వ్యక్తుల ఖాతాలను బ్లాక్ లేదా అన్‌బ్లాక్ చేయడం

అవాంఛిత ఇంటరాక్షన్‌లను నివారించడానికి, మీరు Google Chat మరియు Photos వంటి నిర్దిష్ట Google ప్రోడక్ట్‌లలో ఇతర యూజర్‌లను బ్లాక్ చేయవచ్చు. మీరు బ్లాక్ చేసినప్పుడు, మీరు నిర్దిష్ట Google ఖాతాను బ్లాక్ చేస్తారు.

మరొక వ్యక్తి ఖాతాను బ్లాక్ చేయడానికి, ఈ ప్రోడక్ట్‌లు ఒకదానిలో "బ్లాక్ చేయండి" చర్యను ఉపయోగించండి.

ఖాతాను బ్లాక్ చేయడానికి Google Chatను ఉపయోగించండి

మీరు Google Chat (chat.google.com)లో ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు, ఈ పేజీలో లిస్ట్ చేయబడిన ప్రోడక్ట్‌లు అన్నింటిలో ఆ వ్యక్తి ఖాతా బ్లాక్ చేయబడుతుంది.

Google Chatలో యూజర్‌లను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి.

ఖాతాను బ్లాక్ చేయడానికి Google Photosను ఉపయోగించండి

మీరు Google Photosలో ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు, ఈ పేజీలో లిస్ట్ చేయబడిన అన్ని ప్రోడక్ట్‌లలో ఆ వ్యక్తి ఖాతా బ్లాక్ చేయబడుతుంది.

Google Photosలో యూజర్‌లను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి.

ఖాతాను బ్లాక్ చేయడానికి Google Mapsను ఉపయోగించండి

యూజర్ ప్రొఫైల్‌ను బ్లాక్ చేయండి

Mapsలో మీ ప్రొఫైల్‌ను కనుగొనకుండా ఎవరినైనా బ్లాక్ చేయడానికి, మీరు మొబైల్ పరికరాన్ని ఉపయోగించవచ్చు. మీరు వారిని బ్లాక్ చేసినట్లు Google Maps వారికి తెలియజేయదు. మీరు Google Mapsలో యూజర్ ప్రొఫైల్‌ను బ్లాక్ చేసినప్పుడు, ఈ పేజీలో లిస్ట్ చేయబడిన అన్ని ప్రోడక్ట్‌లలో ఆ వ్యక్తి ఖాతా బ్లాక్ చేయబడుతుంది.

ముఖ్య గమనిక: మీరు బ్లాక్ చేసిన వ్యక్తులకు ఇప్పటికీ Google Mapsలో మీ కంట్రిబ్యూషన్‌లు కనిపించవచ్చు, కానీ వారికి మీ ప్రొఫైల్‌లో అవి కనిపించవు. అంతేకాకుండా, బ్లాక్ చేయబడిన యూజర్ మీరు బ్లాక్ చేసిన ఖాతాలోకి సైన్ ఇన్ చేసి ఉండకపోతే కూడా, వారికి మీ కంట్రిబ్యూషన్‌లు కనిపిస్తాయి.

  1. Google Maps యాప్ Mapsను తెరవండి.
  2. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న యూజర్ ప్రొఫైల్‌కు నావిగేట్ చేయండి. మీరు యూజర్ ప్రొఫైల్స్‌ను ఇక్కడ కనుగొనవచ్చు:
    • పోస్ట్ పైన లేదా ఆ యూజర్ సమర్పించిన రివ్యూ వద్ద.
    • ఒకవేళ మీరు వారిని ఫాలో చేస్తుంటే, మీ "ఫాలో చేస్తున్నారు" ట్యాబ్‌లో.
    • ఒకవేళ వారు మిమ్మల్ని ఫాలో చేస్తుంటే, మీ "ఫాలోవర్‌లు" ట్యాబ్‌లో.
    • "మీ కోసం" విభాగంలో. వారి ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. వ్యక్తి పేరు పక్కన, మరిన్ని మరిన్ని ఆ తర్వాత యూజర్‌ను బ్లాక్ చేయండి ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు ఎవరినైనా ఫాలో చేస్తూ, ఇకపై వారి కంటెంట్‌ను చూడకూడదని గానీ అనుకుంటే, వారిని బ్లాక్ చేయడం కంటే అన్-ఫాలో చేయడం అనే ఆప్షన్‌ను మీరు ఉపయోగించవచ్చు.

లొకేషన్ రిక్వెస్ట్‌ను బ్లాక్ చేయండి

మీరు Google Mapsలో లొకేషన్ రిక్వెస్ట్‌ను బ్లాక్ చేసినప్పుడు, ఈ పేజీలో లిస్ట్ చేయబడిన ప్రోడక్ట్‌లు అన్నింటిలో ఆ వ్యక్తి ఖాతా బ్లాక్ చేయబడుతుంది.

లొకేషన్ డేటాను ఎలా షేర్ చేయాలో తెలుసుకోండి అలాగే Google Mapsలో లొకేషన్ రిక్వెస్ట్‌లను బ్లాక్ చేయండి.

ఖాతాను బ్లాక్ చేయడానికి YouTubeను ఉపయోగించండి

మీరు YouTubeలో ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు, ఈ పేజీలో లిస్ట్ చేయబడిన ప్రోడక్ట్‌లు అన్నింటిలో ఆ వ్యక్తి ఖాతా బ్లాక్ చేయబడుతుంది.

