అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్

క్రియేటర్ ఆదాయాన్ని పెంచడం కోసం మీ వీడియోకు ముందు లేదా తర్వాత చూపే యాడ్ ఫార్మాట్‌లకు సంబంధించిన ఎంపికలను మేము సరళీకృతం చేశాము. ముందస్తు, అనంతర, స్కిప్ చేయదగిన, స్కిప్ చేయదగని యాడ్‌లకు సంబంధించిన విడి విడి యాడ్ ఎంపికలను మేము తీసివేశాము. ఇప్పుడు, మీరు నిడివి ఎక్కువ ఉన్న కొత్త వీడియోలకు యాడ్‌లను ఆన్ చేసినప్పుడు, తగిన సమయంలో మీ వీక్షకులకు మేము ముందస్తు, అనంతర, స్కిప్ చేయదగిన, లేదా స్కిప్ చేయదగని యాడ్‌లను చూపుతాము. అందరికీ స్టాండర్డ్‌గా ఉండేలా, యాడ్ ఫార్మాట్‌లన్నింటినీ సిఫార్సు చేసిన బెస్ట్ ప్రాక్టీసు ఆన్ చేసేలా ఈ మార్పు చేస్తుంది. మధ్యలో వచ్చే యాడ్‌లకు సంబంధించిన మీ ఎంపికలు మారలేదు. మీరు మానిటైజేషన్ సెట్టింగ్‌లను మారిస్తే మినహా, ఇప్పటికే ఉన్న నిడివి ఎక్కువ ఉన్న వీడియోలకు సంబంధించిన మీ యాడ్ ఎంపికలను మేము అలాగే ఉంచుతాము.
మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంటే, యాడ్‌ల నుండి వచ్చే ఆదాయంలో మీకు వాటా లభిస్తుంది. మీ ఛానెల్‌లో ఏ వీడియోలు, ఏ Shorts, అడ్వర్టయిజర్‌లకు తగిన విధంగా ఉన్నాయి అన్నది మీరు అర్థం చేసుకునేందుకు ఈ ఆర్టికల్ రూపొందించబడింది. ఏ కంటెంట్‌పై యాడ్‌లు ప్రదర్శిస్తారు, ఏ కంటెంట్‌పై పరిమితంగా యాడ్‌లను ప్రదర్శిస్తారు, ఏ కంటెంట్‌పై అస్సలు యాడ్‌లను ప్రదర్శించరు, అలాగే ఎప్పుడు మానిటైజేషన్‌ను ఆఫ్ చేస్తారు అనే అంశాలకు సంబంధించి ప్లాట్‌ఫామ్‌లో ఉండే సొంత సర్టిఫికేషన్ ప్రశ్నావళిని, అలాగే నిర్దిష్ట నియమాలను అర్థం చేసుకోవడానికి క్రియేటర్‌లు ఈ ఆర్టికల్‌ను ఉపయోగిస్తారు. మా పాలసీలు మీ కంటెంట్‌లోని అన్ని భాగాలకు (వీడియో, షార్ట్, లేదా లైవ్ స్ట్రీమ్, థంబ్‌నెయిల్, టైటిల్, వివరణతో పాటు ట్యాగ్‌లకు కూడా) వర్తిస్తాయి. మా బెస్ట్ ప్రాక్టీసుల గురించి మరింత తెలుసుకోండి.

మా సిస్టమ్‌లు తీసుకునే నిర్ణయాలన్నీ సరైనవి కాకపోవచ్చు, అందువలన మా ఆటోమేటిక్ సిస్టమ్‌లు తీసుకున్న నిర్ణయాల విషయంలో మీరు హ్యూమన్ రివ్యూ కోసం రిక్వెస్ట్ చేయవచ్చు.

23 ఏప్రిల్ 2024: అనుచితమైన భాషకు సంబంధించిన మా గైడ్‌లైన్స్‌లో "యాడ్ ఆదాయం లేదు" రేటింగ్‌కు దారి తీసే అత్యంత అసభ్య పదజాలం లేదా దూషణల ఉదాహరణలను మేము అప్‌డేట్ చేశాము. అప్‌డేట్ చేసిన వివరాలు, పాలసీల్లో మార్పును సూచించవు, మా ప్రస్తుత పాలసీని మరింత స్పష్టం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. మీ వీడియోలు ఎలా రివ్యూ చేయబడతాయి అనే దానిలో ఏ మార్పూ ఉండబోదు.
మార్చి 23, 2022: ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా, యుద్దాన్ని అనుకూలంగా ఉపయోగించుకునే, తోసిపుచ్చే, లేదా సమర్థించే కంటెంట్ తదుపరి నోటీసు వచ్చే వరకు మానిటైజేషన్‌కు అనర్హమైనది. ఈ అప్‌డేట్ ఈ యుద్దానికి సంబంధించి మా గైడెన్స్‌ను స్పష్టం చేయడానికి, అలాగే కొన్ని సందర్భాల్లో విస్తరించడానికి ఉద్దేశించబడింది.

Note: All content uploaded to YouTube must comply with both our Community Guidelines and our Program Policies. If your content violates our Community Guidelines, it may be removed from YouTube. If you see violative content, you can report it.

ఈ ఆర్టికల్ ద్వారా మీకు ఏ సమాచారం అందుతుంది

"పరిమిత యాడ్‌లు లేదా యాడ్‌లు ప్రదర్శించబడవు" అనే మానిటైజేషన్ స్టేటస్‌కు కారణం అవుతూ యాడ్‌లకు అనుకూలం కాని కంటెంట్‌కు సంబంధించిన ఉదాహరణలు ఇక్కడ కనిపిస్తాయి.

అడ్వర్టయిజ్‌మెంట్‌లకు అనుకూలం కాని ప్రధాన టాపిక్‌లన్నీ ఇక్కడ ఉన్నాయి:

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

సందర్భం అనేది చాలా ముఖ్యమని దయచేసి గమనించండి. మ్యూజిక్ వీడియోల వంటి కళాత్మక కంటెంట్‌లో, అనుచితమైన భాష, తక్కువ స్థాయి మాదక ద్రవ్యాల వాడకానికి సంబంధించిన రెఫరెన్స్‌లు, లేదా అశ్లీలం కాని లైంగిక థీమ్‌లు ఉన్నా కూడా ఈ కంటెంట్ అడ్వర్టయిజింగ్‌కు తగినది కావచ్చు.

పాలసీ వివరాలన్నింటినీ ఒకేసారి తెరవడం వలన మీరు నిర్దిష్ట నియమాల కోసం ఈ పేజీని సెర్చ్ చేయడానికి సహాయపడవచ్చు. అన్ని గైడ్‌లను తెరవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అనుచితమైన భాష

వీడియో ప్రారంభంలో లేదా వీడియోలోని చాలా భాగంలో అసభ్యమైన లేదా అనాగరికమైన పదజాలం ఉన్న కంటెంట్, అడ్వర్టయిజింగ్‌కు తగినది కాకపోవచ్చు. అసభ్య పదజాలాన్ని అక్కడక్కడా ఉపయోగించినంత మాత్రాన (మ్యూజిక్ వీడియోలలో, బ్యాకింగ్ ట్రాక్‌లలో, ఇంట్రో/అవుట్రో మ్యూజిక్‌లో, లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేసిన మ్యూజిక్‌లో వంటివి), మీ వీడియో అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు అని భావించవలసిన అవసరం లేదు.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

టైటిల్, థంబ్‌నెయిల్, లేదా వీడియోలో “దీనబ్బ” లేదా “దీనమ్మ” వంటి సంక్షిప్తీకరించిన, సెన్సార్ చేయబడిన అసభ్యమైన పదజాలాన్ని ఉపయోగించడం. “లంజ”, “బోకు గాడు”, "గుద్ద", “పియ్య” వంటి అసభ్య పదాలను వీడియోలో తరచుగా ఉపయోగించడం. మ్యూజిక్‌లో లేదా స్టాండ్ అప్ కామెడీ వీడియో కంటెంట్‌లో ఉపయోగించే దాదాపు అసభ్య పదజాలం అంతా ఇందులో పరిగణించబడుతుంది.

