Studio కంటెంట్ మేనేజర్‌లో కొత్త అప్‌డేట్‌లు ఏంటి

తాజా అప్‌డేట్‌లు

  మే 2024
  • మేము కొత్త, 20M+ Creator Music టాప్ సబ్‌స్క్రయిబర్‌ల బకెట్‌ను పరిచయం చేశాము. YouTube Studio కంటెంట్ మేనేజర్ లైసెన్స్ క్రియేషన్, మేనేజ్‌మెంట్ పేజీల అంతటా మీకు ఇది కనిపిస్తుంది.
జనవరి 2024
  • అస్సెట్ మెటాడేటా పేజీలో ఆర్టిస్ట్ ISNI సెర్చ్: Studio కంటెంట్ మేనేజర్ యూజర్ ఇంటర్‌ఫేస్ (UI)లోని అస్సెట్‌ మెటాడేటా  పేజీలో ఆర్టిస్ట్ పేరును ఎంటర్ చేస్తే, మ్యాచింగ్ పేర్ల లిస్ట్‌తో పాటుగా, ISNI డేటాబేస్ నుండి వారి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నేమ్ ఐడెంటిఫయర్‌లు (ISNIలు) వస్తాయి. దయచేసి ఇది ఆప్షనల్ అని గమనించండి: ఆర్టిస్ట్ పేరును టైప్ చేసి, Enterను నొక్కినా కూడా పాప్-అప్ బాక్స్ తెరుచుకుంటుంది, అందులో మీరు ఆర్టిస్ట్ పేరును, వారి ISNI లేకుండానే సేవ్ చేయవచ్చు. మరింత తెలుసుకోండి.

అక్టోబర్ 2023 

  • YouTube అడ్వర్టయిజింగ్ ఫార్మాట్ కంట్రోల్స్‌కు చేసిన మార్పులు: అప్‌లోడ్ చేసే సమయంలో, యాడ్‌లను ఇప్పుడు ఆన్ చేయడం వలన మీ నిడివి ఎక్కువ ఉన్న వీడియోకు ముందు లేదా తర్వాత ముందస్తు యాడ్, అనంతర యాడ్, స్కిప్ చేయదగిన లేదా స్కిప్ చేయదగని యాడ్‌లు కనిపించవచ్చు. మరింత తెలుసుకోండి.
సెప్టెంబర్ 2023
  • కంటెంట్ డెలివరీ టెంప్లేట్ ద్వారా రెఫరెన్స్ సెగ్మెంట్‌లను మినహాయించడం: Studio కంటెంట్ మేనేజర్ కంటెంట్ డెలివరీలో "రెఫరెన్స్ - మేనేజ్‌మెంట్" CSV టెంప్లేట్ ద్వారా, రెఫరెన్స్ సెగ్మెంట్‌లను మినహాయించడానికి మేము ఒక కొత్త ఫీచర్‌ను జోడిస్తున్నాము. ఇప్పటికే ఉన్న రెఫరెన్స్‌లకు మాన్యువల్ రెఫరెన్స్ మినహాయింపులను పార్ట్‌నర్‌లు ఇప్పుడు బల్క్‌లో జోడించవచ్చు, రీప్లేస్ చేయవచ్చు, లేదా తీసివేయవచ్చు. మరింత తెలుసుకోండి.

ఆగస్ట్ 2023

  • క్లెయిమ్ చేసిన వీడియోల లిస్ట్ పేజీలో కొత్త 'సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్య' ఫిల్టర్: Studio కంటెంట్ మేనేజర్‌లోని క్లెయిమ్ చేసిన వీడియోల లిస్ట్ పేజీలో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫిల్టర్, ఛానెళ్ల సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్య ఆధారంగా, క్లెయిమ్ చేసిన వీడియోలను ఫిల్టర్ చేసే వెసులుబాటును అందిస్తుంది.

