భవిష్యత్తులో రాబోయే, అలాగే ఇటీవల వచ్చిన యాడ్ గైడ్‌లైన్ అప్‌డేట్‌లు

ఈ పేజీ మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ విషయంలో రాబోయే అప్‌డేట్‌లను, అలాగే ఇటీవల వచ్చిన యాడ్ గైడ్‌లైన్ అప్‌డేట్‌లను క్లుప్తంగా వివరిస్తుంది. YouTube పాలసీలకు చేసిన ఇతర అప్‌డేట్‌ల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

తాజా అప్‌డేట్‌లు

గత 3 నెలలకు సంబంధించిన అప్‌డేట్‌లు

 

ఏప్రిల్ 2024

మా ప్రస్తుత పాలసీ విషయంలో మరింత స్పష్టమైన అవగాహన కోసం, అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌లో "యాడ్ ఆదాయం అస్సలు లభించదు" విభాగంలో అత్యంత అసభ్య పదజాలానికి, ద్వేషపూరిత భాషకు లేదా దూషణలకు సంబంధించిన ఉదాహరణలను అందిస్తున్నాము. ఈ పాలసీకి మేము ఎలాంటి మార్పులు చేయలేదు, అంటే ఏ పదాలను “అత్యంత అసభ్య పదజాలం”గా పరిగణిస్తాము లేదా అడ్వర్టయిజర్-ఫ్రెండ్లీ‌నెస్ కోసం మీ వీడియోలను ఏ విధంగా రివ్యూ చేస్తాము అనే అంశాలలో ఎటువంటి మార్పు ఉండదని అర్థం.
 

జనవరి 2024

ఏదైనా సున్నితమైన ఈవెంట్ నుండి లాభం పొందాలని చూసే, లేదా ఆ ఈవెంట్ విషయంలో దుర్వినియోగానికి పాల్పడే కంటెంట్‌కు మానిటైజేషన్ అందుబాటులో ఉండకపోవచ్చని స్పష్టంగా వివరించడానికి మా గైడ్‌లైన్స్‌‌ను అప్‌డేట్ చేశాము. పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు.
 

నవంబర్ 2023

మేము రెండు ఏరియాలలో పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్‌కు సంబంధించిన మా గైడ్‌లైన్స్‌ను అప్‌డేట్ చేశాము:

  • బ్రెస్ట్ ఫీడింగ్: చనుమొన చుట్టూ ఉన్న చర్మం కనిపిస్తూ, పసిపాప ఉన్న బ్రెస్ట్ ఫీడింగ్ కంటెంట్ ఇప్పుడు యాడ్ ఆదాయాన్ని అందించవచ్చు. మునుపు, చనుమొన చుట్టూ ఉన్న చర్మం కనిపించనప్పుడు మాత్రమే అటువంటి కంటెంట్ మానిటైజ్ చేయదగినదిగా ఉండేది. అలాగే, చనుమొన చుట్టూ ఉన్న చర్మం కనిపించకుండా రొమ్ములపై దృష్టి సారించే బ్రెస్ట్ ఫీడింగ్ థంబ్‌నెయిళ్లు ఇప్పుడు యాడ్ ఆదాయాన్ని పొందవచ్చు.
  • శృంగార నృత్యం:  మెలికలు తిరుగుతూ లేదా శరీరాన్ని ఊపుతూ లయబద్ధమైన కదలికల వంటి శృంగార సంబంధం కాని దృశ్యాలను చూపే డ్యాన్స్, అలాగే కురచటి దుస్తులు ధరించి డ్యాన్స్ చేయడాన్ని చూపించడం ద్వారా ఇప్పుడు యాడ్ ఆదాయాన్ని పొందవచ్చు. మునుపు, ఇలాంటి కంటెంట్ మానిటైజ్ చేయదగినదిగా పరిగణించబడలేదు.

మెలికలు తిరుగుతూ శృంగార సంబంధం కాని దృశ్యాలను చూపే డ్యాన్స్, అలాగే బిడ్డకు తల్లి పాలు ఇవ్వడాన్ని చూపే కంటెంట్‌ను ప్రదర్శించే కంటెంట్ నుండి యాడ్ ఆదాయాన్ని పొందడానికి క్రియేటర్‌లను అనుమతించడానికి మేము పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన మా కంటెంట్ గైడ్‌లైన్స్‌కు ఈ మార్పు చేస్తున్నాము.

ఈ పాలసీ అప్‌డేట్‌లను ప్రతిబింబించేలా గేమింగ్, మానిటైజేషన్ ఆర్టికల్ కూడా అప్‌డేట్ చేయబడింది.

మునుపటి అప్‌డేట్‌లు

3 నెలల కిందటి అప్‌డేట్‌లు

2023

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (అక్టోబర్ 2023)

“హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యల”కు సంబంధించిన మా పాలసీ పేరును “హానికరమైన చర్యలు, నమ్మదగని కంటెంట్” అని అప్‌డేట్ చేశాము. స్పష్టంగా తప్పుడు రకానికి చెందిన క్లెయిమ్‌లు చేసే కంటెంట్, అలాగే ఎన్నికల్లో లేదా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడాన్ని లేదా వాటిపై ఉన్న నమ్మకాన్ని గణనీయంగా తగ్గించే కంటెంట్, యాడ్ ఆదాయాన్ని పొందలేదని స్పష్టం చేయడానికి మేము వివరణను కూడా జోడించాము. ఉదాహరణకు, పబ్లిక్ ఓటింగ్ విధానాలు, వయస్సు లేదా జన్మస్థలం ఆధారంగా రాజకీయ అభ్యర్థి అర్హత, ఎన్నికల ఫలితాలు, లేదా అధికారిక ప్రభుత్వ రికార్డ్‌లకు విరుద్ధంగా ఉండే జన గణనలో పాల్గొనడం గురించిన సమాచారం. ఈ విషయంలో సదరు క్లెయిమ్‌లు తప్పు అని స్పష్టం చేసే కామెంటరీ, విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ కంటెంట్ వంటివి యాడ్ ఆదాయాన్ని సంపాదించవచ్చు.

