నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

పేమెంట్‌లు

AdSense కోసం పేమెంట్ టైమ్‌లైన్స్

మేము YouTube Studio మొబైల్ యాప్‌లోని 'సంపాదించండి' ట్యాబ్‌లో పేమెంట్ వివరాలను అందించే కొత్త బీటా వెర్షన్‌ను పరిచయం చేస్తున్నాము. ఈ బీటా వెర్షన్ అర్హత గల క్రియేటర్‌లకు వారి ఆదాయాలు పేమెంట్‌లుగా ఎలా మారుతాయో అర్థం చేసుకోవడానికి సహాయపడే సులభమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ బీటా వెర్షన్‌తో, మీరు కింద పేర్కొన్న వాటిని చూడవచ్చు:
  • మీ తర్వాతి పేమెంట్‌కు సంబంధించిన ప్రోగ్రెస్
  • తేదీ, పే చేసిన మొత్తం, పేమెంట్ బ్రేక్‌డౌన్‌తో సహా మీకు సంబంధించిన గత 12 నెలల పేమెంట్ హిస్టరీ
మా ఫోరమ్ పోస్ట్ లింక్‌లో మరింత తెలుసుకోండి.

AdSense పేమెంట్ కాల వ్యవధి నెలవారీగా ఉంటుంది. నెల పొడవునా మీకు సంబంధించిన అంచనా నికర ఆదాయం జమ అవుతూ వస్తుంది, ఆపై తర్వాతి నెల ప్రారంభంలో మీ నికర ఆదాయాన్ని ఖరారు చేసి, పేమెంట్‌ల పేజీలోని మీ బ్యాలెన్స్‌లో దాన్ని అప్‌డేట్ చేయడం జరుగుతుంది. మీ బ్యాలెన్స్, కనిష్ఠ పేమెంట్ పరిమితిని అధిగమించి, మీ ఖాతాకు సంబంధించి పేమెంట్ హోల్డ్స్ ఏవీ లేకపోతే, ఆ నెలలో 21 నుండి 26 తేదీల మధ్య మీకు పేమెంట్ జారీ చేయబడుతుంది. పేమెంట్‌ను మీరు ఏ సమయానికి ఖచ్చితంగా అందుకుంటారు అనేది, మీ టైమ్‌జోన్ మీద, 21వ తేదీ వారాంతంలో వచ్చిందా లేదా అది హాలిడేనా అనే దాని పైన, అలాగే మీరు ఎంచుకున్న పేమెంట్ ఆప్షన్ పైన కూడా ఆధారపడి ఉంటుందని గమనించండి.

గమనిక: AdSense, YouTube కోసం మీకు ప్రత్యేక పేమెంట్‌ల ఖాతాలు ఉంటే, పేమెంట్‌ను అందుకోవడానికి ప్రతి పేమెంట్‌ల ఖాతా కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరుకోవాల్సి ఉంటుంది.
ఉదాహరణ: మీరు జూన్ నెల మొత్తం అంచనా వేసిన నికర ఆదాయాలను ఆర్జించారని అనుకోండి. జూన్ 1వ తేదీ నుండి - 30వ తేదీ వరకు ఖరారైన మీ మొత్తం నికర ఆదాయం జూలై 3వ తేదీలోగా, మీ పేమెంట్స్ పేజీలో పోస్ట్ కావడాన్ని మీరు గమనించవచ్చు. ఆ తర్వాత, మీ జూన్ ఆదాయం, అలాగే మీ బ్యాలెన్స్‌లో ఏవైనా ఇతర క్రెడిట్‌లు ఉంటే అన్నీ కలిపి జూలై 21న గానీ, ఆ తేదీకి దగ్గర్లో గానీ ఏకమొత్తంగా పేమెంట్ చేయబడతాయి.
గమనిక: మునుపటి నెలకు సంబంధించి ఖరారైన మొత్తం YouTube నికర ఆదాయం, AdSenseలో మీ YouTube పేమెంట్‌ల ఖాతా బ్యాలెన్స్‌కు నెలలో 7, 12 మధ్య జోడించబడుతుంది. ఉదాహరణకు, మీరు యునైటెడ్ స్టేట్స్‌లో ఉండి, జూన్ నెలలో $100 సంపాదిస్తే, జూలై 7-12 మధ్య మీ YouTube హోమ్ పేజీ కోసం AdSenseలో ఈ బ్యాలెన్స్ మీకు కనిపిస్తుంది. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ ద్వారా నికర ఆదాయం ఆర్జించడం గురించి మరింత తెలుసుకోవడానికి, YouTube పార్ట్‌నర్ ఆదాయం ఓవర్‌వ్యూ లింక్‌ను చూడండి.

