నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

యాడ్ స్థానానికి సంబంధించి బెస్ట్ ప్రాక్టీసులు

మీ సైట్‌లో యాడ్‌లను ఉంచే సమయంలో యూజర్ అనుభవాన్ని, AdSense ప్రోగ్రామ్ పాలసీలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ కొన్ని చిట్కాలను అందిస్తున్నాము.

మీ వినియోగదారులను పరిగణనలోకి తీసుకోండి

మీ సైట్‌లోని కంటెంట్‌ను క్రమబద్ధంగా నిర్వహించి, దానిని సులభంగా నావిగేట్ చేయగలిగేలా రూపొందించండి. మీ ప్రకటనలను ఎక్కడ ఉంచాలో నిర్ణయించుకునే ముందు మీకు మీరు వేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలను ఇక్కడ అందిస్తున్నాము:

  • నా సైట్‌ను సందర్శించడం ద్వారా వినియోగదారు ఏమి ప్రయోజనాన్ని ఆశిస్తారు?
  • నిర్దిష్ట పేజీని వీక్షించే సమయంలో వారు ఏమి చేస్తారు?
  • వారు దేనిపై దృష్టి పెట్టవచ్చు?
  • వినియోగదారు పనులకు ఇబ్బంది కలగకుండా నేను ఈ ప్రాంతంలో ప్రకటనలను ఎలా ఏకీకృతం చేయాలి?
  • పేజీని శుభ్రంగా, గందరగోళం లేకుండా మరియు ఆకర్షణీయంగా ఉంచడం ఎలా?

వినియోగదారు లాగా ఆలోచించండి, మీ పేజీ (మరియు మీ ప్రకటన స్థానం) మీకు సరికొత్తగా కనిపించవచ్చు. వినియోగదారులు దేని కోసం వెతుకుతున్నారో అది వారికి త్వరగా కనిపించినట్లయితే, వారు మీ సైట్‌కు మళ్లీ రాగలరు.

మీ కోసం Google యాడ్‌లను అందించేలా చేయండి

మీ సైట్ కోసం ఆటోమేటిక్ యాడ్స్‌ను ఎనేబుల్ చేయడం ఒక ఆప్షన్. స్వీయ ప్రకటనలు, మీ కోసం ప్రకటనలను ఆటోమేటిక్‌గా అమర్చుతుంది. ఆప్టిమైజ్ చేస్తుంది. కాబ‌ట్టి, మీరు దీని కోసం ప్రత్యేక సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. స్వీయ ప్రకటనల గురించి మరింత తెలుసుకోండి.

మీరు మీ స్వంత ప్రకటనలను అమర్చుతున్నట్లయితే

మీ కంటెంట్ ప్రధానంగా కనిపించేలా చూసుకోండి

మీ యూజర్‌లకు ఆసక్తికరమైన కంటెంట్ ఉన్న ప్రదేశం సమీపంలో మీ యాడ్‌లను ఉంచండి, అలాగే మీ యూజర్‌లు వెతుకుతున్న కంటెంట్ వారికి సులభంగా కనిపించేలా చూసుకోండి. ఉదాహరణకు, మీ సైట్‌లో డౌన్‌లోడ్‌లను అందిస్తున్నట్లయితే, డౌన్‌లోడ్ లింక్‌లు మడత పైన, సులభంగా కనుగొనగలిగేలా ఉండేటట్లు చూసుకోండి.

కంటెంట్‌ను, యాడ్‌లను ఎలా బ్యాలెన్స్ చేయాలనే దాని గురించి మరిన్ని చిట్కాలు కావాలంటే, మా అంతర్గత AdSense బ్లాగ్ పోస్ట్‌ను చూడండి: కంటెంట్ తర్వాతే ఏదైనా

మీ యాడ్‌లను, యాడ్‌ల లాగే కనిపించేలా ఉంచండి

మీ యాడ్‌లను ఇమేజ్‌లతో సమంగా అమర్చడం లేదా సమీపంలోని కంటెంట్ వాటి ఫార్మాట్‌ను అనుకరించేలా చేయడం వంటివి నివారించండి. మా ప్రోగ్రామ్ విధానాల ప్రకారం ప్రకటనలను ఈ విధంగా ప్రదర్శించడం అనుమతించబడదు.