ఈ పాలసీని అమలు చేసే విధానాన్ని మేము మార్చలేదు, అంటే అడ్వర్టయిజర్-ఫ్రెండ్లీ‌నెస్ కోసం మీ వీడియోలు ఎలా చెక్ చేయబడతాయి అనే విషయంలో ఎటువంటి మార్పు ఉండదని అర్థం.

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (సెప్టెంబర్ 2023)

మేము వివాదాస్పద టాపిక్‌లకు సంబంధించిన మా గైడ్‌లైన్స్‌ను అప్‌డేట్ చేశాము. 

  • గర్భస్రావం, పెద్దల లైంగిక హింస వంటి టాపిక్‌ల గురించి చర్చించే కంటెంట్ విషయంలో మరింత యాడ్ ఆదాయాన్ని పొందడానికి క్రియేటర్‌లకు వీలు కల్పించడం జరుగుతోంది. స్పష్టంగా వివరాలను వెల్లడించకుండా ఈ టాపిక్‌ల గురించి చర్చించే కంటెంట్ పూర్తిగా మానిటైజ్ చేయబడుతుందని దీని అర్థం. ఇలాంటి టాపిక్‌లను కవర్ చేసే వీడియోలు యూజర్‌లకు సహాయకరమైన రిసోర్స్‌గా ఉంటాయని మాకు తెలుసు, కాబట్టి వీలైన చోటల్లా, వివరణాత్మకంగా లేని, స్ఫష్టంగా లేని పద్ధతిలో చర్చించిన వివాదాస్పద టాపిక్‌లు డీమానిటైజేషన్ ద్వారా ఆదాయం పొందకుండా ఉండకూడదని మేము కోరుకుంటున్నాము. కొన్ని క్రియేటర్ కమ్యూనిటీలు తమపై అసమానంగా ప్రభావం చూపే అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నందున ఎక్కువ పసుపు రంగు చిహ్నాలను పొందుతున్నట్లు భావిస్తున్నట్లు కూడా మాకు బాగా తెలుసు. ఈ మార్పులు క్రియేటర్‌లందరికీ సంబంధిత కంటెంట్ విషయంలో యాడ్ ఆదాయాన్ని పొందడానికి అర్హతను కల్పించడం ద్వారా ఈ టాపిక్‌ల గురించి చర్చించడానికి మరింత ఎక్కువ అవకాశాన్ని ఇస్తాయని మేము ఆశిస్తున్నాము. 
  • అదనంగా, మేము YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్కు అనుగుణంగా ఉండేలా, ఆహారపు రుగ్మతలకు సంబంధించిన మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌ను మారుస్తున్నాము. ఆహార రుగ్మతలపై ఫోకస్ చేసే కంటెంట్, ఆహారాన్ని అతిగా తినడం, ఆహారాన్ని దాచడం లేదా నిల్వ చేయడానికి సంబంధించి గైడ్ చేయడం లేదా మలబద్ధకాన్ని తగ్గించే ఔషదాలను దుర్వినియోగం చేయడం వంటి ట్రిగ్గర్‌లను షేర్ చేసే కంటెంట్ యాడ్ ఆదాయాన్ని పొందదు. 
    • ఈ మార్పు అటువంటి కంటెంట్, యాడ్‌ల ద్వారా ఆదాయాన్ని పొందకుండా ఉండేలా చూస్తుంది, అలాగే మా మానిటైజేషన్, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండే కంటెంట్ మాత్రమే యాడ్‌ల ద్వారా ఆదాయాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. 
    • విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ కంటెంట్, అలాగే ఆహార రుగ్మత నుండి బయట పడిన వ్యక్తి సదరు యాక్టివిటీలను ప్రమోట్ చేయకుండా సంబంధిత అంశాలను రెఫరెన్స్‌లుగా చూపించే కంటెంట్ ఈ మార్పు వల్ల ప్రభావితం కాదని గమనించండి.

ఈ పాలసీ అప్‌డేట్‌లను ప్రతిబింబించేలా గేమింగ్, మానిటైజేషన్ ఆర్టికల్ కూడా అప్‌డేట్ చేయబడింది.

ఈ అప్‌డేట్ గురించి మరింత సమాచారం కోసం, మా Creator Insider వీడియోను చూడండి.

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (మార్చి2023)

అనుచితమైన భాషకు సంబంధించిన మా గైడ్‌లైన్స్‌ను అప్‌డేట్ చేశాము. మొదటి 7 సెకన్లలో లేదా వీడియోలోని ఎక్కువ భాగంలో అసభ్య పదజాలాన్ని (ఉదాహరణకు, దెం* వంటి పదాలను) ఉపయోగించడం వలన గతంలో కింద పేర్కొన్న విధంగా యాడ్ ఆదాయం అనేది అస్సలు లభించదు అని ప్రకటించడం జరిగింది, కానీ ఇప్పుడు ఇలాంటి సందర్భాలలో పరిమిత ఆదాయం లభించే అవకాశం ఉంది. వీడియో కంటెంట్‌లో “లంజ”, “బోకు గాడు”, "గుద్ద", “పియ్య” వంటి పదాల వాడకానికి ఆకుపచ్చ చిహ్నాలకు అర్హత ఉంది. మొదటి 8-15 సెకన్లలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించినప్పుడు ప్రస్తుతం యాడ్ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది. మ్యూజిక్‌లో అసభ్య పదజాలం వినియోగం విషయంలో, మేము అనుసరించే తీరుకు సంబంధించి గైడెన్స్‌పై కూడా మేము స్పష్టత ఇచ్చాము; తీవ్రమైన అసభ్య పదజాలాన్ని ఉపయోగించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, బ్యాకింగ్ ట్రాక్‌లు, ఇంట్రో/అవుట్రో మ్యూజిక్ ఉన్నా సరే యాడ్ ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంది.

