YouTube Studioకు సంబంధించిన మానిటైజేషన్ చిహ్నం గైడ్

Shorts కోసం యాడ్ ఆదాయ షేరింగ్ ఫిబ్రవరి 1, 2023న ప్రారంభమైంది. ఆ తేదీ తర్వాత కూడా మీకు మీ షార్ట్స్ పక్కన లేత బూడిద రంగు చిహ్నాలు కనిపిస్తే, మీరు YouTube Studioలో మాడ్యూల్‌ను ఆమోదించలేదని అర్థం.

ఈ ఆర్టిక‌ల్ ద్వారా మీ వీడియో మానిటైజేషన్ స్టేటస్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి. అలాగే ఒక్కో రకమైన మానిటైజేషన్ చిహ్నం ఏం చెబుతుందో అర్థం చేసుకోండి. మీ వీడియో పక్కన ఉన్న మానిటైజేషన్ చిహ్నం మారినప్పుడు, దాని అర్థం ఏమిటనేది కూడా మీరు తెలుసుకోవచ్చు.

గమనిక: మీరు వీడియో ద్వారా డబ్బు సంపాదిస్తారా లేదా అనేది కాపీరైట్ క్లెయిమ్‌లు, ఆదాయ షేరింగ్, ఇంకా అడ్వర్టయిజర్-ఫ్రెండ్లీనెస్‌తో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మరింత సమాచారం కోసం, యాడ్‌లతో మానిటైజ్ చేయడానికి వీడియోలను అప్‌లోడ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

వీడియో మానిటైజేషన్ స్టేటస్‌ను చెక్ చేయండి

మీ వీడియో మానిటైజేషన్ స్టేటస్‌ను చెక్ చేయడానికి:

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, ను ఎంచుకోండి.
  3. మానిటైజేషన్ నిలువు వరుసలో, మీరు మానిటైజేషన్ చిహ్నాలను కనుగొనవచ్చు. ఒక్కో చిహ్నానికి అర్థం ఏమిటనే దానికి సంబంధించిన సమాచారం కోసం, మీరు దానిపై మౌస్ కర్సర్‌ను ఉంచవచ్చు.

మానిటైజేషన్ స్టేటస్ ద్వారా మీ వీడియో లిస్ట్‌ను ఫిల్టర్ చేయడానికి:

  1. ఫిల్టర్ బార్ ఆ తర్వాత మానిటైజేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. ఆకుపచ్చని చిహ్నాలతో వీడియోలను చూపడానికి, మానిటైజ్ చేసినవి ఆప్షన్‌ను ఎంచుకోండి. ఎరుపు, బూడిద రంగు చిహ్నాలతో వీడియోలను చూపడానికి, మానిటైజ్ చేయనివి ఆప్షన్‌ను ఎంచుకోండి. పసుపు రంగు చిహ్నాలతో వీడియోలను చూపడానికి, పరిమితం ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. వర్తింపజేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మానిటైజేష‌న్ చిహ్నం గైడ్

ఒక్కో మానిటైజేషన్ చిహ్నానికి అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ఈ టేబుల్‌ను ఉపయోగించండి.

చిహ్నం, వివరణ

చిహ్నం కనిపించినప్పుడు

మీ వీడియో మానిటైజేషన్ స్టేటస్‌కు సంబంధించి చిహ్నానికి అర్థం ఏమిటి ఈ మానిటైజేషన్ స్టేటస్ గురించి చిట్కాలు
 చెక్ చేస్తోంది యాడ్‌ల ఔచిత్యం కోసం మా సిస్టమ్‌లు వీడియోను చెక్ చేస్తున్నప్పుడు వీడియో పక్కన ఈ చిహ్నం కనిపిస్తుంది. యాడ్‌ల ఔచిత్యం చెకప్ దశ ప్రోగ్రెస్‌లో ఉన్నప్పుడు, మేము మీ వీడియోలో యాడ్‌లను చూపించము.

అప్‌లోడ్ ప్రాసెస్ సమయంలో మా సిస్టమ్‌లు యాడ్‌ల ఔచిత్యాన్ని చెక్ చేస్తాయి. ఈ చెకప్ దశకు సాధారణంగా 20 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది, గరిష్టంగా 1 గంట సమయం పడుతుంది.

చెకప్ దశ పూర్తయినప్పుడు, చిహ్నం ఆకుపచ్చ, పసుపు, లేదా ఎరుపు రంగులోకి మారుతుంది.

ఆదాయ సామర్థ్యాన్ని గరిష్ఠ స్థాయికి పెంచుకోవడానికి, మీ వీడియోను పబ్లిక్‌గా అందుబాటులో ఉంచే ముందు చెకప్ దశలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.