మీ పేమెంట్‌ల ప్రోగ్రెస్‌ను ట్రాక్ చేయండి

మీ పేమెంట్‌ల ప్రోగ్రెస్‌ను సూచించడానికి మీ పేమెంట్‌ల పేజీ అప్‌డేట్ చేయబడింది. మీ నికర ఆదాయం ఖరారు చేయబడి, ఆపై పేమెంట్ జారీ చేయబడినందున, నెల మొత్తం లైన్ ఐటెమ్‌లు జోడింపబడటం, అప్‌డేట్ కావడాన్ని మీరు గమనించవచ్చు. మీరు వివిధ రకాల పేమెంట్‌లకు, క్రెడిట్‌లకు సంబంధించిన ఇతర లైన్ ఐటెమ్‌లను కూడా చూడవచ్చు. మీకు సంబంధించిన అనుకూలంగా మార్చబడిన పేమెంట్ టైమ్‌లైన్‌ను చూడటానికి, దిగువున మీ పేమెంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

అన్నింటినీ విస్తరించండి  అన్నింటినీ కుదించండి

ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (EFT)
An example of an AdSense payments calendar
  • 3వ తేదీన: మునుపటి నెలలోని మీకు సంబంధించిన అంచనా వేసిన నికర ఆదాయాన్ని ఖరారు చేసి, దాన్ని మీ పేమెంట్‌ల పేజీలో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ పేమెంట్‌ల పేజీలో, మునుపటి నెల లావాదేవీలకు జోడించిన మీ మొత్తం నికర ఆదాయం ఉన్న లైన్ ఐటెమ్‌ను మీరు గమనిస్తారు.

    సర్దుబాట్లకు లేదా ఫీజులకు సంబంధించిన ఏవైనా డిడక్షన్‌లను కూడా పేమెంట్‌ల పేజీ డిస్‌ప్లే చేస్తుంది. ఫైనలైజేషన్ ప్రాసెస్‌లో చెల్లని యాక్టివిటీ డిడక్షన్‌లకు సంబంధించిన లైన్ ఐటెమ్‌లను మీరు చూడలేకపోవచ్చని గమనించండి. చెల్లని యాక్టివిటీ డిడక్షన్‌ల గురించి మరింత తెలుసుకోండి.

  • 20వ తేదీన: పేమెంట్ సమాచారానికి మార్పులు చేయడం (పేమెంట్ హోల్డ్స్‌ను తీసివేయడంతో సహా) 20వ తేదీ లోపు లేదా అంతకు ముందే పూర్తి కావాలి. ఏ నెలలోనైనా 20వ తేదీ తర్వాత చేసిన మార్పులు తర్వాతి నెల పేమెంట్ కాల వ్యవధి వరకు అమల్లోకి రావు.

    20వ తేదీలోగా మీ మొత్తం బ్యాలెన్స్ తప్పకుండా కనిష్ఠ పేమెంట్ పరిమితికి చేరాలి. మీ బ్యాలెన్స్, కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరకపోతే లేదా మీ ఖాతాపై ఏదైనా పేమెంట్ హోల్డ్ ఉంటే, మీకు ఆ నెలకు సంబంధించిన పేమెంట్ అందదు, మీ బ్యాలెన్స్ తర్వాతి నెలకు రోల్ ఓవర్ అవుతుంది.

  • 21-26 తేదీల మధ్యన: నెలలో 21 నుండి 26 తేదీల మధ్యన, పేమెంట్‌ల పేజీలో "పేమెంట్ పెండింగ్‌లో ఉంది" అనే లైన్ కనిపిస్తుంది, అది ఆదాయం ప్రాసెస్ చేయబడి, పేమెంట్ మీ బ్యాంకింగ్ సంస్థకు పంపడం జరిగింది అని సూచిస్తుంది. 

మీ పేమెంట్ జారీ అయిన ఏడు పని దినాల లోపు మీరు దాన్ని అందుకుంటారు. మీరు నెలాఖరులోగా పేమెంట్‌ను అందుకోకపోతే, మీ బ్యాంకింగ్ సంస్థను సంప్రదించండి.