2022

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (నవంబర్ 2022)

స్పష్టమైన భాష, నిర్దిష్ట గైడ్‌లైన్స్ మార్పులు, అలాగే యాడ్‌ల ఔచిత్యాలకు మార్పులు, రెండింటినీ చేర్చడానికి మేము మా గైడ్‌లైన్స్‌ను అప్‌డేట్ చేశాము. ఏ గైడ్‌లైన్స్ ప్రభావితమవుతున్నాయి, అలాగే ఏవి మారుతున్నాయి, అనే దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలను దిగువున చేర్చాము:

  • పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్
    • లైంగికపరమైన టెక్స్ట్‌లను కలిగి ఉన్న థంబ్‌నెయిల్స్, టైటిల్స్, అలాగే వీడియోలు (లింక్‌లు, 18+ వంటివి), అశ్లీలమైన భాష, ఇమేజ్‌లు (నిజమైన లేదా చాలా కొద్దిగా కప్పబడిన యానిమేటెడ్ పిరుదుల వంటివి), ఆడియో (లైంగిక చిట్కాలు లేదా లైంగిక చర్యలకు సంబంధించిన అనుభవాలను షేర్ చేసుకోవడం వంటివి), అలాగే ప్రేరేపించే చర్యలు (జంతువుల సంపర్కం లేదా అవ్యక్తమైన లైంగిక చర్యల వంటివి) యాడ్ ఆదాయాన్ని పొందలేకపోవచ్చు.
    • ప్రేక్షకులను ప్రేరేపించే ఉద్దేశం లేకుండా లైంగిక యాక్టివిటీలు, శృంగారభరిత డ్యాన్సింగ్, లైంగిక విద్యను చూపించే శాస్త్రీయ కళలకు సంబంధించిన పాలసీ అమలు మారకుండా కొనసాగుతుంది అలాగే యాడ్ ఆదాయాన్ని పొందవచ్చు.
  • హింస 
    • ఎలాంటి సందర్భం లేకుండా స్పష్టంగా చూపని మృతదేహాలను ప్రదర్శించడం, నిజ జీవితంలోని వ్యక్తి పేరు గల పాత్రలపై జరిగే గేమ్ హింస లేదా షాక్‌కు గురిచేసే అనుభవాలను క్రియేట్ చేసేందుకు రూపొందించబడిన చర్యలు (క్రూరమైన సామూహిక హత్యల వంటివి), మరణాన్ని సూచించే క్షణం (లోపల వ్యక్తులు ఉన్న భవనంపై బాంబు దాడి చేయడం వంటివి) యాడ్ ఆదాయాన్ని పొందలేకపోవచ్చు.
    • మొదటి 8 సెకన్ల తర్వాత రక్తంతో నిండిన గాయాలు ఉన్న స్టాండర్డ్ గేమ్ ఆడే విధానం, స్పష్టంగా చూపని విషాదాలు అలాగే వాటి తదనంతర పరిణామాలు (పట్టణంలో వరదలు ముంచెత్తిన ఫుటేజ్ వంటివి), లేదా చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా పోలీసులు చేసే సీజ్‌లు యాడ్ ఆదాయాన్ని పొందవచ్చు.
  • హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యలు 
    • మైనర్‌లు, పాల్గొనే వ్యక్తులుగా లేదా బాధితులుగా ఉన్న ప్రమాదకరమైన చర్యలు (పిల్లలకు తగని స్టంట్‌లతో కూడిన ప్రయోగాలు లేదా సవాళ్లలో మైనర్‌లు పాల్గొనడం వంటివి) యాడ్ ఆదాయాన్ని పొందలేకపోవచ్చు.
  • సున్నితమైన ఈవెంట్‌లు
    • మాదక ద్రవ్యాల వ్యాపార సంస్థలు (DTO) అలాగే విదేశీ ఉగ్రవాద సంస్థల (FTO)కు సంబంధించిన అన్ని టాపిక్‌లు సున్నితమైన ఈవెంట్‌లలో కాకుండా హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యల పరిధిలో ఉంటాయి.
    • సున్నితమైన ఈవెంట్‌లకు సంబంధించిన భాష స్పష్టంగా ఇంకా అర్థమయ్యే విధంగా ఉండేలా చూసేందుకు అది అప్‌డేట్ చేయబడింది, కానీ పాలసీ అమలులో మాత్రం మార్పు లేదు. 
  • అనుచితమైన భాష
    • అసభ్య పదజాలం పట్ల మా విధానం మారుతోంది. అన్ని రకాల అసభ్య పదజాలం ఇప్పుడు సమానంగా పరిగణించబడుతుంది, అంటే అవి తీవ్రత స్థాయిల ఆధారంగా విభజించబడవు (ఉదాహరణకు, స్వల్ప, మధ్యస్థ, తీవ్రమైన, లేదా అత్యంత తీవ్రమైన) అలాగే మేము ఇకపై ‘దీనబ్బ’, ‘దీనమ్మ’ అనే పదాలను అసభ్య పదజాలంగా పరిగణించడం లేదు. అందువల్ల, టైటిల్‌లో, థంబ్‌నెయిల్స్‌లో, లేదా వీడియోలోని మొదటి 7 సెకన్లలో ఉపయోగించిన లేదా వీడియో అంతటా నిలకడగా ఉపయోగించిన అసభ్య పదజాలం యాడ్ ఆదాయాన్ని పొందలేకపోవచ్చు.
    • మొదటి 8 సెకన్ల తర్వాత ఉపయోగించిన అసభ్య పదజాలాలు ఉన్న వీడియో యాడ్ ఆదాయాన్ని పొందవచ్చు. వీడియో అంతటా లేదా అత్యధిక భాగంలో అసభ్య పదజాలం గల కంటెంట్‌ను మానిటైజ్ చేయకూడదన్న మా వైఖరి మారడం లేదు.
  • మాదక ద్రవ్యాలు, అలాగే వాటికి సంబంధించిన కంటెంట్
    • గేమింగ్ కంటెంట్‌లో మాదక ద్రవ్యాలను సేవించడం, వాటిని వినియోగించడం చూపితే, ఆ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని పొందలేకపోవచ్చు. ఉదాహరణకు ఇంజెక్షన్లను చూపడం లేదా గంజాయి సేవించడం మొదలైనవి.
    • గేమింగ్ కంటెంట్‌లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారాలు లేదా మాదక ద్రవ్యాల ప్రస్తావనలు యాడ్ ఆదాయాన్ని పొందవచ్చు.

