సూపర్ థ్యాంక్స్‌ను కొనుగోలు చేయండి

గమనిక: YouTube Android యాప్‌లో చేసిన కొన్ని కొత్త సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, లేదా సూపర్ థ్యాంక్స్ కొనుగోళ్లకు Google Play ద్వారా బిల్ చేయబడుతుంది. ఈ మార్పు అనేది రేట్ లేదా ధరపై ప్రభావం చూపదు, కొనుగోలుకు సంబంధించి బిల్ ఎక్కడి నుండి అయితే చేయబడుతుందో, దానిపై మాత్రమే ప్రభావం చూపుతుంది. మీరు కొత్త ఛార్జీలను చూడటానికి, మీకు ఎలా బిల్లు విధించబడుతుందో చెక్ చేయడానికి pay.google.com‌కు వెళ్లవచ్చు.

సూపర్ థ్యాంక్స్‌తో మీకు నచ్చిన క్రియేటర్‌ల కంటెంట్ పట్ల అదనపు కృతజ్ఞతను చూపి, వారి కామెంట్‌ల విభాగంలో మీరు ప్రత్యేకంగా నిలవవచ్చు. సూపర్ థ్యాంక్స్, సరదా అయిన, వన్-టైమ్ యానిమేషన్‌ను కొనుగోలు చేసే వీలును మీకు కల్పిస్తుంది, ఆ యానిమేషన్ నిడివి ఎక్కువ ఉన్న వీడియోలో లేదా షార్ట్‌లో ఎగువన మీకు మాత్రమే చూపబడుతుంది. అదనపు బోనస్‌గా, కామెంట్‌ల విభాగంలో ఒక విభిన్నమైన, రంగురంగుల, అనుకూలంగా మార్చుకోదగిన కామెంట్‌ను మీరు పొందుతారు. మీరు ఎంచుకోవడానికి వీలుగా సూపర్ థ్యాంక్స్ విభిన్న ధరలలో అందుబాటులో ఉంటుంది.

అర్హత ఉన్న వీడియోలలో సూపర్ థ్యాంక్స్‌ను కొనుగోలు చేయడానికి, మీరు తప్పకుండా అది అందుబాటులో ఉన్న లొకేషన్‌లలో ఒక దానిలో ఉండాలి.

How to buy Super Thanks

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
 

సూపర్ థ్యాంక్స్‌ను కొనుగోలు చేయండి

  1. కంప్యూటర్‌ను ఉపయోగించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను తెరవండి.
  2. నిడివి ఎక్కువ ఉన్న వీడియో కింద, సూపర్ థ్యాంక్స్ ను ఎంచుకోండి.
  3. మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ఎంచుకోండి.
    • ఒక్కో యానిమేషన్‌కు ఒక్కో ధర ఉంటుంది. మీరు ఎక్కువ పే చేస్తే, మీరు మరింత విస్తృతమైన సూపర్ థ్యాంక్స్ యానిమేషన్‌ను పొందుతారు.
    • అదనపు బోనస్‌గా, ఒక విభిన్నమైన, రంగురంగుల, అనుకూలంగా మార్చుకోదగిన కామెంట్‌ను కూడా మీరు పొందుతారు. మీ సూపర్ థ్యాంక్స్ కామెంట్‌ను అనుకూలంగా మార్చడానికి, టెక్స్ట్ బాక్స్‌ను క్లిక్ చేయండి. మీ కామెంట్ పబ్లిష్ అయిన తర్వాత కూడా మీరు దానిని ఎడిట్ చేయవచ్చు.
  4. కొనుగోలు చేసి, పంపండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. కొనుగోలును పూర్తి చేయడానికి, స్క్రీన్ పై సూచనలను ఫాలో అవ్వండి.