నిర్వచనాలు:
  • “సెన్సార్ చేసిన అసభ్య పదజాలం”, పదాన్ని బ్లీప్ లేదా మ్యూట్ చేయడం, అలాగే రాసి ఉన్న పదాలను నల్లని బార్‌లు, చిహ్నాలు, లేదా పోస్ట్-ప్రొడక్షన్‌లో జోడించిన టెక్స్ట్‌తో కప్పివేయడం వంటి వాటిని సూచిస్తుంది.
  • “సంక్షిప్తీకరించిన అసభ్య పదజాలం”, WTF (“వాట్ ది ఫక్”) వంటి సంక్షిప్త పదాన్ని సూచిస్తుంది, ఇలాంటప్పుడు ఒరిజినల్ పదానికి బదులుగా దాని సంక్షిప్త పదాలు ఉపయోగించబడతాయి.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

మొదటి 7 సెకన్లలో తీవ్రమైన అసభ్య పదజాలాన్ని (దెం* వంటిది) ఉపయోగించడం, లేదా కొద్దిపాటి అసభ్య పదజాలాన్ని (“పియ్య” వంటిది) టైటిల్ లేదా థంబ్‌నెయిల్‌లో ఉపయోగించడం.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:
  • వీడియో అంతటా అసభ్య పదజాలాన్ని ప్రధానంగా ఉపయోగించడం (చాలా వాక్యాలలో అసభ్య పదజాలం ఉపయోగించడం వంటివి).
  • మ్యూజిక్ టైటిల్‌లో లేదా థంబ్‌నెయిల్‌లో లేదా స్టాండ్ అప్ కామెడీ కంటెంట్‌లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

థంబ్‌నెయిల్స్‌లో లేదా టైటిల్స్‌లో తీవ్రమైన అసభ్య పదజాలాన్ని (దెం* వంటిది) ఉపయోగించడం.వీడియో, థంబ్‌నెయిల్‌లో లేదా టైటిల్‌లో "మా*గోడు" లేదా "హో*" వంటి ద్వేషపూరిత భాష లేదా దూషణలు ఉన్న ఏదైనా అత్యంత అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం.

ద్వేషపూరిత భాష లేదా దూషణలకు సంబంధించిన అదనపు సమాచారం కోసం, మా సహాయ కేంద్రంలోని ద్వేషపూరితమైన & అమర్యాదకరమైన కంటెంట్‌కు సంబంధించిన మా గైడ్‌లైన్స్‌ను కూడా మీరు చూడవచ్చు.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

హింస

కంటెంట్‌లో అసందర్భోచితంగా రక్తాన్ని, హింసను, లేదా గాయాన్ని ప్రధానంగా ప్రదర్శించినప్పుడు, ఆ కంటెంట్ అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు. మీరు హింసాత్మక కంటెంట్‌ను వార్తలు, విద్యా సంబంధమైన, కళాత్మక లేదా డాక్యుమెంటరీ సందర్భంలో చూపెడుతున్నట్లయితే, ఆ అదనపు సందర్భం అనేది కీలకం. ఉదాహరణకు, పాత్రికేయ వృత్తిలో భాగంగా ఏదైనా హింసాత్మక ఘటనపై కచ్చితమైన వార్తలను రిపోర్ట్ చేసే కంటెంట్, వీడియోలో ఉన్నట్లయితే ఆ వీడియో మానిటైజేషన్‌కు తగినది కావచ్చు. ఎడిట్ చేయని వీడియో గేమ్‌ప్లేలో హింస ఉనప్పటికీ, సాధారణంగా అది యాడ్స్‌కు తగినదిగా పరిగణించబడుతుంది. అయితే మాంటేజ్‌ల్లో, అంటే ఎడిట్ చేసిన విజువల్స్‌లో మితిమీరిన హింసను ప్రధానంగా చూపితే అవి యాడ్స్‌కు తగినవి కావు. అన్ని గేమ్‌లు (అవి వాస్తవికంగా ఉన్నా లేదా వాస్తవికంగా లేకపోయినా), ఈ పాలసీ పరిధిలోకి వస్తాయి.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

సాధారణంగా నిర్వహించే డ్యూటీతో పాటు చట్టాన్ని అమలు చేయడం (బలవంతంగా అరెస్ట్ చేయడం, గుంపును నియంత్రించడం, అధికారితో వాదన, బలవంతంగా ప్రవేశించడం); ఎడిట్ చేయని గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియోలో భాగంగా మొదటి 15 సెకన్ల తర్వాత హింస ఉండటం; తక్కువ రక్తాన్ని చూపే స్వల్ప హింస ఉండటం; పూర్తిగా సెన్సార్ చేయబడిన, బ్లర్ చేసి అస్పష్టంగా చూపిన, ఖననం చేయడానికి సిద్ధం చేయబడిన, లేదా విద్యా సంబంధ వీడియోలో భాగంగా యుద్ధాల వంటి చారిత్రక సంఘటనలలో చూపబడిన మృతదేహాలు ఉండటం.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