నిజాయితీ లేని చర్యలను ఎనేబుల్ చేయడం అనే పరిధిలోకి మేము కొత్త గైడ్‌లైన్స్‌ను కూడా పరిచయం చేస్తున్నాము. ఈ కింద పేర్కొన్న కంటెంట్ ఇప్పుడు “ఈ కంటెంట్ ఎలాంటి యాడ్ ఆదాయాన్ని సంపాదించదు” పరిధిలో ఉంటుంది: 

  • ప్రాపర్టీ ఓనర్ అనుమతి లేకుండా రిటైల్ స్టోర్ ఉద్యోగిలా నటించడం లేదా వారి ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం (వారి స్టోర్ తెరిచి ఉండే సమయం తర్వాత అందులో ఉండటం వంటివి). 
  • పోటీ తరహా ఈ-స్పోర్ట్స్‌లో హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడం లేదా వినియోగాన్ని ప్రోత్సహించడం.

అదే సమయంలో, ఈ పాలసీ అప్‌డేట్‌లను ప్రతిబింబించడానికి, గేమింగ్, మానిటైజేషన్ ఆర్టికల్ కూడా అప్‌డేట్ చేయబడింది.
 

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (అక్టోబర్ 2022)

పేర్కొనబడిన నేటి వీడియో-స్థాయి మానిటైజేషన్ గైడ్‌లైన్స్ VOD (నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు), Shorts ఫార్మాట్‌లు రెండింటికీ వర్తిస్తాయని క్రియేటర్ కమ్యూనిటీకి స్పష్టంగా తెలియజేయడం కోసం అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ పేజీ అప్‌డేట్ చేయబడింది. పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మీకు ఎలాంటి మార్పూ కనిపించదని దీని అర్థం. అప్‌డేట్‌లు చేసినప్పుడు మేము తదుపరి అప్‌డేట్‌లను అందిస్తాము. Shorts యాడ్ ఆదాయ షేరింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే దాని గురించి మీరు ఇక్కడ మరింత తెలుసుకోవచ్చు.

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (ఆగస్ట్ 2022)

హానికరం లేదా ప్రమాదకరం అయ్యే అవకాశం ఉన్న కంటెంట్‌కు సంబంధించి మానిటైజేషన్ గైడెన్స్‌ను మేము అప్‌డేట్ చేశాము. చట్టానికి అతీతంగా ప్రతీకార చర్యలు చేపట్టడాన్ని చూపే అప్‌లోడ్‌లలో యాడ్‌లు ప్రదర్శించబడకపోవచ్చు. 

దీనిని వర్తింపజేసేలా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ పేజీ అప్‌డేట్ చేయబడింది. పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మీకు ఎలాంటి మార్పూ కనిపించదని దీని అర్థం.

పిల్లలు, ఫ్యామిలీల విషయంలో అనుచితమైన కంటెంట్‌కు సంబంధించిన అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (ఏప్రిల్ 2022)

పిల్లల కోసం రూపొందించిన” కంటెంట్ కోసం మేము ఇటీవల గైడ్‌లైన్స్‌ను అప్‌డేట్ చేశాము, ఇవి యాడ్స్‌కు ఏవి అనుకూలంగా ఉంటాయో, అలాగే ఏవి అనుకూలంగా ఉండవో క్రియేటర్‌లకు గైడ్ చేయడంలో సహాయపడతాయి. మేము “పిల్లలు, ఫ్యామిలీలకు సంబంధించిన అనుచితమైన కంటెంట్” అనే కొత్త గైడ్‌లైన్‌ను క్రియేట్ చేశాము, ఇందులో మూడు కేటగిరీలు ఉన్నాయి: ప్రతికూల ప్రవర్తనను ప్రోత్సహించే కంటెంట్, పిల్లలు లక్ష్యంగా రూపొందించిన పెద్దలకు సంబంధించిన కంటెంట్, పిల్లలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన షాక్‌కు గురి చేసే కంటెంట్. 

ఉక్రెయిన్‌లో యుద్దానికి సంబంధించిన అప్‌డేట్‌లు (మార్చి 2022)

ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్దానికి సంబంధించి మేము అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ పేజీలో గైడ్‌లైన్స్‌ను పోస్ట్ చేశాము: 

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా, యుద్దాన్ని అనుకూలంగా ఉపయోగించుకునే, తోసిపుచ్చే, లేదా సమర్థించే కంటెంట్ తదుపరి నోటీసు వచ్చే వరకు మానిటైజేషన్‌కు అనర్హమైనది. ఈ అప్‌డేట్ ఈ యుద్దానికి సంబంధించి మా గైడెన్స్‌ను స్పష్టం చేయడానికి, అలాగే కొన్ని సందర్భాల్లో విస్తరించడానికి ఉద్దేశించబడింది.

