యాడ్‌లతో మానిటైజ్ చేయడానికి వీడియోలను అప్‌లోడ్ చేయడం

మీరు యాడ్‌లతో మానిటైజ్ చేయాలనుకుంటున్న వీడియోను అప్‌లోడ్ చేస్తున్నప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

అప్‌లోడ్ చేసే సమయంలో యాడ్‌ల ఔచిత్యాన్ని చెక్ చేయండి

మీ వీడియోను పబ్లిష్ చేయడానికి ముందు, దాని యాడ్‌ల ఔచిత్యాన్ని చెక్ చేయడానికి, అలాగే ఏవైనా కాపీరైట్ క్లెయిమ్‌ల కోసం చెక్ చేయడానికి, దాన్ని అప్‌లోడ్ చేసేటప్పుడు మీరు చెకప్ దశల పేజీని ఉపయోగించవచ్చు. మీరు మానిటైజేషన్‌కు వర్తించే అవకాశమున్న పరిమితుల గురించి తెలుసుకోవడంలో ఈ చెకప్ దశలు సహాయపడతాయి, తద్వారా మీరు వాటిని పబ్లిష్ చేసే ముందే సర్దుబాటు చేయవచ్చు.

అప్‌లోడ్ ఫ్లోలో కాపీరైట్ & యాడ్‌ల ఔచిత్యం "చెకప్ దశలు"

సొంత సర్టిఫికేషన్ ఎలా సహాయపడుతుంది

సొంత సర్టిఫికేషన్ ద్వారా, YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లోని క్రియేటర్‌లందరికీ, మానిటైజేషన్ నిర్ణయాలపైన మరింత కంట్రోల్ ఉంటుంది. మీరు ఆశించిన మానిటైజేషన్ స్టేటస్‌ను, అలాగే రియల్ టైంలో ఆదాయ సామర్థ్యాన్ని కూడా చూడవచ్చు.

అధిక నిర్దిష్టత రేటింగ్ హిస్టరీ ఉన్న క్రియేటర్‌ల విషయంలో: ప్రారంభ మానిటైజేషన్ నిర్ణయం కోసం మేము మీ ఇన్‌పుట్‌ను ఉపయోగిస్తాము. అప్పుడు మీ వీడియోను అప్‌లోడ్ చేసిన వెంటనే మీరు దాన్ని పబ్లిష్ చేయవచ్చు, మానిటైజ్ చేయవచ్చు. మీ రేటింగ్‌తో మా సిస్టమ్‌లు ఏవైనా వ్యత్యాసాలను కనుగొంటే, అది మారే అవకాశం ఉంది. చాలా వ్యత్యాసాలు ఒక గంటలోపే కనుగొనబడతాయి.

సొంత సర్టిఫికేషన్‌కు కొత్త క్రియేటర్‌లు లేదా తక్కువ నిర్థిష్టత రేటింగ్ హిస్టరీ ఉన్న క్రియేటర్‌ల విషయంలో: మానిటైజేషన్ నిర్ణయాల కోసం మేము మా ఆటోమేటిక్ సిస్టమ్‌లపై ఎక్కువగా ఆధారపడతాము. రివ్యూ ఇంకా ప్రోగ్రెస్‌లో ఉన్నప్పుడు, దాన్ని తెలియజేయడానికి ‘చెక్ చేస్తోంది’ మానిటైజేషన్ చిహ్నం కూడా ఉంది. సిస్టమ్ చెకప్ దశలు పూర్తయ్యే వరకు వీడియోలను మానిటైజ్ చేయడం సాధ్యం కాదు.

మీ రేటింగ్ హిస్టరీని చెక్ చేయడానికి, మీ రేటింగ్ స్టేటస్‌ను అర్థం చేసుకోండి.

మా మానిటైజేషన్ చిహ్నాలను అర్థం చేసుకోండి

విభిన్న చిహ్నాలకు సంబంధించిన అర్థాలు ఇక్కడ ఉన్నాయి:

 ఆకుపచ్చ: మానిటైజేషన్ “ఆన్‌లో” ఉంటుంది, అలాగే వీడియో పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది.

 పసుపు: మీ కంటెంట్ అడ్వర్టయిజర్‌లందరీ నుండి పరిమితం చేయబడిన యాడ్‌లతో లేదా యాడ్‌లు లేకుండా ప్రదర్శించబడవచ్చు. మీరు వీడియోను పబ్లిష్ చేయవచ్చు, ఎడిట్ చేయవచ్చు, అలాగే తిరిగి అప్‌లోడ్ చేయవచ్చు లేదా మీ కంటెంట్ కోసం మాన్యువల్ రివ్యూను రిక్వెస్ట్ చేయవచ్చు.

 ఎరుపు: మీరు మానిటైజేషన్‌ను ఆన్ చేసినప్పటికీ వీడియోపై కాపీరైట్ క్లెయిమ్ ఉన్నందున దాన్ని మానిటైజ్ చేయడం సాధ్యం కాదు. కొన్నిసార్లు, మీరు వివాదాన్ని ఫైల్ చేయవచ్చు.

 బూడిద రంగు: మీరు ఈ వీడియోకు మానిటైజేషన్‌ను ఆన్ చేయకూడదని ఎంచుకున్నారు.

 చెక్ చేస్తోంది: సిస్టమ్ చెకప్ దశలు ఇంకా రన్ అవుతున్నాయి. చెకప్ దశలు రన్ అవుతున్నప్పటికీ మీరు వీడియోను పబ్లిక్‌గా పబ్లిష్ చేయవచ్చు, కానీ పబ్లిష్ చేసే ముందు అది పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. మీ ఆదాయాన్ని గరిష్ఠ స్థాయికి పెంచడానికి, ఈ చిహ్నం ఆకుపచ్చ, పసుపు లేదా ఎరుపు రంగు చిహ్నంతో రీప్లేస్ అయ్యే వరకు వేచి ఉండండి, అంటే చెక్ చేయడం పూర్తయ్యే వరకు అని అర్థం. మా సిస్టమ్‌లు సాధారణంగా వేగవంతంగా ఉంటాయి లేదా మేము మీ సొంత సర్టిఫికేషన్ ఇన్‌పుట్‌పై ఆధారపడతాము, కాబట్టి చాలా మంది క్రియేటర్‌లకు ఈ చిహ్నం కనిపించదని గుర్తుంచుకోండి.

మా మానిటైజేషన్ చిహ్నం గైడ్‌లో ప్రతి చిహ్నానికి సంబంధించిన అర్థం గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13450813613605455821
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false