మీరు ఇష్టపడే ఆర్టిస్ట్‌ల మ్యూజిక్‌ను కనుగొనండి

మీరు మ్యూజిక్ ఆర్టిస్ట్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం ద్వారా వారి సరికొత్త మ్యూజిక్, వీడియోలు, టూర్‌ల గురించి వారి ఛానెల్‌ల నుండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌లు పొందవచ్చు.

ఆర్టిస్ట్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

మీరు ఈ సూచనలు పాటించడం ద్వారా YouTubeలో ఇతర క్రియేటర్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకున్నట్టుగానే ఆర్టిస్ట్‌కు కూడా చేసుకోవచ్చు:

  1. YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీరు ఇష్టపడే ఆర్టిస్ట్ వీడియోకు వెళ్లండి.
  3. వీడియో ప్లేయర్ దిగువున, సబ్‌స్క్రయిబ్ చేయిని క్లిక్ చేయండి లేదా ట్యాప్ చేయండి.

మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న తర్వాత, ఆర్టిస్ట్ పబ్లిష్ చేసిన ఏవైనా కొత్త వీడియోలు మీ సబ్‌స్క్రిప్షన్ ఫీడ్‌లో కనిపిస్తాయి. ఛానెల్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం గురించి తెలుసుకోండి. మీరు ఛానెల్ పేజీలలో కూడా ఆర్టిస్ట్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.

ఆర్టిస్ట్ కలిగి ఉండగలిగే ఛానెల్‌ల రకాలు

ఒక ఆర్టిస్ట్ YouTubeలో ఒకటి కంటే ఎక్కువ ఛానెల్‌లు కలిగి ఉండవచ్చు:

  • ఆర్టిస్ట్ వారంతట వారే మేనేజ్ చేసుకునే ఛానెల్.
  • పార్టనర్ అందించే ఛానెల్, దీనిని YouTube Music డిస్ట్రిబ్యూషన్ పార్టనర్ మేనేజ్ చేస్తారు (అంటే, రికార్డ్ లేబుల్ లాంటివి).
  • టాపిక్ ఛానెల్, దీనిని YouTube ఆటోమేటిక్‌గా జెనరేట్ చేస్తుంది. ఈ ఛానెల్‌ల టైటిల్‌లు “ఆర్టిస్ట్ పేరు - టాపిక్” ఫార్మాట్‌లో ఉంటాయి, అలాగే ఛానెల్ పరిచయం విభాగంలో “YouTube ఆటోమేటిక్‌గా జెనరేట్ చేసినది” అని సూచించబడుతుంది. ఆర్టిస్ట్‌ల కోసం ఆటోమేటిక్‌గా జెనరేట్ అయిన టాపిక్ ఛానెల్‌ల గురించి దిగువున తెలుసుకోండి.
  • అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌ సంగీత చిహ్నం , ఇది ఆర్టిస్ట్‌కు సంబంధించిన వివిధ YouTube ఛానెల్‌లు అన్నింటి నుండి రూపొందించే మ్యూజిక్ మరియు వీడియోల సేకరణ. మీరు YouTubeలో ఆర్టిస్ట్ కోసం సెర్చ్ చేయడం ద్వారా వారి అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌ (OAC)ని కనుగొనవచ్చు. అలాగే ఆర్టిస్ట్ అధికారిక మ్యూజిక్ వీడియోను చూడటం ద్వారా కూడా వారి OACని కనుగొనవచ్చు. అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌‌ల గురించి తెలుసుకోండి.

మీరు ఆర్టిస్ట్ టాపిక్ ఛానెల్ లేదా పార్టనర్ అందిస్తున్న ఛానెల్‌కు ఇదివరకే సబ్‌స్క్రయిబ్ చేసుకుని ఉంటే, వారి అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా దాని సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. ఆ తర్వాత ఆర్టిస్ట్ యొక్క అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌ నుండి నోటిఫికేషన్‌లు పంపబడతాయి. ఆర్టిస్ట్‌ల నుండి ‌నోటిఫికేషన్‌ల గురించి దిగువున తెలుసుకోండి.

ఆర్టిస్ట్ యొక్క అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌‌కు సబ్‌స్క్రయిబ్ అయిన తర్వాత వారి టాపిక్ ఛానెల్, పార్టనర్ అందిస్తున్న ఛానెల్‌కు కలిగి ఉండే సబ్‌స్క్రిప్షన్‌లు ఇన్‌యాక్టివ్‌గా మారతాయి. అంటే, అవి ఆ తర్వాత మీ సబ్‌స్క్రిప్షన్‌ల లిస్ట్‌లో ఉండవు. అయినా కూడా మీరు ఆర్టిస్ట్ టాపిక్ ఛానెల్ లేదా పార్టనర్ అందిస్తున్న ఛానెల్‌ను సెర్చ్‌లో కనుగొనగలుగుతారు, కానీ ఈ ఛానెల్‌లకు ఆ తర్వాత 'సబ్‌స్క్రయిబ్ చేయి' బటన్ ఉండదు.

ఎప్పటి లాగానే, అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌‌లతో సహా మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న ఏ ఛానెల్‌కు సంబంధించి అయినా మీ సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేసుకోవచ్చు.

