YouTubeలో ప్రోడక్ట్‌లు కొనుగోలు చేయండి

 

మీకు నచ్చిన క్రియేటర్‌లకు చెందిన కంటెంట్‌లో ఫీచర్ చేసిన ప్రోడక్ట్‌లను మీరు బ్రౌజ్ చేయవచ్చు, కొనుగోలు చేయవచ్చు, లేదా మీ అసక్తులకు తగిన ప్రోడక్ట్‌లను షాపింగ్ చేయవచ్చు.

YouTubeలో ప్రోడక్ట్‌లను ఎక్కడ కనుగొనవచ్చు

వివరణలోని ప్రోడక్ట్‌లు

మీరు కంటెంట్‌ను చూస్తున్నప్పుడు నేరుగా వీడియో వివరణలలోని ప్రోడక్ట్‌లను బ్రౌజ్ చేయవచ్చు. వీడియో వివరణలో, అమ్మకానికి ఉన్న ఐటెమ్‌ల లిస్ట్‌ను, ధరలను మీరు కనుగొనవచ్చు. మీరు ఏదైనా ఐటెమ్‌ను ఎంచుకుంటే, అధికారిక రిటైలర్ స్టోర్‌కు మళ్లించబడతారు. ఇతర రిటైలర్‌ల ద్వారా చేసిన మీ యాక్టివిటీలకు, కొనుగోళ్లకు YouTube బాధ్యత వహించదు.
 

గమనిక: మీకు విదేశీ కరెన్సీలో ఛార్జీ విధించబడవచ్చు. విదేశీ కరెన్సీ మార్పిడి రేట్లను బట్టి, బ్యాంక్ ఫీజులను బట్టి మీరు పేమెంట్ చేసే మొత్తం మారవచ్చు. కొనుగోలు చేసే ముందు, ఐటెమ్‌ల ధరను రిటైలర్ వెబ్‌సైట్‌లో రివ్యూ చేయండి. 

ధర, పాపులారిటీ, లభ్యత వంటి అనేక అంశాల ఆధారంగా ఐటెమ్‌లు ఆటోమేటిక్‌గా క్రమ పద్ధతిలో అమర్చబడి డిస్‌ప్లే అవుతాయి. క్రియేటర్‌లు తమ ఛానెల్ అంతటా లేదా వీడియోలోని వీడియో వివరణలో ప్రదర్శించాలనుకునే నిర్దిష్ట ఐటెమ్‌లను మాన్యువల్‌గా కూడా ఎంచుకోవచ్చు.

ప్రోడక్ట్ షెల్ఫ్

ప్రోడక్ట్ షెల్ఫ్ అనేది అర్హత ఉన్న వీడియోలకు, లైవ్ స్ట్రీమ్‌లకు దిగువున లేదా పక్కన ఉంటుంది. దీని ద్వారా, ఎవరైనా క్రియేటర్ తన వీడియోలో ఫీచర్ చేసిన ఐటెమ్‌లను వీక్షకులు ప్రివ్యూ చేయవచ్చు. ప్రోడక్ట్ షెల్ఫ్‌లో, మీరు సేల్‌లో ఉన్న ఐటెమ్‌లను, వాటి ధరలను చూడవచ్చు. మీరు ఐటెమ్‌ను ఎంచుకుంటే, ఆ ఐటెమ్ ప్రివ్యూను మీరు నేరుగా YouTubeలో చూడవచ్చు. లేదంటే, మీరు అధికారిక రిటైలర్ స్టోర్‌కు మళ్లించబడతారు. 

వీడియో, షార్ట్, లేదా లైవ్ స్ట్రీమ్ నుండి ప్రోడక్ట్‌లను చూడండి

కంటెంట్‌ను చూస్తున్నప్పుడు, ఫీచర్ చేసిన ప్రోడక్ట్‌లను మీరు బ్రౌజ్ చేయవచ్చు. కొనుగోలు చేయడానికి లేదా మరింత తెలుసుకోవడానికి, షాపింగ్ బటన్‌ను క్లిక్ చేయండి లేదా Shopping shopping bag icon ఆప్షన్‌ను ఎంచుకోండి. క్రియేటర్ తమ కంటెంట్‌లో ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌ల లిస్ట్ కనిపిస్తుంది. దానితో పాటు వారి స్టోర్ నుండి కొనుగోలు చేయడానికి వీలు కల్పించే లింక్‌లు కనిపిస్తాయి. ప్రోడక్ట్‌లను మరింత హైలైట్ చేయడానికి క్రియేటర్ తమ లైవ్ స్ట్రీమ్‌ల సమయంలో వాటిని పిన్ కూడా చేయవచ్చు.