2021

పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్‌కు సంబంధించిన అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (డిసెంబర్ 2021)

లింగ గుర్తింపు పరికరాలను ఫీచర్ చేస్తున్న కంటెంట్‌కు సంబంధించి మానిటైజేషన్ గైడెన్స్‌ను మేము అప్‌డేట్ చేశాము. లింగం, దానిపై కలిగే అసౌకర్య భావాలకు సంబంధించిన అంశాలను క్రియేటర్‌లు వివరించేటప్పుడు నగ్నత్వాన్ని చూపకుండా, వారికి సహాయపడే వక్షోజాలు లేదా పురుషాంగం వంటి జననేంద్రియాలను పోలి ఉండే వస్తువులను షోకేస్ చేసే అప్‌లోడ్‌లు యాడ్‌లను రన్ చేయవచ్చు.

హానికర లేదా ప్రమాదకర చర్యలకు సంబంధించిన అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (అక్టోబర్ 2021)

పాలసీకి సంబంధించిన ఈ భాగాలలో మరిన్ని స్పష్టమైన ఉదాహరణలను చేర్చడానికి మేము మా గైడ్‌లైన్స్‌ను అప్‌డేట్ చేశాము: పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్, హింస, దిగ్భ్రాంతి కలిగించే కంటెంట్, విద్వేషపూరితమైన, అమర్యాదకరమైన కంటెంట్, మారణాయుధాలకు సంబంధించిన కంటెంట్, సున్నితమైన అంశాలు, ఇంకా మత్తు పదార్థాలు, మత్తు పదార్థాల సంబంధిత కంటెంట్ విభాగాలు. గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి స్పష్టంగా తెలియజేయడానికి మేము కొత్త నిర్వచనాల విభాగాన్ని కూడా జోడించాము.

అదనంగా, మేము ఒక కొత్త గైడ్‌లైన్‌ను పరిచయం చేస్తున్నాము: నిజాయితీ లేని చర్యలను ప్రోత్సహించడం. ఇది అక్రమంగా ప్రవేశించడం, మోసం చేయడం, లేదా కంప్యూటర్ హ్యాకింగ్ (వ్యక్తిగతంగా చేసినది అయినా లేదా పెయిడ్ సర్వీస్ అయినా) వంటి చర్యలకు సంబంధించిన కంటెంట్ కోసం యాడ్ సర్వీస్ అర్హత గురించి గైడెన్స్‌ను అందిస్తుంది.

రివ్యూ చేయడాన్ని సులభతరం చేయడానికి ఇంతకుముందు వేరే పేజీలో ఉన్న COVID-19 సంబంధిత కంటెంట్ మానిటైజేషన్‌కు సంబంధించిన మా గైడెన్స్‌ను కూడా నేరుగా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు తరలిస్తున్నాము. మునుపటి పేజీకి వచ్చిన సందర్శనలు అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు మళ్లించబడతాయి.

అదే సమయంలో, ఈ పాలసీ అప్‌డేట్‌లను ప్రతిబింబించడానికి, గేమింగ్, మానిటైజేషన్ ఆర్టికల్ కూడా అప్‌డేట్ చేయబడింది.

హానికర లేదా ప్రమాదకర చర్యలకు సంబంధించిన అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (అక్టోబర్ 2021)

వాతావరణ మార్పు గురించి శాస్త్రీయంగా నిర్ణయించబడిన దానికి విరుద్ధంగా క్లెయిమ్‌లను ప్రమోట్ చేసే కంటెంట్‌లో యాడ్‌లు ప్రదర్శించబడకపోవచ్చని స్పష్టంగా తెలియజేయడానికి నవంబరులో వచ్చిన 'వాతావరణ మార్పు - తప్పుడు సమాచారా'నికి సంబంధించిన మానిటైజేషన్ గైడన్స్‌ను అప్‌డేట్ చేస్తున్నాము. దీని గురించిన విద్యా సంబంధితమైన, డాక్యుమెంటరీ లేదా వార్తా కంటెంట్‌లో యాడ్‌లను ప్రదర్శించడం కొనసాగవచ్చు.

ఈ అప్‌డేట్ గురించి మరింత సమాచారం కోసం Google Ads సహాయ కేంద్రాన్ని ఇక్కడ సందర్శించండి.

మారణాయుధాల సంబంధిత కంటెంట్‌కు సంబంధించిన అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (సెప్టెంబర్ 2021)

మారణాయుధాల సంబంధిత కంటెంట్‌కు సంబంధించిన మా ప్రస్తుత మానిటైజేషన్ గైడ్‌లైన్స్‌ను మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. నిర్వహణ కోసం ఆయుధాల విడిభాగాలను కలపడం లేదా విడదీయడం చూపించే వీడియోలలో యాడ్స్ ప్రదర్శించబడే అవకాశం ఉంది. మేము ఇతర రకాల మారణాయుధాలకు సంబంధించిన కంటెంట్ కోసం మా గైడ్‌లైన్స్‌ను కూడా బలోపేతం చేస్తున్నాము.

ఈ మార్పును ప్రతిబింబించేలా అక్టోబర్‌లో, అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ పేజీలో మారణాయుధాలకు సంబంధించిన కంటెంట్ కింద అప్‌డేట్ చేస్తాము.

హింసకు సంబంధించిన అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్‌లు (జూలై 2021)

మనుషుల కారణంగా బాధపడే జంతువులను చూపే ఫుటేజ్‌లో యాడ్‌లు ప్రదర్శించబడకపోవచ్చు అని స్పష్టంగా తెలియజేయడానికి మేము హింసకు సంబంధించిన మానిటైజేషన్ గైడెన్స్‌ను అప్‌డేట్ చేస్తున్నాము.

