మీరు మానిటైజ్ చేసే వీడియోలలో యాడ్స్ ఎలా ప్రదర్శించబడతాయి

క్రియేటర్ ఆదాయాన్ని పెంచడం కోసం మీ వీడియోకు ముందు లేదా తర్వాత చూపే యాడ్ ఫార్మాట్‌లకు సంబంధించిన ఎంపికలను మేము సరళీకృతం చేశాము. ముందస్తు, అనంతర, స్కిప్ చేయదగిన, స్కిప్ చేయదగని యాడ్‌లకు సంబంధించిన విడి విడి యాడ్ ఎంపికలను మేము తీసివేశాము. ఇప్పుడు, మీరు నిడివి ఎక్కువ ఉన్న కొత్త వీడియోలకు యాడ్‌లను ఆన్ చేసినప్పుడు, తగిన సమయంలో మీ వీక్షకులకు మేము ముందస్తు, అనంతర, స్కిప్ చేయదగిన, లేదా స్కిప్ చేయదగని యాడ్‌లను చూపుతాము. అందరికీ స్టాండర్డ్‌గా ఉండేలా, యాడ్ ఫార్మాట్‌లన్నింటినీ సిఫార్సు చేసిన బెస్ట్ ప్రాక్టీసు ఆన్ చేసేలా ఈ మార్పు చేస్తుంది. మధ్యలో వచ్చే యాడ్‌లకు సంబంధించిన మీ ఎంపికలు మారలేదు. మీరు మానిటైజేషన్ సెట్టింగ్‌లను మారిస్తే మినహా, ఇప్పటికే ఉన్న నిడివి ఎక్కువ ఉన్న వీడియోలకు సంబంధించిన మీ యాడ్ ఎంపికలను మేము అలాగే ఉంచుతాము.

మీ ఛానెల్ కోసం మానిటైజేషన్‌ను ఆన్ చేసినప్పుడు, మీరు వీక్షణ పేజీలో లేదా Shorts ఫీడ్‌లో ప్రదర్శించబడే యాడ్‌ల నుండి వచ్చే ఆదాయాన్ని షేర్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. యాడ్‌ల వేలం, Google Ad Manager, ఇంకా ఇతర YouTube ద్వారా విక్రయించబడే సోర్స్‌ల ద్వారా యాడ్‌లు ప్రదర్శించబడతాయి. మీరు మానిటైజేషన్‌ను ఆన్ చేసిన తర్వాత, యాడ్‌లు ప్రదర్శించబడటానికి కొంత సమయం పట్టవచ్చు.

మీ వీడియో మెటాడేటా, అలాగే కంటెంట్ అడ్వర్టయిజర్-ఫ్రెండ్లీనా కాదా అనేటటువంటి సమాచారాన్ని బట్టి మీ వీడియోలో యాడ్స్ ఆటోమేటిక్‌గా ఎంచుకోబడతాయి.

మీ వీడియోలకు మరింత సందర్భోచితమైన యాడ్స్‌ను అందించడానికి మేము నిరంతరం మా సిస్టమ్‌లను పర్యవేక్షించి, అప్‌డేట్ చేస్తాము. అయితే, మీ వీడియోలలో ప్రదర్శించబడే ప్రతీ యాడ్‌ను మేము మాన్యువల్‌గా కంట్రోల్ చేయము కాబట్టి మేము నిర్దిష్ట యాడ్స్‌ను ప్లే చేస్తామని హామీ ఇవ్వలేము.

మానిటైజ్ చేయబడిన వీడియోలలో యాడ్స్ ఎల్లప్పుడూ చూపబడవు. వీడియోను చూసే సమయంలో యాడ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. యాడ్స్‌తో ఏదైనా సమస్య ఉన్నట్లుగా మీకు అనిపిస్తే, మీ వీడియోలలో యాడ్స్ ఎందుకు ప్రదర్శించబడలేదు అనే దాని గురించి తెలుసుకోండి.

పార్ట్‌నర్-విక్రయించిన యాడ్స్ అంటే ఏమిటి?

2010 నుండి, YouTube కొంతమంది పార్ట్‌నర్‌లను తమ కంటెంట్‌ను YouTubeలో ఉంచినందుకు గానూ వారిని యాడ్స్‌ను విక్రయించడానికి అనుమతించింది. వీటిని "పార్ట్‌నర్-విక్రయించిన యాడ్స్" అని అంటారు. పార్ట్‌నర్-విక్రయించిన యాడ్స్‌కు అర్హత పొందడానికి, సంబంధిత సంస్థలు తప్పనిసరిగా కంటెంట్‌ను వివిధ ప్లాట్‌ఫామ్‌లలో పబ్లిష్ చేయాలి, అలాగే తమ వీడియోలలో యాడ్స్‌ను విక్రయించడానికి (సేల్స్ ఫోర్స్‌‌లతో సహా) సంబంధిత కంపెనీ, అవస్థాపనను కలిగి ఉండాలి.

పార్ట్‌నర్-విక్రయించిన యాడ్స్ విషయంలో, పార్ట్‌నర్‌లు వారికి చెందిన కంటెంట్‌కు సంబంధించిన యాడ్స్‌ను అందించడానికి వారు నేరుగా అడ్వర్టయిజర్‌లతో పని చేస్తారు. అడ్వర్టయిజర్‌లు ఈ పార్ట్‌నర్‌లు అందించే యాడ్స్‌ను కొనుగోలు చేస్తారు కాబట్టి యాడ్స్ నిర్దిష్ట కంటెంట్‌లో ప్రదర్శించబడతాయి. అంటే "చాలా మంది అడ్వర్టయిజర్‌లకు తగినవి కావు" అని YouTube భావించే వీడియోలలో కూడా పార్ట్‌నర్-విక్రయించిన యాడ్స్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ పార్ట్‌నర్‌లు అడ్వర్టయిజర్‌లతో నేరుగా పని చేయడం ద్వారా యాడ్ ప్లేస్‌మెంట్‌కు సంబంధించి పూర్తి బాధ్యత వహిస్తారు. అడ్వర్టయిజర్‌లు తమ బ్రాండ్‌కు తగినవి కావు అని భావించే కంటెంట్‌లో యాడ్స్‌ను ప్రదర్శించినట్లయితే, దానికి సంబంధించిన పూర్తి నష్టాన్ని పార్ట్‌నర్‌లు భరిస్తారు.

విషాదాలకు సంబంధించిన కంటెంట్ గురించిన యాడ్స్‌ను పార్ట్‌నర్‌లు విక్రయించలేరు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15335123557281969351
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false