2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి

ఒకవేళ మీ పాస్‌వర్డ్ దొంగిలించబడినట్లయితే, రెండు-దశల ప్రామాణీకరణ అని కూడా పిలవబడే 2-దశల వెరిఫికేషన్‌తో, మీరు మీ ఖాతాకు అదనపు సెక్యూరిటీ లేయర్‌ను జోడించవచ్చు. మీరు 2-దశల వెరిఫికేషన్‌ను సెటప్ చేసిన తర్వాత, మీరు వీటితో మీ ఖాతాకు సైన్ ఇన్ చేయవచ్చు:

  • మీ పాస్‌వర్డ్
  • మీ ఫోన్

2-దశల వెరిఫికేషన్‌ను ఆఫ్ చేస్తున్నాము

  1. మీ Google ఖాతాను తెరవండి.
  2. నావిగేషన్ ప్యానెల్‌లో, సెక్యూరిటీని ఎంచుకోండి.
  3. "మీరు Googleకు ఎలా సైన్ ఇన్ చేస్తారు” ఆప్షన్ కింద, 2-దశల వెరిఫికేషన్ ఆ తర్వాత ప్రారంభించండి ఆప్షన్‌లను ఎంచుకోండి.
  4. స్క్రీన్‌పై కనిపించే దశలను ఫాలో అవ్వండి.

చిట్కా: మీ ఆఫీస్, పాఠశాల లేదా ఇతర గ్రూప్ ద్వారా మీరు ఖాతాను ఉపయోగిస్తే, ఈ దశలు పని చేయకపోవచ్చు. మీరు 2-దశల వెరిఫికేషన్‌ను సెటప్ చేయలేకపోతే, సహాయం కోసం మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.

2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేయండి

రెండవ దశతో మీ గుర్తింపును వెరిఫై చేయండి

మీరు 2-దశల వెరిఫికేషన్‌ను ఆన్ చేసిన తర్వాత, మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, అది మీరే అని వెరిఫై చేయడానికి, మీరు రెండవ దశను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ ఖాతాను సంరక్షించడంలో సహాయపడటానికి, మీరు నిర్దిష్టమైన రెండవ దశను పూర్తి చేయాలని Google అడుగుతుంది.

Google ప్రాంప్ట్‌లను ఉపయోగించండి

మీరు Google ప్రాంప్ట్‌లతో సైన్ ఇన్ చేయాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయడం కంటే ప్రాంప్ట్‌ను ట్యాప్ చేయడం చాలా సులభం. ప్రాంప్ట్‌లు SIM స్వాప్, ఇతర ఫోన్ నంబర్ ఆధారిత హ్యాక్‌ల నుండి రక్షించడంలో కూడా సహాయపడతాయి.

Google ప్రాంప్ట్‌లు అనేవి మీరు వీటిలో పొందే పుష్ నోటిఫికేషన్‌లు:

  • మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉన్న Android ఫోన్‌లు.
  • Smart Lock యాప్ , Gmail యాప్ , Google Photos యాప్ , YouTube యాప్ YouTube, లేదా Google యాప్ ద్వారా మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయబడిన iPhoneలు.

నోటిఫికేషన్‌లోని పరికరం, లొకేషన్ సమాచారం ఆధారంగా, మీరు ఇలా చేయవచ్చు:

  • మీరు దాన్ని రిక్వెస్ట్ చేసి ఉంటే, అవునును ట్యాప్ చేయడం ద్వారా సైన్ ఇన్‌ను అనుమతించడం.
  • మీరు దాన్ని రిక్వెస్ట్ చేసి ఉండకపోతే, వద్దును ట్యాప్ చేయడం ద్వారా సైన్ ఇన్‌ను బ్లాక్ చేయడం.

అదనపు సెక్యూరిటీ కోసం, Google మిమ్మల్ని మీ PIN లేదా ఇతర నిర్ధారణ కోసం అడగవచ్చు.

ఇతర వెరిఫికేషన్ పద్ధతులను ఉపయోగించండి

కింది సందర్భాలలో మీరు ఇతర వెరిఫికేషన్ పద్ధతులను సెటప్ చేసుకోవచ్చు:

  • ఫిషింగ్ నుండి మీకు అధిక సంరక్షణ కావాలనుకున్నప్పుడు
  • మీరు Google ప్రాంప్ట్‌లను పొందలేనప్పుడు
  • మీ ఫోన్‌ను కోల్పోయినప్పుడు
ఫిషింగ్ నుండి రక్షణను పెంచడానికి సెక్యూరిటీ కీలను ఉపయోగించండి

ఫిజికల్ సెక్యూరిటీ కీ అనేది సైన్ ఇన్ చేస్తున్నది మీరే అని వెరిఫై చేయడంలో సహాయం కోసం మీరు కొనుగోలు చేయదగిన చిన్న పరికరం. అది మీరే అని మేము నిర్ధారించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు, మీరు కీని నేరుగా మీ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్‌కు కనెక్ట్ చేయవచ్చు. మీ సెక్యూరిటీ కీలను ఆర్డర్ చేయండి.