సాధారణ హింస

  • స్పష్టంగా చూపని హింసను లేదా స్పష్టంగా చూపే హింసను కలిగి ఉన్న నాటకీయమైన కంటెంట్.
    • సుదీర్ఘమైన కథనంలో, హింసాత్మకమైన యాక్షన్ సీన్‌లో భాగంగా భౌతికపరమైన హానిని (బుల్లెట్ గాయాల వంటివి) కొద్ది సమయం పాటు ప్రదర్శించే సీన్‌ను చూపడం.
    • యాక్షన్ సినిమాలోని (స్క్రిప్ట్ చేయబడిన కంటెంట్ వంటివి) హింసాత్మక పోరాట దృశ్యాలను క్లుప్తంగా చూపడం, ఈ సందర్భంలో గాయాలు దాదాపుగా కనబడవు.
    • స్క్రిప్ట్ చేయబడిన కంటెంట్‌లో సంభవించిన మరణం కారణంగా బాధపడుతున్న వ్యక్తులను చూపడం.
  • తీవ్రమైనవి కాని గాయాలను చూపడం.
    • ఒక పాత్రధారి, వారి మోకాళ్లపై కూలబడి గాయపడటం, ఈ సందర్భంలో, ఆ గాయాలలో అస్సలు రక్తం కనిపించదు లేదా అది తక్కువగా కనిపిస్తుంది.
    • స్క్రిప్ట్ లేదా క్రీడలలో భాగంగా ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తు కొండ మీద నుండి దొర్లిపోవడం లేదా గోడకు తగలడం.
గేమింగ్
  • గేమింగ్‌లో హింస, వీటితో సహా:
    • వీడియోలోని మొదటి 15 సెకన్ల తర్వాత స్పష్టంగా చూపే సీన్‌లు (ఒక వ్యక్తి మీద రక్తపాతం సంభవించేలా జరిగిన దాడి వంటివి).
    • అవాస్తవికమైన, సరదాగా ఉండే, అలాగే అన్ని వయస్సుల వారికి ఆమోదయోగ్యమైన హింస (రాకాసుల నుండి పారిపోవడాన్ని చూపించే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ వీడియో గేమ్‌లు వంటివి).
    • సెన్సార్ చేయబడిన, బ్లర్ చేయబడిన లేదా కనబడకుండా చేయబడిన హింస (బ్లర్ చేయబడిన తలను నరికే సీన్ వంటివి).
మరణం, విషాదం
  • ఈ కింద పేర్కొనబడినవి ఉన్న విద్యా సంబంధిత లేదా చారిత్రక కంటెంట్:
    • హింసాత్మక దృశ్యాలు లేకుండా మృతదేహాలను చూపడం.
      • మరణించిన వారి గౌరవసూచకంగా జరిగిన బహిరంగ ప్రదర్శనలో, స్పష్టంగా చూపని మృతదేహాన్ని ప్రదర్శించడం.
    • పూర్తిగా సెన్సార్ చేయబడిన (ఉదాహరణకు, బ్లర్ చేయబడినవి), స్పష్టంగా చూపే మృతదేహాలు.
  • పరిమితంగా హింసాత్మక చర్యలను చూపించే లేదా అస్సలు హింసాత్మక చర్యలను గానీ లేదా వాటి ఫలితాలను గానీ చూపకుండా ఒకటి లేదా అంత కంటే ఎక్కువ మరణాలు సంభవించిన (సామూహిక కాల్పులు లేదా ఉగ్రవాద దాడుల వంటి సున్నితమైన సంఘటనలను మినహాయించి) విషాద ఘటనలను కవర్ చేయడం.
    • బాధితుల స్థితి గురించి స్పష్టంగా చూపే వర్ణణలు లేకుండా, సమీపంలో జరిగిన హత్యా సంఘటనల రిపోర్ట్‌లు.
  • వీటిని కలిగి ఉన్న విద్యాపరమైన, నాటకీయమైన, పాత్రికేయ రిపోర్టింగ్ లేదా మ్యూజిక్ వీడియోలు:
    • ఘోరమైన మరణాన్ని లేదా తీవ్రమైన శారీరక హానిని చూపే క్షణం
    • మరణం లేదా తీవ్రమైన శారీరక హాని సంభవించేందుకు అవకాశం ఉన్న తీవ్రమైన ఆస్తి నష్టం జరిగే సంఘటనలు (బాంబు దాడులు, మంటలు, భవనాలు కూలిపోవడం, మొదలైనటువంటివి).
    • బహిరంగ అంత్యక్రియలలో, తెరిచి ఉన్న శవపేటికలతో కూడిన ఖననం చేయడానికి ఇంకా సిద్ధం చేయబడని మృతదేహాలను ప్రదర్శించడం.
వేటాడటం
  • జంతువుల గాయాలను స్పష్టంగా చూపడం లేదా అవి ఎక్కువ సమయం బాధపడటాన్ని చూపడం వంటి అంశాలు లేని వేటకు సంబంధించిన కంటెంట్.
    • చంపిన క్షణాన్ని లేదా గాయాన్ని అస్పష్టంగా చూపే వేటాడే వీడియోలు, ఈ చనిపోయిన జంతువును ట్రోఫీ లేదా ఆహార ప్రయోజనాల కోసం ఎలా ప్రాసెస్ చేస్తారు అనే దానిపై ఈ వీడియోలలో ఫోకస్ చేయడం జరగదు.
జంతు హింస
  • సహజంగా జరిగే జంతు హింసను స్పష్టంగా కనబడకుండా చూపడం.
    • హింసాత్మకమైన వివరాలను (వేటాడబడే జంతువుకు సంబంధించి రక్తంతో ఉన్న శరీర భాగాలపై లేదా ఆహారాన్ని వేటాడటానికి సంబంధించి స్పష్టంగా చూపే దృశ్యాలపై ఫోకస్ చేయడం వంటివి) చేర్చకుండా వేటాడే జంతువుల వేటను చూపడం; కొంత రక్తం అస్పష్టంగా కనిపించినప్పటికీ, అది కంటెంట్ యొక్క ప్రధాన సబ్జెక్ట్ కాదు.
జంతు హింస
  • జాతి అనుకూల ట్రయినింగ్‌ను ఇచ్చేటప్పుడు, వైద్యపరమైన చికిత్సను అందించేటప్పుడు లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించేటప్పుడు బాధను అనుభవించే జంతువులు.
  • హింసకు సంబంధించిన అసలైన ఫుటేజ్‌ను చేర్చకుండా జంతు హింసను కవర్ చేయడం లేదా దాని గురించి చర్చించడం.
క్రీడల్లో హింస
  • రక్షణ కవచాలు ధరించినప్పటికీ లేదా భద్రత పరంగా జాగ్రత్తలు తీసుకోబడ్డాయని హామీ ఇచ్చినప్పటికీ ఆయుధాలు ఉపయోగించే పోరాటపు క్రీడలలో (ఫెన్సింగ్ వంటివి) చోటుచేసుకొనే హింస.
  • క్రీడలలో స్పష్టంగా కనబడని గాయాలను లేదా క్రీడలు ఆడటంలో భాగంగా రక్తంతో కూడిన స్పష్టంగా కనబడే గాయాలను చూపడం.
    • ప్రొఫెషనల్ సెట్టింగ్‌లో (ఉదాహరణకు, ఫిట్‌నెస్ సెంటర్‌లో లేదా క్రీడా మైదానంలో) నిర్వహించబడే బాక్సింగ్ వంటి పోరాటపు క్రీడలు.
  • క్రీడలు ఆడటంలో భాగంగా సంభవించే స్పష్టంగా కనబడని గాయాలు (చీలమండ బెణకడం వంటివి).
పోరాటాలు (పోరాటపు క్రీడలను మినహాయించి)
  • కనబడే గాయం లేదా నాకౌట్ వంటివి లేకుండా విద్యాపరమైన సందర్భంలో భాగంగా పోరాటాలను చూపడం.
    • ట్యుటోరియల్‌గా షేర్ చేసిన ఆత్మరక్షణ చర్యలు.
  • కనబడే గాయాలేవీ లేకుండా వ్యక్తుల పోరాటాలను అప్పుడప్పుడూ కొద్ది సమయం పాటు చూపడం.
పోలీసులు, ఇతర సాయుధ దళాల చర్యలలో భాగంగా భౌతిక హాని
  • పోలీసులు, ఇతర సాయుధ దళాల సిబ్బందితో, పోరాట రహిత లేదా నొచ్చుకునేలా లేని ఇంటరాక్షన్‌లు.
    • పోలీసులతో సాధారణ ఇంటరాక్షన్‌లు (దిశలను అడగడం, పార్కింగ్ టికెట్‌ను తీసుకోవడం మొదలైనటువంటివి).
  • పోలీసులతో భౌతికంగా లేని వాగ్వివాదాలు, పోలీసులు ప్రాపర్టీని సీజ్ చేయడం లేదా ప్రాపర్టీలోకి బలవంతంగా ప్రవేశించడం, పోలీసులు వెంబడించడం.
  • విద్యాపరమైన సందర్భంలో లేదా పాత్రికేయ రిపోర్టింగ్‌లో పోలీసులు లేదా ఇతర సాయుధ దళాలతో జరిగే హింస, పోరాటం, లేదా నొచ్చుకునేలా జరిగే వాగ్వివాదాలు.
    • హింసాత్మకమైన ప్రజల నిరసనకు సంబంధించిన (పౌరులను కొట్టడం లేదా నేలపైకి నెట్టడం వంటివి) వార్తల రిపోర్ట్‌లోని క్లిప్‌లను చూపించి చేసే కామెంటరీ.
    • అల్లర్లలో పోలీసులు పౌరులపై నీటిని చల్లడానికి సంబంధించిన రిపోర్టింగ్.
యుద్ధం, సంఘర్షణ
  • యుద్ధం అలాగే/లేదా ఘర్షణకు సంబంధించి హింసాత్మకం కాని అంశాలను కలిగి ఉన్న విద్యా సంబంధిత కవరేజీ లేదా చర్చ.
    • బాధను లేదా వేదనను చూపడం గానీ లేదా ప్రస్తావించడం గానీ చేయకుండా కనబడని టార్గెట్‌ల వైపు కాల్పులు జరపడాన్ని చూపడం.
మైనర్‌లతో ముడిపడి ఉన్న హింస
  • గాయాలు లేదా క్షోభ వంటివి లేని, మైనర్‌ల మధ్య జరిగే సరదా కొట్లాటలను లేదా హింసాత్మక కొట్లాటలను చూపే వీడియోలు.
  • మైనర్‌ల మధ్య హింసపై తీసిన మ్యూజిక్ కంటెంట్, ఈ కంటెంట్‌లో ఆ హింసకు సంబంధించిన కొట్లాట చూపబడదు లేదా కేవలం కొద్ది సమయం పాటు మాత్రమే చూపబడుతుంది.
నిర్వచనాలు:
  • "తేలికపాటి హింస" అంటే వాస్తవిక కంటెంట్‌లో గొడవలు లేదా గుద్దటం వంటి యధాలాపంగా వచ్చే హింసాత్మక చర్యలు.
  • "స్పష్టంగా చూపని హింస" అంటే మరొక వ్యక్తి పట్ల కోపావేశాలతో కూడిన శారీరక ప్రవర్తనను చూపడం, ఉదాహరణకు, అరుస్తున్నప్పుడు వేలు చూపించడం లేదా ఒంటరిగా చేసే హింసాత్మక చర్యలు (బాటిల్‌ను గోడకు విసిరికొట్టడం వంటివి).
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