    ఇక్కడ అందించబడిన సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్య గల ఛానెళ్లను ఫిల్టర్ చేసే ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి: 1K కంటే తక్కువ సబ్‌స్క్రయిబర్‌లు, 1k-100k సబ్‌స్క్రయిబర్‌లు, 100k-500k సబ్‌స్క్రయిబర్‌లు, 500k-5M సబ్‌స్క్రయిబర్‌లు, 5M కంటే ఎక్కువ సబ్‌స్క్రయిబర్‌లు. సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్య ఫిల్టర్ గురించి మరింత తెలుసుకోండి.
జూన్ 2023
  • అస్సెట్ ఎగుమతులలో యాజమాన్య హక్కు అనే కొత్త నిలువు వరుస: అస్సెట్ యాజమాన్య హక్కుకు సంబంధించిన సమాచారాన్ని అందించే ఉద్దేశంతో అస్సెట్‌ల పేజీలోని అస్సెట్ ఎగుమతులలో ఇప్పుడు పూర్తి వివరాలతో "యాజమాన్య హక్కు" అనే నిలువు వరుసను చేర్చడం జరిగింది. అస్సెట్‌లను ఎగుమతి చేయడం గురించి మరింత తెలుసుకోండి.

ఏప్రిల్ 2023

  • కొత్త ఫిల్టర్: విలీనం అయిన అస్సెట్: అస్సెట్‌ల పేజీలో "విలీనం అయిన అస్సెట్" అనే కొత్త ఫిల్టర్ ఉంది, ఇది మిమ్మల్ని విలీనం అయిన లేదా విలీనం కాని అస్సెట్‌లను చూడటానికి అనుమతిస్తుంది. అస్సెట్‌లను కనుగొనడం కోసం ఫిల్టర్‌లను ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి.
  • అస్సెట్ రిపోర్ట్‌లు ఇప్పుడు రోజూ అందుబాటులో ఉన్నాయి: అస్సెట్ రిపోర్ట్‌లు ఇప్పుడు రోజువారీగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. అస్సెట్ రిపోర్ట్‌లు రిపోర్ట్‌ల  పేజీలోని అస్సెట్‌ల ట్యాబ్ నుండి డౌన్‌లోడ్ చేయబడ్డాయి. డౌన్‌లోడ్ చేయగల రిపోర్ట్‌ల గురించి మరింత తెలుసుకోండి.

ఫిబ్రవరి 2023

  • అస్సెట్ లేబుళ్లను ఉపయోగించేందుకు కొత్త మార్గాలు: Studio కంటెంట్ మేనేజర్‌లో అస్సెట్ లేబుళ్లను మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో మీకు సహాయపడే కొత్త ఫీచర్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇప్పుడు వీటిని చేయవచ్చు:
    • గరిష్ఠంగా 15,000 అస్సెట్ లేబుళ్లను కలిగి ఉండవచ్చు (మునుపటి పరిమితి 5,000).
    • అస్సెట్ లేబుళ్ల పేజీ నుండి నేరుగా అస్సెట్ లేబుల్‌కు అస్సెట్‌లను జోడించవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
    • లేబుల్ క్రియేట్ చేసిన తేదీని అస్సెట్ లేబుళ్ల పేజీలో చూడవచ్చు.
    • బల్క్‌లో అస్సెట్ లేబుళ్లను తొలగించవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
    • మాన్యువల్‌గా క్లెయిమ్ చేసే టూల్‌లో అస్సెట్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు అస్సెట్ లేబుల్‌ను జోడించవచ్చు లేదా క్రియేట్ చేయవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
    • అస్సెట్ లేబుళ్ల పేరు మార్చవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
    • అస్సెట్ లేబుళ్లను, క్లెయిమ్ చేసిన వీడియో ఎగుమతులలో చూడవచ్చు.
    • అస్సెట్ లేబుల్ డేటాను .CSV ఫైల్‌గా ఎగుమతి చేయవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

