వీక్షణ హిస్టరీని చూడండి, తొలగించండి, లేదా దానిని ఆన్ గాని, ఆఫ్ గాని చేయండి

YouTube వీక్షణ హిస్టరీ, మీరు ఇటీవల చూసిన వీడియోలను కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది. దానిని ఆన్ చేసినప్పుడు, సందర్భోచితమైన వీడియో సిఫార్సులను అందించడానికి మమ్మల్ని అనుమతిస్తుంది. హిస్టరీని తొలగించడం లేదా ఆఫ్ చేయడం ద్వారా వీక్షణ హిస్టరీని మీరు కంట్రోల్ చేయవచ్చు. మీరు వీక్షణ హిస్టరీలో కొంత భాగాన్ని లేదా మొత్తాన్ని తొలగిస్తే, భవిష్యత్తు వీడియో సిఫార్సులను YouTube ఆ కంటెంట్ ఆధారంగా చేయదు. హిస్టరీ ఆఫ్‌లో ఉన్నప్పుడు మీరు చూసే వీడియోలు ఏవీ మీ హిస్టరీలో కనిపించవు.

వీక్షణ హిస్టరీని చూడండి

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. myactivity.google.com లింక్‌కు వెళ్లండి.
  3. YouTube హిస్టరీని క్లిక్ చేయండి.
  4. మీరు చూసిన వీడియోలను చూడటానికి హిస్టరీని మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
గమనిక: మీరు సైన్ అవుట్ చేసిన సమయంలో మీ వీక్షణ హిస్టరీని చూడలేరు.

వీక్షణ హిస్టరీని తొలగించండి

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి. 
  2. myactivity.google.com లింక్‌కు వెళ్లండి.
  3. YouTube హిస్టరీని క్లిక్ చేయండి.
  4. హిస్టరీని మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  5. మీరు తొలగించాలనుకుంటున్న వీడియోలకు సంబంధించిన టైమ్‌ఫ్రేమ్‌ను ఎంచుకోవడానికి తొలగించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీరు YouTube నుండి నేరుగా హిస్టరీ ట్యాబ్‌కు వెళ్తే, మీ వీక్షణ హిస్టరీని క్లియర్ చేసేందుకు వీలు కల్పించడం కోసం ఉన్న ఈ ఆప్షన్‌ను కూడా మీరు చూడవచ్చు.

అంతకు ముందు మీకు తగినంత వీక్షణ హిస్టరీ లేకపోతే, YouTube హోమ్ పేజీలోని సిఫార్సుల వంటి వీడియో సిఫార్సులను అందించడం కోసం మీ వీక్షణ హిస్టరీపై ఆధారపడే YouTube ఫీచర్‌లు తీసివేయబడతాయి. ఉదాహరణకు, మీరు ఏ వీడియోలనూ చూడని కొత్త యూజర్ అయితే లేదా మీ వీక్షణ హిస్టరీని క్లియర్ చేసి, దానిని ఆఫ్ చేయడానికి మీరు ఎంచుకుంటే ఇది వర్తిస్తుంది.

వీక్షణ హిస్టరీని ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. myactivity.google.com లింక్‌కు వెళ్లండి.
  3. YouTube హిస్టరీని క్లిక్ చేయండి.
  4. ఆన్ చేయండిని కానీ లేదా ఆఫ్ చేయండిని కానీ క్లిక్ చేయండి.

ఈ పేజీలో, మీ వీక్షణ హిస్టరీ ఆన్‌లో ఉన్నప్పుడు మీరు అందులో ఏమి చేర్చాలనుకుంటున్నారో కూడా ఎంచుకోవచ్చు. ఆప్షన్‌ల లిస్ట్ నుండి ఎంచుకోవడం ద్వారా, మీరు వీటిని ఎంచుకోవచ్చు:

గమనిక: మీరు YouTube నుండి నేరుగా హిస్టరీ ట్యాబ్‌కు వెళ్తే, మీ వీక్షణ హిస్టరీని పాజ్ చేసేందుకు వీలు కల్పించడం కోసం ఉన్న ఈ ఆప్షన్ కూడా మీకు కనిపించవచ్చు.

వీక్షణ హిస్టరీ నుండి వీడియోను తీసివేయండి

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. myactivity.google.com లింక్‌కు వెళ్లండి.
  3. YouTube హిస్టరీని క్లిక్ చేయండి.
  4. హిస్టరీని మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  5. మీరు తీసివేయాలనుకుంటున్న వీడియో పక్కన ఉన్న  తొలగించండి బటన్‌ను క్లిక్ చేయండి.
గమనిక: మీ పరికరం ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు మీరు మీ వీక్షణ హిస్టరీ నుండి ఏవైనా వీడియోలను తీసివేస్తే, ఆ మార్పులు చేయడానికి కొన్ని గంటలు పట్టవచ్చు.

వీక్షణ హిస్టరీని సెర్చ్ చేయండి

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. myactivity.google.com లింక్‌కు వెళ్లండి.
  3. YouTube హిస్టరీని క్లిక్ చేయండి.
  4. హిస్టరీని మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  5. సెర్చ్ ను క్లిక్ చేయండి.

మీ YouTube హిస్టరీని ఆటోమేటిక్‌గా తొలగించండి

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. myactivity.google.com లింక్‌కు వెళ్లండి.
  3. YouTube హిస్టరీని క్లిక్ చేయండి.
  4. హిస్టరీని మేనేజ్ చేయండిని క్లిక్ చేయండి.
  5. ఆటోమేటిక్ తొలగింపును క్లిక్ చేయండి.
  6. మీ ప్రాధాన్య సమయ పరిధిని ఎంచుకుని, 'తర్వాత'ను క్లిక్ చేయండి.
  7. పూర్తయినప్పుడు నిర్ధారించండిని క్లిక్ చేయండి.

TV, గేమ్ కన్సోల్, లేదా మీడియా స్ట్రీమింగ్ బాక్స్

మీ వీక్షణ హిస్టరీని పాజ్ చేయండి

  1. ఎడమ వైపు ఉండే మెనూలో, సెట్టింగ్‌లు కు వెళ్లండి.
  2. వీక్షణ హిస్టరీని పాజ్ చేయండిని ఎంచుకోండి.
  3. వీక్షణ హిస్టరీని పాజ్ చేయండి బటన్‌ను ఎంచుకోండి.

మీ వీక్షణ హిస్టరీని క్లియర్ చేయండి

  1. ఎడమ వైపు ఉండే మెనూలో, సెట్టింగ్‌లు కు వెళ్లండి.
  2. వీక్షణ హిస్టరీని క్లియర్ చేయండిని ఎంచుకోండి.
  3. వీక్షణ హిస్టరీని క్లియర్ చేయండి బటన్‌ను ఎంచుకోండి.

సైన్ అవుట్ అయి ఉన్నప్పుడు వీక్షణ హిస్టరీని పాజ్ చేయండి, క్లియర్ చేయండి

మీరు సైన్ అవుట్ చేసి ఉన్నప్పుడు కూడా, ఆ పరికరంలో మీరు చూసే వీడియోల ఆధారంగా YouTube మీ సిఫార్సులను మెరుగుపరుస్తుంది.

సైన్ అవుట్ చేసినప్పుడు మీ వీక్షణ హిస్టరీని ఆఫ్ చేయడానికి లేదా తొలగించడానికి:

  1. YouTubeకు వెళ్లండి.
  2. హిస్టరీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. వీక్షణ హిస్టరీని అంతటినీ క్లియర్ చేయండి లేదా వీక్షణ హిస్టరీని పాజ్ చేయండిని ఎంచుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15342141825470619705
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false