పోలీసులు లేదా ఇతర సాయుధ దళాల చర్యల కారణంగా కంటికి కనబడే గాయాల హింసను స్పష్టంగా చూపడం; విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ సందర్భాలలో భాగంగా (చరిత్ర గురించి తెలిపే ఛానెల్ వంటి సందర్భాల్లో) స్పష్టమైన గాయాలు ఉన్న లేదా దారుణమైన స్థితిలో ఉన్న మృతదేహాలను చూపినప్పుడు; థంబ్‌నెయిల్‌లో లేదా కంటెంట్‌లో ముందుగా గేమ్‌లోని హింసను స్పష్టంగా చూపడం; గాయాలు లేకుండా ఏదైనా సాయుధ పోరాట ఫుటేజ్‌ను ప్రాసెస్ చేయకుండా చూపినప్పుడు; విషాదాలను స్పష్టంగా వివరాలతో చూపడం; తీవ్రమైన, షాక్‌కు గురి చేసే గాయలను నాటకీయంగా చూపించే కంటెంట్.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

సాధారణ హింస

  • తీవ్రమైన గాయానికి కారణమయ్యే నాటకీయ హింస, ఈ సందర్భంలో హింస తాలూకు పరిణామాలు లేదా ప్రభావాలు స్పష్టంగా కనబడతాయి.
    • ఎముకలు విరిగినట్లు స్పష్టంగా కనిపించే తీవ్రమైన రక్తపాతంతో కూడిన లేదా భయంకరమైన సీన్‌లు.
    • చిన్న, అత్యంత స్పష్టంగా చూపే హింసాత్మక సీన్‌లు (సామూహిక హత్యల వంటివి) ఉన్న నాటకీయమైన, నిడివి ఎక్కువ ఉన్న వీడియో కంటెంట్ లేదా అటువంటి స్పష్టంగా చూపే హింసాత్మక సీన్‌లతో కూడిన వీడియో కంపైలేషన్.
    • విషాదాలకు సంబంధించి అత్యంత స్పష్టంగా చూపే వివరాలు (ఆడియో లేదా వీడియో రూపంలో).
    • ఊపిరాడకపోవడాన్ని లేదా తీవ్రమైన నొప్పిని, బాధను అనుభవించే వ్యక్తులు, ఉదాహరణకు, ఆగకుండా దగ్గడం వలన.
    • వ్యక్తులకు హాని జరిగినట్టు స్పష్టంగా కనబడే లేదా తీవ్రమైన మానసిక క్షోభ వంటి వేదనను కలిగించే విపత్తులకు సంబంధించిన ఫుటేజ్.
  • హింసాత్మక సంఘటన ఫలితంగా ధ్వంసమైన భవనాల శిధిలాలకు సంబంధించిన (టైఫూన్ వచ్చిన తర్వాత స్కూళ్లకు సంబంధించిన శిధిలాల వంటివి) లేదా స్వల్ప గాయాలతో ఉన్న వ్యక్తులకు సంబంధించిన (చీలమండలు బెణకడం లేదా వేళ్లకు కట్టు వేయడం వంటివి) ప్రాసెస్ చేయని ఫుటేజ్.

గేమింగ్

  • థంబ్‌నెయిల్‌లో లేదా వీడియోలోని మొదటి 8 నుండి 15 సెకన్లలో గ్రాఫిక్ గేమ్ హింస. 
    • “గ్రాఫిక్ గేమ్ హింస”లో క్రూరమైన హత్యలు లేదా శరీర ద్రవాలు అలాగే భాగాలపై ఫోకస్ చేసే తీవ్రమైన గాయాలు ఉంటాయి, ఉదాహరణకు శిరచ్ఛేదం అలాగే అవయవాల నరికివేత వంటివి. 

మరణం, విషాదం

  • పలువురి ప్రాణనష్టంతో కూడిన విషాదాలను రిపోర్ట్ చేయడం, ఇందులో స్పష్టంగా చూపే లేదా భయంకరమైన వివరాలు ఉంటాయి.
    • మరణానికి దారితీసిన పరిస్థితుల గురించి వివరణాత్మక భాషను ఫీచర్ చేసే, ఇటీవలి హత్యపై తీసిన డాక్యుమెంటరీ.

పోరాటాలు (పోరాటపు క్రీడలను మినహాయించి)

  • విద్యాపరమైన సందర్భంలో, స్పష్టంగా కనిపించే గాయం లేదా నాకౌట్‌లను ఫీచర్ చేసే వీధి పోరాటాలు.
    • గాయాలు, మానసిక వేదనను (అరవడం వంటివి) ఫీచర్ చేసే సీన్‌లతో సహా స్పష్టంగా చూపే వీధి పోరాటాలు.

పోలీసులు, ఇతర సాయుధ దళాల చర్యలలో భాగంగా భౌతిక హాని

  • పోలీసులు, ఇతర సాయుధ దళాల చర్యలతో కూడిన తీవ్రమైన పోరాట సంబంధ కొట్లాటలు, సాధారణంగా ఇందులో పోలీసులు, ఇతర సాయుధ దళాలు చేసే లేదా వారిపై జరిగే క్రూరమైన చర్యలు ఉంటాయి.
    • గాయాలు తగిలిన చోట పౌరులను బలవంతంగా కర్రలతో కొట్టడం
    • పోలీసులపై ఉమ్మివేయడం 

క్రీడల్లో హింస

  • సందర్భోచితమైన పెద్ద వీడియోలో భాగంగా తీవ్రమైన క్రీడా గాయాలను స్పష్టంగా చూపడం.
    • తీవ్రమైన గాయాలతో కూడిన క్లిప్‌ల కంపైలేషన్‌లు లేదా హైలైట్‌లు, అయితే ఇందులో గాయాల మీద పెద్దగా ఫోకస్ చేయడం జరగదు.

జంతు హింస

  • మనుషులు లేదా మనిషి శిక్షణ ఇచ్చిన జంతువుల కారణంగా కాకుండా సహజంగా జంతువుల మధ్య జరిగే హింస (అడవి సింహాలు జింకలను వేటాడటం వంటివి, కానీ శిక్షణ ఇచ్చిన కుక్కలు కుందేళ్లను పట్టుకోవడం వంటివి కాదు).
    • జంతువుల గాయాలను (రక్తం లేదా ఎముకల వంటివి), తదేకంగా ఎక్కువ సేపు స్పష్టంగా చూపించడమే వీడియో ప్రధాన ఉద్దేశం అయినప్పుడు.

వేటాడటం

  • గాయపడిన లేదా తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్న జంతువుల హింసాత్మక దృశ్యాలను (రక్తంతో నిండిన శరీర భాగాలు వంటివి), కొద్ది సమయం పాటు ఫీచర్ చేసే వేటకు సంబంధించిన కంటెంట్.

