మీ Google ఖాతా, Gmail, లేదా ఇతర Google ప్రోడక్ట్లలో మీకు తెలియని యాక్టివిటీని మీరు గమనించినట్లయితే, మీ అనుమతి లేకుండా వేరే ఎవరో దానిని ఉపయోగిస్తూ ఉండవచ్చు. ఒకవేళ మీ Google ఖాతా లేదా Gmail హ్యాక్ చేయబడినట్లు మీకు అనిపిస్తే, అనుమానాస్పద యాక్టివిటీని గుర్తించడానికి కింది దశలను ఫాలో చేసి, మీ ఖాతాకు తిరిగి వెళ్లి, దాన్ని మరింత సురక్షితంగా మార్చండి.
దశ 1: మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి
ఒకవేళ మీరు సైన్ ఇన్ చేయలేకపోతే
ఖాతా రికవరీ పేజీకి వెళ్లి, ప్రశ్నలకు మీకు సాధ్యమైనంత వరకు ఉత్తమ సమాధానాలను ఇవ్వండి. ఈ చిట్కాలు సహాయపడగలవు.
ఈ కింద పేర్కొనబడిన పరిస్థితులు ఎదురైనప్పుడు ఖాతా రికవరీ పేజీని ఉపయోగించండి:
- మీ పాస్వర్డ్ లేదా రికవరీ ఫోన్ నంబర్ లాంటి మీ ఖాతా సమాచారాన్ని ఎవరైనా మార్చినప్పుడు.
- మీ ఖాతాను ఎవరైనా తొలగించినప్పుడు.
- మరొక కారణం చేత మీరు సైన్ ఇన్ చేయలేకపోయినప్పుడు.
చిట్కా: మీరు సరైన ఖాతాకే సైన్ ఇన్ చేస్తున్నట్లు నిర్ధారించుకోవడానికి, మీ యూజర్‌నేమ్ రికవరీ కోసం ట్రై చేయండి.
దశ 2: యాక్టివిటీని రివ్యూ చేసి, హ్యాక్ చేయబడిన మీ Google ఖాతాను సురక్షితం చేయడంలో సహాయం చేయండి
- మీ Google ఖాతాకు వెళ్లండి.
- ఎడమ వైపున ఉన్న నావిగేషన్ ప్యానెల్లో, సెక్యూరిటీని ఎంచుకోండి.
- ఇటీవలి సెక్యూరిటీ ఈవెంట్ల ప్యానెల్లో, సెక్యూరిటీ ఈవెంట్లను రివ్యూ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ ఉందేమో చెక్ చేయండి:
- ఒకవేళ మీరు చేయని యాక్టివిటీని దేన్నైనా మీరు కనుగొంటే, లేదు, అది నేను కాదు ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆపై, మీ ఖాతాను సురక్షితంగా చేయడానికి స్క్రీన్ మీద ఉన్న దశలను ఫాలో అవ్వండి.
- ఒకవేళ యాక్టివిటీని మీరు చేసి ఉంటే, అవును ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇప్పటికీ మీ ఖాతాను వేరెవరో ఉపయోగిస్తున్నారని మీరు నమ్మితే, మీ ఖాతా హ్యాక్ చేయబడిందేమో కనుగొనండి.
- మీ Google ఖాతాకు వెళ్లండి.
- ఎడమ వైపున ఉన్న నావిగేషన్ ప్యానెల్లో, సెక్యూరిటీని ఎంచుకోండి.
- మీ పరికరాలు ప్యానెల్లో, పరికరాలను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీరు గుర్తుపట్టని ఏవైనా పరికరాల కోసం చెక్ చేయండి.
- ఒకవేళ మీరు గుర్తుపట్టని పరికరాన్ని మీరు కనుగొంటే పరికరాన్ని గుర్తుపట్టలేదా? ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆపై, మీ ఖాతాను సురక్షితంగా చేయడానికి స్క్రీన్ మీద ఉన్న దశలను ఫాలో అవ్వండి.
- అన్ని పరికరాలను మీరు గుర్తుపట్టినా, మీ ఖాతాను వేరెవరో ఉపయోగిస్తున్నారని మీకు అనిపిస్తే, మీ ఖాతా హ్యాక్ చేయబడిందేమో కనుగొనండి.
దశ 3: మరిన్ని సెక్యూరిటీ చర్యలను తీసుకోండి
2-దశల వెరిఫికేషన్ మీ ఖాతాను హ్యాకర్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. 2-దశల వెరిఫికేషన్‌తో, మీరు వీటితో సైన్ ఇన్ చేస్తారు:
- మీకు తెలిసినది ఏదైనా (మీ పాస్వర్డ్)
- మీ దగ్గర ఉన్నది ఏదైనా (మీ ఫోన్, సెక్యూరిటీ కీ లేదా ప్రింట్ చేసిన కోడ్)
ఆ రకంగా, ఒకవేళ మీ పాస్వర్డ్ చోరీకి గురైనా, మీ ఖాతా ఇంకా సురక్షితంగానే ఉంటుంది.