జనవరి 2023

  • Studio కంటెంట్ మేనేజర్ డ్యాష్‌బోర్డ్ కార్డ్‌లో కొత్త అప్‌డేట్‌లు ఏంటి: మీ డ్యాష్‌బోర్డ్  పేజీలో, "Studio కంటెంట్ మేనేజర్‌లో కొత్త అప్‌డేట్‌లు ఏంటి" అనే పేరు గల కొత్త కార్డ్ ఉంది. Studio కంటెంట్ మేనేజర్‌లోని కొత్త ఫీచర్‌లు, ఫంక్షనాలిటీకి సంబంధించిన క్విక్ అప్‌డేట్‌లను ఈ కార్డ్ చూపుతుంది. మరింత సమాచారం కావాలంటే, అప్‌డేట్‌లు లింక్ చేసే ఈ సహాయ కేంద్రం ఆర్టికల్‌కు వెళ్లి మీరు తెలుసుకోవచ్చు.

మునుపటి అప్‌డేట్‌లు

2022

హక్కుదారులు, అప్‌లోడర్‌లు ఇరువురికి సంబంధించిన కంటెంట్ ID వివాదం, అప్పీల్ ప్రాసెస్‌కు మేము కొన్ని మెరుగుదలలు చేస్తున్నాము. ప్రాసెస్ గురించి ఏళ్లుగా మేము విన్న ఫీడ్‌బ్యాక్ నుండి ఈ మెరుగుదలలు వచ్చాయి. ఈ మార్పులు Studio కంటెంట్ మేనేజర్‌లోని మీ కొన్ని వర్క్‌ఫ్లోలపై ప్రభావం చూపవచ్చు. మారుతున్నవి ఇవే:

1. ఉత్తమమైన కావలసిన అర్హతలు: అప్పీల్ ప్రాసెస్ దుర్వినియోగ అవకాశాలను తగ్గించడం కోసం, కంటెంట్ ID అప్పీళ్లను సమర్పించడానికి యూజర్‌లకు ఉండాల్సిన అవసరాలను పెంచుతున్నాము. ఇప్పటి నుండి, అప్పీల్ సమర్పించే సామర్థ్యం మా అధునాతన ఫీచర్ యాక్సెస్ ద్వారా పరిమితం చేయబడుతుంది, ఇది మేము గత కొన్నేళ్లుగా ప్రవేశపెడుతున్న ఫీచర్, దీనికి యూజర్‌లు యాక్సెస్ పొందడానికి గుర్తింపు సమాచారం అందించాలి లేదా కాలానుగుణంగా వారి ఛానెల్ హిస్టరీని అయినా నిర్మించుకోవాలి.

దీని వల్ల కొన్ని, అధిక క్వాలిటీ అప్పీల్‌లు వస్తాయి కాబట్టి, కంటెంట్ ID అప్పీళ్లను రివ్యూ చేసే సమయ వ్యవధిని కూడా 30 రోజుల నుండి 7 రోజులకు కుదిస్తున్నాము. 7 రోజుల తర్వాత ఎలాంటి చర్య తీసుకోకపోతే స్టాండర్డ్ అప్పీల్ గడువు ముగింపు వర్తిస్తుంది.ఒకవేళ ఆ అప్పీల్ 7 రోజుల వ్యవధిలో రివ్యూ చేయబడనప్పటికీ ఏ సమయంలోనైనా తొలగింపు రిక్వెస్ట్‌ను సమర్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు రివ్యూ చేయాల్సిన అప్పీళ్లు సమస్యలు అనే పేజీలో కనిపిస్తాయి, వాటిని మీరు అప్పీల్ గడువు ముగింపు తేదీ ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చవచ్చు.  