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌లో, అలాగే గేమింగ్ & మానిటైజేషన్ ఆర్టికల్స్‌లో పలు పాలసీల అప్‌డేట్‌లు (ఏప్రిల్ 2021)

క్రియేటర్‌ల నుండి, అడ్వర్టయిజర్‌ల నుండి అందిన సూచనల ఆధారంగా, అడ్వర్టయిజర్ ఇండస్ట్రీ స్టాండర్డ్‌లను నిర్వహించడం కొనసాగిస్తూనే, సంపూర్ణ మానిటైజేషన్ (ఆకుపచ్చ చిహ్నం) పరిధిలోకి మరింత కంటెంట్‌ను తెచ్చేందుకు వీలుగా మేము మా గైడ్‌లైన్స్‌ను అప్‌డేట్ చేశాము. 
 
ముందుగా, పోలీసులు లేదా ఇతర సాయుధ దళాలతో జరిగిన హింసాత్మక ఘర్షణలు, మత్తు పదార్థాలు, మత్తు పదార్థాల సంబంధిత కంటెంట్, లేదా సున్నితమైన అంశాలు ఉండే అవకాశం గల విద్యాపరమైన, డాక్యుమెంటరీ లేదా వార్తల కంటెంట్ విషయంలో, మేము మానిటైజేషన్‌ను విస్తరింపజేస్తున్నాము. అలాగే, వీడియోలో వివాదాస్పద టాపిక్‌లపై మరీ స్పష్టమైన వర్ణనలేవీ లేకుండా, వాస్తవాల ఆధారంగానే చర్చలు జరిపినట్లయితే, అలాంటి వివాదాస్పద టాపిక్‌లకు కూడా మేము మానిటైజేషన్‌ను విస్తరింపజేస్తున్నాము. 
 
రెండవది, హాస్యభరితమైన సందర్భంలో భాగంగా పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన అంశాలను ప్రస్తావించే (ఉదాహరణకు, రొమాన్స్, డేటింగ్ జోకులు), అలాగే మొదటి 30 సెకన్లలో కొద్దిపాటి అసభ్య పదజాలాన్ని ఉపయోగించే (ఉదాహరణకు, షిట్, బిచ్) సందర్భాలకు కూడా మేము మానిటైజేషన్‌ను విస్తరిస్తున్నాము.

అదనంగా, ఈ విభాగాలలో, వాటి గైడెన్స్‌ను స్పష్టంగా అర్థమయ్యేలా తెలపడానికి మేము మరిన్ని ఉదాహరణలను చేర్చాము: అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌లో పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్, హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యలు, తుపాకులకు సంబంధించిన విభాగాలు.
 
అదే సమయంలో ఈ పాలసీ అప్‌డేట్‌లను ప్రతిబింబించడానికి, గేమింగ్, మానిటైజేషన్ ఆర్టికల్‌లోని 'గేమింగ్ వీడియోలను మానిటైజ్ చేయడానికి సంబంధించిన చిట్కాల' విభాగం కూడా అప్‌డేట్ చేయబడింది.

అనుచితమైన భాష, హింస, మత్తు పదార్థాలు, మత్తు పదార్థాల సంబంధిత కంటెంట్ గైడ్‌లైన్స్‌కు సంబంధించిన గైడెన్స్ జోడింపులు, అలాగే COVID-19కు సంబంధించిన మా మానిటైజేషన్ పాలసీకి అప్‌డేట్ (ఫిబ్రవరి 2021)

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ ఆర్టికల్‌లో అనుచితమైన భాష, హింస, మత్తు పదార్థాలు, మత్తు పదార్థాల సంబంధిత కంటెంట్ గైడ్‌లైన్స్‌కు సంబంధించిన "ఈ కంటెంట్‌కు మీరు యాడ్‌లను ఆన్ చేయవచ్చు" విభాగాలలో ఇప్పుడు అదనపు ఉదాహరణలను చేర్చడం జరిగింది.

వ్యాక్సినేషన్‌కు సంబంధించిన కంటెంట్ గురించి మరింత గైడెన్స్‌ను అందించడానికి, COVID-19 కంటెంట్ విషయంలో మానిటైజేషన్ అప్‌డేట్ ఆర్టికల్‌తో పాటు మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌లోని హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యల విభాగాన్ని కూడా అప్‌డేట్ చేయడం జరిగింది.

గేమింగ్ కంటెంట్‌కు సంబంధించిన అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు మరింత సందర్భాన్ని అందించడానికి క్రియేట్ చేయబడిన కొత్త పేజీ (జనవరి 2021)

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌ను మరింత బాగా అర్థం చేసుకోవడంలో గేమింగ్ కంటెంట్‌ను రూపొందించే YouTube క్రియేటర్‌లకు సహాయపడటానికి, గేమింగ్ & మానిటైజేషన్ టాపిక్‌కు సంబంధించి అదనపు సందర్భాన్ని అందించే ఉద్దేశంతో మేము ఒక కొత్త పేజీని పబ్లిష్ చేశాము. 

ప్రత్యేకంగా గేమింగ్ కంటెంట్ విషయంలో మా గైడ్‌లైన్స్‌ను స్పష్టంగా తెలియజేసే ఉద్దేశంతో, అలాగే సొంత సర్టిఫికేషన్‌ను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో గేమింగ్ కంటెంట్‌ను రూపొందించే YouTube క్రియేటర్‌లకు సహాయపడే ఉద్దేశంతో ఈ కొత్త పేజీ క్రియేట్ చేయబడింది. 

పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మీకు ఎలాంటి మార్పూ కనిపించదని దీని అర్థం. 

