Google Play సర్వీసుల గురించి తెలుసుకోండి

Google Play సర్వీసులు అనేది కోర్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్, ఇది ప్రతి సర్టిఫై చేయబడిన Android పరికరంలో ప్రధాన ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేస్తుంది. Google Play సర్వీసులు మూడు రకాల ప్రధాన పరికర ఫీచర్‌లను అందిస్తాయి:

సెక్యూరిటీ, విశ్వసనీయత

Google Play సర్వీసులు, Android పరికరానికి సంబంధించిన సెక్యూరిటీని, విశ్వసనీయతను నిర్ధారించడంలో సహాయపడతాయి, అలాగే తాజా సెక్యూరిటీ ఫీచర్‌లతో పరికరాలు అప్‌డేట్ అయ్యి ఉండేలా చూసుకుంటాయి. వీటిలో ఇవి ఉంటాయి:

డెవలపర్ APIలు

Google Play సర్వీసులు డెవలపర్‌లకు వేల కొద్దీ నిరంతరంగా అప్‌డేట్ అయ్యే APIలను అందజేస్తాయి, ఇవి వారి యాప్‌లలో అధిక-క్వాలిటీ గల అనుభవాలను అందించడానికి వీలు కల్పిస్తాయి, ఉదాహరణకు:

ప్రధాన పరికర సర్వీసులు

Google Play సర్వీసులు Android పరికరాలలో ప్రధాన సర్వీసులను ఎనేబుల్ చేస్తాయి. ఉదాహరణకు:

  • యూజర్‌లు సపోర్ట్ ఉన్న ఎమర్జెన్సీ నంబర్‌కు ఎమర్జెన్సీ కాల్ చేసినప్పుడు, నేరుగా పరికర లొకేషన్‌ను అందుకోవడంలో Google లోకల్ ఎమర్జెన్సీ సర్వీసులకు సహాయపడుతుంది.
  • యూజర్‌ల సమయాన్ని ఆదా చేయడంలో, అలాగే టైపింగ్ ఎర్రర్‌లను తగ్గించడంలో Google ఆటోఫిల్ సర్వీసులు సహాయపడతాయి.
  • సమీప షేరింగ్ అనేది యూజర్‌లకు, తమ కాంటాక్ట్‌లతో లేదా అనామకంగా ఫైల్స్‌ను పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుంది.
  • పోగొట్టుకొన్న పరికరాన్ని గుర్తించడం, లాక్ చేయడం లేదా అందులోని డేటాను పూర్తిగా తొలగించడం Find My Device వల్ల సులభం అవుతుంది.
  • ఫాస్ట్ పెయిర్ మీ Google ఖాతాను ఉపయోగించి బ్లూటూత్ యాక్సెసరీలను కనెక్ట్ చేయడాన్ని సులభతరం చేస్తుంది.

అంతే కాకుండా, ఎవరైనా యూజర్ వారి పరికరంలో వారి Google ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు, వారు తమ Google సెట్టింగ్‌లను అప్‌డేట్ చేయగలరు, వారి ఖాతా సెక్యూరిటీని మేనేజ్ చేయగలరు, ముఖ్యమైన డేటాను సింక్ చేయగలరు, ఉదాహరణకు, పరికరాలన్నింటిలో వారి Google Contactsను సింక్ చేయగలరు.

Google Play సర్వీసులు డేటాను ఎందుకు కలెక్ట్ చేస్తాయి 

ప్రధాన పరికర ఫీచర్‌లను సపోర్ట్ చేయడానికి Google Play సర్వీసులు ధృవీకరించబడిన Android పరికరాలలో డేటాను కలెక్ట్ చేస్తాయి. పరికరం, యాప్ లేదా బ్రౌజర్‌కు కంటెంట్‌ను డెలివరీ చేయడానికి IP అడ్రస్ వంటి పరిమిత ప్రాథమిక సమాచారాన్ని కలెక్ట్ చేయడం అవసరం. ఈ ఫీచర్‌లను సపోర్ట్ చేయడం కోసం, లొకేషన్, కాంటాక్ట్‌ల వంటి పరికరంలోని నిర్దిష్ట డేటాను యాక్సెస్ చేయడానికి పరికర తయారీదారులు Google Play సర్వీసులకు అనుమతిని కూడా ఇస్తాయి.

