హ్యాక్ చేయబడిన లేదా చోరీకి గురైన Google ఖాతాను సెక్యూర్ చేయండి

మీ Google ఖాతా, Gmail, లేదా ఇతర Google ప్రోడక్ట్‌లలో మీకు తెలియని యాక్టివిటీని మీరు గమనించినట్లయితే, మీ అనుమతి లేకుండా వేరే ఎవరో దానిని ఉపయోగిస్తూ ఉండవచ్చు. ఒకవేళ మీ Google ఖాతా లేదా Gmail హ్యాక్ చేయబడినట్లు మీకు అనిపిస్తే, అనుమానాస్పద యాక్టివిటీని గుర్తించడానికి కింది దశలను ఫాలో చేసి, మీ ఖాతాకు తిరిగి వెళ్లి, దాన్ని మరింత సురక్షితంగా మార్చండి.

దశ 1: మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి

ఒకవేళ మీరు సైన్ ఇన్ చేయలేకపోతే

ఖాతా రికవరీ పేజీకి వెళ్లి, ప్రశ్నలకు మీకు సాధ్యమైనంత వరకు ఉత్తమ సమాధానాలను ఇవ్వండి. ఈ చిట్కాలు సహాయపడగలవు.

ఈ కింద పేర్కొనబడిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఖాతా రికవరీ పేజీని ఉపయోగించండి:

  • మీ పాస్‌వర్డ్ లేదా రికవరీ ఫోన్ నంబర్ లాంటి మీ ఖాతా సమాచారాన్ని ఎవరైనా మార్చినప్పుడు.
  • మీ ఖాతాను ఎవరైనా తొలగించినప్పుడు.
  • మరొక కారణం చేత మీరు సైన్ ఇన్ చేయలేకపోయినప్పుడు.

చిట్కా: మీరు సరైన ఖాతాకే సైన్ ఇన్ చేస్తున్నట్లు నిర్ధారించుకోవడానికి, మీ యూజర్‌నేమ్ రికవరీ కోసం ట్రై చేయండి.

దశ 2: యాక్టివిటీని రివ్యూ చేసి, హ్యాక్ చేయబడిన మీ Google ఖాతాను సురక్షితం చేయడంలో సహాయం చేయండి

మీ ఖాతా యాక్టివిటీని రివ్యూ చేయండి
  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న నావిగేషన్ ప్యానెల్‌లో, సెక్యూరిటీని ఎంచుకోండి.
  3. ఇటీవలి సెక్యూరిటీ ఈవెంట్‌ల ప్యానెల్‌లో, సెక్యూరిటీ ఈవెంట్‌లను రివ్యూ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ ఉందేమో చెక్ చేయండి:
    • ఒకవేళ మీరు చేయని యాక్టివిటీని దేన్నైనా మీరు కనుగొంటే, లేదు, అది నేను కాదు ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆపై, మీ ఖాతాను సురక్షితంగా చేయడానికి స్క్రీన్ మీద ఉన్న దశలను ఫాలో అవ్వండి.
    • ఒకవేళ యాక్టివిటీని మీరు చేసి ఉంటే, అవును ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇప్పటికీ మీ ఖాతాను వేరెవరో ఉపయోగిస్తున్నారని మీరు నమ్మితే, మీ ఖాతా హ్యాక్ చేయబడిందేమో కనుగొనండి.
మీ ఖాతాను ఉపయోగించే పరికరాలను రివ్యూ చేయండి
  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ వైపున ఉన్న నావిగేషన్ ప్యానెల్‌లో, సెక్యూరిటీని ఎంచుకోండి.
  3. మీ పరికరాలు ప్యానెల్‌లో, పరికరాలను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు గుర్తుపట్టని ఏవైనా పరికరాల కోసం చెక్ చేయండి.
    • ఒకవేళ మీరు గుర్తుపట్టని పరికరాన్ని మీరు కనుగొంటే పరికరాన్ని గుర్తుపట్టలేదా? ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆపై, మీ ఖాతాను సురక్షితంగా చేయడానికి స్క్రీన్ మీద ఉన్న దశలను ఫాలో అవ్వండి.
    • అన్ని పరికరాలను మీరు గుర్తుపట్టినా, మీ ఖాతాను వేరెవరో ఉపయోగిస్తున్నారని మీకు అనిపిస్తే, మీ ఖాతా హ్యాక్ చేయబడిందేమో కనుగొనండి.

దశ 3: మరిన్ని సెక్యూరిటీ చర్యలను తీసుకోండి

2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి

2-దశల వెరిఫికేషన్ మీ ఖాతాను హ్యాకర్‌ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. 2-దశల వెరిఫికేషన్‌తో, మీరు వీటితో సైన్ ఇన్ చేస్తారు:

  • మీకు తెలిసినది ఏదైనా (మీ పాస్‌వర్డ్)
  • మీ దగ్గర ఉన్నది ఏదైనా (మీ ఫోన్, సెక్యూరిటీ కీ లేదా ప్రింట్ చేసిన కోడ్)

ఆ రకంగా, ఒకవేళ మీ పాస్‌వర్డ్ చోరీకి గురైనా, మీ ఖాతా ఇంకా సురక్షితంగానే ఉంటుంది.

