మీ Android పరికరంలో డైనమిక్ డిస్‌ప్లేను ఉపయోగించడం

డైనమిక్ డిస్‌ప్లేతో మీకు కావలసిన దానిని తక్షణమే కనుగొనవచ్చు. మీ పరికరంలోని మొదటి లేదా లాక్ స్క్రీన్‌లో, మీరు సమాచారాన్ని, భవిష్యత్తు ఈవెంట్‌లు, టాస్క్‌లు, వాతావరణం వంటి అప్‌డేట్‌లను కనుగొనవచ్చు.

డైనమిక్ డిస్‌ప్లే విడ్జెట్‌ను జోడించడం, తీసివేయడం

చాలా Android పరికరాలలో, మీ మొదటి స్క్రీన్‌లో డైనమిక్ డిస్‌ప్లేను జోడించవచ్చు.

ముఖ్య గమనిక: మీ పరికరంలో విడ్జెట్‌లను మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి, మీ పరికర తయారీదారును అడగండి.

డైనమిక్ డిస్‌ప్లేను జోడించడానికి:

  1. మీ మొదటి స్క్రీన్‌లో ఉన్న, ఖాళీ స్పేస్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. విడ్జెట్‌లు విడ్జెట్‌లును ట్యాప్ చేయండి.
  3. “Google”కు స్క్రోల్ చేయండి.
  4. డైనమిక్ డిస్‌ప్లేను నొక్కి, పట్టుకోండి.
  5. విడ్జెట్‌ను మీరు ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో అక్కడికి లాగండి.

డైనమిక్ డిస్‌ప్లేను తీసివేయడానికి:

  1. డైనమిక్ డిస్‌ప్లేను నొక్కి, పట్టుకోండి.
  2. విడ్జెట్‌ను తీసివేయడానికి, దానిని పైకి కి లాగండి.

చిట్కాలు:

డైనమిక్ డిస్‌ప్లే ఫీచర్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయడం

ముఖ్య గమనిక: డైనమిక్ డిస్‌ప్లే పూర్తి ఎక్స్‌పీరియన్స్ Android వెర్షన్ 12, తర్వాతి వెర్షన్‌లు గల Pixel పరికరాలలో అందుబాటులో ఉంది. కొన్ని ఫీచర్‌లు అన్ని భాషలలో, దేశాలలో లేదా ప్రాంతాలలో అందుబాటులో ఉండవు.

ఫీచర్‌లు, కంటెంట్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి:

  1. మీ మొదటి స్క్రీన్ ఎగువ భాగంలో, డైనమిక్ డిస్‌ప్లేను నొక్కి పట్టుకోండి.
  2. అనుకూలంగా మార్చండి ఆ తర్వాత డైనమిక్ డిస్‌ప్లే సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. "ఫీచర్‌ల" దిగువున, మీరు ఆన్ లేదా ఆఫ్ చేయాలనుకుంటున్న కేటగిరీ లేదా టాపిక్‌ను ఎంచుకోండి.
  4. కేటగిరీ లేదా టాపిక్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
  5. మరిన్ని టాపిక్‌లు లేదా కేటగిరీల కోసం, దిగువున ఉన్న మరిన్ని ఫీచర్‌లను చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

డైనమిక్ డిస్‌ప్లే సమాచారాన్ని మేనేజ్ చేయడం

ఆటోమేటిక్‌గా, డైనమిక్ డిస్‌ప్లే మీ లాక్ స్క్రీన్‌పై కంటెంట్‌ను చూపుతుంది. ఈ కంటెంట్, క్యాలెండర్ ఈవెంట్‌లు లేదా అప్‌డేట్‌ల వంటి ముఖ్యమైన యాప్ నోటిఫికేషన్‌ల నుండి రావచ్చు.

మీరు సున్నితమైన కంటెంట్‌ను ఆఫ్ చేసి, మీ లాక్ స్క్రీన్‌లో అందుకునే ఇతర అప్‌డేట్‌లను మేనేజ్ చేయవచ్చు. మీ నోటిఫికేషన్‌లను కంట్రోల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సున్నితమైన కంటెంట్ సెట్టింగ్‌ను అప్‌డేట్ చేయడానికి:

  1. మీ మొదటి స్క్రీన్ ఎగువ భాగంలో, డైనమిక్ డిస్‌ప్లేను నొక్కి పట్టుకోండి.
  2. అనుకూలంగా మార్చండి ఆ తర్వాత డైనమిక్ డిస్‌ప్లే సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. “వ్యక్తిగతీకరణను మేనేజ్ చేయండి,” దిగువున ఉన్న, లాక్ స్క్రీన్‌లో సున్నితమైన కంటెంట్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. "గోప్యత" దిగువున ఉన్న గోప్యమైన నోటిఫికేషన్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

చిట్కా: మీ వర్క్ ప్రొఫైల్ నుండి డైనమిక్ డిస్‌ప్లేలో కంటెంట్ కోసం గోప్యమైన వర్క్ ప్రొఫైల్ నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయవచ్చు.