ఆర్టిస్ట్‌ల నుండి నోటిఫికేషన్‌లు

మీరు ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న తర్వాత, ఆ ఛానెల్‌లో కొత్త వీడియోలు పబ్లిష్ అయినప్పుడు, మీకు నోటిఫికేషన్‌లు రావడం ప్రారంభం కావచ్చు. ఆటోమేటిక్‌గా మేము ఛానెల్ నుండి మీకు హైలైట్‌లు మాత్రమే పంపుతాము. మీ నోటిఫికేషన్‌లను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

ఒకవేళ ఆర్టిస్ట్‌కు అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌ ఉన్నట్లయితే, మీ సబ్‌స్క్రిప్షన్‌ల ఫీడ్‌లో ఉండే వారి అధికారిక ఛానెల్ నుండి మాత్రమే మీరు నోటిఫికేషన్‌లను అందుకుంటారు.

మీరు అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌ నుండి ఎలాంటి నోటిఫికేషన్‌లు అందుకునేది, ఆ ఆర్టిస్ట్‌కు సంబంధించిన ఇతర ఛానెల్‌ల కోసం మీరు సెట్ చేసుకుని ఉన్న నోటిఫికేషన్ ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది:

  • మీరు అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌‌లో బెల్ నోటిఫికేషన్‌లు సెట్ చేసుకుని ఉంటే, ఇతర ఛానెల్‌లలో మీ సెట్టింగ్‌తో సంబంధం లేకుండా మీరు బెల్ నోటిఫికేషన్‌లను అందుకుంటారు. 
  • మీరు అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌‌లో హైలైట్‌లు సెట్ చేసుకుని ఉంటే, ఇతర ఛానెల్‌లలో మీ సెట్టింగ్‌తో సంబంధం లేకుండా మీరు హైలైట్‌లను అందుకుంటారు. 
  • మీరు అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌‌లో ఇంకేదైనా ఇతర నోటిఫికేషన్ సెట్టింగ్ కలిగి ఉండి, పార్టనర్ అందిస్తున్న ఛానెల్‌లో బెల్ నోటిఫికేషన్‌లు సెట్ చేసుకుని ఉంటే లేదా నోటిఫికేషన్‌లు ఏవీ సెట్ చేసుకోకుండా ఉంటే, పార్టనర్ అందిస్తున్న ఛానెల్‌లోని సెట్టింగ్‌ల నుండి అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను పొందుతుంది.
  • టాపిక్ ఛానెల్‌లోని ప్రాధాన్యతలు అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌కు సంబంధించిన మీ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను ప్రభావితం చేయవు.

ఆర్టిస్ట్‌ల కోసం ఆటోమేటిక్‌గా జెనరేట్ అయ్యే టాపిక్ ఛానెల్‌లు

మీకు సెర్చ్‌లో టాపిక్ ఛానెల్, అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్ రెండూ కనిపించవచ్చు. ఆర్టిస్ట్ టాపిక్ ఛానెల్ అన్నది YouTube ద్వారా ఆటోమేటిక్‌గా జెనరేట్ అవుతుంది, అలాగే "ఆర్టిస్ట్ పేరు - టాపిక్” అని టైటిల్ కలిగి ఉంటుంది. ఒకవేళ ఆర్టిస్ట్‌కు అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌ లేకపోతే, వారి టాపిక్ ఛానెల్‌కు మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. దీని వలన టాపిక్ ఛానెల్ మీ సబ్‌స్క్రిప్షన్‌ల జాబితాకు చేర్చబడుతుంది, కానీ మీ సబ్‌స్క్రిప్షన్‌ల ఫీడ్‌కు ఎలాంటి వీడియోలు చేర్చబడవు. మీరు టాపిక్ ఛానెల్‌ల నుండి నోటిఫికేషన్‌లు పొందరు.

మీరు టాపిక్ ఛానెల్ కలిగిన ఆర్టిస్ట్ అయితే, అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్ సెటప్ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నాము.

 

ఒక ఆర్టిస్ట్‌కు టాపిక్ ఛానెల్‌ను ఎప్పుడు ఆటో-జెనరేట్ చేయాలో YouTube ఎలా నిర్ణయిస్తుంది?

ఆర్టిస్ట్ YouTubeలో గణనీయ స్థాయిలో ఉనికిని కలిగి ఉంటే, ఆ ఆర్టిస్ట్ కోసం టాపిక్ ఛానెల్ క్రియేట్ అవుతుంది. ఆర్టిస్ట్‌కు టాపిక్ ఛానెల్ లేకపోవడానికి ఈ కింది అంశాలు కారణాలు కావచ్చు:

  • ఆర్టిస్ట్ నుండి కొన్ని వీడియోలు మాత్రమే ఉన్నాయి.
  • ఆర్టిస్ట్ వీడియోలకు అంత ఎక్కువ వీక్షణలు లేవు.
  • ఆర్టిస్ట్ వీడియోలు YouTube క్వాలిటీ స్టాండర్డ్‌లకు అనుగుణంగా లేవు.
ఆర్టిస్ట్ టాపిక్ ఛానెల్‌లో ఎలాంటి కంటెంట్ ఉంటుందన్నది YouTube ఎలా నిర్ణయిస్తుంది?

అల్గారిథమ్‌లను ఉపయోగించి, YouTube ఒక వీడియోలోని ప్రధాన టాపిక్‌లను తెలుసుకుంటుంది, అలాగే ఆర్టిస్ట్ కోసం వీడియో సేకరణలను డెవలప్ చేయడానికి ఆ సమాచారాన్ని ఉపయోగిస్తుంది. టాపిక్ ఛానెల్‌లలో ఆర్టిస్ట్ ఛానెల్‌లోని కంటెంట్, అలాగే యూజర్ రూపొందించిన కంటెంట్ ఉంటుంది. ఈ ఛానెల్‌లు YouTube తరపున ఎటువంటి ఎడిటోరియల్ అభిప్రాయాన్ని తెలియజేయవు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
463846929545617462
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false