వయో అర్హతలకు తగినట్లు మీ ఖాతాను అప్‌డేట్ చేయండి

మీ స్వంత Google ఖాతాను మేనేజ్ చేయడానికి, మీరు తప్పనిసరిగా మీ ఖాతాతో అనుబంధించబడిన దేశానికి అవసరమైన కనీస వయో అర్హతను కలిగి ఉండాలి.

మీ స్వంత ఖాతాను మేనేజ్ చేయడానికి తగిన వయస్సు మీకు ఉండకపోవచ్చని మాకు తెలిసినట్లయితే:

  • మీ ఖాతా కోసం పర్యవేక్షణను సెటప్ చేయడానికి లేదా మీ ఖాతాను మేనేజ్ చేయడానికి మీకు తగినంత వయస్సు ఉందని వెరిఫై చేయడానికి మీకు 14 రోజుల సమయం ఉంటుంది. ఈ అదనపు గడువు సమయంలో మీరు లాగిన్ చేసి, మీ ఖాతాను ఎప్పటిలాగానే ఉపయోగించవచ్చు.
    • మీ ఖాతా ఆఫీస్, స్కూల్ లేదా మరొక సంస్థ ద్వారా ఉన్నట్లయితే, మీ ఖాతా తల్లిదండ్రుల పర్యవేక్షణకు అర్హత పొందకపోవచ్చు. అటువంటి సందర్భంలో, మీ ఖాతా తక్షణమే డిజబుల్ చేయబడుతుంది. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు మీ అడ్మిన్‌ను సంప్రదించాలి.
  • మీరు పర్యవేక్షణను సెటప్ చేయకుండా ఉండటానికి ఎంచుకుంటే లేదా 14 రోజులలోపు మీ ఖాతాను మేనేజ్ చేయడానికి తగిన వయస్సు మీకు ఉందని వెరిఫై చేయకూడదనుకుంటే, మీ ఖాతా నిలిపివేయబడుతుంది, అలాగే మీ ఖాతా సమాచారం 30 రోజుల తర్వాత తొలగించబడుతుంది.
ముఖ్య గమనిక: మీ ఖాతా డిజేబుల్ చేయబడితే, మీరు పబ్లిష్ చేసిన కంటెంట్ దాచబడుతుంది. ఉదాహరణకు, మీ ఖాతా డిజేబుల్ చేయబడినప్పుడు మీరు క్రియేట్ చేసిన YouTube వీడియోలు కనిపించవు. మీరు మీ ఖాతాను రి-ఎనేబుల్ చేస్తే, మీ కంటెంట్ మళ్లీ కనిపించడానికి చాలా రోజుల వరకు పట్టవచ్చు.

మీ ఖాతాకు పర్యవేక్షణను సెటప్ చేయండి

మీ స్వంత ఖాతాను మేనేజ్ చేయడానికి తగిన వయస్సు మీకు లేనట్లయితే, మీ తల్లి/తండ్రి వారి Google ఖాతాను ఉపయోగించి పర్యవేక్షణను సెటప్ చేయవచ్చు, తద్వారా మీరు మీ ఖాతాను ఉపయోగించడం కొనసాగించవచ్చు. మీ ఖాతా డిజేబుల్ చేయబడటానికి ముందు పర్యవేక్షణను ప్రారంభించడానికి మీరు మీ పుట్టిన తేదీని ఎంటర్ చేసిన తర్వాత మీకు 14 రోజుల సమయం ఉంటుంది. మీ ఖాతా నిలిపివేయబడిన తర్వాత, మీ ఖాతా తొలగించబడటానికి ముందు పర్యవేక్షణను ఎనేబుల్ చేయడానికి మీకు 30 రోజుల సమయం ఉంటుంది.

చిట్కా: బ్రాండ్ ఖాతా కోసం పర్యవేక్షణను సెటప్ చేయడం సాధ్యపడదు. మీరు పర్యవేక్షణను సెటప్ చేయడానికి ముందు మీ బ్రాండ్ ఖాతాను ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనే దాన్ని మార్చాలి లేదా తొలగించాలి.

మీ ఖాతాను మేనేజ్ చేయడానికి తగినంత వయస్సు మీకు ఉందని వెరిఫై చేయండి

మీరు కనీస వయో అర్హతలకు అనుగుణంగా ఉంటే, మీ వయస్సును వెరిఫై చేయడానికి మీరు ప్రభుత్వ ID లేదా క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించవచ్చు.

మీరు మీ ID ఫోటోను తీసినా లేదా అప్‌లోడ్ చేసినా, మీ ID సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది, పబ్లిక్‌గా ఉంచబడదు.

మీరు క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించినట్లయితే, దానికి ఏదైనా తాత్కాలిక ప్రామాణీకరణ ఛార్జీ విధించినట్లయితే అది పూర్తిగా రీఫండ్ చేయబడుతుంది.

