యాడ్ ఆదాయ ఎనలిటిక్స్‌ను అర్థం చేసుకోండి

మీరు YouTube ఎనలిటిక్స్‌లోని కొలమానాలను ఉపయోగించి మీ YouTube ఆదాయాన్ని, ఛానెల్ పనితీరును చెక్ చేసుకోవచ్చు. కొన్ని కొలమానాలు సారూప్యంగా అనిపించినప్పటికీ మీ YouTube యాడ్ ఆదాయాన్ని అర్థం చేసుకోవడానికి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలుసుకోవడం ముఖ్యం.

RPM

ఒక్కో మైల్‌కు ఆదాయం (RPM) అనేది ప్రతి 1,000 వీడియో వీక్షణలకు మీరు ఎంత డబ్బును సంపాదించారో సూచించే ఒక కొలమానం. RPM వీటితో సహా అనేక ఆదాయ సోర్స్‌లపై ఆధారపడి ఉంటుంది: యాడ్స్, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, YouTube Premium ఆదాయం, సూపర్ చాట్, Super Stickers.

నా CPM కంటే నా RPM ఎందుకు తక్కువగా ఉంది?

RPM కంటే CPM తక్కువగా ఉంది ఎందుకంటే RPMను లెక్కించేటప్పుడు వీటిని పరిగణనలోకి తీసుకుంటారు:
  • YouTubeకు దాని ఆదాయ షేరింగ్ వెళ్లిన తర్వాత లెక్కించబడుతుంది
  • మొత్తం వీక్షణలు అంటే, మానిటైజ్ కాని వీక్షణలతో సహా అన్ని వీక్షణలు అని అర్థం.
RPM కొలమానాన్ని జోడించడం వలన మీరు సంపాదించే ఆదాయంలో ఎటువంటి మార్పు ఉండదు.

RPM, CPMకు మధ్య ఉన్న తేడా ఏమిటి?

CPM అనేది YouTubeకు దాని ఆదాయ షేరింగ్ వెళ్లక ముందు 1000 యాడ్ ఇంప్రెషన్‌లకు అయ్యే ఖర్చును సూచిస్తుంది. RPM అనేది 1000 వీక్షణలకు వచ్చే (YouTubeకు దాని ఆదాయ షేరింగ్ వెళ్లిన తర్వాత) మీ మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది.

RPM

CPM

  • క్రియేటర్-కేంద్రీకృత కొలమానం
  • యాడ్‌లు, YouTube Premium, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్, Super Stickersతో సహా YouTube ఎనలిటిక్స్‌లో రిపోర్ట్ చేయబడిన మొత్తం ఆదాయాన్ని కలిగి ఉంటుంది
  • మానిటైజ్ చేయని వీక్షణలతో సహా మీ వీడియోల నుండి మొత్తం వీక్షణల సంఖ్యను కలిగి ఉంటుంది
  • ఆదాయ షేరింగ్ తర్వాత వచ్చిన వాస్తవ ఆదాయం.
  • అడ్వర్టయిజర్-కేంద్రీకృత కొలమానం
  • యాడ్స్, YouTube Premium నుండి వచ్చే ఆదాయాన్ని మాత్రమే కలిగి ఉంటుంది
  • మానిటైజ్ అయిన వీడియోల నుండి వచ్చే వీక్షణలను మాత్రమే కలిగి ఉంటుంది (అంటే, యాడ్స్ ప్రదర్శించబడిన వీడియోలు)
  • ఆదాయ షేరింగ్‌కు ముందు నికర ఆదాయం

RPM ఎందుకు ముఖ్యమైనది?

ప్రతి 1,000 వీక్షణలకు మీరు ఎంత డబ్బును సంపాదిస్తున్నారో చూడటానికి RPM మిమ్మల్ని అనుమతిస్తుంది. మొత్తంగా మీ మానిటైజేషన్ ఎంత ప్రభావవంతమైనదో అర్థం చేసుకోవడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది.