మీ డైనమిక్ డిస్‌ప్లే సమాచార వివరాలు

మీకు కావలసిన సమాచారాన్ని అందించడానికి, మీ పరికరం, యాక్టివిటీ నుండి పొందిన డేటాను Google ఉపయోగిస్తుంది. 

వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని అందించడానికి డైనమిక్ డిస్‌ప్లే ఏ డేటాను ఉపయోగించవచ్చో కంట్రోల్ చేయడానికి:

  1. మీ మొదటి స్క్రీన్ ఎగువ భాగంలో, డైనమిక్ డిస్‌ప్లేను నొక్కి పట్టుకోండి.
  2. అనుకూలంగా మార్చండి ఆ తర్వాత డైనమిక్ డిస్‌ప్లే సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  3. “వ్యక్తిగతీకరణను మేనేజ్ చేయండి” అనే ఆప్షన్ దిగువున ఉన్న సెట్టింగ్‌లను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
డైనమిక్ డిస్‌ప్లే సమాచారాన్ని మేనేజ్ చేయడం

మీ డైనమిక్ డిస్‌ప్లే సమాచారాన్ని మేనేజ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి.

యాప్‌ల డేటాను మేనేజ్ చేయడం

క్యాలెండర్ ఈవెంట్‌లకు అప్‌డేట్‌ల వంటి సమాచారం కోసం, మీ పరికరంలోని యాప్‌ల డేటాను డైనమిక్ డిస్‌ప్లే ఉపయోగిస్తుంది.

మీ Google ఖాతాలోని డేటా

చాలా డైనమిక్ డిస్‌ప్లే ఫీచర్‌ల కోసం, మీ పరికరానికి మీ Google యాక్టివిటీకి యాక్సెస్ ఉందని నిర్ధారించుకోండి.

వెబ్ & యాప్ యాక్టివిటీ

అపాయింట్‌మెంట్ కోసం ఎప్పుడు వెళ్లాలి వంటి టాస్క్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందించడంలో, మీ వెబ్ & యాప్ యాక్టివిటీ సెట్టింగ్ డైనమిక్ డిస్‌ప్లేకు సహాయపడుతుంది. మీ వెబ్ & యాప్ యాక్టివిటీని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

యాప్ సమాచారం

మీరు "యాప్ డేటాను ఉపయోగించి వ్యక్తిగతీకరించండి" అనే ఆప్షన్‌ను ఆన్ చేసినప్పుడు, టాస్క్‌లు, నోటిఫికేషన్‌లను మీకు అందించడానికి డైనమిక్ డిస్‌ప్లే మీ పరికరాల్లోని యాప్‌ల సమాచారాన్ని పొందుతుంది. మీ పరికర యాప్ సమాచారాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

Gmail స్మార్ట్ ఫీచర్‌లు, కంట్రోల్స్

స్మార్ట్ ఫీచర్ కంట్రోల్స్‌తో, బోర్డింగ్ పాస్‌లు, ఈవెంట్ రిజర్వేషన్‌ల వంటి మీ ఈమెయిల్‌లోని సమాచారాన్ని డైనమిక్ డిస్‌ప్లే మీకు అందించగలదు. స్మార్ట్ ఫీచర్‌లు, కంట్రోల్స్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

లొకేషన్ సమాచారం

మీ లొకేషన్ ఆధారంగా ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు అందుకునేలా సహాయపడే వీలును మీ లొకేషన్ సమాచారం సెట్టింగ్‌లు డైనమిక్ డిస్‌ప్లేకు కల్పిస్తాయి. ఉదాహరణకు, సమీపంలో భూకంపం సంభవించినప్పుడు లేదా మీ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణం ఉన్నప్పుడు మిమ్మల్ని ఇది అలర్ట్ చేస్తుంది.

కొన్ని ఫీచర్‌ల కోసం, డైనమిక్ డిస్‌ప్లేకు మీ ఖచ్చితమైన లొకేషన్ యాక్సెస్ అవసరం. మీ లొకేషన్ సెట్టింగ్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

మీరు లొకేషన్ హిస్టరీని ఆన్ చేస్తే, మీరు సందర్శించిన లొకేషన్‌ల గురించిన సమాచారాన్ని పొందవచ్చు. మీ లొకేషన్ హిస్టరీని మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీరు ఇల్లు, వర్క్ ప్లేస్ అడ్రస్‌లను సెట్ చేస్తే, లోకల్ ట్రాఫిక్ గురించిన రియల్-టైమ్ ట్రాఫిక్ సమాచారాన్ని మీరు పొందవచ్చు. మీ ఇల్లు, ఆఫీసు, ఇతర లొకేషన్‌లను సెట్ చేయడం తెలుసుకోండి.

