పలు ప్రొఫైల్స్‌తో Chromeను ఉపయోగించండి

ప్రొఫైల్స్‌తో, మీరు బుక్‌మార్క్‌లు, హిస్టరీ, పాస్‌వర్డ్‌లు, ఇంకా ఇతర సెట్టింగ్‌ల వంటి మీ Chrome సమాచారం మొత్తాన్ని విడిగా ఉంచవచ్చు.

ఇలాంటి సందర్భాల్లో ప్రొఫైల్స్ ఉండటం (ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసుకోవడం) ప్రయోజనకరంగా ఉంటుంది:

  • ఒకే కంప్యూటర్‌ను పలువురు వ్యక్తులతో షేర్ చేయాలనుకున్నప్పుడు.
  • ఆఫీస్‌కు ఒక ఖాతా, వ్యక్తిగత పనులకు ఒక ఖాతా లాగా వేర్వేరు ఖాతాలు ఉంచుకోవాలనుకున్నప్పుడు.

మీరు Chromeను షేర్ చేసినప్పుడు ఇతరులు ఏం చూడగలుగుతారు

మీకు నమ్మకం ఉన్న వ్యక్తులతో మాత్రమే మీ పరికరాన్ని షేర్ చేయండి. ఒకవేళ మీ పరికరం వేరొకరి దగ్గర ఉన్నపుడు, దానిలో ఉన్న ఏదైనా ఇతర Chrome ప్రొఫైల్‌కు వారు స్విచ్ చేయవచ్చు. ఒకవేళ వారు మీ Chrome ప్రొఫైల్‌ను తెరిస్తే, మీరు సందర్శించిన వెబ్‌సైట్‌ల వివరాల లాంటి సమాచారాన్ని వారు చూడగలుగుతారు.

కొత్త ప్రొఫైల్‌ను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువన కుడి వైపు, ప్రొఫైల్ ప్రొఫైల్ను క్లిక్ చేయండి.
  3. జోడించును క్లిక్ చేయండి.
  4. మీ Google ఖాతాకు సింక్ చేయాలనే ఆప్షన్‌ను మీరు ఎంచుకుంటే, మీ ప్రొఫైల్ పేరు ఆటోమేటిక్‌గా మీ ఖాతా పేరు అవుతుంది.
  5. పేరు, ఫోటో, రంగు స్కీమ్‌ను ఎంచుకోండి.

కొత్త ప్రొఫైల్ కోసం Google ఖాతాతో Chromeలో సింక్ చేయడాన్ని ప్రారంభించాలని మీరు ఎంచుకుంటే, మీ బుక్‌మార్క్‌లు, హిస్టరీ, పాస్‌వర్డ్‌లు, అలాగే ఇతర సెట్టింగ్‌లు ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి.

Chromebook ఉపయోగిస్తున్నారా? మీ Chromebookకు ఇతరులను జోడించడం ద్వారా మీరు మీ Chromebookను వారితో షేర్ చేయవచ్చు.

మరొక ప్రొఫైల్‌కు స్విచ్ అవ్వండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న ప్రొఫైల్ ప్రొఫైల్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్న ప్రొఫైల్‌ను ఎంచుకోండి. 

Chromebook ఉపయోగిస్తున్నారా? మీరు మీ Chromebookలో ఒకే సమయంలో అనేక ఖాతాలను ఉపయోగించవచ్చు.

పేరు, ఫోటో, లేదా రంగును మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, ప్రొఫైల్ ప్రొఫైల్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి
  3. "ఇతర ప్రొఫైల్స్" పక్కన, ప్రొఫైల్స్‌ను మేనేజ్ చేయండి Manage people ఆప్షన్‌ను ఎంచుకోండి
  4. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ప్రొఫైల్‌కు ఎగువన కుడి వైపు ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాతఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. కొత్త పేరును ఎంటర్ చేయండి లేదా కొత్త ఫోటో లేదా రంగు రూపాన్ని ఎంచుకోండి. మార్పులు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి.

ప్రొఫైల్‌ను తీసివేయండి

ముఖ్య గమనిక: మీరు Chrome నుండి ప్రొఫైల్‌ను తీసివేసిన తర్వాత, ప్రొఫైల్‌కు సంబంధించిన బుక్‌మార్క్‌లు, హిస్టరీ, పాస్‌వర్డ్‌లు, అలాగే ఇతర సెట్టింగ్‌లు కంప్యూటర్ నుండి తొలగించబడతాయి.

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున ఉన్న ప్రొఫైల్ ప్రొఫైల్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "ఇతర ప్రొఫైల్స్" పక్కన, ప్రొఫైల్స్‌ను మేనేజ్ చేయండి Manage people ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు తీసివేయాలనుకుంటున్న ప్రొఫైల్ వైపు పాయింట్ చేయండి.
  5. ప్రొఫైల్‌కు ఎగువన కుడి వైపు, మరిన్ని మరిన్ని ఆ తర్వాత తొలగించును క్లిక్ చేయండి.
  6. నిర్ధారించడానికి, తొలగించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8948080964892159808
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false