గమనిక: 21వ తేదీ వారాంతం లేదా హాలిడే అయితే, ఆ నెలలోని 21వ తేదీ తర్వాత వచ్చే తొలి పని దినంలో పేమెంట్‌లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

చెక్

మీ మునుపటి నెల నికర ఆదాయాన్ని చెక్ పేమెంట్‌ల రూపంలో జారీ చేస్తుంటే, ఆ పేమెంట్‌లు 21 నుండి 26 తేదీల మధ్యన రిలీజ్ చేయబడతాయి, ఆ చెక్, మీ పేమెంట్ అడ్రస్‌కు చేరడానికి నాలుగు వారాల దాకా సమయం పట్టవచ్చు.

  • 3వ తేదీన: మునుపటి నెల అంచనా నికర ఆదాయాన్ని ఖరారు చేసి, దాన్ని పేమెంట్‌ల పేజీలో పోస్ట్ చేయడం జరుగుతుంది.
  • 20వ తేదీన: పేమెంట్ సమాచారానికి మార్పులు చేయడం (పేమెంట్ హోల్డ్స్‌ను తీసివేయడంతో సహా) 20వ తేదీ లోపు లేదా అంతకు ముందే పూర్తి కావాలి. ఏ నెలలోనైనా 20వ తేదీ తర్వాత చేసిన మార్పులు తర్వాతి నెల పేమెంట్ కాల వ్యవధి వరకు అమల్లోకి రావు. అలాగే, 20వ తేదీ లోపు మీ మొత్తం బ్యాలెన్స్ తప్పకుండా కనిష్ఠ పేమెంట్ పరిమితికి చేరాలి. మీ బ్యాలెన్స్, కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరకపోతే లేదా మీ ఖాతాపై ఏదైనా పేమెంట్ హోల్డ్ ఉంటే, మీకు ఆ నెలకు సంబంధించిన పేమెంట్ అందదు, మీ బ్యాలెన్స్ తర్వాతి నెలకు రోల్ ఓవర్ అవుతుంది.
  • 21-26 తేదీల మధ్యన: అర్హత ఉన్న ఖాతాలకు చెక్, మెయిల్ చేయబడుతుంది. "పేమెంట్ పెండింగ్‌లో ఉంది" అనే లైన్ ఐటెమ్ మీ పేమెంట్‌ల పేజీలో కనిపిస్తుంది.

మెయిల్ ద్వారా చెక్ మీకు చేరడానికి రెండు నుండి నాలుగు వారాల సమయం పట్టవచ్చు. మీ ప్రాంతంలోని పోస్టల్ సర్వీస్ ఆధారంగా అరైవల్ సమయాలు మారుతాయి.

Western Union Quick Cash

Western Union Quick Cash పేమెంట్‌లు ప్రతి నెలా 21 నుండి 26 తేదీల మధ్యన జారీ చేయబడతాయి. పేమెంట్‌లను జారీ చేసిన తర్వాతి పని దినం నుండి మీ దేశంలోని ఏ Western Union ఆఫీస్‌లో అయినా పేమెంట్ పొందవచ్చు.

  • 3వ తేదీన: మునుపటి నెల అంచనా నికర ఆదాయాన్ని ఖరారు చేసి, దాన్ని పేమెంట్‌ల పేజీలో పోస్ట్ చేయడం జరుగుతుంది.
  • 20వ తేదీన: పేమెంట్ సమాచారానికి మార్పులు చేయడం (పేమెంట్ హోల్డ్స్‌ను తీసివేయడంతో సహా) 20వ తేదీ లోపు లేదా అంతకు ముందే పూర్తి కావాలి. ఏ నెలలోనైనా 20వ తేదీ తర్వాత చేసిన మార్పులు తర్వాతి నెల పేమెంట్ కాల వ్యవధి వరకు అమల్లోకి రావు. అలాగే, 20వ తేదీ లోపు మీ మొత్తం బ్యాలెన్స్ తప్పకుండా కనిష్ఠ పేమెంట్ పరిమితికి చేరాలి. మీ బ్యాలెన్స్, కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరకపోతే లేదా మీ ఖాతాపై ఏదైనా పేమెంట్ హోల్డ్ ఉంటే, మీకు ఆ నెలకు సంబంధించిన పేమెంట్ అందదు, మీ బ్యాలెన్స్ తర్వాతి నెలకు రోల్ ఓవర్ అవుతుంది.
  • 21-26 తేదీల మధ్యన: పేమెంట్ Western Unionకు పంపబడుతుంది. "పేమెంట్ పెండింగ్‌లో ఉంది" అనే లైన్ ఐటెమ్ మీ పేమెంట్‌ల పేజీలో కనిపిస్తుంది.

