సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అనేవి మీ ఛానెల్‌ను మానిటైజ్ చేయడానికి మార్గాలు. ఈ ఫీచర్‌లు, ఇతర మెసేజ్‌ల మాదిరిగా కాకుండా భిన్నంగా, ప్రత్యేకంగా కనబడే చాట్ మెసేజ్‌లను కొనే వీలును మీ వీక్షకులకు కల్పిస్తాయి, అప్పుడప్పుడూ వీటిని చాట్ ఫీడ్‌కు ఎగువున పిన్ చేసే వీలు కూడా లభిస్తుంది. అర్హత గురించి మరింత తెలుసుకోండి.

సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వర్తించే అన్ని చట్టాలను పాటించాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తుంచుకోండి. మీరు సూపర్ చాట్‌లు, సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయవచ్చా, వాటిని అందించవచ్చా, వాటికి సంబంధించి డబ్బును పంపవచ్చా లేదా అందుకోవచ్చా అనే అంశాలను ఈ చట్టాలు కవర్ చేయవచ్చు.

సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్: సెటప్, వాటిని ఉపయోగించడం కోసం చిట్కాలు

తాజా వార్తలు, అప్‌డేట్‌లు, చిట్కాలను పొందడానికి మా YouTube Creators ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

 

మీ ఛానెల్ కోసం సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయండి

సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్ నుండి ఆదాయాన్ని సంపాదించడానికి, ముందుగా మీరు (అలాగే MCN) తప్పనిసరిగా వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) ఒప్పందాన్ని అంగీకరించాలి. CPM గురించిన మరింత సమాచారం కోసం, మా YouTube వాణిజ్యపరమైన ప్రోడక్ట్‌ల మానిటైజేషన్ పాలసీలను చూడండి.

మీరు కంప్యూటర్‌ను ఉపయోగించి సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయాలనుకుంటే:

  1. కంప్యూటర్‌లో, YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. Supers ట్యాబ్‌ను క్లిక్ చేయండి. మీ ఛానెల్‌కు అర్హత ఉంటేనే ఈ ట్యాబ్ కనిపిస్తుంది.
  4. ప్రారంభించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
  5. Supers విభాగాన్ని ఉపయోగించడం మీరు ఇదే మొదటిసారి అయితే, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అయ్యి వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) ఒప్పందంపై సంతకం చేయండి.
  6. మీరు అన్ని సూచనలను పూర్తి చేసిన తర్వాత, మీకు 2 ఆప్షన్‌లు కనిపిస్తాయి:
    • మీరు ఆన్ లేదా ఆఫ్ చేయగల స్విచ్ పక్కన ఉన్న “సూపర్ చాట్”.
    • మీరు ఆన్ లేదా ఆఫ్ చేయగల స్విచ్ పక్కన ఉన్న “సూపర్ స్టిక్కర్స్”.

మీరు మొబైల్ పరికరాన్ని ఉపయోగించి సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయాలనుకుంటే:

  1. YouTube Studio మొబైల్ యాప్ ను తెరవండి.
  2. స్క్రీన్‌కు దిగువున, సంపాదించండి ని ట్యాప్ చేయండి.
  3.  Supers కార్డ్‌ను ట్యాప్ చేయండి. Supers కార్డ్ కనిపించకపోతే, “Supers” విభాగంలో ప్రారంభించండి ఆ తర్వాత ఆన్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. Supers విభాగాన్ని ఉపయోగించడం మీరు ఇదే మొదటిసారి అయితే, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అయ్యి వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) ఒప్పందంపై సంతకం చేయండి.
  5. మీరు సూచనలన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, కింద పేర్కొన్న అర్హత ఉన్న ఈ విభాగాలలో Supers ప్రోడక్ట్‌లన్నీ కనిపిస్తాయి:
    • లైవ్ స్ట్రీమ్‌లు, ప్రీమియర్‌లు (సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్)
    • నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు, Shorts (సూపర్ థ్యాంక్స్)

గమనికలు:

  • ఒకవేళ మీ హక్కులను థర్డ్ పార్టీ కనుక నిర్వహిస్తుంటే, సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయడానికి ముందు వారితో చెక్ చేయండి.
  • మీరు నిర్దిష్ట Supersను ఆఫ్ చేయాలనుకుంటే, కంప్యూటర్‌ను ఉపయోగించి YouTube Studio‌కు సైన్ ఇన్ చేయవచ్చు. Supers ట్యాబ్‌కు వెళ్లి సంబంధిత Supersను ఆఫ్ చేయండి.

సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్‌ను ఆఫ్ చేయండి

  1. కంప్యూటర్‌లో YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సంపాదించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. Supers ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. కింది ఆప్షన్‌లలో ఒకటి లేదా రెండింటిని ఎంచుకోండి:
    • "సూపర్ చాట్‌"కు పక్కన ఉన్న స్విచ్‌ను ఆఫ్ చేయండి.
    • "సూపర్ స్టిక్కర్స్‌"కు పక్కన ఉన్న స్విచ్‌ను ఆఫ్ చేయండి.
  5. పాప్-అప్‌లో, "ఈ చర్యను ఎంచుకోవడం వలన ఎదురయ్యే పరిణామాలను నేను అర్థం చేసుకున్నాను" పక్కన ఉండే చెక్‌బాక్స్‌ను క్లిక్ చేయండి.
  6. ఆఫ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ నెట్‌వర్క్‌కు సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయండి

సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయడానికి నెట్‌వర్క్‌ను అనుమతించండి

సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్ నుండి ఆదాయాన్ని సంపాదించడానికి, ముందుగా నెట్‌వర్క్‌లు తప్పనిసరిగా వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ (CPM) ఒప్పందాన్ని అంగీకరించాలి. CPM గురించిన మరింత సమాచారం కోసం, మా YouTube వాణిజ్యపరమైన ప్రోడక్ట్‌ల మానిటైజేషన్ పాలసీలను చూడండి.

  1. కంప్యూటర్‌లో, YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లకు వెళ్లండి.
  3. "ఒప్పందాల"ను క్లిక్ చేసి, వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌ను అంగీకరించండి.

ప్రీమియర్‌ల కోసం సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేయండి

సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ YouTube ప్రీమియర్‌లతో పని చేస్తాయి. మీ ఛానెల్‌కు సూపర్ చాట్‌లు & సూపర్ స్టిక్కర్స్‌ను ఆన్ చేస్తే, మీరు వీడియోను ప్రీమియర్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్‌గా ఆన్ అవుతాయి. సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్స్‌తో వీడియోను ప్రీమియర్ చేయడానికి ఈ సూచనలను ఫాలో అవ్వండి:

  1. కంప్యూటర్‌లో, మీ సూపర్ చాట్ లేదా సూపర్ స్టిక్కర్ ఎనేబుల్ చేయబడిన ఛానెల్‌తో YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. పేజీ ఎగువున, అప్‌లోడ్ ను క్లిక్ చేయండి, లేదా youtube.com/upload లింక్‌కు వెళ్లండి.
  3. డ్రాప్-డౌన్ మెనూలో షెడ్యూల్ చేయబడింది ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • 'పబ్లిక్' ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా వీడియోను అప్‌లోడ్ చేయడం పూర్తయిన వెంటనే ప్రీమియర్ ప్రారంభమవుతుందని గమనించండి.
    • అన్‌లిస్టెడ్ వీడియోలను ప్రీమియర్ చేయడం సాధ్యపడదు.
  4. మీరు మీ కంప్యూటర్ నుండి అప్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్ చేయండి.
  5. తర్వాతి పేజీలో, ప్రీమియర్ ఆప్షన్‌ను ఆన్ చేయండి.
  6. మీ ప్రీమియర్‌కు సంబంధించిన తేదీ, సమయాన్ని ఎంచుకోండి.
  7. వీడియో ప్రాసెస్ అవ్వడం పూర్తయినప్పుడు, ఎగువ కుడి మూలలో ప్రీమియర్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12440916387898348149
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false