  

లైవ్ స్ట్రీమ్‌ల కోసం క్లాసిక్, అలాగే ఆకట్టుకునే ప్లేయర్‌లు

ఛానెల్ స్టోర్

క్రియేటర్‌లు తమ వ్యక్తిగత స్టోర్‌లలో విక్రయించే ప్రోడక్ట్‌లన్నిటినీ ఛానెల్ తాలూకు స్టోర్ ట్యాబ్ చూపుతుంది. మీరు క్రియేటర్ స్టోర్ ట్యాబ్‌ను వారి ఛానెల్ హోమ్ పేజీలో చూడవచ్చు.

స్టోర్ వివరణ లింక్‌లు

వీడియో వివరణలో క్రియేటర్ తన స్టోర్‌కు సంబంధించిన URL లింక్‌ను చేర్చవచ్చు. వీడియో ప్లే అవుతున్నప్పుడు, YouTubeలో నేరుగా ఐటెమ్‌ల ప్రివ్యూను చూడటానికి URLను ఎంచుకోండి. తర్వాత, ఆ ఐటెమ్‌ను మళ్లీ ఎంచుకోవచ్చు. తద్వారా ఆ ఛానెల్ అధికారిక స్టోర్‌కు వెళ్లి, ఐటెమ్‌ను కొనుగోలు చేయవచ్చు.

క్రియేటర్‌లకు చెందిన ప్రోడక్ట్‌లను బ్రౌజ్ చేయండి, కొనుగోలు చేయండి

అందుబాటులో ఉన్న లొకేషన్‌లలో ఒక దానిలో మీరు ఉంటే, మీకు నచ్చిన YouTube క్రియేటర్‌లలో కొందరి ప్రోడక్ట్‌లను కొనుగోలు చేసి, మీరు వారిని సపోర్ట్ చేయవచ్చు. అర్హత ఉన్న క్రియేటర్‌లు YouTubeలో తమ సొంత ప్రోడక్ట్‌లను వీటిలో ప్రదర్శించవచ్చు:

  • క్రియేటర్ ఛానెల్ స్టోర్‌లో
  • వీడియో వివరణలోని ప్రోడక్ట్‌లలో
  • వీడియోకు లేదా లైవ్ స్ట్రీమ్‌కు దిగువున లేదా పక్కన ఉన్న ప్రోడక్ట్ షెల్ఫ్‌లో
  • పిన్ చేసిన ప్రోడక్ట్ ఉన్న లైవ్ స్ట్రీమ్‌లలో
  • స్టోర్ వివరణ లింక్‌లు ఉన్న వీడియో వివరణలలో
  • నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు, Shorts, లేదా లైవ్ స్ట్రీమ్‌లలోని Shopping బటన్‌లో

క్రియేటర్లు, సపోర్ట్ చేసే మా ప్లాట్‌ఫామ్‌లతో లేదా రిటైలర్‌లతో కలిసి పని చేయవచ్చు. తద్వారా వారి అధికారిక బ్రాండెడ్ అమ్మకపు వస్తువుల లాంటి వారి ప్రోడక్ట్‌లను YouTubeలో ప్రదర్శించవచ్చు. YouTubeలో మీరు వారి ఐటెమ్‌లలో ఒక దాన్ని ఎంచుకున్నప్పుడు, రిటైలర్ వెబ్‌సైట్‌లో కొత్త ట్యాబ్‌లో ఆ ఐటెమ్ తెరవబడుతుంది. ఆపై మీరు రిటైలర్ నుండి క్రియేటర్ ప్రోడక్ట్‌లను, అధికారిక అమ్మకపు వస్తువులను బ్రౌజ్ చేయవచ్చు, కొనుగోలు చేయవచ్చు. మీ కొనుగోళ్లను నియంత్రించే పాలసీల గురించి మరింత తెలుసుకోండి.

