Google వెలుపలి సర్వీస్‌కు మీ ఫోటోలను కాపీ చేయండి

ఫోటోల కాపీని, ఆల్బమ్‌లను, ఇంకా మీ Google ఖాతాలో సేవ్ చేయబడిన వివరణలను బ్యాకప్ చేయడం కోసం లేదా వేరే సర్వీస్‌తో వినియోగించడం కోసం మీరు వాటిని బదిలీ చేయవచ్చు.

ముఖ్యమైనది: మీరు బదిలీ చేసిన తర్వాత, ఫోటోలు మీ Google ఖాతా నుండి తొలగించబడవు. మీ ఫోటోలను తొలగించడం, మీ ఖాతా నుండి Google సర్వీస్‌ను తొలగించడం, లేదా మీ Google ఖాతాను తొలగించడం లాంటివి ఎలా చేయాలో తెలుసుకోండి.

సపోర్ట్ చేయబడే ఫోటో ఫైల్ రకాలు

బదిలీ చేయగలిగిన ఫైల్ రకాలలో ఇవి కూడా ఉంటాయి:

  • JPG
  • PNG

సపోర్ట్ చేయబడని ఫోటో ఫైల్‌లు, వీడియో ఫైల్‌లు బదిలీ చేయబడవు.

దశ 1: Google Photosను ఎంచుకోండి

Google టేక్అవుట్ Photos వీక్షణను బదిలీ చేయండికి వెళ్ళండి లేదా కింద పేర్కొన్న దశలను ఫాలో అవ్వండి.

  1. మీ Google ఖాతా డ్యాష్‌బోర్డ్‌కు వెళ్ళండి.
  2. "మీ Google సర్వీస్‌లు,” కింద ఉన్న ఫోటోలు ఆ తర్వాత మరిన్ని మరింత ఆ తర్వాత డేటా బదిలీ చేయి ఆప్షన్‌ను ఎంచుకోండి.

దశ 2: మీ ఫోటోల కాపీని ఎక్కడికి బదిలీ చేయాలో ఎంచుకోండి

  1. "డెలివరీ పద్ధతి" కింద ఉన్న 'కింది వైపు బాణం' గుర్తు Down arrowను ఎంచుకోండి.
  2. మీ ఫోటోల కాపీని బదిలీ చేయాల్సిన గమ్యస్థానాన్ని ఎంచుకోండి ఆ తర్వాత ఖాతాలను లింక్ చేసి, ఎగుమతిని క్రియేట్ చేయండి.
  3. మీ ఖాతాను లింక్ చేసుకోవడానికి, మీ ఫోటోలను బదిలీ చేయడానికి కింది దశలను ఫాలో అవ్వండి. మీరు దీనికి సైన్ ఇన్ చేయాలి:
    • మీ Google ఖాతా
      చిట్కా:  మీరు మీ ఫోటోలలోని లొకేషన్ సమాచారాన్ని కూడా బదిలీ చేయాలనుకుంటే, "మీ Google Photos లైబ్రరీలోని ఫోటోలు, వీడియోలు ఎక్కడ తీయబడ్డాయో చూడండి" అని లేబుల్ చేయబడిన చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి.
    • మీరు ఫోటోలను బదిలీ చేస్తున్న కంపెనీతో మీ ఖాతా

మీ ఫోటోలు కాపీ అయిన తర్వాత:

  • కొత్త సర్వీస్‌లో, మీకు ఫోటోల లింక్‌తో కూడిన ఇమెయిల్ వస్తుంది.
  • మీరు మీ ఫోటోలను బదిలీ చేసిన సర్వీస్‌కు ఇకపై మీ Google ఖాతా యాక్సెస్ కలిగి ఉండదు, కానీ అది సర్వీస్ సెట్టింగ్‌లలో ఇంకా కనిపిస్తుండవచ్చు. మీ Microsoft లేదా Flickr ఖాతాలో చూపించడం నుంచి, మీ Google ఖాతాను తీసివేయవచ్చు.
  • మీరు బదిలీ చేసిన ఫోటోలు గమ్యస్థాన సర్వీస్‌లో ప్రైవేట్‌కు సెట్ చేయబడతాయి. గమ్యస్థాన సర్వీస్‌లో మీరు మీ ఫోటోల విజిబిలిటీని అప్‌డేట్ చేయవచ్చు.
  • మీరు మీ ఫోటోలను మళ్ళీ బదిలీ చేస్తే, మీ ఫోటోల కొత్త కాపీ క్రియేట్ చేయబడుతుంది, ఇంకా మీరు ఒరిజినల్ ఫోటోలను బదిలీ చేయడం ద్వారా అది డూప్లికేట్‌లను కలిగి ఉండవచ్చు.

కొన్ని ఫోటోలు ఎందుకు బదిలీ కాలేదో తెలుసుకోండి

మీ ఫొటోలన్నీ బదిలీ కాకపోతే, దానికి కారణం కింద పేర్కొన్న విధంగా ఉండవచ్చు:

  • కొన్ని ఫోటోలు సపోర్ట్ చేయబడని ఫైల్ రకాలును కలిగి ఉంటాయి.
  • మీరు ఫోటోలను బదిలీ చేసిన ఖాతాకు సంబంధించిన స్పేస్ అయిపోయి ఉండవచ్చు.
  • బదిలీ పూర్తి కాకుండానే అది రద్దు అయ్యి ఉండవచ్చు.

ఫోటో బదిలీలను సపోర్ట్ చేయని ఖాతా రకాలు

ప్రస్తుతం, మీరు ఈ సర్వీస్‌ను కింద పేర్కొన్న వాటితో ఉపయోగించలేరు:

బదిలీ చేయబడని ఫోటో డేటా

ప్రస్తుతం, ఫోటోకు జోడించిన కామెంట్‌లు, మాన్యువల్‌గా ఎడిట్ చేసిన లొకేషన్ సమాచారం వంటి మెటాడేటా బదిలీ చేయబడదు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12941514099899417391
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false