మీ బ్యాంక్ లేదా స్థానిక అధికార సంస్థలను కాంటాక్ట్ చేయండి

మీ బ్యాంక్ లేదా ప్రభుత్వం ఇచ్చినట్లుగా, 'ఖాతా తెరవండి', 'డబ్బు బదిలీ చేయండి' లాంటి సూచనలను వేరెవరో ఇవ్వలేదని నిర్ధారించుకోండి. కింద తెలిపిన సందర్భాలలో ఇది ముఖ్యం:

  • మీ ఖాతాలో బ్యాంకింగ్ సమాచారం సేవ్ చేయబడి ఉన్నప్పుడు, అంటే Google Pay లేదా Chromeలో క్రెడిట్ కార్డ్‌లు సేవ్ చేయబడి ఉండటం లాంటివి.
  • మీ ఖాతాలో పన్ను లేదా పాస్‌పోర్ట్ సమాచారం లాంటి వ్యక్తిగత సమాచారం సేవ్ చేయబడి ఉన్నప్పుడు. ఉదాహరణకు, Google Photos, Google Drive, లేదా Gmailలో మీ వ్యక్తిగత సమాచారాన్ని మీరు సేవ్ చేసి ఉండవచ్చు.
  • ఎవరో మీ గుర్తింపును ఉపయోగిస్తున్నారని లేదా మీలాగ నటిస్తున్నారని అనుకోండి.
హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను తీసివేయండి

ఒకవేళ మీ ఖాతాలో అనుమానాస్పద యాక్టివిటీ ఉందని మీకు అనిపిస్తే, మీరు హానికర సాఫ్ట్‌వేర్‌ను తీసివేయాల్సి ఉంటుంది. మీ ఖాతా సెక్యూరిటీ మెరుగుపరచడానికి, విశ్వసనీయమైన యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి దానిని రన్ చేయండి.

అలాగే మీరు మీ కంప్యూటర్‌ను ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు రీసెట్ చేసి, ఆపరేటింగ్ సిస్టమ్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్యమైనది: మీకు అవసరమైన ఫైల్‌లను బ్యాకప్ చేసుకున్నట్లు నిర్ధారించండి. Google Driveకు ఫైల్‌లను ఎలా అప్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
మరింత సురక్షితంగా ఉండే బ్రౌజర్‌ను ఇన్‌స్టాల్ చేయండి
కొన్ని ఇంటర్నెట్ బ్రౌజర్‌లలో సెక్యూరిటీ బలహీనతలు ఉంటాయి. Google Chrome లాంటి మరింత భద్రత గల బ్రౌజర్‌ను ఉపయోగించి చూడండి.
పాస్‌వర్డ్ హెచ్చరికతో పాస్‌వర్డ్ దొంగిలించడాన్ని నిరోధించడంలో సహాయం చేయండి
ఒకవేళ Google-కాని సైట్‌లో మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేస్తే, Google Chromeలోని పాస్‌వర్డ్ అలర్ట్ ఫీచర్ మీకు నోటిఫై చేస్తుంది. ఆ రకంగా, Google మాదిరిగా నటిస్తూ మీ పాస్‌వర్డ్‌ను దొంగిలించాలనుకుంటున్న సైట్ గురించి మీకు తెలుస్తుంది.
మీ యాప్‌లు, పరికరాలను సురక్షితంగా ఉంచడంలో సహాయం చేయడం
మీరు ఉపయోగించే ఇతర Google ప్రోడక్ట్‌లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడండి

మీ Google ఖాతా హ్యాక్ చేయబడిందేమో కనుగొనండి

ఒకవేళ మీరు ఇలాంటి సంకేతాలను గమనిస్తే, వేరెవరో మీ Google ఖాతాను ఉపయోగిస్తూ ఉండవచ్చు.

ముఖ్యమైనది: ఒకవేళ వేరెవరో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేశారని అనిపిస్తే, మీ పాస్‌వర్డ్‌ను వెంటనే మార్చండి, ఎందుకంటే:

  • మీరు ఇప్పటికే మార్చకుండా ఉంటే, మీ Google ఖాతా
  • యాప్‌లు, సైట్‌లు:
    • మీ Google ఖాతాకు ఉపయోగించిన పాస్‌వర్డ్‌నే ఉపయోగించేవి
    • మీ Google ఖాతా ఇమెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేసేవి
    • మీ Google ఖాతా ఇమెయిల్ అడ్రస్‌తో మీరు సైన్ ఇన్ చేసేవి
    • మీ Google ఖాతాలో మీరు పాస్‌వర్డ్‌లు సేవ్ చేసేవి

ఆపై మీరు చెక్ చేసి, మీ ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉన్న తెలియని పరికరాలను తీసివేయవచ్చు.