మీ బ్యాంక్ లేదా ప్రభుత్వం ఇచ్చినట్లుగా, 'ఖాతా తెరవండి', 'డబ్బు బదిలీ చేయండి' లాంటి సూచనలను వేరెవరో ఇవ్వలేదని నిర్ధారించుకోండి. కింద తెలిపిన సందర్భాలలో ఇది ముఖ్యం:
- మీ ఖాతాలో బ్యాంకింగ్ సమాచారం సేవ్ చేయబడి ఉన్నప్పుడు, అంటే Google Pay లేదా Chromeలో క్రెడిట్ కార్డ్‌లు సేవ్ చేయబడి ఉండటం లాంటివి.
- మీ ఖాతాలో పన్ను లేదా పాస్‌పోర్ట్ సమాచారం లాంటి వ్యక్తిగత సమాచారం సేవ్ చేయబడి ఉన్నప్పుడు. ఉదాహరణకు, Google Photos, Google Drive, లేదా Gmailలో మీ వ్యక్తిగత సమాచారాన్ని మీరు సేవ్ చేసి ఉండవచ్చు.
- ఎవరో మీ గుర్తింపును ఉపయోగిస్తున్నారని లేదా మీలాగ నటిస్తున్నారని అనుకోండి.
ఒకవేళ మీ ఖాతాలో అనుమానాస్పద యాక్టివిటీ ఉందని మీకు అనిపిస్తే, మీరు హానికర సాఫ్ట్‌వేర్‌ను తీసివేయాల్సి ఉంటుంది. మీ ఖాతా సెక్యూరిటీ మెరుగుపరచడానికి, విశ్వసనీయమైన యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసి దానిని రన్ చేయండి.
అలాగే మీరు మీ కంప్యూటర్ను ఫ్యాక్టరీ సెట్టింగ్‌లకు రీసెట్ చేసి, ఆపరేటింగ్ సిస్టమ్‌ను మళ్లీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది.
- ఒకవేళ తక్కువ సురక్షిత యాప్‌లకు యాక్సెస్ ఆన్‌లో ఉంటే, దాన్ని ఆఫ్ చేయాలని మేము బలంగా సిఫార్సు చేస్తున్నాము, ఎందుకంటే అది మీ ఖాతాను తక్కువ సురక్షితంగా చేయవచ్చు.
- మీ పరికరానికి స్క్రీన్ లాక్ ఆప్షన్ ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించండి.
- Gmail: ఈ సెక్యూరిటీ చిట్కాలను రివ్యూ చేసి, మీరు సెటప్ చేయని ఏవైనా లేబుల్లు, ఫిల్టర్లు, లేదా ఫార్వర్డ్ చేసే నియమాలు ఉన్నట్లయితే వాటిని తీసివేయండి.
- Chrome: మీరు గుర్తించలేని ఎక్స్టెన్షన్లను అన్ఇన్స్టాల్ చేసి, తాజా వెర్షన్‌కు Chromeను అప్డేట్ చేయండి.
- Google Drive: ఏదైనా అసాధారణమైన వాటి కోసం మీ యాక్టివిటీ, ఫైల్ వెర్షన్లను రివ్యూ చేయండి.
- Google Photos: మీరు గుర్తించలేని ఏదైనా ఆల్బమ్ షేరింగ్‌ను మీరు చూసినట్లయితే, ఆ ఆల్బమ్ షేరింగ్‌ను ఆపివేయండి.
- లొకేషన్: అసాధారణంగా కనిపిస్తున్న లొకేషన్ షేరింగ్‌ను ఆఫ్ చేయండి.
మీ Google ఖాతా హ్యాక్ చేయబడిందేమో కనుగొనండి
ఒకవేళ మీరు ఇలాంటి సంకేతాలను గమనిస్తే, వేరెవరో మీ Google ఖాతాను ఉపయోగిస్తూ ఉండవచ్చు.