యూజర్ కాన్ఫిగర్ చేసిన పరికర సెట్టింగ్‌లు, పరికరంలో ఇన్‌స్టాల్ చేసిన లేదా ఉపయోగించే యాప్‌లు, సర్వీసులు, పరికర తయారీదారు, ఇంకా యూజర్ Google ఖాతా సెట్టింగ్‌లను బట్టి వాస్తవ డేటా కలెక్షన్ మారుతుంది. చాలా సందర్భాల్లో, Google Play సర్వీసులు పరికరం నుండి డేటాను కలెక్ట్ చేయకుండానే పరికరంలో స్థానికంగా డేటాను యాక్సెస్ చేస్తాయి.

పైన వివరించిన ప్రతి ఒక్క ఫంక్షన్‌ను సపోర్ట్ చేయడానికి, Google Play సర్వీసులు ఈ కింద పేర్కొన్న కారణాల దృష్ట్యా సమాచారాన్ని సేకరించవచ్చు:

సెక్యూరిటీకి, అలాగే మోసాన్ని నివారించడానికి

మోసం, స్పామ్, ఇంకా దుర్వినియోగం నుండి యూజర్‌లను, Google సర్వీసులను, థర్డ్ పార్టీ డెవలపర్‌ల యాప్‌లు, సర్వీసులను సంరక్షించడంలో సహాయపడటానికి Google Play సర్వీసుల ద్వారా Google డేటాను కలెక్ట్ చేస్తుంది. వీటిలో ఇవి ఉంటాయి:

  • ఏదైనా ఒక రిక్వెస్ట్ నిజమైన యూజర్ నుండే వస్తోందని వెరిఫై చేయడానికి కావాల్సిన సమాచారం, ఇంకా మాల్‌వేర్ స్కాన్‌ల ఫలితాలతో సహా ఇన్‌స్టాల్ చేసిన యాప్‌ల గురించి సమాచారం.
  • యూజర్ పరికరంలో సైన్ ఇన్ చేసి ఉంటే లేదా కొత్త పరికరానికి వారి డేటాను తరలించినట్లయితే Google ఖాతా, లాగిన్ సమాచారం.
  • ఖాతా రికవరీ సర్వీసులను అందించడానికి, అలాగే యూజర్‌లను ఫోన్ నంబర్ ఆధారిత సర్వీసులకు (Google Meet వంటివి) లాగిన్ చేయడానికి Google, పరికర ఫోన్ నంబర్‌ను సేకరించవచ్చు.
  • సరికొత్త సెక్యూరిటీ ప్యాచ్‌లతో పరికరాలను అప్‌డేట్ చేయడానికి, అలాగే వివిధ రకాల పరికరాలు సర్వీసులో ఎంత కాలం ఉంటాయి లాంటి Android ఎకో సిస్టమ్‌లో ట్రెండ్‌లను పర్యవేక్షించడానికి IMEI, MAC అడ్రస్‌లు, సీరియల్ నంబర్‌ల వంటి హార్డ్‌వేర్ ఐడెంటిఫయర్‌లు. Google పరికర కాన్ఫిగరేషన్ సర్వీసు, పరికరాలు అప్‌డేట్ అయ్యి ఉన్నాయని, అలాగే సాధ్యమైనంత ఉత్తమంగా పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడం కోసం డేటాను సేకరిస్తుంది, ఇది Google Play సర్వీసుల్లో భాగంగా ఉంటుంది.

Android ఎకో సిస్టమ్‌ను సపోర్ట్ చేయడానికి, అలాగే మెరుగుపరచడానికి

పైన వివరించినట్లుగా, Google Play సర్వీసులు అనేక APIలను, ఇంకా ప్రధాన పరికర సర్వీసులను అందిస్తాయి, ఇవి Androidను మరిన్ని ఎక్కువ ఫీచర్‌లతో, కనెక్ట్ చేయబడిన ప్లాట్‌ఫామ్‌గా మారుస్తాయి. ఈ సర్వీసులను, అలాగే APIలను అందించడం, నిర్వహించడం, మెరుగుపరచడంలో సహాయపడటానికి వాటికి సంబంధించిన డేటాను Google సేకరించవచ్చు. పరికర సెట్టింగ్‌లను బట్టి, పరికరం గురించి అదనపు సమాచారాన్ని Google సేకరించవచ్చు. ఉదాహరణలలో ఇవి ఉంటాయి:

