YouTube BrandConnectను ప్రారంభించండి

YouTube BrandConnect అనేది క్రియేటర్‌లకు బ్రాండెడ్ కంటెంట్ క్యాంపెయిన్‌లకు సంబంధించిన అవకాశాలను అందించే సెల్ఫ్-సర్వీస్ ప్లాట్‌ఫామ్. బ్రాండ్‌లు తమ బ్రాండెడ్ కంటెంట్ క్యాంపెయిన్‌లను ఎగ్జిక్యూట్ చేయడానికి, అలాగే తమతో పని చేయగల క్రియేటర్‌లను గుర్తించడానికి, మా యాజమాన్య ఇన్‌ఫ్లూయెన్సర్ డ్యాష్‌బోర్డ్‌ను ఉపయోగించవచ్చు.

క్రియేటర్‌ల కోసం YouTube BrandConnect ప్లాట్‌ఫారమ్ ఫీచర్‌లు:

  • మీ ప్రాధాన్యతలకు తగిన విధంగా ఉండే బ్రాండెడ్ కంటెంట్ క్యాంపెయిన్‌లపై పని చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశాలు
  • క్యాంపెయిన్‌లను మేనేజ్ చేయడానికి YouTube Studioలో సెల్ఫ్-సర్వీస్ టూల్స్
  • మీ ఛానెల్‌కు అనుగుణమైన ప్రేక్షకుల గణాంకాలతో అనుకూలంగా మార్చి అందించబడే మీడియా కిట్, దీని సాయంతో బ్రాండ్‌లకు మిమ్మల్ని మీరే సూచించుకొని, డీల్స్‌ను సంపాదించవచ్చు. మీ మీడియా కిట్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
  • మీకు గైడెన్స్‌ను అందించడంలో సహాయపడే బెస్ట్ ప్రాక్టీసులు, రిసోర్స్‌లు

YouTube BrandConnectతో, మీరు మీ క్యాంపెయిన్‌లను సమర్థవంతంగా మేనేజ్ చేయవచ్చు, క్రియేటివ్ కంట్రోల్‌ను కొనసాగించవచ్చు, అలాగే ఎవరితో పని చేయాలో ఎంచుకోవచ్చు.

లభ్యత, అలాగే కావలసిన అర్హతలు

YouTube BrandConnect బీటా దశలో ఉంది, ఇది ఈ సమయంలో ఈ దేశాలు/ప్రాంతాలలో ఏదైనా ఒక దానిలో ఉన్న అర్హత ఉన్న క్రియేటర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

YouTube BrandConnect ప్లాట్‌ఫామ్‌లో పాల్గొనాలంటే, మీ ఛానెల్ తప్పనిసరిగా ఈ కనీస కావలసిన అర్హతలకు అనుగుణంగా ఉండాలి:

మీ ఛానెల్ తప్పనిసరిగా వీటితో పాటు, YouTube మానిటైజేషన్ పాలసీలను కూడా ఫాలో అవ్వాలి:

లభ్యత

YouTube BrandConnect కింది దేశాలు/ప్రాంతాలలో అర్హత ఉన్న క్రియేటర్‌లకు అందుబాటులో ఉంది:
  • బ్రెజిల్
  • ఇండియా
  • ఇండోనేషియా
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్

YouTube BrandConnectను ఆన్ చేయండి

కంప్యూటర్‌ను ఉపయోగించి మీ ఛానెల్‌కు YouTube BrandConnectను ఆన్ చేయడానికి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. BrandConnect ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మీ ఛానెల్‌కు అర్హత ఉంటేనే ఈ ట్యాబ్ కనిపిస్తుంది.
  4. స్క్రీన్ ఎగువున, ప్రారంభించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి లేదా స్క్రీన్ దిగువున ప్రారంభిద్దాం ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. YouTube BrandConnect మాడ్యూల్‌ను రివ్యూ చేసి, అంగీకరించండి.

