ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలకు సైన్ ఇన్ చేయడం

ఒకవేళ మీకు ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు ఉంటే, ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలకు మీరు సైన్ ఇన్ చేయవచ్చు. అప్పుడు, మీరు సైన్ అవుట్ చేసి, మళ్లీ సైన్ ఇన్ చేయకుండానే వివిధ ఖాతాల మధ్య స్విచ్ చేయవచ్చు.

మీ ఖాతాలకు వేర్వేరుగా సెట్టింగ్‌లు ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో మీ ఆటోమేటిక్ ఖాతాలో ఉన్న సెట్టింగ్‌లు వర్తించవచ్చు.

ఖాతాలను జోడించడం

  1. మీ కంప్యూటర్‌లో, Googleకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఇమేజ్‌ను లేదా పేరులోని మొదటి అక్షరాన్ని ఎంచుకోండి.
  3. మెనూలో, ఖాతాను జోడించండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి సూచనలను ఫాలో చేయండి.

ఖాతాల మధ్య స్విచ్ చేయడం

  1. మీ కంప్యూటర్‌లో, Googleకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఇమేజ్‌ను లేదా పేరులోని మొదటి అక్షరాన్ని ఎంచుకోండి.
  3. మెనూలో, మీరు ఉపయోగించాలని అనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.

సైన్ అవుట్ చేయడం

ముఖ్యమైనది: మీరు సైన్ అవుట్ చేయడానికి ముందు, మీరు మళ్లీ సైన్ ఇన్ చేయడంలో సమస్య రాకుండా ఉండేందుకు వీలుగా బ్యాకప్ వెరిఫికేషన్ విధానాలు సెటప్ చేసి ఉన్నట్లు నిర్ధారించుకోండి.

  1. మీ పరికరంలో, www.google.com లాంటి Google పేజీకి వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఇమేజ్‌ను లేదా పేరులోని మొదటి అక్షరాన్ని ఎంచుకోండి.
  3. మెనూలో, సైన్ అవుట్ చేయండి లేదా అన్ని ఖాతాల నుండి సైన్ అవుట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

సైన్-ఇన్ పేజీ నుండి మీ ఖాతాను తీసివేయడం

  1. మీ పరికరంలో, మీరు సైన్ ఇన్ చేసి ఉన్న బ్రౌజర్‌కు వెళ్లండి, ఉదాహరణకు Chrome.
  2. myaccount.google.comకు వెళ్లండి.
  3. ఎగువున కుడి వైపున ఉన్న, మీ ప్రొఫైల్ ఫోటోను లేదా పేరులోని మొదటి అక్షరాన్ని ఎంచుకోండి.
  4. సైన్ అవుట్ చేయండి లేదా అన్ని ఖాతాల నుండి సైన్ అవుట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. ఖాతాను తీసివేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  6. ఖాతాకు పక్కన ఉన్న, తీసివేయండి తీసివేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.
  7. తప్పనిసరి కాదు: ఒకవేళ మీరు Firefox లేదా Safari లాంటి ఇతర బ్రౌజర్‌లలో కూడా సైన్ ఇన్ చేసి ఉంటే, ప్రతి దానికి ఈ దశలను మళ్లీ అమలు చేయండి.

ఖాతాలకు వేర్వేరుగా సెట్టింగ్‌లు ఉంటాయి

మీ ఖాతాల్లో ప్రతిదాని కోసం వేర్వేరుగా మీ సెట్టింగ్‌లను మీరు కంట్రోల్ చేయవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలకు సైన్ ఇన్ చేసినప్పుడు, సాధారణంగా ఖాతాల మధ్య ఖాతా సెట్టింగ్‌లు షేర్ చేయబడవు. ఉదాహరణకు, మీ ఖాతాలకు వేర్వేరు భాష సెట్టింగ్‌లు లేదా సైన్-ఇన్ చేసే దశలు ఉండవచ్చు.

కొన్ని సందర్భాల్లో సెట్టింగ్‌లు వర్తింపబడవచ్చు

ఒకటి కంటే ఎక్కువ ఖాతాలకు ఒకేసారి మీరు సైన్ ఇన్ చేసినట్లయితే, కొన్ని సందర్భాల్లో మీరు ఏ ఖాతాను ఉపయోగిస్తున్నారనేది మేము చెప్పలేకపోవచ్చు. ఉదాహరణకు, ఒకవేళ మీరు రెండు ఖాతాలకు సైన్ ఇన్ చేసి ఉండి, కొత్త బ్రౌజర్ తెరిచినట్లయితే, మీరు ఏ ఖాతా ఉపయోగించాలనుకుంటున్నారో మేము నిర్ధారించలేము. ఇలాంటి సందర్భాలలో, మీ ఆటోమేటిక్ ఖాతా నుండి Google సెట్టింగ్‌లను వర్తింపజేయవచ్చు, వీటిలో వెబ్ & యాప్ యాక్టివిటీ, యాడ్స్ వ్యక్తిగతీకరణ సెట్టింగ్‌ల లాంటివి ఉంటాయి.

ఆటోమేటిక్ ఖాతా అంటే ఏమిటి

చాలా సందర్భాల్లో, మీరు మొదట సైన్ ఇన్ చేసిన ఖాతా మీ ఆటోమేటిక్ ఖాతాగా ఉంటుంది. మొబైల్ పరికరాలలో, మీ ఆటోమేటిక్ ఖాతా అనేది మీ పరికరాలలో ఆపరేటింగ్ సిస్టమ్, మీరు ఉపయోగించే యాప్‌ల మీద ఆధారపడి మారవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3558751721892295898
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false