నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

స్వీయ ప్రకటనలు

ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు

ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు అనేవి, మీ యూజర్‌లు పేజీలోని ఏ కంటెంట్‌ను అయితే చూస్తున్నారో, ఆ కంటెంట్‌కు సంబంధించిన సెర్చ్ క్వెరీలను చూపించే వీలు మీకు కల్పిస్తాయి. యూజర్‌లు సంబంధిత సెర్చ్ క్వెరీని క్లిక్ చేసినప్పుడు, యాడ్స్‌ను, సైట్ సెర్చ్ ఫలితాలను చూపగలిగే, Google అందించే సెర్చ్ ఎక్స్‌పీరియన్స్ వారికి అందించడం జరుగుతుంది. ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను ఆన్ చేస్తే, మీ సైట్‌లో సంబంధిత టాపిక్‌లను అన్వేషించడానికి, సెర్చ్ కోసం AdSense యాడ్స్‌తో ఎంగేజ్ అవ్వడానికి మీ యూజర్‌లను ప్రోత్సహించినట్టు అవుతుంది.

గమనిక: ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు అనేవి, ప్రస్తుతం ఇంగ్లీష్ లేదా జర్మన్ భాషలలో ఉండే పేజీలు గల సైట్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మీరు వేరే భాషలో ఉండే సైట్ విషయంలో ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను ఆన్ చేస్తే, ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు కనిపించవు.

ప్రయోజనాలు

  • సైట్ ఎంగేజ్‌మెంట్‌లో వృద్ధి: యూజర్‌లు ఏ కంటెంట్‌ను అయితే చూస్తున్నారో, ఆ కంటెంట్‌కు సందర్బోచితంగా ఉండే కంటెంట్‌ను కనుగొనడంలో వారికి సహాయపడటం ద్వారా, ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు మరింత సైట్ ఎంగేజ్‌మెంట్‌కు ఊతం ఇవ్వగలవు.
  • సందర్భోచితమైన సెర్చ్ యాడ్‌లు: సెర్చ్ ఫలితాల పేజీలో, Google మీ యూజర్ సెర్చ్ క్వెరీలకు సంబంధించిన అధిక క్వాలిటీ గల సెర్చ్ కోసం AdSense యాడ్‌లను అందించగలదు.
  • అదనపు ఆదాయం: ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు అనేవి, మీ సైట్‌కు సంబంధించిన సెర్చ్ ఫలితాలకు మరింత ట్రాఫిక్‌ను మళ్లించడం ద్వారా, సెర్చ్ యాడ్స్ విషయంలో అదనపు ఆదాయాన్ని సంపాదించడంలో మీకు సహాయపడగలదు.
  • మీ ప్రస్తుత యాడ్స్‌తో పని చేస్తుంది: ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు అనేవి కేవలం నావిగేషనల్ యూనిట్ మాత్రమే కాబట్టి, అది యాడ్ కాదు కాబట్టి, పేజీ విషయంలో అది యాడ్ లోడ్ కిందికి రాదు. మీ యాడ్‌ల కంట్రోల్స్‌ను (బీటా) మెరుగుపరచండి ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను ప్రభావితం చేయదని గుర్తుంచుకోండి.

ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు ఎలా పని చేస్తాయి

  • మీరు ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను ఆన్ చేసినప్పుడు, అర్హత గల మీ పేజీలలో, సంబంధిత సెర్చ్ ఎక్స్‌పీరియన్స్‌ను AdSense అందిస్తుంది.
  • AdSense, సంబంధిత సెర్చ్ క్వెరీలను ఆటోమేటిక్‌గా జెనరేట్ చేసి మీకు అందిస్తుంది. కాలక్రమేణా క్వెరీలు, వాటి స్థానం మారవచ్చని గమనించండి.

ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీల ద్వారా మీరు ఎలా సంపాదిస్తారు

ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు అనేవి సమ్మతి ఆధారంగా ఎనేబుల్ అయ్యే ఫార్మాట్, ఈ ఫార్మాట్ 'సెర్చ్ కోసం AdSense' యాడ్స్‌ను డిస్‌ప్లే చేస్తుంది, ఈ యాడ్స్‌పై క్లిక్ చేయగా వచ్చే ఆదాయంలో 51% వాటా మీకు అందుతుంది. 'కంటెంట్ కోసం AdSense' ఫార్మాట్‌ల ద్వారా మీకు అందే ఆదాయంలో షేర్‌కు ఇది భిన్నంగా ఉండవచ్చు. ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీల ద్వారా మీకు వచ్చే నికర ఆదాయం, మీ సాధారణ 'కంటెంట్ కోసం AdSense' పేమెంట్‌లలో ప్రత్యేక లైన్ ఐటెమ్‌గా కనిపిస్తుంది.

ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను ఆన్ చేయడం ఎలా

  1. మీ AdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. యాడ్‌లు ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీ సైట్‌లు అన్నీ ఉండే టేబుల్‌లో, మీ సైట్ పక్కన ఉండే ఎడిట్ చేయండి ఎడిట్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీ సైట్ యాడ్ సెట్టింగ్‌ల ప్రివ్యూలో తెరుచుకుంటుంది.
  4. "యాడ్ సెట్టింగ్‌ల"లో ఆటోమేటిక్ యాడ్స్ ఆప్షన్ ఆన్ చేసి ఉందని నిర్ధారించుకోండి.
  5. పేజీలోని ఫార్మాట్‌ల ఆప్షన్‌ను క్లిక్ చేసి, సంబంధిత సెర్చ్ ఆప్షన్‌ను ఆన్ చేయండి.
  6. సర్వీస్ నియమాలను, పాలసీలను అంగీకరిస్తున్నారని నిర్ధారించండి.
  7. సైట్‌కు వర్తింపజేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    గమనిక: ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీల యూనిట్‌లు, అర్హత గల మీ పేజీలలో వెంటనే కనిపించకపోవచ్చు.

ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలకు చెందిన పనితీరును ట్రాక్ చేయడం ఎలా

  1. AdSenseలో రిపోర్ట్‌ల పేజీకి వెళ్లండి.
  2. అనుకూల రిపోర్ట్‌ను క్రియేట్ చేయండి, "యాడ్ ఫార్మాట్" కేటగిరీలను జోడించండి.
  3. కొలమానాలను ఎడిట్ చేయండి ఎడిట్ చేయండిని క్లిక్ చేసి, "ఫనెల్" కొలమానాలను ఎంచుకుని, వర్తింపజేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

FAQలు

ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను ఆన్ చేయడానికి, నాకు 'సెర్చ్ కోసం AdSense' (AFS) ఖాతా అవసరం అవుతుందా?

లేదు. ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు, 'సెర్చ్ కోసం AdSense' యాడ్స్‌ను డిస్‌ప్లే చేసినప్పటికీ, ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను ఆన్ చేయడానికి, AFS ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను ఆన్ చేయడానికి, మీరు ఆటోమేటిక్ యాడ్స్‌ను ఎనేబుల్ చేస్తే సరిపోతుంది.

నా సైట్ ప్రస్తుతం సెర్చ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడం లేదు. అయినా కూడా నేను ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలకు సైన్ అప్ చేయవచ్చా?

చేయవచ్చు. యూజర్‌లు సంబంధిత సెర్చ్ క్వెరీని క్లిక్ చేసినప్పుడు, యాడ్స్‌ను, ఇంకా మీ సైట్ నుండి ఫలితాలను చూపే, Google అందించే సెర్చ్ ఎక్స్‌పీరియన్స్ వారికి అందించడం జరుగుతుంది.

నా పేజీలలో వేటికి ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలకు అర్హత ఉంది?

తగినంత టెక్స్ట్ కంటెంట్ ఉన్న ఏ పేజీకి అయినా అర్హత ఉంటుంది. ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు అనేవి కంటెంట్ ఆధారంగా క్వెరీలను జెనరేట్ చేస్తుంది కాబట్టి, కంటెంట్ అధికంగా ఉండే పేజీలు మరిన్ని సందర్భోచితమైన క్వెరీలను జెనరేట్ చేస్తాయి, దీని వలన పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది. ఇంగ్లీష్, జర్మన్ భాషలలో రెండర్ అయ్యే పేజీలను మాత్రమే సంబంధిత సెర్చ్ డిస్‌ప్లే చేస్తుందని గమనించండి.

నా పేజీకి అర్హత ఉంది, కానీ నాకు ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు ఎందుకు కనిపించడం లేదు?

పేజీకి అర్హత ఉన్నా కూడా, డిస్‌ప్లే చేయడానికి సంబంధిత క్వెరీలేవీ లేవని మేము గుర్తిస్తే, ఆ పేజీ విషయంలో మేము ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలను రెండర్ చేయము. పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్‌తో పాటు సున్నితమైన అంశాలు ఉండే కంటెంట్ కూడా సూచించబడకుండా ఉండేందుకు వాటిని ఫిల్టర్ చేయడానికి, ఆటోమేటిక్ యాడ్స్ కోసం సంబంధిత సెర్చ్ క్వెరీలు తగిన చర్యలు తీసుకుంటాయి.

నా సైట్‌కు చెందని సెర్ఛ్ ఫలితాలు నాకు కనిపిస్తున్నాయి, దీనికి కారణం ఏమిటి?

ఏదైనా క్వెరీ మీ సైట్ నుండి తగినన్ని సందర్భోచితమైన ఫలితాలను అందించలేనప్పుడు, మేము వెబ్‌లోని ఇతర సైట్‌ల నుండి ఫలితాలను చేర్చే అవకాశం ఉంది. దీని వలన యూజర్‌కు మరింత విలువ అందుతుంది, అలాగే అనుకూల సెర్చ్ యాడ్స్ పాలసీలకు అనుగుణంగా ఉండటాన్ని కొనసాగించడంలో ఇది మీకు సహాయపడుతుంది. వెబ్‌లోని ఇతర సైట్‌ల నుండి ఫలితాలు డిస్‌ప్లే అయినప్పుడు, సెర్చ్ ఫలితాల పేజీలో ఈ విషయాన్ని మేము యూజర్‌కు తెలియజేస్తాము.

థర్డ్-పార్టీ యాడ్‌లను సమ్మతించండి

ఈ యాడ్ ఫార్మాట్ కోసం థర్డ్-పార్టీ యాడ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ సెర్చ్ ఫలితాల పేజీలలో థర్డ్-పార్టీ యాడ్‌లను చూపడానికి సమ్మతించడం ఎలాగో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5039142113481104552
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false