ముఖ్య గమనిక: మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసిన తర్వాత, చెల్లుబాటు అయ్యే IDని నేరుగా అప్‌లోడ్ చేయడం, క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని ఎంటర్ చేయడం లేదా ఇతర వెరిఫికేషన్ పద్ధతులను ఎలా ఉపయోగించాలి అనే దానిపై మీరు సూచనలను పొందుతారు. ఈ రకమైన సమాచారాన్ని ఈమెయిల్లో అందించమని Google మిమ్మల్ని ఎప్పటికీ అడగదు.

చిట్కా: మీ వయస్సును వెరిఫై చేసిన తర్వాత మీ పుట్టిన రోజును మార్చుకుంటే, మీ వయస్సును మళ్లీ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రభుత్వ IDని ఉపయోగించండి

మీరు మీ పుట్టిన తేదీని చూపించే చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ ID తాలూకు ఫోటోను తీయవచ్చు లేదా అప్‌లోడ్ చేయవచ్చు. చాలా వరకు రిక్వెస్ట్‌లను మేము 24 గంటలలోపే రివ్యూ చేస్తాము. మీరు ఐడెంటిఫికేషన్ నంబర్‌ను ప్రైవేట్‌గా ఉంచడానికి దానిని కూడా కవర్ చేసి దాచవచ్చు.

చిట్కా: .jpg లేదా .png వంటి ఇమేజ్ ఫైల్ ఫార్మాట్‌ను ఉపయోగించండి. .pdf ఫైల్‌ను అప్‌లోడ్ చేయవద్దు.

క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించండి

ముఖ్య గమనిక: ఈ ఆప్షన్ కొన్ని దేశాలలో అందుబాటులో లేదు.

మీ క్రెడిట్ కార్డ్ చెల్లుబాటు అవుతుందని మేము నిర్ధారించిన తర్వాత, క్రెడిట్ కార్డ్ లావాదేవీకి సంబంధించిన నియంత్రణ అవసరాలను తీర్చడానికి అవసరమైనంత వరకు మాత్రమే మేము ఈ డేటా నిల్వను కొనసాగిస్తాము.

మీరు మీ పుట్టిన తేదీని వెరిఫై చేయడానికి క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తే, మీ ఖాతాలో తక్కువ అమౌంట్‌కు ప్రామాణీకరణ ఛార్జీ విధించబడి ఉండటాన్ని మీరు గమనించవచ్చు. ఇది మీ కార్డ్, ఇంకా ఖాతా చెల్లుబాటు అవుతాయో లేదో చెక్ చేస్తుంది. మీ కార్డ్‌కు బిల్ చేయబడదు, అలాగే ప్రామాణీకరణ త్వరలో నిలిపివేయబడుతుంది.

చిట్కా: మీ ప్రమాణీకరణ జరగకపోతే, మీరు చెల్లని కార్డ్‌ను ఉపయోగిస్తున్నారా లేదా తప్పుడు సమాచారాన్ని అందించారా అనేది చెక్ చేయండి.

మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను చెక్ చేయండి

  • మొదటి 14 రోజుల్లో, మీరు మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను చెక్ చేయవచ్చు. మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నట్లయితే, మీరు సరైన ఖాతాకు సైన్ ఇన్ చేసినట్లు నిర్ధారించుకోండి.
  • మీ ఖాతా నిలిపివేయబడితే, మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను చూడటానికి ఎప్పటిలాగానే సైన్ ఇన్ చేయండి.

మీ ఖాతా నుండి డేటాను డౌన్‌లోడ్ చేయండి

మీరు మీ ఖాతా రి-ఎనేబుల్ చేయబడటానికి వేచి ఉన్నట్లయితే లేదా మీరు మీ ఖాతాను రి-ఎనేబుల్ చేయలేకపోయినట్లయితే, మీరు కొన్ని Google సర్వీస్‌ల నుండి ఖాతా డేటాను డౌన్‌లోడ్ చేసి, సేవ్ చేయవచ్చు.

మొదటి 14 రోజుల్లో, మీరు మీ ఖాతాకు సైన్ ఇన్ చేసి, మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ ఖాతా నిలిపివేయబడితే, మీరు కొన్ని Google సర్వీస్‌ల నుండి ఖాతా డేటాను డౌన్‌లోడ్ చేసుకొని, సేవ్ చేయవచ్చు.

మీ Google ఖాతాను తొలగించడం

పర్యవేక్షణను జోడించాలని గానీ లేదా మీ పుట్టిన తేదీని వెరిఫై చేయాలని గానీ మీకు లేకుంటే, మీ Google ఖాతా డిజేబుల్ చేయబడటానికి ముందే మీరు మీ Google ఖాతాను తొలగించాలని ఎంచుకోవచ్చు.
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6766588142577737836
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false