2. అప్పీల్ చేయడానికి పై స్థాయికి రిపోర్ట్ చేయడం: “అప్పీల్ చేయడానికి పై స్థాయికి రిపోర్ట్ చేయడం” అన్నది యూజర్‌ల కోసం అధునాతన ఫీచర్ యాక్సెస్‌తో ప్రవేశపెడుతున్న మరొక మార్పు. తమ వీడియోలపై ఉన్న బ్లాక్ క్లెయిమ్‌లను సవాలు చేయాలనుకుంటున్న అర్హత కలిగిన యూజర్‌లు ప్రారంభ వివాద దశ ఆప్షన్‌ను దాటవేసి, తక్షణమే అప్పీల్‌ను సమర్పించే ఆప్షన్‌ను కలిగి ఉంటారు. మానిటైజ్, అలాగే ట్రాక్ క్లెయిమ్‌లు “అప్పీల్ చేయడానికి పై స్థాయికి రిపోర్ట్ చేయడం” ఫీచర్‌కు అర్హత కలిగి ఉండవు, బ్లాక్ క్లెయిమ్‌లు మాత్రమే అర్హత కలిగి ఉంటాయి. 

అలాగే అప్పీల్ కోసం మీకు ఉన్న ఆప్షన్‌లు, ఉదాహరణకు క్లెయిమ్‌ను రిలీజ్ చేయడం లేదా తొలగింపు రిక్వెస్ట్‌ను జారీ చేయడం వంటివి మారడం లేదని గుర్తుంచుకోండి. 

మీరు మేనేజ్ చేసే ఛానెల్స్ కూడా ఈ మార్పుల నుండి ప్రయోజనం పొందుతాయి, ఎందుకంటే అవి ఏవైనా క్లెయిమ్‌లను సవాలు చేయాలనుకుంటే, ఇప్పుడు వాటి ముందు వేగవంతమైన పరిష్కార ఆప్షన్‌లు ఉంటాయి.

ఈ మార్పులు జూలై 18, 2022 నుండి అమల్లోకి వస్తాయి. ఆ తేదీ తర్వాత సమర్పించిన వివాదాలు, అప్పీల్స్‌కు మాత్రమే మార్పులు వర్తిస్తాయి. మీ వర్క్‌ఫ్లోలను మేనేజ్ చేయడం కోసం మీకు సమయం ఇవ్వడానికి, మార్పులు కాలానుగుణంగా అమల్లోకి వస్తాయి.

 

ఫీడ్‌బ్యాక్

Studio కంటెంట్ మేనేజర్ ఫీచర్‌లపై మీకు ఉన్న ఫీడ్‌బ్యాక్‌ను మాకు పంపడానికి ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. Studio కంటెంట్ మేనేజర్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, ఫీడ్‌బ్యాక్‌ను పంపండి ని ఎంచుకోండి.
  3. మీ ఫీడ్‌బ్యాక్‌ను ఎంటర్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ ఎంత నిర్దిష్టంగా ఉంటే, అది మాకు అంత ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది.
    • గమనిక: మీ ఫీడ్‌బ్యాక్‌లో ఎటువంటి గోప్యమైన సమాచారాన్ని (సురక్షితంగా ఉంచాల్సిన ఏ డేటా అయినా) చేర్చకండి. ఉదాహరణకు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, లేదా వ్యక్తిగత వివరాలను చేర్చకండి.
  4. మీరు స్క్రీన్‌షాట్‌ను చేర్చాలనుకుంటున్నారో, లేదో ఎంచుకోండి. మీరు స్క్రీన్‌లోని ఏ సమాచారాన్ని అయినా హైలైట్ చేయవచ్చు లేదా ఏదైనా గోప్యమైన సమాచారం కనిపిస్తే, దానిని తీసివేయవచ్చు.
  5. మీ ఫీడ్‌బ్యాక్‌ను ఎంటర్ చేయడం పూర్తయ్యాక, పంపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మాకు అందే ఫీడ్‌బ్యాక్ అంతటినీ మేము చదివి, పరిగణనలోకి తీసుకుంటామని, అయితే సమర్పించిన వాటన్నింటికీ మేము రిప్లయి చేయలేకపోతున్నామని గుర్తుంచుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2989157234197203966
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false