మీరు సూపర్ థ్యాంక్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత, మీ కామెంట్ అనేది దాని పక్కన రంగురంగుల చిప్‌తో కామెంట్‌ల విభాగంలో పోస్ట్ చేయబడుతుంది. మీ కొనుగోలు మొత్తం మీ కామెంట్‌లో పబ్లిక్‌గా కనిపిస్తుంది.

గమనికలు:
  • మీ సూపర్ థ్యాంక్స్ కామెంట్, ఛానెల్ పేరు, ప్రొఫైల్ ఫోటో, కొనుగోలు మొత్తం పబ్లిక్‌కు కనిపిస్తాయి. ఈ సమాచారం మా YouTube Data API సర్వీస్ ద్వారా ఛానెల్‌కు కూడా అందుబాటులో ఉండవచ్చు, అలాగే వారు ఈ సమాచారాన్ని థర్డ్-పార్టీ సర్వీస్‌లతో షేర్ చేయవచ్చు.
  • YouTubeలోని అన్నింటిలాగే, మీరు పంపే సూపర్ థ్యాంక్స్ కూడా తప్పకుండా మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి.

సూపర్ థ్యాంక్స్‌కు సంబంధించిన కొనుగోలు పరిమితులు

కింద షేర్ చేసిన పరిమితులకు లోబడి, ఒకే వీడియోలో మీరు కావలసినన్ని సార్లు సూపర్ థ్యాంక్స్‌ను కొనుగోలు చేయవచ్చు.
మీ దేశం/ప్రాంతాన్ని బట్టి రోజువారీ, వారంవారీ కొనుగోలు పరిమితి మారుతూ ఉంటుంది. సాధారణంగా, మీరు రోజుకు గరిష్ఠంగా $500 USD, లేదా వారానికి గరిష్ఠంగా $2,000 USD (లేదా మీ లోకల్ కరెన్సీలో వీటికి సమానమైన అమౌంట్)ను వీటి కోసం ఖర్చు చేయవచ్చు:
  • సూపర్ చాట్‌లు
  • సూపర్ స్టిక్కర్స్
  • సూపర్ థ్యాంక్స్
  • మొత్తం 3 కలిపి

సూపర్ థ్యాంక్స్‌కు సంబంధించిన రీఫండ్‌లు

సూపర్ థ్యాంక్స్ స్వచ్ఛంద పేమెంట్‌ల విషయంలో రీఫండ్ సదుపాయం ఉండదు. మరింత సమాచారం కోసం మీరు YouTube రీఫండ్ పాలసీలను చూడవచ్చు. మీకు సమస్య ఉంటే లేదా పేమెంట్ గురించి ఏవైనా సందేహాలు ఉంటే, మా సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి.
YouTubeలో అన్నింటిలాగానే, మీరు సూపర్ థ్యాంక్స్ కామెంట్‌లను పోస్ట్ చేసేటప్పుడు తప్పకుండా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి. మీ సూపర్ థ్యాంక్స్ కామెంట్ తొలగించబడినా, నియంత్రించబడినా, లేదా తీసివేయబడినా, మీకు రీఫండ్ లభించదు. 

సూపర్ థ్యాంక్స్ కామెంట్‌లు

మీరు సూపర్ థ్యాంక్స్‌ను కొనుగోలు చేసినప్పుడు, ఒక విభిన్నమైన, రంగురంగుల, అనుకూలంగా మార్చుకోదగిన కామెంట్‌ను అదనపు బోనస్‌గా మీరు పొందుతారు. మీ సూపర్ థ్యాంక్స్‌ను అనుకూలంగా మార్చుకోవడానికి, ఆటోమేటిక్‌గా పంపే SMS పక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్‌ను లేదా ఎడిట్ చేయండి ని క్లిక్ చేయండి. సూపర్ థ్యాంక్స్ కామెంట్‌లు అనేవి మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను తప్పకుండా ఫాలో అవ్వాలని గుర్తుంచుకోండి. 