ముఖ్యమైనది: ఒకవేళ వేరెవరో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేశారని అనిపిస్తే, మీ పాస్‌వర్డ్‌ను వెంటనే మార్చండి, ఎందుకంటే:
- మీరు ఇప్పటికే మార్చకుండా ఉంటే, మీ Google ఖాతా
- యాప్‌లు, సైట్లు:
- మీ Google ఖాతాకు ఉపయోగించిన పాస్‌వర్డ్‌నే ఉపయోగించేవి
- మీ Google ఖాతా ఇమెయిల్ అడ్రస్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేసేవి
- మీ Google ఖాతా ఇమెయిల్ అడ్రస్‌తో మీరు సైన్ ఇన్ చేసేవి
- మీ Google ఖాతాలో మీరు పాస్వర్డ్లు సేవ్ చేసేవి
ఆపై మీరు చెక్ చేసి, మీ ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉన్న తెలియని పరికరాలను తీసివేయవచ్చు.
అనుమానాస్పద ఖాతా యాక్టివిటీ
ఈ కింది సెట్టింగ్‌లలో మీరు ఏవైనా తెలియని మార్పులు కనుగొన్నట్లయితే వెంటనే సెట్టింగ్‌ను సరి చేయండి:
- మీ రికవరీ ఫోన్ నంబర్.
- మీ రికవరీ ఇమెయిల్ అడ్రస్.
- ప్రత్నామ్నాయ లేదా కాంటాక్ట్ ఇమెయిల్ అడ్రస్.
- మీ Google ఖాతాలోని పేరు.
- మీ సెక్యూరిటీ ప్రశ్న.
- చిట్కా: అదనపు సెక్యూరిటీ ప్రశ్నలు ఇక అందుబాటులో లేవు.
- మీ ఖాతాకు యాక్సెస్ కలిగి ఉన్న యాప్‌లు.
- ఒకవేళ ఈ సెట్టింగ్ మీకు తెలియకుండా ఆన్ లేదా ఆఫ్ చేయబడి ఉంటే:
- 2-దశల వెరిఫికేషన్ పద్ధతులు.
- లొకేషన్ షేరింగ్.
ఇలా జరిగితే మీ ఫైనాన్షియల్ యాక్టివిటీ మీద అనుమానపడవచ్చు:
- Google Payలో
- మీరు గుర్తించలేని కొనుగోళ్లు: రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయడానికి, అనధికార ఛార్జ్‌లను రిపోర్ట్ చేయండి.
- మీరు గుర్తించలేని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు లేదా గిఫ్ట్ కార్డ్‌లు: మీరు గుర్తించలేని పేమెంట్ ఆప్షన్‌ను తీసివేయండి
- Google Playలో, మీరు కొనుగోళ్లను గుర్తించలేకపోతే: అనధికార ఛార్జ్‌లను రిపోర్ట్ చేయండి.
- Google Chromeలో, మీరు గుర్తించలేని పేమెంట్ సమాచారం సెటప్ చేసి ఉంటే: మీరు తెలియని పేమెంట్ సమాచారాన్ని తొలగించండి.
- Google యాడ్లలో, అనధికార ఛార్జ్‌లు లేదా యాడ్లను మీరు గమనించినట్లయితే: మీ ఖాతాలో అసాధారణ యాక్టివిటీని రివ్యూ చేయాలని Google యాడ్ల టీమ్‌ను అడగండి.
- Google AdSenseలో, సరైన బ్యాంక్ ఖాతాకు పేమెంట్లు వెళ్లడం లేదని మీరు గమనిస్తే: మీ AdSense పేమెంట్ ఆప్షన్‌ను చెక్ చేయండి.
చిట్కా: అనుమానాస్పద యాక్టివిటీ గురించి మీకు తెలియజేయడానికి, మేము మీ రికవరీ ఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్‌ను ఉపయోగిస్తాము.
మేము వీటి ద్వారా అసాధారణ యాక్టివిటీని గురించి మీకు తెలియజేస్తాము:
- మీ ఖాతాకు అసాధారణ సైన్ ఇన్ గురించి లేదా కొత్త పరికరంలో మీ ఖాతాను ఉపయోగించడం గురించి నోటిఫికేషన్.
- మీ యూజర్‌నేమ్, పాస్వర్డ్ లేదా ఇతర సెక్యూరిటీ సెట్టింగ్‌లలో ఏదైనా మార్పు జరిగి ఉండి, ఆ మార్పును మీరు చేయనప్పుడు నోటిఫికేషన్.
- మీరు గుర్తించని ఏదైనా ఇతర యాక్టివిటీని గురించి నోటిఫికేషన్.
- మీ స్క్రీన్ పైన, "మీ ఖాతాలో మేము అనుమానాస్పద యాక్టివిటీని గుర్తించాము" అని తెలియజేసే ఎరుపు రంగు పట్టీ.
- మీ "పరికర యాక్టివిటీ, సెక్యూరిటీ ఈవెంట్ల" పేజీ.