 ఆన్‌లో ఉంది వీడియో మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉన్నప్పుడు దాని పక్కన ఈ చిహ్నం కనిపిస్తుంది. చాలా వరకు యాడ్‌ల కోసం వీడియోకు అర్హత ఉంటుంది. వీడియోకు సంబంధించి మీరు మొత్తం యాడ్ ఆదాయాన్ని పొందలేకపోవచ్చని గుర్తుంచుకోండి. కొన్నిసార్లు, కాపీరైట్ వివాదం లేదా చెల్లని ట్రాఫిక్ కారణంగా మీ ఆదాయం తాత్కాలికంగా నిలిపివేయబడవచ్చు.
 మినహాయింపులు వీడియోకు సంబంధించిన ప్రేక్షకుల సెట్టింగ్ 'పిల్లల కోసం రూపొందించబడినది'గా సెట్ చేసి ఉన్నప్పుడు దాని పక్కన ఈ చిహ్నం కనిపిస్తుంది. వ్యక్తిగతీకరించని యాడ్‌ల కోసం మాత్రమే వీడియోకు అర్హత ఉంటుంది. -
 షేరింగ్ మీరు పాట కవర్ వీడియోను అప్‌లోడ్ చేసి, అలాగే మ్యూజిక్ పబ్లిషర్ దాన్ని క్లెయిమ్ చేసినప్పుడు ఈ చిహ్నం కనిపిస్తుంది. ఈ మ్యూజిక్ పబ్లిషర్, మ్యూజిక్ కవర్‌లను క్రియేట్ చేసే YPPలోని క్రియేటర్‌లతో ఆదాయాన్ని షేర్ చేయడానికి గతంలో అంగీకరించారు. వీడియో, ఆదాయాన్ని మ్యూజిక్ హక్కుదారుతో షేర్ చేసుకుంటుంది. మీరు ఈ వీడియోకు సంబంధించి పూర్తి ఆదాయాన్ని కాకుండా కొంత ఆదాయాన్నే పొందుతారు. ఆదాయ షేరింగ్ అలాగే అర్హత కలిగిన కవర్ వీడియోలను మానిటైజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.
 తాకట్టు కంటెంట్ ID వివాదాన్ని ప్రాసెస్ చేసే సమయంలో ఆదాయాన్ని విడిగా ఉంచినప్పుడు వీడియో పక్కన ఈ చిహ్నం కనిపిస్తుంది. కంటెంట్ ID వివాదం పరిష్కరించబడిన తర్వాత, మేము తగిన పార్టీకి ఆదాయాన్ని పే చేస్తాము. స్టేటస్ వివరణ “కాపీరైట్ క్లెయిమ్” అని సూచిస్తే: వీడియోలో కాపీరైట్ చేసిన అంశాలున్నట్లు కనుగొనబడ్డాయని, అలాగే మీ వివాదాన్ని లేదా అప్పీల్‌ను కాపీరైట్ ఓనర్ రివ్యూ చేస్తున్నారని అర్థం. కంటెంట్ ID వివాదాల సమయంలో మానిటైజేషన్ గురించి మరింత తెలుసుకోండి.
 పరిమితం వీడియో మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ అన్నింటికీ అనుగుణంగా లేనప్పుడు దాని పక్కన ఈ చిహ్నం కనిపిస్తుంది. మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేని కంటెంట్‌కు సమ్మతిని నిలిపివేయడాన్ని బ్రాండ్‌లు ఎంచుకోవచ్చు. అందువల్ల, అడ్వర్టయిజర్‌లకు తగిన విధంగా ఉండే కంటెంట్‌తో పోలిస్తే, వీడియో తక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు.

స్టేటస్ వివరణ “యాడ్‌ల ఔచిత్యం” అని సూచిస్తున్నట్లయితే: మా ఆటోమేటిక్ సిస్టమ్‌లు ఆ వీడియోను అంచనా వేశాయి అని ఈ వివరణకు అర్థం. మీరు రివ్యూ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు, అంటే పాలసీ స్పెషలిస్ట్ వీడియోను మళ్లీ పరిశీలిస్తారు, అలాగే వీడియో తగిన విధంగా ఉంది అని భావిస్తే, దాని మానిటైజేషన్ స్టేటస్‌ను మార్చవచ్చు.

స్టేటస్ వివరణ “యాడ్‌ల ఔచిత్యం - రివ్యూలో ఉంది” అని సూచిస్తున్నట్లయితే: పాలసీ స్పెషలిస్ట్ ఈ వీడియోను రివ్యూ చేస్తున్నారని ఈ వివరణకు అర్థం. స్పెషలిస్ట్ మానిటైజేషన్ స్టేటస్‌ను అలానే ఉంచవచ్చు లేదా మార్చవచ్చు, వారిదే తుది నిర్ణయం.

స్టేటస్ వివరణ “యాడ్‌ల ఔచిత్యం - రివ్యూ ద్వారా నిర్ధారించబడింది” అని సూచిస్తున్నట్లయితే: మా పాలసీ స్పెషలిస్ట్‌లు ఈ వీడియోను రివ్యూ చేసి, అది మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేనట్లు భావిస్తున్నారని ఈ వివరణకు అర్థం. పసుపు రంగు చిహ్నం స్టేటస్‌ను మార్చడం సాధ్యపడదు.