చిట్కా: ఏ హ్యాకర్ అయినా మిమ్మల్ని ఏమార్చి మీ నుండి మీ పాస్‌వర్డ్‌ను లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సంపాదించడానికి ట్రై చేసినప్పుడు, ఫిషింగ్ అటాక్‌ల నుండి మీ Google ఖాతాను సురక్షితంగా ఉంచుకోవడంలో మీకు సెక్యూరిటీ కీలు సహాయపడతాయి. ఫిషింగ్ అటాక్‌ల గురించి మరింత తెలుసుకోండి.

Google ప్రామాణీకరణదారు లేదా ఇతర వెరిఫికేషన్ కోడ్ యాప్‌లను ఉపయోగించండి
ముఖ్య గమనిక: మీ వెరిఫికేషన్ కోడ్‌లను ఎప్పుడూ ఎవరికీ ఇవ్వవద్దు.

మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదా మొబైల్ సర్వీస్ లేనప్పుడు, మీరు Google Authenticator లేదా వన్-టైమ్ వెరిఫికేషన్ కోడ్‌లను రూపొందించే మరొక యాప్‌ను సెటప్ చేయవచ్చు.

ఇది మీరేనని వెరిఫై చేయడంలో సహాయపడటానికి, సైన్-ఇన్ స్క్రీన్‌పై వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయండి.

టెక్స్ట్ మెసేజ్ లేదా కాల్ ద్వారా పొందిన వెరిఫికేషన్ కోడ్‌ను ఉపయోగించండి
ముఖ్య గమనిక: మీ వెరిఫికేషన్ కోడ్‌లను ఎప్పుడూ ఎవరికీ ఇవ్వవద్దు.
మీరు ఇంతకుముందు అందించిన నంబర్‌కు 6-అంకెల కోడ్ పంపబడి ఉండవచ్చు. మీరు ఎంచుకున్న సెట్టింగ్ ఆధారంగా కోడ్‌లు టెక్స్ట్ మెసేజ్ (SMS) ద్వారా లేదా వాయిస్ కాల్ ద్వారా పంపబడతాయి. అది మీరే అని వెరిఫై చేయడానికి, సైన్ ఇన్ స్క్రీన్‌పై కోడ్‌ను ఎంటర్ చేయండి.
చిట్కా: ఏ రకమైన 2-దశల వెరిఫికేషన్ అయినా ఖాతా సెక్యూరిటీని పెంచడానికే అయినప్పటికీ, టెక్స్ట్‌లు లేదా కాల్‌ల ద్వారా పంపబడిన వెరిఫికేషన్ కోడ్‌లు ఫోన్ నంబర్-ఆధారిత హ్యాక్‌లకు గురి కావచ్చు.
బ్యాకప్ కోడ్‌లను ఉపయోగించండి
ముఖ్య గమనిక: మీ బ్యాకప్ కోడ్‌లను ఎప్పుడూ, ఎవరికీ ఇవ్వవద్దు.
సురక్షితమైన ప్రదేశంలో ఉంచడానికి మీరు 8-అంకెల బ్యాకప్ కోడ్‌ల సెట్‌ను ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా, మీ పాస్‌వర్డ్‌లు ఇప్పటికీ మరొక పరికరంలో అందుబాటులో ఉంటాయి.

విశ్వసనీయ పరికరాలలో రెండవ దశను స్కిప్ చేయండి

మీరు మీ కంప్యూటర్ లేదా ఫోన్‌కు సైన్ ఇన్ చేసిన ప్రతిసారి రెండవ వెరిఫికేషన్ దశను అందించకూడదు అనుకుంటే, "ఈ కంప్యూటర్‌లో మళ్లీ అడగవద్దు" లేదా "ఈ పరికరంలో మళ్లీ అడగవద్దు" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంపిక చేయండి.
ముఖ్య గమనిక: మీరు రోజూ ఉపయోగించే, ఎవరితోనూ షేర్ చేసుకోని పరికరాలలో మాత్రమే ఈ బాక్స్‌ను ఎంపిక చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16753204859776135134
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false