మరింత సమాచారం, మరిన్ని ఉదాహరణలతో, అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌లోని పలు విభాగాలకు అప్‌డేట్‌లు, 'సొంత సర్టిఫికేషన్‌తో మీ కంటెంట్‌కు మీరే రేటింగ్ ఇవ్వడం' అనే ఆర్టికల్ ఇప్పుడు విస్మరించబడింది (జనవరి 2021)

సొంత సర్టిఫికేషన్‌కు సంబంధించిన అదనపు గైడెన్స్‌తో, మరిన్ని ఉదాహరణలతో, ఇప్పుడు అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ ఆర్టికల్ అప్‌డేట్ చేయబడింది. దీనికి అనుగుణంగా, 'సొంత సర్టిఫికేషన్‌తో మీ కంటెంట్‌కు మీరే రేటింగ్ ఇవ్వడం' అనే ఆర్టికల్ విస్మరించబడింది. 

పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్, విద్వేషపూరితమైన, అమర్యాదకరమైన కంటెంట్‌కు సంబంధించిన పాలసీల విషయంలో, "మీరు యాడ్‌లను ఆన్ చేయవచ్చు, కానీ సమ్మతి తెలిపే బ్రాండ్‌లు మాత్రమే యాడ్‌లను ప్రదర్శిస్తాయి" (పరిమిత యాడ్‌లు), అలాగే "ఈ కంటెంట్‌కు మీరు యాడ్‌లను ఆఫ్ చేయాలి" (యాడ్‌లు ప్రదర్శించబడవు) విభాగాలకు సంబంధించిన కొత్త, సమగ్రమైన ఉదాహరణలు, ఏ కంటెంట్ ఈ పరిధిలోకి వస్తుందో మరింతగా అర్థమయ్యేలా తెలియజేస్తాయి. పాలసీకి సంబంధించిన గైడెన్స్‌ను వివరణాత్మకంగా, పారదర్శకంగా అందిస్తున్నామని నిర్ధారించుకోవడానికి, సున్నితమైన అంశాలకు సంబంధించిన పాలసీని, అలాగే వివాదాస్పదమైన అంశాల పాలసీని మేము వేర్వేరుగా ఉంచాము. 

'పరిమిత యాడ్స్ లేదా యాడ్స్ ప్రదర్శించబడవు' పరిస్థితికి దారి తీసే అవకాశం ఉన్న కంటెంట్‌కు సంబంధించిన మరిన్ని ఉదాహరణలను చూపడానికి, హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యల పాలసీలకు కొంత సమాచారం జోడించబడింది. 

రెచ్చగొట్టే, కించపరిచే కంటెంట్, పొగాకు సంబంధిత కంటెంట్, ఫ్యామిలీ కంటెంట్‌లో పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన అంశాలకు సంబంధించిన పాలసీలలో ఒక కొత్త గమనిక జోడించబడింది, ఇవి YouTube Studioలోని సొంత సర్టిఫికేషన్ ప్రశ్నావళిలో ఉన్న ఇతర పాలసీలతో కలిపి అందించబడ్డాయని పాఠకులకు తెలియజేయడానికి ఇలా జోడించడం జరిగింది.

పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మీకు ఎలాంటి మార్పూ కనిపించదని దీని అర్థం.

2020

మరింత సమాచారం, మరిన్ని ఉదాహరణలతో, 'సొంత సర్టిఫికేషన్‌తో మీ కంటెంట్‌కు మీరే రేటింగ్ ఇవ్వడం'లోని పలు విభాగాలకు అప్‌డేట్‌లు (అక్టోబర్ 2020)

సొంత సర్టిఫికేషన్‌తో మీ కంటెంట్‌కు మీరే రేటింగ్ ఇవ్వడం అనే ఆర్టికల్‌లో, హింస, అలాగే పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్‌కు సంబంధించిన పాలసీల విషయంలో, "ఈ కంటెంట్‌కు మీరు యాడ్‌లను ఆన్ చేయవచ్చు" విభాగంలో, ఏ కంటెంట్ ఈ పరిధిలోకి వస్తుంది అన్నది స్పష్టంగా తెలియజేయడానికి, ఇప్పుడు మరిన్ని సమగ్రమైన ఉదాహరణలు చేర్చబడ్డాయి. 'వివాదాస్పదమైన అంశాలు, అలాగే సున్నితమైన అంశాలు' విభాగంలో, మేము "సున్నితమైన అంశాలు", అలాగే "ఫోకస్"కు సంబంధించిన నిర్వచనాన్ని కూడా స్పష్టంగా అందించాము.

మానసిక క్షోభకు గురి చేసే విధంగా ఉండే ప్రాంక్‌లకు సంబంధించిన మరిన్ని ఉదాహరణలను చూపడానికి, అలాగే తరచుగా తీవ్రమైన అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం అనేది 'పరిమిత యాడ్‌లు లేదా యాడ్‌లు ప్రదర్శించబడవు' పరిస్థితికి దారి తీసే అవకాశం ఉందని స్పష్టంగా తెలియజేయడానికి, హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యలు, ఇంకా అనుచితమైన భాషల విభాగాలకు కొంత సమాచారం జోడించబడింది. 

పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మీకు ఎలాంటి మార్పూ కనిపించదని దీని అర్థం.

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు ప్రత్యేకంగా వార్తలకు సంబంధించిన గైడెన్స్ జోడింపు (ఆగస్ట్ 2020)

కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన వార్తల రిపోర్టింగ్‌ను మా పాలసీలు ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని చేర్చడానికి, హింస,వివాదాస్పదమైన అంశాలు, అలాగే సున్నితమైన అంశాల గైడ్‌లైన్స్‌ను మేము మరింత స్పష్టంగా అందిస్తాము. 