YouTubeలో ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లను బ్రౌజ్ చేయండి, కొనుగోలు చేయండి

కొంత మంది క్రియేటర్లు ఇతర బ్రాండ్‌లకు చెందిన ప్రోడక్ట్‌లను కూడా తమ YouTube వీడియోల్లో, Shortsలో, లైవ్ స్ట్రీమ్‌ల్లో ట్యాగ్ చేయవచ్చు. మీరు ఈ లొకేషన్‌లలో ఒక దానిలో ఉంటే, ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లను మీరు బ్రౌజ్ చేయవచ్చు, అలాగే కొనుగోలు చేయవచ్చు. షాపింగ్ shopping bag icon కొన్ని వీడియోలు, Shorts, లైవ్ స్ట్రీమ్‌లలోని వీక్షణ పేజీలో కనిపించి, కనీసం ఒక ప్రోడక్ట్ అయినా ట్యాగ్ చేయబడిందని సూచిస్తుంది. మీరు Shopping shopping bag icon‌ను ఎంచుకుంటే, ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లను అది ప్రదర్శిస్తుంది.

మీరు మొబైల్ పరికరంలో చూస్తుంటే, మీ సెర్చ్ ఫలితాలు, వీక్షణ ఫీడ్ లేదా మొదటి ట్యాబ్‌లోని ఫీడ్‌లో కంటెంట్ దిగువున ప్రోడక్ట్ షెల్ఫ్ కనిపించవచ్చు. క్రియేటర్ తన వీడియోలో ట్యాగ్ చేసిన ప్రోడక్ట్‌లను ప్రోడక్ట్ షెల్ఫ్ చూపుతుంది. మీరు ఏదైనా ప్రోడక్ట్‌ను ట్యాప్ చేస్తే, వీక్షణ పేజీకి మళ్లించబడతారు, అక్కడ ఎంగేజ్‌మెంట్ ప్యానెల్‌లో ప్రోడక్ట్ వివరాలను చూడవచ్చు. చూపబడిన ప్రోడక్ట్‌లపై మీకు ఆసక్తి లేకపోతే, మూసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేసి, ఈ ఫీచర్‌ను విస్మరించవచ్చు.

ప్రోడక్ట్ గురించి మరింత తెలుసుకోవడం కోసం సదరు ప్రోడక్ట్‌ను ఎంచుకుని ఒక్కో ప్రోడక్ట్ వివరాల పేజీకి వెళ్లండి లేదా నేరుగా రిటైలర్ వెబ్‌సైట్‌కు వెళ్లండి. ప్రోడక్ట్ వివరాల పేజీలో, మీరు వీటిని కూడా కనుగొనవచ్చు:

  • ప్రోడక్ట్ ఇమేజ్‌లు
  • ప్రోడక్ట్ వివరణలు
  • విభిన్న రంగులు లేదా సైజ్‌ల వంటి ప్రోడక్ట్ వేరియంట్‌లు
  • ఒక రిటైలర్ లేదా విభిన్న రిటైలర్‌లు అందించే ధర సమాచారం
  • సేవ్ & షేర్ ఆప్షన్‌లు
  • ప్రోడక్ట్ రేటింగ్‌లు
  • సంబంధిత వీడియోలు, ప్రోడక్ట్‌లు

మీరు ఐటెమ్‌ను ఎంచుకున్నప్పుడు, అది రిటైలర్ వెబ్‌సైట్‌ను తెరిచి, మిమ్మల్ని YouTube నుండి అక్కడికి మళ్లిస్తుంది. ఎక్స్‌టర్నల్ రిటైలర్ వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేయడానికి సంబంధించిన మా పాలసీల గురించి మరింత తెలుసుకోండి.

గమనిక: మీరు బ్రాండ్ ఖాతాను ఉపయోగించినప్పుడు, బ్రాండ్ ఖాతా తరఫున మీరు కొనుగోళ్లు చేయలేరు. మీ కొనుగోలు మీ బ్రాండ్ ఖాతాకు బదులుగా మీ వ్యక్తిగత ఖాతాకు లింక్ చేయబడుతుంది.

YouTubeలో ప్రోడక్ట్‌లను కొనుగోలు చేయడానికి ఇతర మార్గాలు

ఏదైనా ఒక వీడియోను మీరు చూస్తున్నప్పుడు, మీరు చూస్తోన్న దానికి సంబంధించి ఒక ప్రోడక్ట్ విభాగం 'వీక్షణ ఫీడ్‌'లో జెనరేట్ అవుతుంది. ఈ ఫీచర్ US, IN, BR, AU, CA, PH, MYలో Android లేదా iPhone పరికరంలోని YouTube యాప్‌లో అందుబాటులో ఉంది.