అనుమానాస్పద ఖాతా యాక్టివిటీ

కీలకమైన సెక్యూరిటీ సెట్టింగ్‌లకు తెలియని మార్పులు

ఈ కింది సెట్టింగ్‌లలో మీరు ఏవైనా తెలియని మార్పులు కనుగొన్నట్లయితే వెంటనే సెట్టింగ్‌ను సరి చేయండి:

అనధికార ఫైనాన్షియల్ యాక్టివిటీ

ఇలా జరిగితే మీ ఫైనాన్షియల్ యాక్టివిటీ మీద అనుమానపడవచ్చు:

అసాధారణ యాక్టివిటీ నోటిఫికేషన్‌లు

చిట్కా: అనుమానాస్పద యాక్టివిటీ గురించి మీకు తెలియజేయడానికి, మేము మీ రికవరీ ఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగిస్తాము.

మేము వీటి ద్వారా అసాధారణ యాక్టివిటీని గురించి మీకు తెలియజేస్తాము:

  • మీ ఖాతాకు అసాధారణ సైన్ ఇన్ గురించి లేదా కొత్త పరికరంలో మీ ఖాతాను ఉపయోగించడం గురించి నోటిఫికేషన్.
  • మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ లేదా ఇతర సెక్యూరిటీ సెట్టింగ్‌లలో ఏదైనా మార్పు జరిగి ఉండి, ఆ మార్పును మీరు చేయనప్పుడు నోటిఫికేషన్.
  • మీరు గుర్తించని ఏదైనా ఇతర యాక్టివిటీని గురించి నోటిఫికేషన్.
  • మీ స్క్రీన్ పైన, "మీ ఖాతాలో మేము అనుమానాస్పద యాక్టివిటీని గుర్తించాము" అని తెలియజేసే ఎరుపు రంగు పట్టీ.
  • మీ "పరికర యాక్టివిటీ, సెక్యూరిటీ ఈవెంట్‌ల" పేజీ.

మీరు ఉపయోగించే Google ప్రోడక్ట్‌లలో అనుమానాస్పద యాక్టివిటీ

Gmail

Gmail సెట్టింగ్‌లు

కింది వాటిలో మీకు తెలియని మార్పులు చూసినట్లయితే, వెంటనే సెట్టింగ్‌ను సరిచేయండి:

Gmail యాక్టివిటీ

ఇలా జరిగితే మీ Gmail యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉండవచ్చు:

YouTube

ఇలా జరిగితే మీ YouTube యాక్టివిటీ మీద అనుమానపడవచ్చు:

  • మీ YouTube ఛానెల్‌లో మీరు అప్‌లోడ్ చేయని వీడియోలు ఉన్నా, మీరు చేయని కామెంట్‌లు ఉన్నా, లేదా కింద తెలిపిన వాటిలో మీకు తెలియని మార్పులు ఉన్నా:
    • ఛానెల్ పేరు
    • ప్రొఫైల్ ఫోటో
    • వివరణలు
    • ఇమెయిల్ సెట్టింగ్‌లు
    • పంపిన మెసేజ్‌లు
Google Drive

ఇలా జరిగితే మీ Google Drive యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉండవచ్చు:

Google Photos

ఒకవేళ ఇలా జరిగితే మీ Google Photos యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉన్నట్లు:

Blogger

ఇలా జరిగితే మీ Blogger యాక్టివిటీ మీద అనుమానపడవచ్చు:

  • మీరు పబ్లిష్ చేయని పోస్ట్‌లు మీ బ్లాగ్‌లో కనిపించినప్పుడు.
  • మీరు పబ్లిష్ చేయని పోస్ట్‌ల మీద కామెంట్‌లు వచ్చినప్పుడు.
  • మీరు మార్చకున్నా, మీ మెయిల్-నుండి-Blogger అడ్రస్ మారిపోయినప్పుడు.
  • మీ బ్లాగ్ కనిపించకపోయినప్పుడు లేదా బ్లాక్ చేయబడినప్పుడు.
Google Ads

ఇలా ఏదైనా మీకు తెలియనిది కనుగొంటే మీ Google యాడ్‌ల యాక్టివిటీ మీద అనుమానపడవచ్చు:

  • తెలియని లింక్‌లు లేదా గమ్యస్థానాలకు తీసుకెళ్లే యాడ్‌లు
  • మీ యాడ్ ఖర్చులో పెరుగుదల
  • ఖాతా ఓనర్‌లు, మేనేజర్‌లు లేదా యూజర్‌లలో మార్పులు
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11152514758361310524
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false