యుద్ధం, సంఘర్షణ

  • విద్యాపరమైన సందర్భం, రక్తంతో నిండిన సీన్‌లు లేదా స్పష్టమైన గాయాలు లేకుండా, సాయుధ సంఘర్షణకు (యుద్ధం వంటివి) సంబంధించిన నిజమైన, హింసాత్మక అంశాలు లేని ప్రాసెస్ చేయని ఫుటేజ్.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

విద్యతో సంబంధం లేని వీడియోలో మృతదేహాన్ని స్పష్టంగా చూపడం; నిషేధించబడిన థీమ్‌లను ఫీచర్ చేసే గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో (లైంగిక వేధింపు వంటివి). అత్యంత తీవ్రమైన హింసను స్పష్టంగా చూపే చర్యలను (వీటిలో చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి), గాయాలను కలిగి ఉండటం. హింసను ప్రేరేపించడం లేదా దాని గురించి గొప్పగా చెప్పడం.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

సాధారణ హింస

  • సందర్భం గురించి తక్కువగా వివరిస్తూ లేదా సందర్భమే లేకుండా రక్తం, పేగులు, హింస, శరీర ద్రవాలు (మనుషులవి అయినా లేదా జంతువులవి అయినా), నేరం జరిగిన ప్రదేశాలు లేదా ప్రమాదానికి సంబంధించిన ఫోటోలపై ఫోకస్ చేయడం.
  • వీటితో సహా అత్యంత దిగ్భ్రాంతికరమైన ఇమేజ్‌లు కలిగి ఉన్న హింసాత్మక చర్యకు సంబంధించి తదనంతర పరిణామాలను స్పష్టంగా డిస్‌ప్లే చేయడం:
    • రక్తం లేదా రక్తపాతాన్ని అతిగా డిస్‌ప్లే చేయడం (ఉదాహరణకు, నరికివేయబడిన కాలు లేదా తీవ్రంగా కాలిన గాయాల వంటి బహిరంగ గాయాలు)
    • తీవ్రమైన బాధ (బహిరంగ గాయాల వల్ల వచ్చే విపరీతమైన నొప్పి కారణంగా వ్యక్తులు ఏడవడం లేదా మూర్చపోవడం వంటివి)
  • షాక్‌కు గురిచేసే, స్పష్టంగా చూపే, అలాగే/లేదా హింసాత్మక ఇమేజ్‌లను ఫీచర్ చేసే కంటెంట్, లేదా హింసను ప్రేరేపించే లేదా గొప్పగా వర్ణించే సీన్‌లు.

గేమింగ్

  • షాక్‌కు గురిచేసే అనుభవాన్ని క్రియేట్ చేయడానికి రూపొందించబడిన ‘గేమ్ ఆడే విధానం‘ మీద ఫోకస్ చేయడం. ఉదాహరణలలో ఇవి ఉంటాయి: 
    • సామూహిక హత్యలకు సంబంధించి ఆడలేని పాత్రలను అగ్రిగేట్ చేయడం.
  • థంబ్‌నెయిల్‌లో లేదా వీడియోలోని మొదటి ఏడు సెకన్లలో గేమ్‌లో స్పష్టంగా హింసను చూపడం.
    • “గేమ్‌లో హింసను స్పష్టంగా చూపడం”లో శరీర ద్రవాలు మరియు/లేదా దీర్ఘకాలంగా లేదా తీవ్రమైన నొప్పితో కూడిన భాగాలపై ఫోకస్ చేసే తీవ్రమైన గాయాలు (తలను నరకడం అలాగే అవయవాల నరికివేత వంటివి) ఉంటాయి.
  • లైంగిక హింసను చూపించే 'గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో'.
  • ప్రత్యేక హక్కులు గల గ్రూప్‌ను టార్గెట్‌గా చేసుకుని విద్వేషం లేదా హింసతో ప్రేరేపించబడిన హింసను చూపించే 'గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో'.
  • హింసను స్పష్టంగా చూపే 'గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో'.
  • మైనర్‌లపై జరిగే హింసను స్పష్టంగా చూపించే 'గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో'.
  • నిజ జీవితంలోని వ్యక్తుల పేర్లు కలిగిన పాత్రలపై జరిగే హింసను స్పష్టంగా చూపే 'గేమ్ ఆడే విధానాన్ని వివరించే వీడియో'.

మరణం, విషాదం

  • ఖననం చేయడానికి ఇంకా సిద్ధం చేయబడని లేదా అత్యంత స్పష్టంగా చూపే గాయాలు ఉన్న మృతదేహాలను ప్రదర్శించడం.
  • విద్యతో సంబంధం లేని సందర్భాలలో, ఖననం చేయడానికి ఇంకా సిద్ధం చేయబడని మృతదేహాలను ప్రదర్శించడం.
  • ఏ సందర్భంలోనైనా కానీ, ఒకరు లేదా అంత కంటే ఎక్కువ మంది వ్యక్తుల చనిపోయే క్షణాన్ని స్పష్టంగా ప్రదర్శించడం.
    • ఊపిరాడక చనిపోవడం.
    • ప్యాసింజర్‌లతో ఉన్న కారు వంతెనపై నుండి పడిపోవడం.
  • ఘోరమైన మరణాన్ని లేదా తీవ్రమైన శారీరక హానిని చూపే క్షణం.
    • మరణం లేదా తీవ్రమైన శారీరక హాని సంభవించేందుకు అవకాశం ఉన్న తీవ్రమైన ఆస్తి నష్టం జరిగే సంఘటనలు (బాంబు దాడులు, మంటలు, భవనాలు కూలిపోవడం, మొదలైనటువంటివి).
  • విద్యతో సంబంధం లేని సందర్భంలో, సెన్సార్ చేయబడిన (ఉదాహరణకు, బ్లర్ చేయబడటం) దారుణమైన స్థితిలో ఉన్న మృతదేహాలు.

పోరాటాలు (పోరాటపు క్రీడలను మినహాయించి)

  • విద్యతో సంబంధం లేని సందర్భాలలో, వీధి పోరాటాలను (గాయాలు లేకపోయినా కూడా) ప్రధానంగా గానీ లేదా ఎక్కువ సేపు గానీ ప్రదర్శించడం.

వేటాడటం

  • గాయపడిన లేదా తీవ్రమైన నొప్పిని అనుభవిస్తున్న జంతువులను స్పష్టంగా చూపే దృశ్యాలను (రక్తంతో నిండిన శరీర భాగాలు వంటివి) ప్రధానంగా ఫీచర్ చేసే వేటకు సంబంధించిన కంటెంట్.

జంతు హింస

  • జంతు హింసను (భౌతికంగా అయినా లేదా మానసికంగా అయినా) లేదా జంతువుల పట్ల క్రూరత్వాన్ని (ఉదాహరణకు, తన్నడం) ప్రదర్శించడం లేదా చూపడం.
  • హింసాత్మకమైన దృశ్యాలు ఉన్నా కానీ, లేదా లేకపోయినా కానీ, మనుషుల పర్యవేక్షణలో జరిగే జంతు హింసను (కోళ్ల పందాలు లేదా కుక్కల పొట్లాట వంటివి) ప్రమోట్ చేయడం లేదా గొప్పగా వర్ణించడం.
  • మనుషుల కారణంగా బాధపడే జంతువులను చూపే ఫుటేజ్, ఉదాహరణకు, బాధాకరమైనది లేదా అసహజమైనదిగా పరిగణించబడే విధానంలో, ఉద్దేశపూర్వకంగా ఏదైనా జంతువును హానికరమైన రీతిలో, ఒత్తిడి కలిగించే రకమైన పద్ధతిలో లేదా ఇతర ప్రమాదకర పరిస్థితుల్లో ఉంచడం.