మీరు YouTubeలో ఒక ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేసినప్పుడు, సదరు ప్రోడక్ట్‌ను బ్రౌజ్ & షాపింగ్ చేసే ఆప్షన్ మీకు కనిపించవచ్చు. మీరు ప్రోడక్ట్‌ను క్లిక్ చేస్తే, మీరు ప్రోడక్ట్ వివరాల పేజీకి వెళ్లి, మరింత సమాచారాన్ని చూడవచ్చు. ఈ ఫీచర్ US, IN, BRలో Android లేదా iPhone పరికరంలోని YouTube యాప్‌లో అందుబాటులో ఉంది.

మీరు గతంలో చూసిన వీడియోలకు సంబంధించి ఒక ప్రోడక్ట్ విభాగం మీ 'మొదటి ట్యాబ్‌'లోని ఫీడ్‌లో ఆటోమేటిక్‌గా జెనరేట్ అవుతుంది. ఈ ఫీచర్ US, IN, లేదా BRలో Android లేదా iPhone పరికరంలోని YouTube యాప్‌లో అందుబాటులో ఉంది.

దేశానికి/ప్రాంతానికి సంబంధించి లభ్యత

మీరు క్రియేటర్‌ల నుండి లేదా వారి కంటెంట్‌లో వారు ఫీచర్ చేసిన ఇతర బ్రాండ్‌లకు సంబంధించిన ప్రోడక్ట్‌లను కొనుగోలు చేయవచ్చు. లభ్యత అనేది కింద పేర్కొన్న అంశాల ఆధారంగా మారుతుంది:

  • మీరు లైవ్ స్ట్రీమ్‌ను, వీడియోను, లేదా షార్ట్‌ను చూస్తున్నారా అనే దాని ఆధారంగా
  • మీరు ఏ దేశం/ప్రాంతంలో ఉన్నారు అనే దాని ఆధారంగా
  • ప్రోడక్ట్ అనేది క్రియేటర్‌కు సంబంధించినదా లేదా మరొక బ్రాండ్‌కు సంబంధించినదా అనే అంశం ఆధారంగా

మీరు ఈ దేశాలు/ప్రాంతాలలో ఒకదానిలో వీడియో, Shorts లేదా లైవ్ స్ట్రీమ్‌ను చూస్తున్నట్లయితే, మీరు క్రియేటర్ నుండి అమ్మకపు వస్తువుల వంటి ప్రోడక్ట్‌లను, లేదా వారు ఫీచర్ చేసే ఇతర బ్రాండ్‌ల ప్రోడక్ట్‌లను కొనుగోలు చేయవచ్చు:

  • అల్జీరియా
  • అర్జెంటీనా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • బహ్రెయిన్
  • బంగ్లాదేశ్
  • బెల్జియం
  • బ్రెజిల్
  • కంబోడియా
  • కెనడా
  • చిలీ
  • కొలంబియా
  • కోస్టారికా
  • చెక్ రిపబ్లిక్
  • డెన్మార్క్
  • డొమినికన్ రిపబ్లిక్
  • ఈక్వెడార్
  • ఈజిప్ట్
  • ఎల్ సాల్వడోర్
  • ఫిన్లాండ్
  • ఫ్రాన్స్
  • జార్జియా
  • జర్మనీ
  • ఘనా
  • గ్రీస్
  • గ్వాటెమాలా
  • హాంకాంగ్
  • హంగేరీ
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్
  • ఇజ్రాయిల్
  • ఇటలీ
  • జపాన్
  • జోర్డాన్
  • కజకిస్థాన్
  • కెన్యా
  • కువైట్
  • లెబనాన్
  • మలేషియా
  • మెక్సికో
  • మొరాకో
  • నేపాల్ 
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్ 
  • నికరాగువా
  • నైజీరియా
  • నార్వే
  • ఒమన్
  • పాకిస్థాన్ 
  • పనామా
  • పరాగ్వే
  • పెరూ
  • ఫిలిప్పీన్స్ 
  • పోలాండ్
  • పోర్చుగల్
  • ప్యూర్టోరికో
  • రొమేనియా
  • సౌదీ అరేబియా
  • సెనెగల్
  • సింగపూర్
  • స్లోవేకియా
  • దక్షిణాఫ్రికా
  • దక్షిణ కొరియా
  • స్పెయిన్
  • శ్రీలంక 
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్ 
  • టాంజానియా
  • థాయ్‌లాండ్ 
  • ట్యునీషియా
  • టర్కీ
  • ఉగాండా
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్
  • ఉరుగ్వే
  • వియత్నాం
  • జింబాబ్వే

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12728212246641926581
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false