మీరు మీ కొనుగోలును పూర్తి చేసిన తర్వాత, మీ కామెంట్ అనేది దాని పక్కన రంగురంగుల చిప్‌తో కామెంట్‌ల విభాగంలో పోస్ట్ చేయబడుతుంది. మీరు ఖర్చు చేసిన మొత్తం, అలాగే మీ కామెంట్ పబ్లిక్‌గా కనిపిస్తాయి. మీరు కావాలనుకుంటే, పోస్ట్ చేసిన తర్వాత మీ కామెంట్‌ను తొలగించవచ్చు

మీ సూపర్ థ్యాంక్స్ కోసం మీరు పేమెంట్ చేసిన తర్వాత, కొనుగోలు చేసిన దానికి రికార్డ్‌గా మేము మీకు ఒక రసీదును పంపుతాము.

కామెంట్‌ల నియంత్రణ

సూపర్ థ్యాంక్స్ కామెంట్‌లు మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను తప్పకుండా ఫాలో అవ్వాలి. క్రియేటర్‌లు, అలాగే YouTube ఇద్దరూ టెక్స్ట్‌లు, గ్రాఫిక్స్‌తో సహా కామెంట్‌లను నియంత్రించగలరు. నియంత్రించబడిన కామెంట్‌లు ఎప్పుడైనా, ఏ కారణంతో అయినా, అలాగే నోటీస్ లేకుండానే తొలగించబడవచ్చు. పోస్ట్ చేసిన తర్వాత మీ కామెంట్‌ను మీరు తొలగించవచ్చని గుర్తుంచుకోండి.
మీ సూపర్ థ్యాంక్స్ కామెంట్ తొలగించబడినా, నియంత్రించబడినా, లేదా తీసివేయబడినా, మీకు రీఫండ్ లభించదు. సూపర్ థ్యాంక్స్ స్వచ్ఛంద పేమెంట్‌ల విషయంలో రీఫండ్ సదుపాయం ఉండదని గుర్తుంచుకోండి. మా పాలసీలను ఉల్లంఘించిన కారణంగా మీ సూపర్ థ్యాంక్స్ కామెంట్ తీసివేయబడితే, దాని ద్వారా వచ్చిన ఆదాయంలో మా భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు YouTube విరాళంగా ఇస్తుంది.

సూపర్ థ్యాంక్స్ లభ్యత, పాలసీలు

సూపర్ థ్యాంక్స్ అందుబాటులో ఉన్న లొకేషన్‌లు
మీరు కింద పేర్కొన్న లొకేషన్‌లలోని మొబైల్ పరికరాలు లేదా కంప్యూటర్‌లలో సూపర్ థాంక్స్‌ను కొనుగోలు చేయవచ్చు:
  • అల్జీరియా
  • అమెరికన్ సమోవా
  • అర్జెంటీనా
  • అరుబా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • బహ్రెయిన్
  • బెలారస్
  • బెల్జియం
  • బెర్ముడా
  • బొలీవియా
  • బోస్నియా & హెర్జిగోవినా
  • బ్రెజిల్
  • బల్గేరియా
  • కెనడా
  • కేమాన్ దీవులు
  • చిలీ
  • కొలంబియా
  • కోస్టారికా
  • క్రొయేషియా
  • సైప్రస్
  • చెక్ రిపబ్లిక్
  • డెన్మార్క్
  • డొమినికన్ రిపబ్లిక్
  • ఈక్వెడార్
  • ఈజిప్ట్
  • ఎల్ సాల్వడోర్
  • ఎస్టోనియా
  • ఫిన్లాండ్
  • ఫ్రాన్స్
  • ఫ్రెంచ్ గీయానా
  • ఫ్రెంచ్ పాలినేషియా
  • జర్మనీ
  • గ్రీస్
  • గ్వాడెలోప్
  • గ్వామ్
  • గ్వాటెమాలా
  • హోండురస్
  • హాంకాంగ్
  • హంగేరి
  • ఐస్‌ల్యాండ్
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్
  • ఇజ్రాయిల్
  • ఇటలీ
  • జపాన్
  • జోర్డాన్
  • కెన్యా
  • కువైట్
  • లాత్వియా
  • లెబనాన్
  • లిచెన్‌స్టెయిన్
  • లిథువేనియా
  • లక్సెంబర్గ్
  • మలేషియా
  • మాల్టా
  • మెక్సికో
  • మొరాకో
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • నికరాగువా
  • నైజీరియా
  • ఉత్తర మాసిడోనియా
  • ఉత్తర మారియానా దీవులు
  • నార్వే
  • ఒమన్
  • పనామా
  • పాపువా న్యూ గినియా
  • పరాగ్వే
  • పెరూ
  • ఫిలిప్పీన్స్
  • పోలండ్
  • పోర్చుగల్
  • ప్యూర్టోరికో
  • ఖతార్
  • రొమేనియా
  • సౌదీ అరేబియా
  • సెనెగల్
  • సెర్బియా
  • సింగపూర్
  • స్లోవేకియా
  • స్లోవేనియా
  • దక్షిణాఫ్రికా
  • దక్షిణ కొరియా
  • స్పెయిన్
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • థాయ్‌లాండ్
  • టర్కీ
  • టర్క్స్ మరియు కైకోస్ దీవులు
  • ఉగాండా
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్
  • ఉరుగ్వే
  • U.S. వర్జిన్ దీవులు
  • వియత్నాం

