YouTube విరాళంతో లాభాపేక్ష రహిత సంస్థకు డొనేట్ చేయండి

YouTubeలో స్వచ్ఛంద విరాళాలతో క్రియేటర్‌లు, ఇంకా ఫ్యాన్స్ ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడడం కోసం YouTube విరాళం అనేది రూపొందించబడింది. కొన్ని వీడియోలు అలాగే లైవ్ స్ట్రీమ్‌లు వీడియో క్రియేటర్ సపోర్ట్ చేస్తున్న లాభాపేక్ష రహిత సంస్థకు డొనేట్ చేసే ఆప్షన్‌ను మీకు ఇస్తాయి.

లావాదేవీ ఫీజులను YouTube భరిస్తుంది కాబట్టి, మీరు విరాళంగా ఇచ్చే డబ్బులో 100% మొత్తం అర్హత ఉన్న లాభాపేక్ష రహిత సంస్థకు అందించబడుతుంది. లాభాపేక్ష రహిత సంస్థలకు ఇచ్చిన విరాళాలకు రీఫండ్‌ను పొందలేరు. మరింత సమాచారం కోసం మా YouTube విరాళం FAQలను చదవండి.

డొనేట్ చేయడం ఎలా

'విరాళం' బటన్

కొంతమంది క్రియేటర్‌లకు చెందిన వీడియోల పక్కన, అలాగే లైవ్ స్ట్రీమ్‌ల పక్కన 'విరాళం' అనే ఒక బటన్ ఉంటుంది. డొనేట్ చేయడానికి, కింది దశలను ఫాలో చేయండి.

'విరాళం' అనే బటన్ ఉన్న వీడియోకు వెళ్లండి, ఆ తర్వాత:

  1. విరాళం అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. మీరు విరాళం ఇవ్వాలనుకుంటున్న డబ్బును, ఆ తర్వాత కొనసాగించండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. మీ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  4. విరాళం ఆ తర్వాత పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

లాభాపేక్ష రహిత సంస్థ అలాగే YouTube క్రియేటర్, మీ వ్యక్తిగత సమాచారాన్ని చూడలేరు.

మీ పేమెంట్ ప్రాసెస్ చేయబడిన తర్వాత, మీకు ఈమెయిల్ ద్వారా రసీదు వస్తుంది.

లైవ్ చాట్ విరాళాలు

లైవ్ చాట్ విరాళాల కోసం సూపర్ చాట్ ఫర్ గుడ్ స్థానంలో లైవ్ చాట్ విరాళాలు రీప్లేస్ చేయబడ్డాయి. లైవ్ స్ట్రీమ్‌లో ఒక క్రియేటర్ నిధుల సమీకరణ చేస్తున్నప్పుడు, ఇంకా లైవ్ చాట్‌ను ఆన్ చేసినప్పుడు, మీకు చాట్‌లో 'విరాళం' బటన్ కనిపిస్తుంది.

విరాళం ఇవ్వడానికి:

  1. లైవ్ చాట్‌లోనే విరాళం ను ఎంచుకోండి. లైవ్ చాట్‌ను చూడటానికి మొబైల్ పరికరాలు తప్పనిసరిగా పోర్ట్రెయిట్ మోడ్‌లో ఉండాలి.
  2. విరాళం మొత్తాన్ని ఎంచుకోండి లేదా వేరొక విలువను ఎంటర్ చేయడానికి ఇతరం అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. లైవ్ చాట్‌లో మీ యూజర్‌నేమ్‌ను ప్రదర్శించడానికినేను నా విరాళాన్ని పబ్లిక్‌గా ఉంచాలనుకుంటున్నాను అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. లేకపోతే, మీ విరాళం “అజ్ఞాత వ్యక్తి” అనే పేరుతో చూపబడుతుంది.
  4. విరాళం అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. మీ విరాళాన్ని పూర్తి చేయడానికి, స్క్రీన్ పై సూచనలను ఫాలో అవ్వండి.
గమనిక: మీ విరాళం పక్కన మీరు మీ యూజర్‌నేమ్‌ను చూపించకూడదనుకుంటే, నేను నా విరాళాన్ని పబ్లిక్‌గా ఉంచాలనుకుంటున్నాను పక్కన ఉన్న బాక్స్‌లో ఎంపికను తీసివేయండి.

మీ పేమెంట్ ప్రాసెస్ చేయబడిన తర్వాత, మీకు ఈమెయిల్ ద్వారా రసీదు వస్తుంది.

మీ విరాళం గురించిన పన్ను సమాచారం

విరాళాల సహాయ కేంద్రంలో పన్ను సమాచారం గురించి తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3946835211986116598
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false