మీ మొబైల్ పరికరాన్ని ఉపయోగించి మీ ఛానెల్‌కు YouTube BrandConnectను ఆన్ చేయడానికి:

  1. YouTube Studio మొబైల్ యాప్ ను తెరవండి.
  2. దిగువున ఉన్న మెనూ నుండి, సంపాదించండి ని ట్యాప్ చేయండి.
  3. BrandConnect కార్డ్‌ను ట్యాప్ చేయండి. మీ ఛానెల్‌కు అర్హత ఉంటేనే ఈ కార్డ్ కనిపిస్తుంది.
  4. ఆన్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. YouTube BrandConnect మాడ్యూల్‌ను రివ్యూ చేసి, అంగీకరించండి.
గమనిక: MCNలు వాటి Studio కంటెంట్ ఓనర్ ఖాతాతో సెట్టింగ్‌ల ఆ తర్వాత ఒప్పందాలకు వెళ్లడం ద్వారా YouTube BrandConnect మాడ్యూల్‌ను ఆమోదించగలవు.

YouTube BrandConnectను మేనేజ్ చేయండి

మీ ప్రాధాన్యతలను సెట్ చేయండి

మీరు YouTube BrandConnect మాడ్యూల్‌ను అంగీకరించిన తర్వాత, మీకు బ్రాండెడ్ కంటెంట్ అవకాశాలను పొందడానికి అర్హత లభిస్తుంది. బ్రాండ్‌లు ఇప్పుడు మిమ్మల్ని కనుగొనగలవు, అయితే సైన్ అప్ చేసినంత మాత్రాన బ్రాండెడ్ కంటెంట్ అవకాశాలు పక్కాగా లభిస్తాయని అనుకోరాదు.

బ్రాండ్‌ల నుండి లభించే అవకాశాలు నేరుగా YouTube Studioలో కనిపిస్తాయి, ఇక్కడ మీరు వివరాలను రివ్యూ చేయవచ్చు. అవకాశాలు సంబంధితంగా ఉండేలా చూసుకోవడంతో పాటు, అవి ఆమోదయోగ్యమైన ధరకు అందుబాటులో ఉండేలా కూడా చూసుకోవడానికి, మీ ప్రాధాన్యతలు ఆటోమేటిక్‌గా వాటిని ఫిల్టర్ చేస్తాయి. మీ అవసరాలకు అనుగుణంగా మీ మ్యాచ్‌లను మెరుగుపరచడానికి మీ ప్రాధాన్యతలను మీరు మార్చుకోవచ్చు:

  1. YouTube Studioలో సంపాదించండి విభాగానికి వెళ్లండి.
  2. BrandConnect and then ప్రాధాన్యతలను సెట్ చేయండిని ఎంచుకోండి.

డీల్ మేనేజ్‌మెంట్

మీరు YouTube Studioలో లేదా YouTube Studio మొబైల్ యాప్‌లో వివరాలను చూడండిని ఎంచుకోవడం ద్వారా మీ డ్యాష్‌బోర్డ్‌లో ప్రతి అవకాశానికి సంబంధించిన వివరాలను చూడవచ్చు. ప్రతి అవకాశంలోను క్యాంపెయిన్ టైమ్‌లైన్ హై-లెవెల్ ఓవర్‌వ్యూ ఉంటుంది. డీల్‌ను అర్థం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగడంలో, ప్రాసెస్‌లో భాగంగా మీరు ఏ దశలో ఉన్నారో చూడటంలో క్యాంపెయిన్ టైమ్‌లైన్ మీకు సహాయపడుతుంది. క్యాంపెయిన్ టైమ్‌లైన్‌లో మూడు హై-లెవెల్ దశలు ఉంటాయి: ఆఫర్, క్యాంపెయిన్ వీడియోలు, క్యాంపెయిన్ పనితీరు.

ఆఫర్

“ఆఫర్” విభాగంలో మీ క్యాంపెయిన్‌కు సంంబంధించిన వివరాలు పేర్కొనబడతాయి, అలాగే బ్రాండ్ గురించిన మరింత సమాచారం ఇందులో ఉంటుంది:

ధర

ఈ డీల్ ద్వారా మీరు సంపాదించగల డబ్బు మొత్తం. ఈ డీల్ ద్వారా మీరు సంపాదించగల తుది మొత్తం క్యాంపెయిన్ సైజ్, క్రియేటర్ రీచ్ అంశాలకే పరిమితం కాకుండా ఇంకా మరిన్ని అంశాల మీద ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రతి అవకాశానికి సంబంధించిన ధర గురించి మీరు చర్చలు జరపవచ్చు.