పోలీసులు, ఇతర సాయుధ దళాల చర్యలలో భాగంగా భౌతిక హాని

  • విద్యతో సంబంధం లేని సందర్భంలో, పోలీసుల క్రూరత్వాన్ని ప్రధానంగా ప్రదర్శించడం.

క్రీడల్లో హింస

  • స్పష్టంగా చూపే గాయాన్ని ప్రదర్శించడం అనేది వీడియో ప్రధాన సబ్జెక్ట్‌గా ఉండే క్రీడా వీడియోలు.

యుద్ధం, సంఘర్షణ

  • కాల్పులు, పేలుళ్లు, మరణశిక్షలు లేదా బాంబు దాడులకు సంబంధించిన హింసాత్మకమైన ఇమేజ్‌లు లేదా ఇతివృత్తాలు.
  • ఏ సందర్భంలోనైనా కానీ, గాయాలు, మరణాలు లేదా వేదనలను తీవ్ర స్థాయిలో చూపించే యుద్ధ ఫుటేజ్.

మైనర్‌లతో ముడిపడి ఉన్న హింస

  • ఏ సందర్భంలోనైనా, మైనర్‌ల మధ్య హింసను ఫోకస్ చేసి చూపే కంటెంట్, లేదా పాల్గొన్న వ్యక్తులకు తగిలిన గాయాలను లేదా కలిగిన బాధను ఫోకస్ చేసి చూపే కంటెంట్.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్

టైటిల్ లేదా థంబ్‌నెయిల్‌లో అత్యంత లైంగికంగా అనిపించే కంటెంట్ లేదా లైంగికపరమైన థీమ్‌లు అధిక స్థాయిలో ఉన్న కంటెంట్ అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు. స్పష్టంగా చూపబడని లైంగిక విద్యకు సంబంధించిన వీడియోలు, అలాగే మ్యూజిక్ వీడియోల విషయంలో పరిమిత మినహాయింపులు ఉంటాయి. ఈ పాలసీ నిజమైన విజువల్స్‌కు, అలాగే కంప్యూటర్ జెనరేట్ చేసిన విజువల్స్‌కు రెండింటికీ వర్తిస్తుంది. అత్యంత లైంగికంగా అనిపించే కంటెంట్‌ను హాస్యం పంచాలనే ఉద్దేశంతోనే రూపొందించారని తెలిపినా అది అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

శృంగార చేష్టలు లేదా ముద్దు పెట్టుకోవడం; సంభోగాన్ని గురించిన ప్రస్తావన లేకుండా, శృంగార బంధాలను గురించి లేదా లైంగికతను గురించి సాగే చర్చలు; అస్పష్టమైన అలాగే ప్రేక్షకులను ప్రేరేపించే ఉద్దేశం లేకుండా పూర్తిగా సెన్సార్ చేయబడిన నగ్నత్వం; సన్నివేశంలో బిడ్డ కూడా ఉండి, తల్లిపాలు ఇచ్చేటప్పడు చూపబడే నగ్నత్వం; లైంగిక అంశాలను స్పష్టంగా చూపని లైంగిక విద్య; ఇష్టంగా లేదా ఆకర్షణీయంగా కనిపించే ప్రయత్నంలో లైంగిక సంబంధిత శరీర భాగాల లయబద్ధమైన కదలికలతో కూడిన డ్యాన్స్, అయితే అది లైంగికంగా స్పష్టంగా ఉండకూడదు; ప్రొఫెషనల్ సెట్టింగ్‌లో ప్రదర్శించిన లైంగికంగా స్పష్టంగా చూపే డ్యాన్స్, కొరియోగ్రాఫ్ చేసిన డ్యాన్స్ లేదా మ్యూజిక్ వీడియో వంటివి.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

లైంగిక తృప్తిని కలిగించే కంటెంట్

  • యానిమేషన్, నిజ జీవితం, లేదా నాటకీయమైన ముద్దు లేదా కౌగిలింత సీన్‌ల వంటి, లైంగిక ప్రేరేపణలను కలిగించని రొమాంటిక్ సీన్‌లు.
    • లైంగిక చర్యలను బహిరంగంగా చూపించకుండా పాత్రల మధ్య లైంగిక ఉద్రిక్తత ఉండే సీన్‌లు.
    • సుదీర్ఘమైన కథనంలో భాగంగా, లైంగిక ప్రేరేపణలను కలిగించాలనే ఉద్దేశంతో కాకుండా, కేవలం రొమాన్స్ మీదనే ఫోకస్‌తో చిత్రీకరించబడిన ముద్దు సీన్.
    • జననేంద్రియాలను చూపకుండా కొద్ది సమయం పాటు చూపబడే పరోక్ష లైంగిక చర్యలు; ఉదాహరణకు, ఊగుతున్న బెడ్‌లను చూపడం, లైంగిక సంపర్క సమయంలో వచ్చే శబ్దాలను వినిపించడం, లేదా డ్రై హంపింగ్‌ను చూపడం.
  • లైంగిక ప్రేరేపణలు కలిగించని/కామెడీ సందర్భాల్లో లైంగిక చర్య గురించి చేసే చర్చలు:
    • లైంగికపరమైన వాంఛను, కోరికను లేదా కామాన్ని సూచించే లిరిక్స్ లేదా డైలాగ్‌లు.
    • లైంగిక విద్య.
    • లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STDలు), అవి వ్యాపించే విధానం.
    • లైంగిక సామర్థ్యం ఎలా పెంచుకోవాలన్నది కాకుండా, లైంగిక కలయిక అంశాల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసే లైంగిక అనుభవాలు (లైంగిక కలయిక తర్వాత కలిగే నొప్పితో బాధపడటం వంటివి).
    • స్పెర్మ్ దానం.
    • డయగ్రామ్‌లు లేదా డమ్మీలను ఉపయోగించి పునరుత్పాదక శరీర నిర్మాణ శాస్త్రాన్ని శాస్త్రీయంగా వివరించడం.
    • లైంగిక ధోరణి మరియు/లేదా మానవ సంబంధాలకు లోబడి లైంగిక గుర్తింపు అనేది ఎలా పరిణామం చెందుతుందనే అంశాలు.
    • అసభ్య లేదా అశ్లీల పదాలను (లైంగిక ఉద్రిక్తతను సూచించే మ్యూజిక్ లిరిక్స్ వంటివి) ఉపయోగించని లైంగికపరమైన జోకులను అలాగే పరోక్ష లైంగిక వ్యాఖ్యలను (లైంగిక చర్యలను హాస్యాస్పదంగా అనుకరించడం వంటివి) ఉపయోగించడం.
    • లైంగికపరంగా కాకుండా, ఇతర పద్ధతుల్లో అసాధారణ లైంగిక కోరికలను సూచించే కంటెంట్ (“మీకు ఇష్టమైన ఆహారం ఏమిటి లేదా మీకు ఏ ఆహారమంటే కోరిక?” వంటివి).

డ్యాన్స్

  • తుంటిని లేదా నడుమును గుండ్రంగా తిప్పడం లేదా వేగంగా కదిలించడం వంటి సెక్సీ డ్యాన్స్ కదలికలు.
  • ట్వెర్కింగ్ లేదా గ్రైండింగ్.
  • డ్యాన్స్ చేస్తున్నపుడు జారుతూ, ఎగురుతూ ఉండి, శరీరభాగాలను సాధ్యమైనంత తక్కువ కప్పి ఉంచే బట్టలు.
  • శృంగార ప్రేరణ పొందే శరీర భాగాల కదలిక.
  • తోటి డ్యాన్సర్‌లు శరీర అవయవాలను దగ్గరగా తాకుతూ డ్యాన్స్ చేయడం. ఉదాహరణకు, ఇరువురి లైంగిక అవయవాల మధ్య తగినంత దూరం లేకపోవడం.
  • ప్రొఫెషనల్ సెట్టింగ్‌లో ప్రదర్శించే (ఉదా. డ్యాన్స్ స్టూడియోలు) లైంగిక శరీర భాగాల కదలికలు, లేదా శృంగార భరిత ల్యాప్ డ్యాన్స్‌ల వంటి లైంగిక చర్యలను అనుకరించే లేదా ప్రేరేపించే డ్యాన్స్ స్టెప్పులు.
  • లైంగిక శరీర భాగాలను చూపే షాట్స్‌ను పదే పదే ఫీచర్ చేసే మ్యూజిక్ వీడియోలు.