మీరు ఎవరినైనా లైవ్ చాట్ ద్వారా లేదా ఎవరైనా మీ ఛానెల్ గురించి పేర్కొనడం లేదా పోస్ట్ ద్వారా మీ కంటెంట్‌ను షేర్ చేయడం చేస్తే, మీ నోటిఫికేషన్‌ల ఇన్‌బాక్స్ ద్వారా YouTubeలో వారిని బ్లాక్ చేయవచ్చు.

ఖాతాను బ్లాక్ చేయడానికి Google Pay ఇండియాను ఉపయోగించండి

మీరు Google Pay ఇండియాలో ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు, ఈ పేజీలో లిస్ట్ చేయబడిన ప్రోడక్ట్‌లు అన్నింటిలో ఆ వ్యక్తి ఖాతా బ్లాక్ చేయబడుతుంది.

Google Pay ఇండియాలో ఎవరినైనా బ్లాక్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఖాతాను బ్లాక్ చేయడానికి Driveను ఉపయోగించండి

మీరు కంప్యూటర్‌లో Google Driveలో ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు, ఈ పేజీలో లిస్ట్ చేయబడిన ప్రోడక్ట్‌లు అన్నింటిలో ఆ ఖాతా బ్లాక్ చేయబడుతుంది.

Driveలో యూజర్‌లను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి.

ఖాతాను బ్లాక్ చేయడానికి Recorderను ఉపయోగించండి

మీరు Recorderలో ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు, ఈ పేజీలో లిస్ట్ చేయబడిన ప్రోడక్ట్‌లు అన్నింటిలో ఆ వ్యక్తి ఖాతా బ్లాక్ చేయబడుతుంది.

Recorderలో యూజర్‌లను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి.

ఖాతాను బ్లాక్ చేయడానికి Meetని ఉపయోగించండి

మీరు Meetలో ఎవరినైనా బ్లాక్ చేసినప్పుడు, ఈ పేజీలో లిస్ట్ చేసిన ప్రోడక్ట్‌లు అన్నింటిలో వారి ఖాతా బ్లాక్ చేయబడుతుంది.

Meetలో యూజర్‌లను బ్లాక్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

బ్లాక్ చేయబడిన ఖాతాలను కనుగొనండి లేదా ఎవరినైనా అన్‌బ్లాక్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, ఎగువు కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో లేదా పేరులోని మొదటి అక్షరం ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  2. వ్యక్తులు & షేరింగ్‌ను క్లిక్ చేయండి.
  3. "కాంటాక్ట్‌లు" విభాగంలో, బ్లాక్ చేయబడినవిని క్లిక్ చేయండి.
  4. Google ప్రోడక్ట్‌లు అంతటా మీరు బ్లాక్ చేసిన ఖాతాల లిస్ట్‌ను మీరు కనుగొంటారు. ఎవరినైనా అన్‌బ్లాక్ చేయడానికి, ఆ వ్యక్తి పేరు పక్కన ఉన్న, 'తీసివేయి' తీసివేయండిని ఎంచుకోండి. 

చిట్కా: "బ్లాక్ చేయబడిన యూజర్‌లు" లిస్ట్‌లో ఇవి ఉండవు:

  • YouTube ఛానెల్‌లు లేదా లైవ్ చాట్ ద్వారా బ్లాక్ చేయబడిన ఖాతాలు.
  • బ్లాక్ చేయబడిన ఇమెయిల్ అడ్రస్‌లు.
  • మీ Android ఫోన్‌కు లేదా iPhoneకు సంబంధించిన ఫోన్ యాప్‌తో మీరు బ్లాక్ చేసిన ఫోన్ నంబర్‌లు.

ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేయండి

యూజర్‌కు సంబంధించిన Google ఖాతాను బ్లాక్ చేయడంతో పాటు, ఎవరిదైనా ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్‌ను బ్లాక్ చేసే ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. ఈ బ్లాక్‌లు ఈ పేజీలో లిస్ట్ చేసిన అన్ని Google ప్రోడక్ట్‌లు అంతటా యూజర్‌లను బ్లాక్ చేయవు. ఉదాహరణకు, మీరు వీటిని చేయవచ్చు:

Gmailలో బ్లాక్ చేసిన ఈమెయిల్ అడ్రస్‌లు అలాగే మీ ఫోన్ యాప్‌లో బ్లాక్ చేసిన ఫోన్ నంబర్‌లు, మీ ఖాతాకు సంబంధించిన "బ్లాక్ చేయబడిన యూజర్‌లు" విభాగంలో కనిపించవు. అవి Google ప్రోడక్ట్‌లు అంతటా కూడా అమలులోకి రావు.

Google Fi, Google Voice లేదా Google Meetలో బ్లాక్ చేసిన ఫోన్ నంబర్‌లు మీ ఖాతాలోని “బ్లాక్ చేసిన యూజర్‌లు” విభాగంలో కనిపిస్తాయి. అవి Google Fi, Google Voice, అలాగే Google Meet అంతటా అమలు అవుతాయి, కానీ ఇతర Google ప్రోడక్ట్‌లలో అమలులోకి రావు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13760060424664600159
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false