ఓవర్‌వ్యూ బ్రాండ్ క్యాంపెయిన్‌కు చెందిన, బ్రాండ్ అందించే ప్రోడక్ట్ లేదా సర్వీస్‌కు చెందిన ఓవర్‌వ్యూ. వీక్షకులకు మీరు షేర్ చేయాలని బ్రాండ్ కోరుకునే ఏ ఐడియాలు అయినా, వీక్షకులను నిర్దిష్ట చర్య తీసుకోమని మీరు ప్రోత్సహించాలని బ్రాండ్ కోరుకునే ఏ చర్య అయినా ఈ విభాగంలో ఉంటాయి.
డెలివరీ చేయాల్సిన అంశాల సారాంశం క్యాంపెయిన్ విషయంలో, మీరు బ్రాండ్‌కు డెలివరీ చేయాల్సినవి.
ప్రోడక్ట్ సమాచారం మీ సర్వీస్‌లకు ప్రతిఫలంగా, బ్రాండ్ మీకు అందించే ప్రోడక్ట్ లేదా సర్వీస్‌కు సంబంధించిన వివరణ.

పరిచయం (బ్రాండ్)

బ్రాండ్‌కు సంబంధించిన హై-లెవెల్ ఓవర్‌వ్యూతో పాటు బ్రాండ్ వెబ్‌సైట్‌కు లింక్.

ఆఫర్‌లకు ప్రతిస్పందించడం 

మీరు యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నట్లయితే, ఆఫర్ విషయంలో మీరు తీసుకోగల చర్యలు, మీ నియమాలు- డీల్‌ను Google అందిస్తోందా లేదా బ్రాండ్ అందిస్తోందా అనే వాటిపై ఆధారపడి ఉంటాయి. 

మీరు YouTube BrandConnect మాడ్యూల్ నియమాలకు అంగీకరించి ఉండి, మీకు నేరుగా బ్రాండ్, డీల్‌ను అందిస్తున్నట్లయితే, ఆ ఆఫర్ విషయంలో మీరు ఈ కింది చర్యలను అమలు చేయవచ్చు:

  • ఆసక్తి ఉంది: మీరు 'ఆసక్తి ఉంది' అని ఎంచుకుంటే, మీ కాంటాక్ట్ వివరాలను బ్రాండ్‌తో మేము షేర్ చేస్తాము, తద్వారా వారు మిమ్మల్ని సంప్రదించి డీల్ గురించి మీతో చర్చించగలరు. మీకు ఆసక్తి ఉన్నట్లు నిర్ధారించినప్పుడు, మీ నిర్ధారణకు సంప్రదింపు ప్రాధాన్యతల వంటి వివరాలను కూడా జోడించవచ్చు, ఇది మిమ్మల్ని ఎలా సంప్రదించాలో బ్రాండ్‌కి తెలియజేయడంలో సహాయపడుతుంది. డీల్‌లో పేమెంట్ నియమాలు, ధర, ఒప్పందం భాష ఉంటాయి. డీల్‌ను కొనసాగించడానికి, మీరు నేరుగా బ్రాండ్‌తో ఒప్పందంపై సంతకం చేయాలి, బ్రాండ్ మీకు పేమెంట్ చేస్తుంది. బ్రాండ్‌తో ఒప్పందంపై సంతకం చేసినప్పుడు, మీరు నియమాలను తప్పక అర్థం చేసుకోవాలి; అవసరమైతే న్యాయవాదిని సంప్రదించండి.
  •  తిరస్కరించడం: తిరస్కరించడానికి ఎంచుకుంటే, మీరు ఒప్పందాన్ని కొనసాగించాలనుకోవడం లేదని మేము బ్రాండ్‌కు తెలియజేస్తాము.