పేమెంట్ చేసిన 60 రోజుల లోగా మీరు ఆ డబ్బును ఖచ్చితంగా తీసుకోవాలి, లేదంటే అది తిరిగి మీ AdSense ఖాతాకు క్రెడిట్ చేయబడుతుంది.

బ్యాంక్ ట్రాన్స్‌ఫర్
  • 3వ తేదీన: మునుపటి నెల అంచనా నికర ఆదాయాన్ని ఖరారు చేసి, దాన్ని పేమెంట్‌ల పేజీలో పోస్ట్ చేయడం జరుగుతుంది.
  • 20వ తేదీన: పేమెంట్ సమాచారానికి మార్పులు చేయడం (పేమెంట్ హోల్డ్స్‌ను తీసివేయడంతో సహా) 20వ తేదీ లోపు లేదా అంతకు ముందే పూర్తి కావాలి. ఏ నెలలోనైనా 20వ తేదీ తర్వాత చేసిన మార్పులు తర్వాతి నెల పేమెంట్ కాల వ్యవధి వరకు అమల్లోకి రావు. అలాగే, 20వ తేదీ లోపు మీ మొత్తం బ్యాలెన్స్ తప్పకుండా కనిష్ఠ పేమెంట్ పరిమితికి చేరాలి. మీ బ్యాలెన్స్, కనిష్ఠ పేమెంట్ పరిమితిని చేరకపోతే లేదా మీ ఖాతాపై ఏదైనా పేమెంట్ హోల్డ్ ఉంటే, మీకు ఆ నెలకు సంబంధించిన పేమెంట్ అందదు, మీ బ్యాలెన్స్ తర్వాతి నెలకు రోల్ ఓవర్ అవుతుంది.
  • 21-26 తేదీల మధ్యన: బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ప్రారంభించబడుతుంది. "పేమెంట్ పెండింగ్‌లో ఉంది" అనే లైన్ ఐటెమ్ మీ పేమెంట్‌ల పేజీలో కనిపిస్తుంది.

ట్రాన్స్‌ఫర్ పూర్తవ్వడానికి 15 పని దినాల వరకు సమయం పట్టవచ్చు. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు చేరడానికి పట్టే సమయం మీ బ్యాంకింగ్ సంస్థపై ఆధారపడి ఉంటుంది.

గమనిక: 21వ తేదీ వారాంతం లేదా హాలిడే అయితే, ఆ నెలలోని 21వ తేదీ తర్వాత వచ్చే తొలి పని దినంలో పేమెంట్‌లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

గమనిక: పబ్లిషర్ ఖాతా మా నియమాలను, షరతులను లేదా ప్రోగ్రామ్ పాలసీలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే, మేము ఏ సమయంలోనైనా పేమెంట్‌ను (ఉల్లంఘనలు జరిగి ఉండటానికి అవకాశం ఉంది అన్న అంశంపై విచారణను Google ప్రారంభించినప్పటి నుండి) విత్‌హోల్డ్ చేయవచ్చు, పబ్లిషర్ ఖాతా నుండి ఆదాయాన్ని డిడక్ట్ చేయవచ్చు, మరియు/లేదా సెర్చ్ ఫలితాల పేజీ కోసం AdSense లేదా పబ్లిషర్ సైట్‌లో పొందిన క్లిక్‌లకు సంబంధించి అడ్వర్టయిజర్‌లకు రీఫండ్ చేయవచ్చు.

అదనంగా, Google Ads ప్రోగ్రామ్‌కు సంబంధించి పబ్లిషర్ గతంలో ఏదైనా పేమెంట్‌లో Googleకు బకాయి పడి ఉంటే, ఆ మొత్తం బకాయి తీర్చే దాకా పేమెంట్‌ను విత్‌హోల్డ్ చేసే హక్కు మాకు ఉంది. పేమెంట్ నియమాల పూర్తి వివరణ కోసం, AdSense నియమాలు, షరతులు లింక్‌లో చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
ఎదగగల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

విలువైన AdSense గణాంకాలను మిస్ చేసుకోకండి. మీ నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగల పనితీరు రిపోర్ట్‌లను, వ్యక్తిగతీకరించిన చిట్కాలను, వెబినార్ ఆహ్వానాలను అందుకోవడానికి సమ్మతించండి

సమ్మతించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4190246649155623509
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false