ఈ అప్‌డేట్ ఆగస్ట్‌లో అమలు చేయబడుతుంది.

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు దిగ్భ్రాంతి కలిగించే కంటెంట్ జోడింపు (ఆగస్ట్ 2020)

దిగ్భ్రాంతి కలిగించే కంటెంట్‌కు సంబంధించిన గైడ్‌లైన్, ప్రస్తుత పాలసీని స్పష్టంగా తెలియజేస్తుంది, అలాగే వీక్షకులకు బాధ కలిగించే, జుగుప్స కలిగించే లేదా దిగ్భ్రాంతి కలిగించే అవకాశమున్న కంటెంట్‌పై ఫోకస్ చేస్తుంది. ఏ కంటెంట్‌లో అయితే యాడ్‌లను ప్రదర్శించడం సాధ్యపడదో, అలాంటి కంటెంట్ గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడంలో క్రియేటర్‌కు సహాయపడటానికి, రిసోర్స్‌లలో మేము ఈ మార్పు చేస్తున్నాము.

సొంత సర్టిఫికేషన్ ప్రశ్నావళికి ఒక కొత్త విభాగం జోడించబడుతుంది. క్రియేటర్ కమ్యూనిటీకి వీలైనన్ని వివరాలను అందించడానికి, అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు, అలాగే సొంత సర్టిఫికేషన్‌తో మీ కంటెంట్‌కు మీరే రేటింగ్ ఇవ్వడం అనే ఆర్టికల్‌కు కూడా ఆగస్ట్‌లో అప్‌డేట్‌లను జోడించడం జరుగుతుంది. 

పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మీకు ఎలాంటి మార్పూ కనిపించదని దీని అర్థం.

అనుచితమైన భాషకు అప్‌డేట్‌లు (జూన్ 2020)

అనుచితమైన భాషా ఫలితాలను సెన్సార్ చేసే ఉద్దేశంతో టైటిల్ లేదా థంబ్‌నెయిల్‌లో అసభ్య పదజాలాన్ని తప్పుగా రాస్తే, అది 'పరిమిత యాడ్‌లు లేదా యాడ్‌లు ప్రదర్శించబడవు' పరిస్థితికి దారి తీస్తుందని స్పష్టంగా తెలియజేయడానికి ఈ విభాగంలో పదజాలం సవరించబడింది. అప్‌డేట్ చేసిన భాషను క్రియేటర్‌లు ఇక్కడ రివ్యూ చేయగలరు.  

పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మీకు ఎలాంటి మార్పూ కనిపించదని దీని అర్థం.

'సొంత సర్టిఫికేషన్‌తో మీ కంటెంట్‌కు మీరే రేటింగ్ ఇవ్వడం' అనే అంశానికి సంబంధించిన అప్‌డేట్‌లు (మే 2020)

మీ ఖాతాలో ఉండే ప్రశ్నావళిలో అందించబడిన ఆప్షన్‌లలో, ఒక్కో ఆప్షన్ కిందకు వచ్చే కంటెంట్ రకాలకు సంబంధించిన ఉదాహరణలు ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో చేర్చబడ్డాయి. ప్రశ్నావళి అంతటా ప్రస్తావించబడిన ముఖ్యమైన కాన్సెప్ట్‌లకు (ఉదాహరణకు, నగ్నత్వం) సంబంధించిన నిర్వచనాలను కూడా మేము చేర్చాము.

పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మీకు ఎలాంటి మార్పూ కనిపించదని దీని అర్థం.

COVID-19కు సంబంధించిన అప్‌డేట్‌లు (ఏప్రిల్ 2020)

మా అడ్వర్టయిజర్-ఫ్రెండ్లీ గైడ్‌లైన్స్‌ను, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతూ, COVID-19ను రెఫర్ చేసే కంటెంట్‌ను మరియు/లేదా ఫీచర్ చేసే కంటెంట్‌ను ఇప్పుడు మానిటైజ్ చేసుకోవచ్చు (దీనికి ఆకుపచ్చ చిహ్నం కనిపిస్తుంది). COVID-19 కంటెంట్‌ను మానిటైజ్ చేయడం గురించి మరింత వివరణాత్మక గైడెన్స్‌ను ఇక్కడ పొందండి.

వివాదాస్పదమైన అంశాలు, సున్నితమైన అంశాలు, అలాగే అనుచితమైన భాషకు అప్‌డేట్‌లు (ఫిబ్రవరి 2020)

ఈ ఆర్టికల్‌లో ఇప్పుడు వివాదాస్పదమైనవిగా పరిగణించబడే అంశాలకు సంబంధించిన మరింత సమగ్రమైన లిస్ట్, అలాగే సున్నితమైన అంశాలను మేము ఎలా నిర్వచిస్తాం అనే దానికి సంబంధించిన వివరణ చేర్చబడింది. అనుచితమైన భాషకు సంబంధించిన మా గైడ్‌లైన్స్‌ను కూడా మేము స్పష్టం చేశాము.

పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మార్పు ఉంటుందని మీరు భావించవలసిన అవసరం లేదు.

2019

అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అప్‌డేట్ (జూన్ 2019)

ఈ ఆర్టికల్‌లో ఇప్పుడు 'పరిమిత యాడ్‌లు లేదా యాడ్‌లు ప్రదర్శించబడవు' పరిస్థితికి దారి తీసే కంటెంట్‌కు సంబంధించి మరిన్ని ఉదాహరణలు చేర్చబడ్డాయి. 

పాలసీలో ఎలాంటి మార్పులూ జరగలేదు, అంటే అడ్వర్టయిజర్ అనుకూలత విషయంలో మీ వీడియోలను చెక్ చేసే విధానంలో మార్పు ఉంటుందని మీరు భావించవలసిన అవసరం లేదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13156919119125796913
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false