నా RPMను నేను ఎలా మెరుగుపరచుకోగలను?

మీ RPMను మెరుగుపరచుకోవడానికి మీరు మీ మొత్తం ఆదాయాన్ని మెరుగుపరుచుకోవాలి. RPM సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయికి పెంచడానికి ఇక్కడ కొన్ని దశలు ఉన్నాయి:
  • అన్ని వీడియోలకు మానిటైజేషన్‌ను ఆన్ చేయండి.
  • మధ్యలో వచ్చే యాడ్‌లను ఆన్ చేయండి.
  • మీ ఆదాయ స్ట్రీమ్‌లను విస్తృతం చేయడానికి AltMon ఫీచర్‌లను ఆన్ చేయండి (ఉదాహరణకు, మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్).

ప్రతి ఫీచర్‌కు దాని స్వంత ఆవశ్యకతలు, గైడ్‌లైన్స్ ఉంటాయని గుర్తుంచుకోండి.

నా RPM పెరుగుతున్నట్లు లేదా తగ్గుతున్నట్లు కనిపిస్తే దానికి అర్థం ఏమిటి?

RPM అనేది మీరు YouTubeలో డబ్బు సంపాదించే రేటు యొక్క స్నాప్‌షాట్. ఒకవేళ ఇది పెరిగితే, మీరు ప్రతి 1000 వీక్షణలకు మరింత డబ్బును సంపాదిస్తున్నారని, అలాగే తగ్గితే మీరు తక్కువ డబ్బును సంపాదిస్తున్నారని అర్థం. మీ ఆదాయం అలాగే ఉన్నప్పటికీ, మానిటైజ్ చేయని వీక్షణలు పెరిగినట్లయితే మీ RPM తగ్గే అవకాశం ఉందని గమనించండి.
RPM పెరిగినా లేదా తగ్గినా, మీ ఆదాయ వ్యూహంలో ఏది పని చేస్తుంది లేదా ఏది పని చేయదు అనే దానికి ఇది ఒక మంచి సూచన. RPMను ప్రభావితం చేసే వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మీ మానిటైజేషన్ వ్యూహాన్ని మెరుగుపరచడానికి అవకాశాలను గుర్తించడంలో మీకు సహాయపడవచ్చు.

నా ఆదాయానికి సంబంధించి RPM నాకు దేని గురించి తెలియజేయలేదు?

RPM అనేది క్రియేటర్‌లకు ఉపయోగకరమైన మానిటైజేషన్ కొలమానం అయినప్పటికీ ఇది మీ మొత్తం ఆదాయ కథనం గురించి తెలియజేయలేదు. దీనిలో చేర్చబడనవి ఇక్కడ ఉన్నాయి:

  • అమ్మకపు వస్తువులను లేదా అమ్మకపు వస్తువుల అరను ఉపయోగించడం ద్వారా వచ్చిన ఆదాయం.
  • బ్రాండ్ డీల్స్, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చిన ఆదాయం (YouTube BrandConnect మినహా).
  • YouTube ద్వారా పరోక్షంగా వచ్చిన ఇతర ఆదాయం (సర్వీస్‌లు, ప్రసంగించడం, సంప్రదింపు ఫీజులు)

మీ మొత్తం ఆదాయంలో మార్పులకు ఏ ఆదాయ సోర్స్ బాధ్యత వహిస్తుందో RPM మీకు తెలియజేయలేదు

RPM అనేక కొలమానాలను కలిపి అందిస్తున్నందున, మీ ఆదాయంలో మార్పులకు ఏ ఆదాయ సోర్స్ బాధ్యత వహిస్తుందో ఇది మీకు తెలియజేయలేదు.