వ్యక్తిగత ఫలితాలు

మీరు డైనమిక్ డిస్‌ప్లేతో వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను కనుగొనవచ్చు. వ్యక్తిగత ఫలితాలను ఆన్ లేదా ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

క్యాలెండర్‌లకు యాక్సెస్

డైనమిక్ డిస్‌ప్లేతో మీరు భవిష్యత్తు క్యాలెండర్ ఈవెంట్‌ల గురించిన సమాచారాన్ని పొందవచ్చు.

డైనమిక్ డిస్‌ప్లే మీ క్యాలెండర్ నుండి ఈవెంట్‌లను చూపకూడదని మీరు అనుకుంటే, Google యాప్ నుండి క్యాలెండర్ అనుమతులను తీసివేయండి:

  1. మీ Android పరికరంలో, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  2. యాప్‌లు ఆ తర్వాత Google ఆ తర్వాత అనుమతులు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. క్యాలెండర్ ఆ తర్వాత అనుమతించవద్దు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: కొన్ని క్యాలెండర్ ఈవెంట్‌లు యాప్ నోటిఫికేషన్‌ల ద్వారా డైనమిక్ డిస్‌ప్లేకు చేరతాయి.

Google Walletకు యాక్సెస్

డైనమిక్ డిస్‌ప్లేతో, Google Walletలో స్టోర్ అయి ఉన్న భవిష్యత్తు ఈవెంట్ పాస్‌లకు మీరు యాక్సెస్ పొందవచ్చు. Google Walletలో పాస్‌లను మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

డైనమిక్ డిస్‌ప్లే, Google Walletలోని పాస్‌లను చూపకూడదని మీరు అనుకుంటే, Google Walletలో అనుమతులను అప్‌డేట్ చేయండి:

  1. మీ Android పరికరంలో, Google Wallet కు వెళ్లండి.
  2. ప్రొఫైల్ ఫోటో లేదా ఇనిషియల్ ఆ తర్వాత Walletలో మీ డేటా ఆ తర్వాత పాస్‌ల డేటాను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. Google అంతటా పాస్‌లను ఉపయోగించండి అనే ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల నోటిఫికేషన్‌లు

క్యాలెండర్ ఈవెంట్‌ల వంటి కొన్ని ఫీచర్‌ల కోసం యాప్ నోటిఫికేషన్‌లను ఉపయోగించవచ్చు. డైనమిక్ డిస్‌ప్లే, యాప్ నోటిఫికేషన్‌లను ఉపయోగించకూడదని మీరు అనుకుంటే, మీ పరికర సెట్టింగ్‌లను మార్చండి.

యాప్ నోటిఫికేషన్‌లను ఉపయోగించడాన్ని మార్చాలనుకుంటే:

  1. మీ Android పరికరంలో, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  2. నోటిఫికేషన్‌లు ఆ తర్వాత పరికరం, యాప్ నోటిఫికేషన్‌లు ఆ తర్వాత Android సిస్టమ్ ఇంటెలిజెన్స్ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సమీపంలోని పరికరాలు

డైనమిక్ డిస్‌ప్లేతో, సమీపంలోని పరికరాల గురించి మీరు సమాచారాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, మీరు పరికరాన్ని బ్లూటూత్ హెడ్‌ఫోన్స్‌కు కనెక్ట్ చేసినప్పుడు, డైనమిక్ డిస్‌ప్లే మీకు బ్యాటరీ సమాచారాన్ని అందించగలదు.

మీ సమీపంలోని పరికరాలను కనుగొని, వాటికి డైనమిక్ డిస్‌ప్లే కనెక్ట్ అవ్వడాన్ని అనుమతించడానికి:

  1. మీ Android పరికరంలో, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌కు వెళ్లండి.
  2. గోప్యత ఆ తర్వాత అనుమతి మేనేజర్ ఆ తర్వాత సమీపంలోని పరికరాలు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

వ్యక్తిగత ఫలితాలను ఆఫ్ చేయడం

మీరు, వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను పొందకూడదనుకుంటే, Google Assistant సెట్టింగ్‌లలో వ్యక్తిగత ఫలితాలను ఆఫ్ చేయవచ్చు.

మీరు వ్యక్తిగత ఫలితాలను ఆఫ్ చేసినప్పటికీ, సున్నితమైనది కాగల కొంత కంటెంట్ డైనమిక్ డిస్‌ప్లేలో డిస్‌ప్లే కావచ్చు. మీ పరికర సెట్టింగ్‌ల ద్వారా డైనమిక్ డిస్‌ప్లేలో కనబడే కంటెంట్‌ను మీరు మేనేజ్ చేయవచ్చు.

  1. మీ మొదటి స్క్రీన్ ఎగువున ఉన్న డైనమిక్ డిస్‌ప్లేను నొక్కి, పట్టుకోండి.
  2. అనుకూలంగా మార్చండి ఆ తర్వాత డైనమిక్ డిస్‌ప్లే అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3853057146789812602
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false