సూపర్ థ్యాంక్స్ పాలసీలు

YouTubeలో అన్నింటిలాగానే, మీరు సూపర్ థ్యాంక్స్ కామెంట్‌లను పంపుతున్నప్పుడు తప్పకుండా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి. మీ సూపర్ థ్యాంక్స్ కామెంట్ తొలగించబడినా, నియంత్రించబడినా, లేదా తీసివేయబడినా, మీకు రీఫండ్ లభించదు. మా పాలసీలను ఉల్లంఘించిన కారణంగా మీ సూపర్ థ్యాంక్స్ కామెంట్ నియంత్రించబడితే, తీసివేయబడితే, దాని ద్వారా వచ్చిన ఆదాయంలో మా భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు YouTube విరాళంగా ఇస్తుంది.
YouTube సర్వీస్ నియమాల ప్రకారం వర్తించే అన్ని చట్టాలకు కూడా మీరు కట్టుబడి ఉండాలి. సూపర్ థ్యాంక్స్ అనేది ప్రజల నుండి సేకరించే నిధి లేదా విరాళంతో కొనుగోలు చేసే టూల్ కాదని గుర్తుంచుకోండి. సూపర్ థ్యాంక్స్‌పై మీరు ఖర్చు చేసే డబ్బు మీకు, మీ యాక్టివిటీలకు వర్తించే చట్టాల ఆధారంగా భిన్నంగా పరిగణించబడుతుంది. సూపర్ థ్యాంక్స్‌ను మీరు కొనుగోలు చేయగలరా లేదా అనే దానితో సహా అన్ని వర్తించే చట్టాలను అర్థం చేసుకోవడం, అలాగే పూర్తిగా పాటించడం మీ బాధ్యత.

సూపర్ థ్యాంక్స్‌కు సంబంధించిన క్రియేటర్ ఆదాయం

స్థానిక సేల్స్ ట్యాక్స్‌ను, ఇంకా iOSలో వర్తించే App Store ఫీజులను డిడక్ట్ చేసిన తర్వాత, Google గుర్తించే సూపర్ థ్యాంక్స్ ఆదాయంలో క్రియేటర్‌లకు 70% అందుతుంది. క్రెడిట్ కార్డ్ ఫీజులతో సహా లావాదేవీల ఖర్చులను ప్రస్తుతం YouTube కవర్ చేస్తోంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2220459917637077749
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false