ఉదాహరణకు, మీ వీక్షణలు ఎక్కువ ఉన్నప్పటికీ, అన్ని వీక్షణలు యాడ్-ఎనేబుల్ చేసినవి కాదు కాబట్టి మీరు RPMలో తగ్గుదలను చూడవచ్చు. లేదా వీక్షకులు ఛానెల్ మెంబర్‌షిప్‌ల కోసం సైన్ అప్ చేస్తున్నందున వీక్షణలలో ఎటువంటి మార్పు లేకుండానే మీ RPMలో పెరుగుదలను మీరు చూడవచ్చు.

మీ RPMలోని మార్పులను పూర్తిగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి YouTube అందించే అన్ని విభిన్న ఎనలిటిక్స్‌ను ఉపయోగించమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.

CPM

ప్రతి 1,000 ఇంప్రెషన్‌లకు అయ్యే ఖర్చు (CPM) అనేది YouTubeలో యాడ్స్‌ను ప్రదర్శించడానికి అడ్వర్టయిజర్‌లకు అయ్యే ఖర్చును సూచించే ఒక కొలమానం. మీకు YouTube ఎనలిటిక్స్‌లో కొన్ని విభిన్న కొలమానాలు కనిపిస్తాయి:

  • CPM: ప్రతి 1,000 యాడ్ ఇంప్రెషన్‌ల కోసం అడ్వర్టయిజర్‌కు అయ్యే ఖర్చు. యాడ్ ప్రదర్శించబడే ఏ సమయంలోనైనా యాడ్ ఇంప్రెషన్ లెక్కించబడవచ్చు.
  • ప్లేబ్యాక్ ఆధారిత CPM: యాడ్ ప్రదర్శించబడే 1,000 వీడియో ప్లేబ్యాక్‌ల కోసం అడ్వర్టయిజర్‌కు అయ్యే ఖర్చు.

CPMకు, ప్లేబ్యాక్ ఆధారిత CPMకు మధ్య ఉన్న తేడా ఏమిటి?

YouTubeలోని వీడియోలు ఒకటి కంటే ఎక్కువ యాడ్స్‌ను కలిగి ఉండవచ్చు. CPM, యాడ్ ఇంప్రెషన్‌ల కోసం అడ్వర్టయిజర్ ఎంత ఖర్చు చేస్తున్నారో చూపిస్తుంది. ప్లేబ్యాక్ ఆధారిత CPM, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యాడ్స్‌ను కలిగి ఉన్న వీడియో ప్లేబ్యాక్‌ల కోసం అడ్వర్టయిజర్ ఎంత ఖర్చు చేస్తున్నారో చూపిస్తుంది. మీ ప్లేబ్యాక్ ఆధారిత CPM తరచుగా మీ CPM కంటే ఎక్కువ ఉంటుంది.
ఉదాహరణకు, మీ వీడియోను 5,000 సార్లు చూశారని అనుకుందాం. యాడ్స్‌ను కలిగి ఉన్న మొత్తం 1,500 వీక్షణలలో 1,000 వీక్షణలను ఒక యాడ్, 500 ఇతర వీక్షణలను రెండు యాడ్స్ కలిగి ఉంటాయి. 2,000 నిర్దిష్ట యాడ్ ఇంప్రెషన్‌లు ఉన్నప్పటికీ వాటిలో 1,500 మాత్రమే మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌లు ఉంటాయని ఈ ఉదాహరణకు అర్థం.
అడ్వర్టయిజర్ మొత్తం $7 పేమెంట్ చేశారని అనుకుందాం. వీడియో యొక్క ప్రతి ఇంప్రెషన్‌కు అయ్యే ఖర్చు $7 అడ్వర్టయిజర్ ఖర్చును 2,000 యాడ్ ఇంప్రెషన్‌లతో భాగిస్తే వచ్చే విలువకు సమానం లేదా $0.0035 అవుతుంది. CPM లేదా ప్రతి 1000 ఇంప్రెషన్‌లకు అయ్యే ఖర్చు, 1,000కి $0.0035తో గుణించడానికి సమానం లేదా $3.50 అవుతుంది. ప్లేబ్యాక్ ఆధారిత CPM అనేది 1,000కి 1,500 మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌లను $7తో భాగిస్తే వచ్చే విలువతో గుణించడానికి సమానం లేదా $4.67కు సమానం.

