మీ Google ఖాతా లేదా Gmailను ఎలా రికవర్ చేయాలి

మీ పాస్‌వర్డ్ లేదా యూజర్‌నేమ్‌ను మీరు మర్చిపోతే లేదా మీ వెరిఫికేషన్ కోడ్‌లను పొందలేకపోతే, మీ Google ఖాతాను రికవర్ చేయడానికి ఈ దశలను ఫాలో అవ్వండి. ఆ విధంగా, మీరు Gmail, Photos, Google Play వంటి సర్వీస్‌లను ఉపయోగించవచ్చు.

చిట్కాలు:

మీరు పాస్‌వర్డ్‌ను మర్చిపోయినప్పుడు

  1. మీ Google ఖాతా లేదా Gmailను రికవర్ చేయడానికి సూచించిన దశలను ఫాలో అవ్వండి.
  2. ప్రాంప్ట్ వచ్చినప్పుడు మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయండి. ఈ ఖాతాతో మీరు ఇది వరకే ఉపయోగించని ఒక శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి. శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

సైన్ ఇన్ చేయడానికి మీరు ఉపయోగించే ఈమెయిల్ అడ్రస్‌ను మర్చిపోయినప్పుడు

  1. మీ యూజర్‌నేమ్‌ను కనుగొనడానికి, ఈ దశలను ఫాలో అవ్వండి. మీరు దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది:
    • ఖాతాకు సంబంధించిన ఫోన్ నంబర్ లేదా రికవరీ ఈమెయిల్ అడ్రస్.
    • మీ ఖాతాలోని పూర్తి పేరు.
  2. ఇది మీ ఖాతా అని నిర్ధారించడానికి సూచనలను ఫాలో అవ్వండి.
  3. మీ ఖాతాకు మ్యాచ్ అయ్యే యూజర్‌నేమ్‌ల లిస్ట్ మీకు కనిపిస్తుంది.

వేరొకరు మీ ఖాతాను ఉపయోగిస్తున్నప్పుడు

మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ Google ఖాతాను ఉపయోగిస్తున్నారని మీరు అనుకుంటే, హ్యాక్ చేయబడిన లేదా హైజాక్ చేయబడిన Google ఖాతా లేదా Gmailను రికవర్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.

వేరే కారణం వల్ల సైన్ ఇన్ చేయలేకపోయినప్పుడు

మీకు వేరొక సమస్య ఉంటే, సైన్ ఇన్ చేయడంలో సహాయం పొందండి.

తొలగించిన Google ఖాతాను రికవర్ చేయండి

మీరు ఇటీవల మీ Google ఖాతాను తొలగించినట్లయితే, మీ ఖాతాను రికవర్ చేయడం కోసం మీరు దశలను ఫాలో అవ్వవచ్చు.

ఇప్పటికీ సైన్ ఇన్ చేయడం సాధ్యం కాకపోతే

కొత్త ఖాతాను క్రియేట్ చేయండి

మీరు సైన్ ఇన్ చేయలేకపోతే, ఖాతా రికవరీ కోసం ఈ చిట్కాలను ట్రై చేయండి.

మీరు ఇప్పటికీ మీ ఖాతాను రికవర్ చేయలేకపోతే, మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేయవచ్చు. మీరు ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, మీ Google ఖాతా నుండి లాక్ చేయబడకుండా ఉండటానికి మీరు ఈ దశలను ఫాలో చేయవచ్చు.

ఖాతా & పాస్‌వర్డ్ రికవరీ సర్వీస్‌లను ఉపయోగించకండి

మీ సెక్యూరిటీ కోసం, మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేయడానికి సహాయం కోసం మీరు Googleకు కాల్ చేయలేరు. ఖాతా లేదా పాస్‌వర్డ్ సపోర్ట్‌ను అందిస్తున్నట్లు క్లెయిమ్ చేసే ఏ సర్వీస్‌తోనూ మేము పని చేయము. మీ పాస్‌వర్డ్‌లు లేదా వెరిఫికేషన్ కోడ్‌లను బయటకు ఇవ్వవద్దు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11932550805843376169
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false