Androidలోని యాప్‌లను, డేటాను కొత్త Android పరికరంలోకి కాపీ చేయండి

మీరు కొత్త పరికరాన్ని సెటప్ చేసినప్పుడు, మీ పాత Android పరికరంలోని డేటాను కొత్త Android పరికరానికి తరలించవచ్చు.

ముఖ్య గమనికలు:

  • మీరు పాత Android పరికరం నుండి Pixel 8 లేదా Pixel 8 Proకు డేటాను బదిలీ చేస్తుంటే, Pixel సహాయ కేంద్రానికి వెళ్లండి.
  • Samsung పరికరాలు అనేక డేటా బదిలీ ఆప్షన్‌లను ఆఫర్ చేస్తాయి. Samsung స్మార్ట్ స్విచ్ గురించి మరింత తెలుసుకోండి.
  • ఈ దశలలో కొన్ని, Android 10లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
  • ఒక పరికరంలోని డేటాను మరొక దానిలోకి కాపీ చేయడానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మీ రెండు పరికరాలను Wi-Fiకి కనెక్ట్ చేయాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము.
  • డేటాను బదిలీ చేయడానికి మీరు కేబుల్‌ను లేదా వైర్‌లెస్ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. రెండు విధానాలు ఒకే రకంగా డేటాను సపోర్ట్ చేస్తాయి. మీరు కేబుల్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, ఆ కేబుల్ రెండు పరికరాలలో ఫిట్ అవుతుందని నిర్ధారించుకోండి. అది ఫిట్ అవ్వకపోతే, మీరు ఒక అడాప్టర్‌ను కొనుగోలు చేయాల్సి రావొచ్చు.
  • మీరు డేటా బదిలీని ఒకసారి మాత్రమే చేయగలరు. సెటప్ చేస్తున్నప్పుడే బదిలీ చేయమని సిఫార్సు చేస్తున్నాము, ఎందుకంటే ఈ ఆప్షన్ తర్వాత అందుబాటులో ఉండకపోవచ్చు.
  • బిజినెస్ లేదా స్కూల్ లాంటి సంస్థ మీ Android పరికరాన్ని మేనేజ్ చేస్తుంటే, మీరు మొత్తం డేటాను బదిలీ చేయలేకపోవచ్చు.

మీరు బదిలీ చేయడానికి ముందు

  • మీ ఫోన్‌లు రెండూ ఛార్జ్ అయి ఉన్నాయని నిర్ధారించుకోండి.
  • SIMలను మార్చడానికి SIM కార్డ్ టూల్‌ను అందబాటులో ఉంచుకోండి.
  • కొంత టైమ్‌ ఇవ్వండి. డేటాను బదిలీ చేయడానికి కొన్నిసార్లు నిమిషాలు పడుతుంది, మరికొన్ని సార్లు గంటలు పడుతుంది.
  • మీ పాత, కొత్త పరికరాలు రెండింటిలో స్టోరేజ్‌ను చెక్ చేయండి. మీ కొత్త పరికరంలో తగినంత స్టోరేజ్ లేకపోతే, ఏ డేటాను బదిలీ చేయాలో మీరు ఎంచుకోవచ్చు.
  • మీ పాత ఫోన్ నుండి డేటాను కాపీ చేయడానికి Samsung పరికరాలకు ఇతర మార్గాలు ఉన్నాయి. Samsung స్మార్ట్ స్విచ్ గురించి మరింత తెలుసుకోండి.
సెటప్ సమయంలో ఏవేవి కాపీ అవుతాయి
  • యాప్స్, కొంత యాప్ డేటా
  • మ్యూజిక్
  • ఫోటోలు
  • వీడియోలు
  • మీ ఫోన్ లేదా SIM కార్డ్‌లో స్టోర్ అయి ఉన్న కాంటాక్ట్‌లు
  • టెక్స్ట్ మెసేజ్‌లు
  • దాదాపు ఫోన్ సెట్టింగ్‌లన్నీ (ఫోన్, Android వెర్షన్ ఆధారంగా మారతాయి)
  • టెక్స్ట్ మెసేజ్‌లలోని మల్టీమీడియా
  • వాల్‌పేపర్
  • కాల్ హిస్టరీ
సెటప్ సమయంలో ఏవి కాపీ కావు
  • PDF ఫైల్స్ వంటి డౌన్‌లోడ్‌లు
  • దాచబడిన ఫోల్డర్‌లలో స్టోర్ అయి ఉన్న ఫోటోలు, వీడియోలు, మ్యూజిక్
  • Google Play Store నుండి కాకుండా వేరే వాటి నుండి పొందిన యాప్స్
  • Android బ్యాకప్‌ను వాడని యాప్స్‌ డేటా
  • Google ఖాతాలు కాకుండా మిగిలిన ఇతర ఖాతాలు, వాటిలోని డేటా
  • Googleకు కాకుండా ఇతర సర్వీస్‌లకు సింక్ అయి ఉన్న కాంటాక్ట్‌లు, క్యాలెండర్‌లు
  • రింగ్‌టోన్‌లు
  • కొన్ని ఫోన్ సెట్టింగ్‌లు (ఫోన్‌ను బట్టి, Android వెర్షన్‌ను బట్టి మారతాయి)