CPM ఎందుకు ముఖ్యమైనది?

మీ వీడియోలో ఒక యాడ్ ప్రదర్శించబడినప్పుడు అడ్వర్టయిజర్‌లు పేమెంట్ చేసిన దానిలో కొంత భాగాన్ని మీరు పొందుతారు. యాడ్ కోసం అడ్వర్టయిజర్ ఎంత ఎక్కువ పేమెంట్ చేస్తే మీరు అంత ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. అడ్వర్టయిజర్‌లు వారి స్వంత బిజినెస్ లక్ష్యాలను సాధించడానికి మీ వీడియోలను, ప్రేక్షకులను కనుగొనడం వారికి ఎంత విలువైనదో తెలియజేయడానికి మీ CPM ఒక మంచి సూచిక.
మీ ఆదాయం మీ వీక్షణలను చూసిన పర్యాయాల సంఖ్యకు సమానంగా ఉండదు, ఎందుకంటే CPM అడ్వర్టయిజర్‌లు ఎంత పేమెంట్ చేస్తారో తెలియజేస్తుంది, మీరు ఎంత సంపాదించారో కాదు. అలాగే, అన్ని వీక్షణలు యాడ్స్‌ను కలిగి ఉండవు. అవి అడ్వర్టయిజర్-ఫ్రెండ్లీ కాకపోతే, కొన్ని వీడియోలకు యాడ్స్ కోసం పూర్తిగా అర్హత ఉండదు. యాడ్స్ లభ్యత తక్కువగా ఉన్న కారణంగా ఇతర వీడియో వీక్షణలలో యాడ్స్ ఉండకపోవచ్చు. యాడ్స్‌ను కలిగి ఉన్న వీక్షణలు మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌లుగా సూచించబడతాయి.

నా CPM ఎందుకు మారుతోంది?

కాలక్రమేణా మీ CPMలో హెచ్చుతగ్గులు కనిపించడం సాధారణమే , అనేక కారణాల వల్ల ఇలా జరుగుతుంది, ఉదాహరణకు:
  • ఏడాదిలోని సమయం: ఏడాదిలోని సమయాన్ని బట్టి అడ్వర్టయిజర్‌లు ఎక్కువ లేదా తక్కువ ధరతో వేలం వేస్తారు. ఉదాహరణకు, చాలా మంది అడ్వర్టయిజర్‌లు సెలవులకు ముందు అధిక ధరతో వేలం వేస్తారు.
  • వీక్షకుల భౌగోళిక ప్రాంతంలో మార్పులు: అడ్వర్టయిజర్‌లు వారి యాడ్స్‌తో ఏ భౌగోళిక ప్రాంతాలను చేరుకోవాలనుకుంటున్నారో కంట్రోల్ చేయవచ్చు. యాడ్ మార్కెట్‌లో వివిధ లొకేషన్‌లకు భిన్నమైన స్థాయిల్లో పోటీ ఉంటుంది, కాబట్టి CPMలు భౌగోళిక ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మీరు ఎక్కువ వీక్షణలను పొందుతున్న భౌగోళిక ప్రాంతం మారితే, మీకు CPMలో మార్పు కనిపించవచ్చు. ఉదాహరణకు, మీరు ఇంతకుముందు అధిక CPMలతో ఉన్న భౌగోళిక ప్రాంతం నుండి వీక్షణలను కలిగి ఉండి, ఇప్పుడు తక్కువ CPMలతో ఉన్న భౌగోళిక ప్రాంతం నుండి ఎక్కువ వీక్షణలను పొందుతున్నట్లయితే, మీరు CPMలో తగ్గుదలను చూడవచ్చు.
  • అందుబాటులో ఉన్న యాడ్ ఫార్మాట్‌ల పంపిణీలో మార్పులు: వివిధ యాడ్ రకాలు విభిన్న CPMలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, ఒకవేళ యాడ్ స్పేస్‌లో మరిన్ని స్కిప్ చేయలేని యాడ్స్ అందుబాటులో ఉన్నట్లయితే, CPM ఎక్కువగా ఉండవచ్చు.