  • ఈ APIలు ఎలా ఉపయోగించబడుతున్నాయో అర్థం చేసుకోవడానికి, అలాగే అవి సరిగ్గా పని చేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి Google డేటాను సేకరిస్తుంది.
  • Google లొకేషన్ ఖచ్చితత్వం ఎనేబుల్ చేయబడినట్లయితే, పరికరంలో మరింత ఖచ్చితమైన లొకేషన్‌ను అందించడంతో పాటు, లొకేషన్-ఆధారిత సర్వీసులను మెరుగుపరచడానికి లొకేషన్ సమాచారం అనామక మార్గంలో ఉపయోగించబడవచ్చు.
  • పరికరానికి సంబంధించిన వినియోగం & విశ్లేషణల కంట్రోల్ ఎనేబుల్ చేయబడినట్లయితే, Google యాప్‌లు, Android పరికరాల వంటి ప్రోడక్ట్‌లను, సర్వీసులను మెరుగుపరచడానికి, పరికర వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని, ఇంకా ఆ పరికరం ఎంత బాగా పని చేస్తోంది అనే దానికి సంబంధించిన సమాచారాన్ని Google సేకరిస్తుంది.

Google సర్వీసులను అందించడానికి

ఎవరైనా ఒక యూజర్ Androidలో Google యాప్‌లు, సర్వీసులను ఉపయోగిస్తుంటే, ఆ యాప్‌లు, సర్వీసులను అందించడానికి, అలాగే మెరుగుపరచడానికి Google Play సర్వీసుల ద్వారా Google డేటాను సేకరిస్తుంది. ఉదాహరణకు:

  • యూజర్ సెట్టింగ్‌ల ఆధారంగా, పరికరాలలో, ఇంకా క్లౌడ్‌లో సింక్ చేయడానికి కాంటాక్ట్‌లు, బుక్‌మార్క్‌ల వంటి డేటాను Google సేకరిస్తుంది.
  • Google Play సర్వీసులు, పరికరాలన్నింటిలో యూజర్‌కు సంబంధించిన Google ఖాతా సెట్టింగ్‌లను సింక్ చేస్తాయి, అలాగే వారి ఖాతాను సంరక్షించడంలో సహాయపడటానికి సమాచారాన్ని సేకరిస్తాయి.
  • Google Maps వంటి పొందుపరచబడిన యాప్ ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేయడానికి Google Play సర్వీసులు డేటాను సేకరించవచ్చు.
  • బిజినెస్‌లకు నేరుగా మెసేజ్‌లను పంపడానికి యూజర్‌లకు ఇంటరాక్ట్ అవడం‌లో Google Play సర్వీసులు సహాయపడతాయి.
  • Google Payను ఉపయోగిస్తున్నప్పుడు, Google Play సర్వీసులు యూజర్‌లు తమ పేమెంట్ సమాచారాన్ని మేనేజ్ చేయడం‌లో, స్పర్శరహిత పేమెంట్‌లు చేయడం లేదా డిజిటల్ కార్ కీని సురక్షితంగా ఉపయోగించడంలో సహాయపడతాయి.
  • మీరు Play Games ప్రొఫైల్ లేదా సర్వీస్‌లను ఉపయోగించినప్పుడు Google డేటాను సేకరిస్తుంది.
  • వెబ్ & యాప్ యాక్టివిటీలో, "ఈ పరికరంలోని యాప్‌ల నుండి మీ యాక్టివిటీని సేవ్ చేస్తుంది" అనే సెట్టింగ్‌ను ఏ యూజర్‌లు అయితే తమ పరికరంలో ఎనేబుల్ చేస్తారో వారి విషయంలో, Google వారి పరికరంలోని యాప్‌ల నుండి యాక్టివిటీ డేటాను వారి Google ఖాతాలో సేవ్ చేసి, Google యాప్‌లను, సర్వీసులను వ్యక్తిగతీకరించడానికి దానిని ఉపయోగించవచ్చు.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3729549586646233895
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false