, Driveలో సెర్చ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెర్చ్ చిప్‌ను ఎంపిక చేసుకోవడానికి ట్యాప్ చేసి, మీరు వీటిని ఎంచుకోవచ్చు:
    • రకం
    • ఫోల్డర్‌లు
    • మార్చిన సమయం: ఈరోజు, నిన్న, గత 7 రోజులలో.
  4. మీరు చిప్‌పై ట్యాప్ చేసిన తర్వాత, మీ ఫలితాలను మరింత కుదించవచ్చు: సెర్చ్ బార్‌లో టైప్ చేయండి.
  5. సెర్చ్ నొక్కండి.

ఈ చిప్‌లు సెర్చ్ బార్‌కు కింద కనిపిస్తాయి. వారు అన్ని ఫైళ్లు, ఫోల్డర్‌లు, అలాగే సబ్‌ఫోల్డర్‌లను సెర్చ్ చేస్తారు. సెర్చ్ చిప్‌ను తొలగించడానికి, చిప్‌నకు కుడి వైపున, ను ట్యాప్ చేయండి.

మీరు సెర్చ్‌ను ఎంటర్ చేశాక, పెద్ద టెక్స్ట్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరాన్ని తగ్గించే సంబంధిత చిప్స్‌ను ఎంచుకోగల సూచనలు మీకు కనిపిస్తాయి.

మీరు Gmail నుండి మెయిల్స్‌ను రికవర్ చేయాల్సి వస్తే

Gmail నుండి ఇమెయిల్‌లను తిరిగి పొందడం ఎలాగో తెలుసుకోండి.

మమ్మల్ని సంప్రదించండి

ఫైల్ రికవరీని రిక్వెస్ట్ చేయడానికి, మీరు కంప్యూటర్‌ను ఉపయోగించాలి.

మమ్మల్ని సంప్రదించడానికి, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.

Drive మద్దతు అన్ని భాషలలో అందుబాటులో లేదు. మీరు ఇంగ్లీష్ మాట్లాడేవారు అయితే, భాషను మార్చుకోవచ్చు మరియు Drive నిపుణులను సంప్రదించవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Drive సహాయ కేంద్రానికి వెళ్లండి.
  2. పేజీ దిగువన, మీ భాషను క్లిక్ చేయండి.
  3. ఇంగ్లీష్‌ను ఎంచుకోండి.
  4. పైన ఎడమవైపున, మెనూ ఆ తర్వాత మమ్మల్ని సంప్రదించండిని క్లిక్ చేయండి.
  5. మీ సమస్యను, మీరు మమ్మల్ని సంప్రదించే విధానాన్ని ఎంచుకోండి.

గమనిక: మీరు పూర్తి చేసిన తర్వాత, మీ భాషను మీ ప్రాధాన్య భాషకు తిరిగి మార్చవచ్చు.

 

 
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6870614329356109805
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false