మీరు YouTube BrandConnect సెల్ఫ్-సర్వీస్ ప్లాట్‌ఫామ్ బీటా నియమాలకు అంగీకరిస్తే, మీ 'YouTube కోసం AdSense' ఖాతాకు Google ధరను పేమెంట్ చేయడంతో సహా Google మీకు డీల్స్‌ను అందించవచ్చు. ఆటువంటి ఆఫర్ విషయంలో మీరు కింది చర్యలను అమలు చేయవచ్చు: 

  • ఆమోదించడం: మీరు ఆమోదిస్తే, బ్రాండ్‌తో ఒప్పందంపై సంతకం చేయమని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మీరు ఒప్పంద నియమాలకు అనుగుణంగా ఉంటే, పాల్గొన్నందుకు Google మీకు పేమెంట్ చేస్తుంది. బ్రాండ్‌తో మీరు సంతకం చేసే ఏ ఒప్పంద నియాలను అయినా మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.
  • ప్రతివాదించడం: మీరు ప్రతివాదించడాన్ని ఎంచుకుంటే, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం కొత్త ధరతో చర్చించవచ్చు.  
  • చర్చించడం: మీరు చర్చించడానికి ఎంచుకుంటే, ఆఫర్ గురించి మరింత తెలుసుకోవడానికి మీరు బ్రాండ్‌ను సంప్రదించవచ్చు.
  • తిరస్కరించడం: తిరస్కరించడానికి ఎంచుకుంటే, మీరు ఒప్పందాన్ని కొనసాగించాలనుకోవడం లేదని మేము బ్రాండ్‌కు తెలియజేస్తాము.

క్యాంపెయిన్ వీడియోలు

మీరు బ్రాండ్ డీల్‌ను అంగీకరించిన తర్వాత, మీ క్యాంపెయిన్‌కు సంబంధించిన కంటెంట్‌ను క్రియేట్ చేసే పనిని మీరు మొదలుపెట్టవచ్చు. "క్యాంపెయిన్ వీడియోలు" విభాగం మీ కంటెంట్‌ను అన్‌లిస్టెడ్‌గా అప్‌లోడ్ చేయడానికి, అలాగే దాన్ని రివ్యూ చేసి, ఆమోదం పొందడం కోసం బ్రాండ్‌కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వీడియోలను సమర్పించడానికి సంబంధించిన తర్వాతి దశలను పేర్కొంటుంది. బ్రాండ్ ఏదైనా ఫీడ్‌బ్యాక్‌ను కలిగి ఉంటే, మీరు మీ బ్రాండ్ పార్ట్‌నర్ కామెంట్‌లతో కూడిన ఈమెయిల్‌ను పొందుతారు.

బ్రాండ్ రివ్యూలతో పాటుగా, మీ కంటెంట్ కూడా Google Ads పాలసీలకు, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా రివ్యూ చేయబడుతుంది. మీ కంటెంట్ పూర్తిగా ఆమోదించబడిన తర్వాత, మీకు YouTube Studioలో ఈమెయిల్, స్టేటస్ అప్‌డేట్ వస్తుంది. మీరు మీ కంటెంట్‌ను వెంటనే పబ్లిష్ చేయవచ్చు, లేదా మీరు దాన్ని లైవ్‌లో అందుబాటులో ఉంచాలనుకునన్నప్పుడు షెడ్యూల్ చేయవచ్చు. మీరు బ్రాండ్‌తో ఏ టైమ్‌లైన్‌కు అయితే అంగీకరించారో, ఆ టైమ్‌లైన్ ప్రకారం పబ్లిష్ చేసేలా చూసుకోండి.

క్యాంపెయిన్ పనితీరు

"క్యాంపెయిన్ పనితీరు" విభాగం, మీ కంటెంట్ పనితీరుకు సంబంధించిన హై-లెవెల్ ఓవర్‌వ్యూను మీకు అందిస్తుంది, ఇందులో ఈ కింద పేర్కొనబడినవి కూడా ఉంటాయి, కానీ ఇవే కాకుండా ఇంకా చాలా ఉండవచ్చని గమనించండి:

  • మీ క్యాంపెయిన్‌లో మిగిలి ఉన్న రోజులు
  • మీ కంటెంట్‌కు వచ్చిన వీక్షణలు
  • లైక్‌లు

మీరు YouTube ఎనలిటిక్స్‌లో కూడా మీ కంటెంట్ పనితీరు గురించి మరిన్ని వివరాలను చూడవచ్చు.