1వ దశ: మీ Android పరికరాన్ని ఆన్ చేయండి

మీ Android పరికరాన్ని ఆన్ చేసి, ప్రారంభించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: అవసరాన్ని బట్టి మీ ఫోన్ భాషను లేదా విజన్ సెట్టింగ్‌లను ఇప్పుడు మార్చుకోవచ్చు.

2వ దశ: Wi-Fiకి లేదా మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయండి

  1. అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ల లిస్ట్‌తో ఒక ప్రాంప్ట్ కనబడుతుంది. అప్పుడు, Wi-Fiకి కనెక్ట్ చేయడానికి ఆ లిస్ట్‌లో ఒక దానిని ఎంచుకోండి.
  2. మీ డేటా నెట్‌వర్క్‌ను ఆన్ చేయడానికి, మీ SIM కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేయండి లేదా మీ క్యారియర్ నుండి eSIMను డౌన్‌లోడ్ చేసుకోండి.

చిట్కా:

  • ఈ రెండు దశలను పూర్తి చేయమని మీకు సిఫార్సు చేస్తున్నాము. అయితే, మీకు ఇంటర్నెట్ ఉన్నంత వరకు, డేటా బదిలీ కోసం ఈ రెండు దశలలో ఒక దానిని పూర్తి చేస్తే సరిపోతుంది.
  • మీరు కొత్త Android పరికరాన్ని సెటప్ చేసినప్పుడు, రెండు ఫోన్‌లను యాక్టివ్‌గా ఉన్న ఇంటర్నెట్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయమని సిఫార్సు చేస్తున్నాము.

3వ దశ: మీ యాప్స్‌ను, డేటాను కాపీ చేయండి

మీ కొత్త Android పరికరానికి యాప్స్‌ను, డేటాను కాపీ చేయడానికి, కాపీ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

కేబుల్‌తో (సిఫార్సు చేసిన విధానం)

రెండు పరికరాలను కేబుల్‌తో కనెక్ట్ చేయడానికి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.

ముఖ్య గమనిక: మీ వద్ద అనుకూలమైన కేబుల్ లేకపోతే, అడాప్టర్‌ను ఉపయోగించండి లేదా వైర్‌లెస్ పద్ధతిని ఫాలో అవ్వండి.

  1. మీ పాత పరికరంలో, కాపీ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • డేటాను పూర్తిగా బదిలీ చేయడానికి, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయమని సిఫార్సు చేస్తున్నాము.
  2. కాపీ చేయాల్సిన వాటిని ఎంచుకోండి.
  3. కాపీ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. కాపీ జరుగుతున్నప్పుడు, మీ కొత్త పరికరంలో, “మీ డేటా కాపీ అవుతోంది…” అనే మెసేజ్ కనిపిస్తుంది, పూర్తయ్యాక, మీ పాత పరికరంలో, “కాపీ చేయడం పూర్తయింది” అనే మెసేజ్ కనిపిస్తుంది.
    • మీరు ఎంత డేటాను బదిలీ చేస్తున్నారు అనే దాని ఆధారంగా, ఈ ప్రాసెస్‌కు కొన్ని నిమిషాల నుండి ఒక గంట వరకు సమయం పట్టవచ్చు.

