మానిటైజేషన్ సిస్టమ్‌లు లేదా 'యాడ్‌ల అల్గారిథమ్' గురించి వివరించబడింది

YouTube అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు తమ కథనాలను షేర్ చేయడానికి ఉపయోగించే ఒక ప్లాట్‌ఫామ్. YouTubeలో ప్రతి నిమిషం 400 గంటల కంటే ఎక్కువ వీడియోలు అప్‌లోడ్ చేయబడతాయి, ప్రతిరోజూ 100ల మిలియన్ల గంటల పాటు చూస్తారు, ప్రతి నెలా బిలియన్ల కొద్దీ యూజర్‌లు YouTubeను సందర్శిస్తారు.
క్రియేటర్‌లు, వీక్షకులు, అలాగే అడ్వర్టయిజర్‌లకు మా కమ్యూనిటీ సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి, మేము YouTubeలోని మొత్తం కంటెంట్‌ను ఫిల్టర్ చేయడంలో మాకు సహాయపడే ఆటోమేటిక్ సిస్టమ్‌లను క్రియేట్ చేశాము. ఈ సిస్టమ్‌లను కొన్నిసార్లు "యాడ్‌ల అల్గారిథమ్" లేదా "సిస్టమ్‌లు" అని పిలుస్తారు.

మానిటైజ్ చేసే క్రియేటర్‌లను మా సిస్టమ్‌లు ఎలా ప్రభావితం చేస్తాయి

మా సిస్టమ్‌లు మీ కంటెంట్, ఛానెల్స్‌ను వివిధ మార్గాలలో, వివిధ దశలలో పరిశీలిస్తాయి. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లోని క్రియేటర్‌ల కోసం, మా మానిటైజేషన్ సిస్టమ్‌లు మీ కంటెంట్, మీ ఛానెల్ రెండింటినీ ప్రభావితం చేయగలవు.

కంటెంట్‌పై ప్రభావం

మీరు కంటెంట్‌కు యాడ్స్‌ను ఆన్ చేసినప్పుడు, మా సిస్టమ్‌లు దాన్ని 2 మార్గాలలో స్కాన్ చేస్తాయి:

  • అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్. మీరు యాడ్స్‌తో మానిటైజ్ చేసే ఏ వీడియో అయినా తప్పనిసరిగా మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండాలి. మా సిస్టమ్‌లు మీ వీడియో టైటిల్, థంబ్‌నెయిల్, వివరణ, ట్యాగ్‌లను, అలాగే వీడియోను చెక్ చేసి, మా గైడ్‌లైన్స్‌కు అది అనుగుణంగా ఉందో లేదో తెలుసుకుంటాయి. మీరు దీని ఫలితాన్ని మానిటైజేషన్ చిహ్నం రూపంలో చూడవచ్చు.
  • వీక్షకుల ఎంగేజ్‌మెంట్. మా సిస్టమ్‌లు వీక్షకుల ఎంగేజ్‌మెంట్ కోసం కూడా స్కాన్ చేస్తాయి. దీని అర్థం మేము కామెంట్‌లు, లైక్‌లు, అలాగే మొత్తం వీడియోను చూశారా లేదా అనే విషయాలను పరిశీలిస్తాము. మీ ప్రేక్షకులు చూసే ఇతర రకాల కంటెంట్‌లను కూడా మేము పరిశీలిస్తాము. మా సిస్టమ్‌లు మీ వీడియోను మానిటైజేషన్‌ను మరొక విధానంలో పరిశీలించవచ్చు, అది మీ వీడియో మానిటైజేషన్ స్టేటస్‌ను మార్చవచ్చు.

మానిటైజేషన్ చిహ్నం స్టేటస్ మార్పులు, అలాగే దాని విషయంలో మీరు ఏమి చేయగలరో అనే విషయాల గురించి మరింత తెలుసుకోండి.

ఛానెల్‌పై ప్రభావం

మీరు మీ ఛానెల్‌లో స్థిరంగా ఖచ్చితమైన మానిటైజేషన్ నిర్ణయాలు తీసుకుంటారో లేదో కూడా మా సిస్టమ్‌లు చెక్ చేస్తాయి. మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండే వీడియోల కోసం మాత్రమే మీరు యాడ్‌లను ఆన్ చేయాలని గుర్తుంచుకోండి. మీరు నిరంతరం మా గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించే వీడియోల కోసం యాడ్‌లను ఆన్ చేస్తే, మా సిస్టమ్‌లు మీ ఛానెల్‌ను ఫ్లాగ్ చేయవచ్చు. అలాంటి తీవ్రమైన సందర్భాలలో, మేము యాడ్‌లతో మానిటైజ్ చేసే మీ సామర్థ్యాన్ని ఆఫ్ చేయవచ్చు లేదా మిమ్మల్ని YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నుండి తీసివేయవచ్చు.

సిస్టమ్ అందించిన స్టేటస్ విషయంలో మీరు తీసుకోగల చర్యలు

మా సిస్టమ్‌లు ఎల్లప్పుడూ సరైన నిర్ణయాన్ని అందించకపోవచ్చు. అందుకే మీరు ఎల్లప్పుడూ మీ వీడియోకు సంబంధించిన మానిటైజేషన్ స్టేటస్‌ను రివ్యూ చేయమని రిక్వెస్ట్ చేయవచ్చు. మీరు రివ్యూ కోసం రిక్వెస్ట్ చేసినప్పుడు, శిక్షణ పొందిన పాలసీ స్పెషలిస్ట్ మీ కంటెంట్‌ను మా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉందో లేదో చూస్తారు. మా రివ్యూవర్ మా ఆటోమేటిక్ సిస్టమ్‌తో విభేదిస్తే, మేము రివ్యూవర్ నిర్ణయాన్ని తుది నిర్ణయంగా పరిగణిస్తాము.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13525683533013258560
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false