ఖాతా రికవరీ దశలను పూర్తి చేయడానికి చిట్కాలు

మీరు సైన్ ఇన్ చేయలేకపోతే, మీ Google ఖాతాకు తిరిగి వెళ్లేందుకు ట్రై చేయడానికి ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. ఖాతా రికవరీ పేజీకి వెళ్లండి.
  2. ఈ దశలను మీరు పూర్తి చేస్తున్నప్పుడు, కింద ఉన్న చిట్కాలలో సాధ్యమైనన్ని ఉపయోగించండి.

చిట్కా: ఇక్కడ వివరించిన ప్రశ్నలన్నింటినీ మీరు చూడలేక పోవచ్చు.

మీరు ఇప్పటికే రికవర్ చేయడానికి ట్రై చేసి, "ఈ ఖాతా మీకు చెందినది అని Google వెరిఫై చేయలేకపోయింది" అనే మెసేజ్‌ను పొందినట్లయితే, మీరు మళ్లీ ట్రై చేయవచ్చు.

సాధ్యమైనన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి

ప్రశ్నలను స్కిప్ చేయడానికి ట్రై చేయకండి. మీకు సమాధానం ఖచ్చితంగా తెలియకపోతే, మరొక ప్రశ్నకు వెళ్లడం కంటే మీ ఉత్తమ అంచనాను పరిగణనలోకి తీసుకోండి. తప్పు అంచనాలు మిమ్మల్ని ప్రాసెస్ నుండి తొలగించవు.

తెలిసిన పరికరం & లొకేషన్‌ను ఉపయోగించండి

ఒకవేళ కుదిరితే:

  • మీరు తరచుగా సైన్ ఇన్ చేసే కంప్యూటర్, ఫోన్ లేదా టాబ్లెట్‌ను ఉపయోగించండి
  • మీరు సాధారణంగా వాడే బ్రౌజర్‌నే (Chrome లేదా Safari వంటివి) ఉపయోగించండి
  • మీరు సాధారణంగా సైన్ ఇన్ చేసే లొకేషన్‌లోనే, అంటే ఇల్లు లేదా ఆఫీస్ వంటి వాటిలో ఉండండి

ఖచ్చితమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి

వివరాలు చాలా ముఖ్యం, అక్షర దోషాలను నివారించండి, అప్పర్‌కేస్, లోయర్‌కేస్ అక్షరాల పట్ల శ్రద్ధ వహించండి.

పాస్‌వర్డ్‌లు

మీకు గుర్తున్న చివరి పాస్‌వర్డ్‌ను అడిగితే, మీకు గుర్తున్న ఇటీవలి పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.

  • మీ చివరి పాస్‌వర్డ్ మీకు గుర్తు లేకపోతే: మీకు గుర్తున్న మునుపటి దాన్ని ఉపయోగించండి. అది ఎంత ఇటీవలిది అయితే, అంత మంచిది.
  • మీరు మునుపటి పాస్‌వర్డ్‌లను సరిగ్గా గుర్తు చేసుకోలేకపోతే: మీకు సరైనది అనిపించిన దాన్ని పరిగణనలోకి తీసుకోండి.

మీ ఖాతాకు కనెక్ట్ చేయబడిన ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి

మీరు ఇప్పుడే చెక్ చేయగల ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయమని అడిగితే, మీ ఖాతాకు జోడించిన దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:

  • మీరు తిరిగి ప్రవేశించడానికి రికవరీ ఈమెయిల్ అడ్రస్ సహాయపడుతుంది, అక్కడే మేము భద్రతా నోటిఫికేషన్‌లు పంపుతాము.
  • ప్రత్యామ్నాయ ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు సైన్ ఇన్ చేసేటప్పుడు ఉపయోగించవచ్చు.
  • మీరు ఉపయోగించే పలు Google సర్వీస్‌ల గురించి సమాచారం మీకు ఈ కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్‌లో లభిస్తుంది.

మా టీమ్ నుండి అందే మెసేజ్ కోసం మీ స్పామ్ ఫోల్డర్‌ను చెక్ చేయండి

ముఖ్య గమనిక: ఈమెయిల్, ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా Google మీ పాస్‌వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్‌లను ఎప్పుడూ అడగదు. మీ పాస్‌వర్డ్ లేదా వెరిఫికేషన్ కోడ్‌లను accounts.google.com లో మాత్రమే ఎంటర్ చేయండి.

మా టీమ్ నుండి ఇమెయిల్ వచ్చి ఉంటుందని తెలిసినా, దాన్ని కనుగొనలేకపోతే, “మీ Google సపోర్ట్ విచారణ” అనే సబ్జెక్ట్‌తో ఉన్న ఇమెయిల్ కోసం మీ స్పామ్ లేదా జంక్ ఫోల్డర్‌ను చెక్ చేయండి. 

ఇప్పటికీ లాగిన్ అవ్వలేకపోతున్నారా? Google ఖాతాను రీప్లేస్ చేసే మరొక ఖాతాను క్రియేట్ చేయడాన్ని పరిగణించండి. మీరు ఖాతాను క్రియేట్ చేసినప్పుడు, మీ Google ఖాతా నుండి లాక్ చేయబడకుండా ఉండటానికి మీరు ఈ దశలను ఫాలో చేయవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4218766260774974589
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false