వీడియో టైటిల్స్, వివరణల్లో ఛానెల్స్‌ను పేర్కొనండి

మీరు మరొక ఛానెల్ పేరును లేదా హ్యాండిల్‌ను మీ వీడియో టైటిల్ లేదా వివరణలో చేర్చేందుకు ప్రస్తావనలు అనుమతిస్తాయి. మీరు మరొక ఛానెల్‌ను పేర్కొన్నప్పుడు, వారి ఇన్‌బాక్స్‌లో వారికి ఒక నోటిఫికేషన్ అందుతుంది – మరింత తెలుసుకోండి.

వేరొకరి వీడియోలో మీ ఛానెల్ పేరును లేదా హ్యాండిల్‌ను పేర్కొన్నంత మాత్రాన, వారి వీడియో మీ ఫ్యాన్స్‌కు కనిపించే అవకాశమేమీ పెరగదు.

మరొక క్రియేటర్‌ను పేర్కొనండి

మీరు వీడియో టైటిల్ లేదా వివరణను క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రస్తావనను జోడించడానికి:

  1. "@" చిహ్నం తర్వాత ఛానెల్ పేరు లేదా హ్యాండిల్‌ను టైప్ చేయండి.
  2. సిఫార్సు చేసిన లిస్ట్ నుండి ఛానెల్ పేరును లేదా హ్యాండిల్‌ను ఎంచుకోండి.

వారి పేర్లు అక్షరాల పరిమితిలో ఉన్నంత వరకు మీరు ఎంత మంది క్రియేటర్‌లను అయినా పేర్కొనవచ్చు.

మీ ఛానెల్ ప్రస్తావనలను కనుగొనండి

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, కామెంట్‌లను ఎంచుకోండి.
  3. ప్రస్తావనల ట్యాబ్‌ను ఎంచుకోండి.
క్రియేటర్‌ల కోసం ఉద్దేశించిన సహకార చిట్కాలను పొందండి.

పేర్కొనడానికి సంబంధించిన నోటిఫికేషన్‌లను మార్చండి

ప్రతీ ప్రస్తావనా నోటిఫికేషన్‌ను ట్రిగ్గర్ చేయదు. ముఖ్యమైనవి, అంటే మీకున్న సంఖ్యలోనే సబ్‌స్క్రయిబర్‌లు ఉన్న క్రియేటర్ మిమ్మల్ని పేర్కొనడం వంటి సందర్భాలలో, మీరు నోటిఫికేషన్ పొందుతారు.

నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత సమాచారం కోసం, 'YouTube నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయండి'ని చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4996050330713554211
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false