గమనిక: ఏదైనా వీడియో చెల్లని ట్రాఫిక్‌ని కలిగి ఉన్నట్లయితే, అది పసుపు రంగు చిహ్నాన్ని చూపించదు. మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ ఆధారంగా మాత్రమే వీడియోలకు పసుపు రంగు చిహ్నాలు వర్తింపజేయబడతాయి.

 అర్హత లేదు మరింత తరచుగా, వీడియోపై కాపీరైట్ క్లెయిమ్ ఉన్నప్పుడు వీడియో పక్కన ఈ చిహ్నం కనిపిస్తుంది. వీడియోను మానిటైజ్ చేయడం సాధ్యపడదు. స్టేటస్ వివరణ “కాపీరైట్” అని సూచిస్తున్నట్లయితే: హక్కుదారు మీ వీడియోను కంటెంట్ IDని ఉపయోగించి క్లెయిమ్ చేశారని లేదా సంపూర్ణమైన, చెల్లుబాటు అయ్యే కాపీరైట్ ఉల్లంఘన వల్ల తొలగింపు రిక్వెస్ట్‌ను సమర్పించారని ఈ వివరణకు అర్థం. మీ వీడియో ప్రామాణీకరణ లేకుండా కాపీరైట్ రక్షణ ఉన్న కంటెంట్‌ను ఉపయోగించినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా, మీరు ఇకపై వీడియోను మానిటైజ్ చేయలేరు.
 ఆఫ్‌లో ఉంది వీక్షణా పేజీ యాడ్‌లకు సంబంధించి, ఈ వీడియోకు మీరు మానిటైజేషన్‌ను ఆన్ చేయకూడదని ఎంచుకున్నారని ఈ చిహ్నానికి అర్థం. ఈ చిహ్నం మీకు Shortsలో కనిపిస్తే, మీరు YouTube Studioలో Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను ఆమోదించలేదని అర్థం. వీడియో మానిటైజ్ చేయబడదు. స్టేటస్ వివరణ “కాపీరైట్” అని సూచిస్తున్నట్లయితే: అంటే మీ వీడియోలోని కంటెంట్‌పై కాపీరైట్‌ను మరొకరు కలిగి ఉన్నారని అర్థం. యాడ్‌లు ప్రదర్శించబడతాయి, అలాగే ఆ ఆదాయం కాపీరైట్ ఓనర్‌కు పంపబడుతుంది. మంచి విషయం ఏంటంటే, కాపీరైట్ ఓనర్ మీతో ఆదాయాన్ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మానిటైజేషన్ స్టేటస్‌ను “ఆన్”కు మార్చినట్లయితే, మీరు ఈ వీడియోకు సంబంధించి పాక్షిక ఆదాయాన్ని పొందుతారు.

మానిటైజేషన్ చిహ్నం ఆకుపచ్చ రంగు నుండి పసుపు రంగులోకి ఎందుకు మారవచ్చు

కొన్నిసార్లు వీడియో మానిటైజేషన్ చిహ్నం ఆకుపచ్చ రంగు నుండి పసుపు రంగు లోకి మారుతుంది. మీ వీడియో మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మా సిస్టమ్‌లు మీ వీడియోను స్కాన్ చేయడాన్ని కొనసాగిస్తున్నందున మానిటైజేషన్ స్టేటస్‌లో ఈ మార్పు జరుగుతుంది. ఈ ప్రాసెస్‌ను వేగవంతం చేయడానికి అలాగే మరింత స్థిరంగా చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తాము.

చిహ్నం మార్పుల విషయంలో మీరు తీసుకోగల చర్యలు

మీ వీడియోను లైవ్‌లో అందుబాటులో ఉంచడానికి ముందు

అప్‌లోడ్ ప్రాసెస్ సమయంలో, మీరు మీ వీడియోను పబ్లిష్ చేయడానికి చెకప్ దశల ప్రాసెస్ పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము.

మీ వీడియో లైవ్ అయిన తర్వాత

మీరు మీ వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాత, తదుపరి 24 నుండి 48 గంటల్లో వీడియో మానిటైజేషన్ స్టేటస్ మారవచ్చు. ఇది సాధారణంగా 48 గంటల తర్వాత స్థిరీకరించబడుతుంది. మీ వీడియోతో వీక్షకులు ఎలా ఇంటరాక్ట్ అవుతారనే దాని ఆధారంగా ఇది మళ్లీ మారవచ్చని గుర్తుంచుకోండి.

మీ వీడియోలో పసుపు రంగు చిహ్నం పొరపాటుగా ఉందని మీరు భావిస్తే, మీరు హ్యూమన్ రివ్యూ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు. పాలసీ స్పెషలిస్ట్ వీడియోను రివ్యూ చేసి, తుది నిర్ణయం తీసుకున్న తర్వాత, మానిటైజేషన్ చిహ్నం మారదు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8191288533255145370
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false