నగ్నత్వం

  • నగ్నత్వంపై ప్రధానంగా ఫోకస్ చేయని, సెన్సార్ చేయబడిన నగ్నత్వం. అంటే ఇందులో పాత్రలు నగ్నంగా ఉన్నప్పటికీ ఉరుగుజ్జులు, పిరుదులు లేదా జననేంద్రియాలను చూపించడం జరగదు (ఉదా. అవి పూర్తిగా పిక్సెలేట్/బ్లర్ చేయబడతాయి).
    • విద్యాపరమైన సందర్భాలలో, తక్కువ దుస్తులను ధరించిన గొప్ప చారిత్రక వ్యక్తులకు సంబంధించి బ్లర్ చేయబడిన నగ్నత్వం.
    • లైంగికేతర ప్రయోజనాల (ఉదా. వైద్య పద్ధతులు) కోసం జననేంద్రియాలను పూర్తిగా సెన్సార్ చేసి, అస్పష్టంగా చూపడం.
  • లైంగిక ప్రేరేపణలను కలిగించాలనే ఉద్దేశంతో కాకుండా, తక్కువ దుస్తులు ధరించిన వ్యక్తులను చూపడం, ఉదాహరణకు, ఈత కొలను వద్ద బికినీలు ధరించిన వారిని చూపడం.
    • వక్షోజాల వంటి శరీర భాగాల మీద తదేకంగా ఫోకస్ చేయకుండా వస్త్రాల రూపం, వాటి అమరిక మీద ఫోకస్ చేసే క్లాథింగ్ రివ్యూలు.
    • శిల్పాలు, స్కెచ్‌లు, లేదా కంప్యూటర్ జెనరేట్ చేసిన గ్రాఫిక్స్ ద్వారా నగ్నత్వాన్ని ప్రదర్శించే కళాత్మక వ్యక్తీకరణలు, ఉదాహరణకు, క్లాసిక్ ఆర్ట్‌లోని పాత్రలు లేదా గోచీలు ధరించిన ఆదివాసీ ప్రజల ఫోటోగ్రఫీ.
    • ఫ్యాషన్ షో రన్‌వేలు, వైద్య పరీక్షలు లేదా వినోదభరితమైన బీచ్‌ల వంటి తగిన ప్రదేశాలలో పలుచటి వస్త్రాలతో కప్పబడి ఉన్న ఆడవారి వక్షోజాలు/వక్షోజాల చీలిక, పిరుదులు లేదా మగవారి శరీర మొండాన్ని చూపడం.
    • క్రీడలలో భాగంగా కనిపించే పాక్షిక నగ్నత్వం, ఉదాహరణకు, బాక్సింగ్ వంటి క్రీడలలో అటువంటి వస్త్రధారణ అవసరం అవుతుంది.
    • పలుచటి వస్త్రాలలో లేదా పూర్తిగా కప్పని వస్త్రాలలో వక్షోజాలను లేదా పిరుదులను చూపడం (ఉదాహరణకు, ఈత దుస్తులను ధరించినప్పుడు), ఈ సందర్భంలో ఆ కంటెంట్‌ను లైంగిక ప్రేరేపణలను కలిగించాలనే ఉద్దేశంతో చూపడం జరగదు, అలాగే వీడియోలో వాటినే ఫోకల్ పాయింట్‌గా ఉంచ.డం జరగదు
  • లైంగిక సంతృప్తి కోసం ఉపయోగించే వాటిని మినహాయించి, శరీరంపై జననేంద్రియాల బరువు లేదా రూపాన్ని సిమ్యులేట్ చేయడానికి ఉపయోగించే వస్తువులు.
    • శస్త్ర చికిత్స ద్వారా వక్షోజాలను తొలగించుకున్న వారు లేదా లింగ మార్పిడి చేసుకున్న మరియు/లేదా బైనరీ కాని కమ్యూనిటీ మెంబర్‌లు ఉపయోగించే కృత్రిమ వక్షోజాలు.
    • నిలబడి మూత్ర విసర్జన చేసే పరికరాలు లేదా ఫ్లాసిడ్ ప్యాకర్స్ వంటి లింగ మార్పిడి చేసుకున్న మరియు/లేదా బైనరీ కాని కమ్యూనిటీ ఉపయోగించే పరికరాలు. 

పాలు ఇస్తున్న తల్లి వక్షోజాల నగ్నత్వం

  • స్త్రీ తన చనుమొనలను కప్పుకోకుండా లేదా అవి కనిపించే విధంగా తన బిడ్డకు పాలివ్వడం.
  • వీడియోలో చేయి ద్వారా చేసే సంజ్ఞలు, లేదా చనుమొనలు కనిపించే విధంగా బ్రెస్ట్ పంప్ వాడకాన్ని చూపడం, సీన్‌లో చిన్నారి కూడా ఉండటం.

నిర్వచనాలు:

  • "లైంగికంగా ప్రేరేపించడం" అనేది, ప్రేక్షకులను లైంగికంగా ప్రేరేపించే ఉద్దేశాన్ని సూచిస్తుంది.
  • "పరోక్ష లైంగిక వ్యాఖ్య" అనేది, ఏదైనా లైంగికపరమైన విషయాన్ని సూచించడానికి లేదా జోక్ చేయడానికి ఉపయోగించే ఫ్రేజ్‌ను సూచిస్తుంది.
  • "లైంగిక భావనలను సూచించేది" అనేది లైంగిక ఉద్దేశాన్ని సూచించే విజువల్, ఆడియో లేదా రాతపూర్వకంగా ఉన్న కంటెంట్, ఇది ప్రేక్షకులను లైంగికంగా ప్రేరేపించే ఉద్దేశంతో రూపొందించబడుతుంది.
  • "స్పష్టంగా చూపబడే లైంగికత్వం" అనేది, ప్రేక్షకులను ఉత్తేజపరిచేందుకు లైంగిక చర్య లేదా నగ్నత్వం అనేది ఎంత స్పష్టంగా చూపబడిందో సూచిస్తుంది.
  • చనుబాలివ్వడం లేదా చనుబాలిచ్చే సందర్భంలో రొమ్ములు కనిపించడం మరియు/లేదా చనుమొనలు కనిపించడం "బ్రెస్ట్ ఫీడింగ్ నగ్నత్వం" కిందికి వస్తుంది. తల్లి పాలివ్వడాన్ని చూపించేటప్పుడు, ఆ సందర్భానికి తగిన సన్నివేశాలు ఉండాలి, అంటే ఉదాహరణకు పాలు తాగబోయే బిడ్డను గాని, లేదా పాలు తాగుతున్నట్లు చూపడం గాని అందులో భాగంగా ఉండాలి.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

సంభోగాన్ని ప్రదర్శించే శాస్త్రీయ కళ (లైంగిక చర్యకు సంబంధించిన ఫోటో) లేదా థంబ్‌నెయిల్స్‌లో జననేంద్రియాలను ఫోకస్ చేసి చూపించడం; లైంగిక ప్రేరేపణకు తావివ్వని, యానిమేట్ చేసిన లైంగిక చర్యలు ఉన్న విద్యాపరమైన కంటెంట్; లైంగికపరమైన థీమ్‌లను కలిగిన ప్రాంక్‌లు; సాధ్యమైనంత తక్కువగా దుస్తులను ధరించి డ్యాన్స్ చేయడం; డ్యాన్స్‌లో లైంగిక శరీర భాగాలను ఉద్దేశపూర్వకంగా తాకడం లేదా వాటిపై తదేకంగా ఫోకస్ చేయడం.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