మీరు ఉపయోగించే Google ప్రోడక్ట్లలో అనుమానాస్పద యాక్టివిటీ
Gmail సెట్టింగ్‌లు
కింది వాటిలో మీకు తెలియని మార్పులు చూసినట్లయితే, వెంటనే సెట్టింగ్‌ను సరిచేయండి:
- మెయిల్ నియుక్త బృందం: మీ Gmailకు యాక్సెస్ ఉన్న వ్యక్తులు
- ఆటోమేటిక్‌గా మెయిల్ ఫార్వర్డ్ చేయడం
- షెడ్యూల్ చేసిన ఇమెయిల్‌లు
- Gmailలో మీ పేరు
- ఆటోమేటిక్ రిప్లయి: సెలవు ప్రత్యుత్తరం
- పంపుతున్న మెయిల్లో అడ్రస్
- బ్లాక్ చేయబడిన ఇమెయిల్ అడ్రస్‌లు
- మీ Gmailకు రిమోట్ యాక్సెస్: IMAP లేదా POP
- మీ ఇన్కమింగ్ మెయిల్‌ను మేనేజ్ చేసే ఫిల్టర్లు
- మీ ఇన్కమింగ్ మెయిల్‌ను ఆర్గనైజ్ చేసే లేబుల్లు
Gmail యాక్టివిటీ
ఇలా జరిగితే మీ Gmail యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉండవచ్చు:
- మీకు ఇకపై ఇమెయిల్‌లు రాకపోవడం.
- మీ దగ్గరి నుంచి స్పామ్ లేదా అసాధారణ మెయిల్లు వస్తున్నాయని మీ స్నేహితులు చెప్పడం.
- మీ యూజర్‌నేమ్ మారడం.
- మీ ఇన్‌బాక్స్ నుండి మీ ఇమెయిల్‌లు తొలగించబడి, అవి "ట్రాష్"లో కూడా కనిపించకపోవడం. మీరు కనపడకుండా పోయిన ఇమెయిల్‌ల గురించి రిపోర్ట్ చేయవచ్చు, వాటిని రికవర్ చేసే అవకాశం కూడా ఉంది.
- మీరు రాయని "పంపిన ఇమెయిల్‌లు" మీకు కనిపించడం.
ఇలా జరిగితే మీ YouTube యాక్టివిటీ మీద అనుమానపడవచ్చు:
- మీ YouTube ఛానెల్లో మీరు అప్లోడ్ చేయని వీడియోలు ఉన్నా, మీరు చేయని కామెంట్లు ఉన్నా, లేదా కింద తెలిపిన వాటిలో మీకు తెలియని మార్పులు ఉన్నా:
- ఛానెల్ పేరు
- ప్రొఫైల్ ఫోటో
- వివరణలు
- ఇమెయిల్ సెట్టింగ్‌లు
- పంపిన మెసేజ్‌లు
ఇలా జరిగితే మీ Google Drive యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉండవచ్చు:
- మీరు గుర్తించలేని Google Drive యాక్టివిటీని మీరు కనుగొన్నప్పుడు.
- మీకు తెలియకుండా మీ Drive నుండి ఫైల్లు తొలగించబడినప్పుడు. మీ ఫైల్‌లను రికవర్ చేయడానికి మీరు ట్రై చేయవచ్చు.
ఒకవేళ ఇలా జరిగితే మీ Google Photos యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉన్నట్లు:
- మీ అనుమతి లేకుండా మీ ఫోటో ఆల్బమ్‌లు షేర్ చేయబడినప్పుడు.
- మీరు పార్టనర్ ఖాతాను జోడించనప్పటికీ, మీ ఫోటోలు పార్టనర్‌తో షేర్ చేయబడినప్పుడు.
ఇలా జరిగితే మీ Blogger యాక్టివిటీ మీద అనుమానపడవచ్చు:
- మీరు పబ్లిష్ చేయని పోస్ట్‌లు మీ బ్లాగ్‌లో కనిపించినప్పుడు.
- మీరు పబ్లిష్ చేయని పోస్ట్‌ల మీద కామెంట్లు వచ్చినప్పుడు.
- మీరు మార్చకున్నా, మీ మెయిల్-నుండి-Blogger అడ్రస్ మారిపోయినప్పుడు.
- మీ బ్లాగ్ కనిపించకపోయినప్పుడు లేదా బ్లాక్ చేయబడినప్పుడు.
ఇలా ఏదైనా మీకు తెలియనిది కనుగొంటే మీ Google యాడ్ల యాక్టివిటీ మీద అనుమానపడవచ్చు:
- తెలియని లింక్‌లు లేదా గమ్యస్థానాలకు తీసుకెళ్లే యాడ్లు
- మీ యాడ్ ఖర్చులో పెరుగుదల
- ఖాతా ఓనర్లు, మేనేజర్లు లేదా యూజర్లలో మార్పులు