FAQలు

YouTube BrandConnectతో నేను ఎలా పని చేయగలను?

ప్రస్తుతం, YouTube BrandConnect బీటా దశలో ఉంది, ఈ దేశాలు/ప్రాంతాలలోని కొందరు క్రియేటర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు బీటా వెర్షన్‌కు అర్హులైతే, BrandConnect ట్యాబ్ YouTube Studioలో కనిపిస్తుంది. మేము ఈ ఫీచర్‌ను మరింత మంది క్రియేటర్‌లకు, దేశాలు/ప్రాంతాలకు అందించాలని ఆశిస్తున్నాము.

ఏజెంట్‌లు / మేనేజర్‌లు తమ క్రియేటర్‌ల కోసం YouTube BrandConnectను ఉపయోగించవచ్చా?

అవును. మేము ఛానెల్‌తో అనుబంధించబడిన ఈమెయిల్ అడ్రస్‌కు కొత్త అవకాశాల గురించి ఈమెయిల్ నోటిఫికేషన్‌లను పంపుతాము. మీరు ఈ ఈమెయిల్ నోటిఫికేషన్‌లను పొందాలని క్రియేటర్ కోరుకుంటే, వారు తమ ఛానెల్‌తో అనుబంధించబడిన ఈమెయిల్ అడ్రస్‌ను సవరించవచ్చు. నేరుగా YouTube Studioలో, మీ క్రియేటర్ తరఫున డీల్స్‌ను మేనేజ్ చేసే వీలును మీకు కల్పించడానికి, మీ క్రియేటర్ మిమ్మల్ని అధికారిక యూజర్‌గా జోడించవచ్చు కూడా.

YouTube BrandConnect నుండి వచ్చిన నా ఆదాయాన్ని నేను ఎక్కడ చూడగలను?

Google నుండి నేరుగా అందించిన, YouTube BrandConnect సెల్ఫ్-సర్వీస్ ప్లాట్‌ఫామ్ బీటా నియమాలకు లోబడి ఉన్న డీల్స్‌కు సంబంధించి, మీరు మీ ఆదాయాన్ని YouTube ఎనలిటిక్స్‌లో చూడవచ్చు. సంబంధిత సమయ వ్యవధిని ఎంచుకోండి, కార్డ్‌పై "YouTube BrandConnect ఆదాయం" అనే ఒక అడ్డు వరుస కనిపిస్తుంది. మీకు ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మీరు నేరుగా బ్రాండ్‌తో డీల్‌పై సంతకం చేసి ఉంటే, డీల్ నుండి మీరు పొందే ఆదాయం YouTube ఎనలిటిక్స్‌లో కనిపించదు.

నేను బ్రాండెడ్ కంటెంట్ క్యాంపెయిన్ నుండి వీడియోలను అడ్వర్టయిజర్‌కు లింక్ చేయాలా?

మీరు బ్రాండెడ్ కంటెంట్ క్యాంపెయిన్‌లో అడ్వర్టయిజర్‌కు పార్ట్‌నర్‌గా చేరి ఉంటే, ఆ అడ్వర్టయిజర్, క్యాంపెయిన్ నుండి కంటెంట్‌ను వారి Google Ads ఖాతాకు లింక్ చేయడానికి మీకు రిక్వెస్ట్‌ను పంపవచ్చు. అడ్వర్టయిజర్ పంపిన రిక్వెస్ట్‌ను ఆమోదించాలా వద్దా అనేది పూర్తిగా మీ నిర్ణయం, మీరు ఎల్లప్పుడూ మీ ఛానెల్‌కు ఏది ఉత్తమమైనదో అదే చేయాలి.
మీరు లింక్ చేసే రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే, అడ్వర్టయిజర్ Google Adsలో కంటెంట్ తాలూకు ఆర్గానిక్ పనితీరు కొలమానాలను చూడవచ్చు, వారి అడ్వర్టయిజింగ్‌లో లింక్ చేసిన వీడియోలను ఉపయోగించవచ్చు. మీ బ్రాండెడ్ కంటెంట్‌ను అడ్వర్టయిజర్‌కు ఎలా లింక్ చేయాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5026309534842559152
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false