చిట్కా:

  • మీ వద్ద WhatsApp ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మీరు కొత్త Android పరికరంలోకి సైన్ ఇన్ చేసి, యాప్‌ను తెరిచిన తర్వాత, క్లౌడ్ నుండి చాట్స్, డేటా రీస్టోర్ అవుతాయి.
  • WhatsApp చాట్స్‌ను, డేటాను రీస్టోర్ చేయడానికి, ముందుగా పాత పరికరంలో WhatsApp బ్యాకప్‌లను ఆన్ చేసి ఉంచాలి.
Wi-Fi కనెక్షన్‌తో

మీ వద్ద అనుకూలమైన కేబుల్ లేదా అడాప్టర్ లేకపోతే, వైర్‌లెస్ కనెక్షన్‌తో మీరు ఇప్పుడు కూడా యాప్స్‌ను, డేటాను కాపీ చేయవచ్చు.

మీ కొత్త పరికరంలో

  1. కేబుల్‌ను కనుగొనమని అడిగినప్పుడు, కేబుల్ లేదు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. “వైర్‌లెస్ విధానంలో బదిలీ చేయండి” అనే ఆప్షన్‌ను అది చూపినప్పుడు, తర్వాత అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీ పాత పరికరంలో PIN‌ను ఎంటర్ చేయండి.

మీ పాత పరికరంలో

  1. మీ పాత పరికరంలో, Google యాప్ ను తెరవండి.
  2. నా పరికరాన్ని సెటప్ చేయండి అనే ఆప్షన్ కోసం సెర్చ్ చేయండి.
  3. తర్వాత అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. “ప్రారంభించండి” అనే ఆప్షన్‌ను అది చూపినప్పుడు, తర్వాత అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. రెండు ఫోన్‌లలో ఆకారాలు, నంబర్‌లు మ్యాచ్ అవుతున్నాయో, లేదో చెక్ చేయండి.
  6. తర్వాత ఆ తర్వాత కాపీ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయమని సిఫార్సు చేస్తున్నాము.
  7. మీరు కాపీ చేయాలనుకునే యాప్స్‌ను, డేటాను ఎంచుకోండి.
  8. డేటా కాపీ అవ్వడం పూర్తయ్యే వరకు వేచి ఉండండి, పూర్తయ్యింది అని చూపుతూ మీకు ఒక మెసేజ్ అందుతుంది.

చిట్కా:

  • మీ వద్ద WhatsApp ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మీరు కొత్త Android పరికరంలోకి సైన్ ఇన్ చేసి, యాప్‌ను తెరిచిన తర్వాత, క్లౌడ్ నుండి చాట్స్, డేటా రీస్టోర్ అవుతాయి.
  • WhatsApp చాట్స్‌ను, డేటాను రీస్టోర్ చేయడానికి, ముందుగా పాత పరికరంలో WhatsApp బ్యాకప్‌లు ఆన్ చేసి ఉండాలి.
Google One నుండి డేటాను రీస్టోర్ చేయండి

మీ వద్ద మీ పాత పరికరం అందుబాటులో లేకుంటే, మీ Google ఖాతాలో స్టోర్ చేయబడిన మీ పాత పరికరంలోని మునుపటి బ్యాకప్ నుండి మీరు రీస్టోర్ చేయవచ్చు. మీ Android పరికరంలో డేటాను బ్యాకప్ చేయడం లేదా రీస్టోర్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

  • యాప్‌లను, డేటాను కాపీ చేయమని అడిగినప్పుడు, తర్వాత అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • USB కేబుల్‌ను కనెక్ట్ చేయమని అడిగినప్పుడు, దిగువున ఎడమ వైపున, కేబుల్ ఫిట్ కాలేదా? లేదా అడాప్టర్ లేదా? ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • మీకు పలు పరికరాల నుండి బ్యాకప్ ఉన్నట్లయితే, మీకు కావలసిన బ్యాకప్ వెర్షన్‌ను ఎంచుకోమని మిమ్మల్ని అడగవచ్చు.
    1. మీ ఎంపికను నిర్ధారించడానికి, మీ పాత పరికరానికి సంబంధించిన మీ PINను ఎంటర్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు.
    2. మీ క్లౌడ్ బ్యాకప్ నుండి మీరు రీస్టోర్ చేయాలనుకునే డేటా రకాలను ఎంచుకోండి.
    3. రీస్టోర్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: రీస్టోర్ చేయడం కోసం అందుబాటులో ఉన్న బ్యాకప్‌లను కనుగొనడానికి, మీరు మీ పాత పరికరంలో బ్యాకప్‌లను ఆన్ చేయాలి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4482423057236032022
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false