అంచనా ఆదాయం వర్సెస్ యాడ్ ఆదాయం

  • అంచనా ఆదాయం: ఛానెల్ మెంబర్‌షిప్‌లు, YouTube Premium ఆదాయం, సూపర్ చాట్‌తో సహా అన్ని ఆదాయ రకాల నుండి వచ్చే ఆదాయం. ఈ కొలమానం మీకు ఆదాయ ట్యాబ్‌లో కనిపిస్తుంది.
  • అంచనా వేసిన యాడ్ ఆదాయం: కేవలం మీ వీడియోలలోని యాడ్స్ నుండి వచ్చే ఆదాయం. ఈ కొలమానం మీకు ఆదాయ సోర్స్‌ల రిపోర్ట్‌లో కనిపిస్తుంది.

వీక్షణలు, యాడ్ ఇంప్రెషన్‌లు & అంచనా వేసిన మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌లు

  • వీక్షణలు: మీ వీడియోను చూసిన పర్యాయాల సంఖ్య.
  • యాడ్ ఇంప్రెషన్‌లు: మీ వీడియోలలోని నిర్దిష్ట యాడ్స్‌ను చూసిన పర్యాయాల సంఖ్య.
  • అంచనా వేసిన మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌లు: యాడ్స్‌తో ఉన్న మీ వీడియోను చూసిన పర్యాయాల సంఖ్య.

మీ వీడియోను 10 సార్లు చూసినట్లయితే, వాటిలో 8 వీక్షణలు యాడ్స్‌ను కలిగి ఉంటే, మీరు 10 వీక్షణలను, 8 అంచనా వేసిన మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌లను కలిగి ఉంటారు. ఒకవేళ ఆ అంచనా వేసిన మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌లలో ఒకటి వాస్తవానికి 2 యాడ్స్‌ను కలిగి ఉంటే, మీరు 9 యాడ్ ఇంప్రెషన్‌లను కలిగి ఉంటారు.

YouTubeలో అన్ని వీక్షణలు యాడ్‌ను కలిగి ఉండవు. వీక్షణ ఇలా ఉంటే, యాడ్‌ను కలిగి ఉండకపోవచ్చు:

  • వీడియో అడ్వర్టయిజర్-ఫ్రెండ్లీ కాకపోతే.
  • ఆ వీడియోకు యాడ్‌లు ఆఫ్ చేసి ఉంటే.
  • నిర్దిష్ట వీక్షకులకు చూపించడానికి యాడ్ అందుబాటులో లేదు. అడ్వర్టయిజర్‌లు నిర్దిష్ట పరికరాలను, జనాభా కేటగిరీలను, ఆసక్తులను టార్గెట్‌గా చేసుకోవచ్చు. మీ వీక్షకులు ఈ టార్గెట్‌తో మ్యాచ్ అవ్వకపోవచ్చు. వీడియో యాడ్స్ కోసం అందుబాటులో ఉన్న టార్గెటింగ్ పద్ధతుల గురించి మరింత తెలుసుకోండి.
  • వీక్షకుల భౌగోళిక ప్రాంతంతో సహా, వారు ఎంతకాలం క్రితం యాడ్‌ను చూశారు, వారికి Premium సబ్‌స్క్రిప్షన్ ఉందా లేదా, మొదలైనటువంటి వాటికి సంబంధించిన అనేక ఇతర అంశాలు.

ఈ విభిన్నమైన వీక్షణల కారణంగా, మీరు అంచనా వేసిన మానిటైజ్ అయిన ప్లేబ్యాక్‌ల కంటే ఎక్కువ వీక్షణలను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1322854447090002011
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false