వాటిని ఎలాగైతే పిలుస్తారో, అదే విధంగా సూచించండి

యూజర్‌లను తప్పుదారి పట్టించే లేబుల్‌లను, శీర్షికలను నివారించేలా జాగ్రత్తలు తీసుకోండి. యాడ్ యూనిట్‌లను "అడ్వర్టయిజ్‌మెంట్‌లు" లేదా "స్పాన్సర్ చేసిన లింక్‌లు" అని మాత్రమే లేబుల్ చేయవచ్చు. అలాగే, మెనూ, నావిగేషన్ లేదా డౌన్‌లోడ్ లింక్‌లుగా భావించేందుకు ఆస్కారమున్న చోట యాడ్‌లను ఉంచవద్దు.

మీ యాడ్ సైజ్‌లను ఆప్టిమైజ్ చేయండి

మొబైల్‌లో మీ యాడ్‌ల సైజ్‌ను Google ఆటోమేటిక్‌గా ఆప్టిమైజ్ చేయగలదు. ప్రకటన యూనిట్ పరిమాణాలు మీ అర్హత కలిగిన మొబైల్ వీక్షకుల నుండి ఉత్తమ ఆదరణ లభించేలా ఎంపిక చేయబడతాయి. వీటి కోసం మీ పేజీలలోని ప్రకటన కోడ్‌ను మార్చాల్సిన అవసరం ఉండదు. "ప్రకటనల పరిమాణాలు" ఆప్టిమైజేషన్ సెట్టింగ్ గురించి మరింత తెలుసుకోండి.

తక్కువతో ఎక్కువ లాభం

మీరు మీ పేజీలలోని కంటెంట్ కంటే యాడ్‌లను ఎక్కువగా ఉంచకూడదు, కానీ మీరు మీ సైట్‌లోని ప్రతి పేజీలోనూ యాడ్ యూనిట్‌లు, లింక్ యూనిట్‌లు మరియు/లేదా సెర్చ్ బాక్స్‌లను కలిపి ఉంచవచ్చు. మరింత సమాచారం కోసం మా ఇన్వెంటరీ విలువ పాలసీని చూడండి. అయితే, మీ పేజీలో చాలా ఎక్కువ యాడ్‌లను ఉంచడం వల్ల గందరగోళం ఏర్పడవచ్చని గమనించండి. వినియోగదారులు వెతుకుతున్నది వారికి కనిపించలేదంటే, వారు మరో చోటుకు వెళ్లవచ్చు.

మీ సైట్‌ను సమీక్షించండి

మీ సైట్‌లోని అంశాలన్నీ విశ్లేషించి, మొదటిసారి వచ్చే వినియోగదారులకు ఎలాంటి అనుభవం అందిస్తుందో పరిశీలించండి. మీరు టెంప్లేట్ బిల్డర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, ప్రకటనలు, అలాగే వాటి "Google అందించిన ప్రకటనలు" లేదా "AdChoices" లేబుల్‌లు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో సరిచూసుకోండి.

మీకు మీరు ఈ రెండు ప్రశ్నలను వేసుకోండి:

  • నా కంటెంట్‌ను సులభంగా కనుగొనవచ్చా?
  • నా కంటెంట్ అలాగే నా యాడ్‌ల మధ్య వ్యత్యాసాన్ని సులభంగా కనుగొనవచ్చా?

రెండింటికీ సమాధానం 'అవును' అయితే, మీరు అంతా సరిగ్గానే చేస్తున్నారని అర్థం

 

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3895095899466922479
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false