లైంగిక తృప్తిని కలిగించే కంటెంట్

  • లైంగికపరమైన థీమ్‌లు ఉన్న టైటిల్స్ లేదా థంబ్‌నెయిల్స్ (తప్పుదారి పట్టించే సంకేతాలతో సహా).
    • లైంగికపరమైన థీమ్‌లతో కూడిన థంబ్‌నెయిల్స్ లేదా టైటిల్స్ ఉన్న మ్యూజిక్ వీడియోలు (తప్పుదారి పట్టించే సంకేతాలతో సహా).
    • లైంగిక యాక్టివిటీలను వివరించడం లేదా పరోక్షంగా సూచించడం (ఎమోజీలను లేదా గ్రాఫిక్స్‌ను ఉపయోగించి లైంగిక శరీర భాగాలను పరోక్షంగా సూచించడం వంటివి).
    • పరోక్ష లైంగిక చర్యలను సూచించే థంబ్‌నెయిల్‌లో ఉన్న వాటిని స్పష్టంగా కనిపించకుండా చేయడం లేదా వాటి మీద దృష్టి పెట్టడం.
    • ఒక సంస్థగా ఫీచర్ చేయబడిన సెక్స్ వర్కర్లు.
    • లైంగిక యాక్టివిటీలు (పరోక్ష లైంగిక చర్యలతో సహా).
    • మూలిగే సౌండ్‌లు లేదా చెవిని సున్నితంగా కొరకడం వంటి లైంగిక ప్రేరేపణలు.
    • కంటెంట్‌లో ఫీచర్ చేయబడిన శృంగార ఉపకరణాలు లేదా పరికరాలు; వాటిని ఉపయోగించకపోయినా సరే. 
  • విద్యాపరమైన, డాక్యుమెంటరీ, లేదా నాటకీయమైన కంటెంట్‌లో లైంగిక ప్రేరేపణలు కలిగించకుండా లైంగిక యాక్టివిటీలను చూపడం.
    • వైద్యపరమైన టాపిక్‌ల వంటి వాటితో విద్యా ప్రయోజనాల కోసం లైంగిక యాక్టివిటీలను, అలాగే వాటి హిస్టరీని వివరించడం.
  • లైంగిక పరిశ్రమకు సంబంధించిన డాక్యుమెంటరీల వంటి లైంగిక సంబంధిత కంటెంట్.
  • వీటిని కలిగి ఉన్న విద్యాపరమైన అలాగే డాక్యుమెంటరీ కంటెంట్:
    • సెక్స్ వర్కర్‌గా నేర్చుకున్న తమ వ్యక్తిగత చిట్కాల వంటి సన్నిహితంగా ఉన్న శృంగార అనుభవాల గురించి చర్చలు లేదా సన్నిహిత సంభాషణలో భాగంగా ఉపయోగించే అశ్లీల భాషలు.
  • శాస్త్రీయ కళల్లో పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్‌ను ఫీచర్ చేసే టైటిల్స్ లేదా థంబ్‌నెయిల్స్.

డ్యాన్స్

  • శరీర భాగాలను తక్కువగా కప్పి ఉంచిన దుస్తులపై దృష్టి కేంద్రీకరించబడిన చోట ట్వెర్కింగ్ లేదా గ్రైండింగ్.
  • డ్యాన్సర్, తనతో పాటు డ్యాన్స్ చేసే పార్ట్‌నర్ రొమ్ములు లేదా పిరుదులను పట్టుకునే డ్యాన్స్‌లు; లేదా డ్యాన్సర్ తన తోటి డ్యాన్సర్ దుస్తుల కింద చేతులు పెట్టే డ్యాన్స్‌లు.
  • డ్యాన్స్‌లో లైంగిక శరీర భాగాలను ఉద్దేశపూర్వకంగా జూమ్ చేయడం.

నగ్నత్వం

  • పూర్తి నగ్నత్వాన్ని ఫీచర్ చేసే విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ కంటెంట్.
    • శరీరమంతా గీయబడిన పెయింటింగ్‌లను ప్రదర్శించడం వంటి లైంగికత లేదా నగ్నత్వానికి సంబంధించిన చరిత్ర లేదా పరిశ్రమ ఓవర్‌వ్యూలు.
  • జననేంద్రియాలను గుర్తించగలిగేలా ఫీచర్ చేసే శాస్త్రీయ కళ.

నిర్వచనాలు:

  • “సెన్సార్ చేసిన నగ్నత్వం” అంటే, నల్లని బార్‌లు లేదా పిక్సెలేట్ చేసి నగ్నత్వాన్ని బ్లర్ చేయడం, కవర్ చేయడం వంటి వాటిని సూచిస్తుంది.
  • పరోక్ష లైంగిక చర్య: డ్రై హంపింగ్ వంటి లైంగిక సంపర్కాన్ని అనుకరించే ప్రవర్తన.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

లైంగిక శరీర భాగాలను తక్కువగా కప్పి, లేదా పూర్తి నగ్నత్వాన్ని బహిర్గతం చేసి చూపడం; స్తన్యమిచ్చే సన్నివేశాలలో చిన్నారి లేకుండా, నగ్నత్వాన్ని చూపడం; లైంగిక చర్యలు (బ్లర్ చేసి చూపినా లేదా పరోక్షంగా అర్థమయ్యేలా చూపినా), లైంగిక కోరికలు, చిట్కాలు, ఎక్స్‌పీరియన్స్‌ల వంటి లైంగిక టాపిక్‌ల గురించి చర్చించడం; లైంగిక కంటెంట్ కలిగిన వీడియో థంబ్‌నెయిల్ (టెక్స్ట్‌లు లేదా లింక్‌లతో సహా); రెచ్చగొట్టే డ్యాన్స్‌లు లేదా హావభావాలు కలిగిన లైంగికంగా ప్రేరేపించే సన్నివేశాలు; శృంగార ఉపకరణాలు లేదా పరికరాలను చూపడం; లైంగిక పరిశ్రమ, అందులో పని చేసే వారికి సంబంధించిన కంటెంట్; జననేంద్రియాలు లేదా సంపర్క సన్నివేశాలను ఫీచర్ చేసే జంతువుల లైంగికత; డ్యాన్స్‌లో లైంగిక కదలికలను లేదా చర్యలను అనుకరించడం లేదా సిమ్యులేట్ చేయడం; ప్రేక్షకులను లైంగికంగా ప్రేరేపించే ఉద్దేశంతో ఉన్న శృంగారభరితమైన డ్యాన్స్‌లను స్పష్టంగా చూపడం.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

లైంగిక తృప్తిని కలిగించే కంటెంట్

  • లైంగికపరమైన థీమ్‌లు ఉన్న టైటిల్స్ లేదా థంబ్‌నెయిల్స్ (తప్పుదారి పట్టించే సంకేతాలతో సహా).
    • లైంగిక యాక్టివిటీలను వివరించడం లేదా పరోక్షంగా సూచించడం (ఎమోజీలను లేదా గ్రాఫిక్స్‌ను ఉపయోగించి లైంగిక శరీర భాగాలను పరోక్షంగా సూచించడం వంటివి).
    • పరోక్ష లైంగిక చర్యలను సూచించే థంబ్‌నెయిల్‌లో ఉన్న వాటిని స్పష్టంగా కనిపించకుండా చేయడం లేదా వాటి మీద దృష్టి పెట్టడం.
    • వీడియోలో లైంగిక కంటెంట్ ఉంటుందని హామీ ఇచ్చి తప్పుదారి పట్టించే టైటిల్ పెట్టి, అందులో లైంగిక కంటెంట్‌ను చూపకపోవడం (“పోర్న్‌ను చూడండి” అనే టైటిల్‌తో ఉన్న వంట వీడియో వంటివి).
    • వైద్యపరమైన సందర్భంలో కంప్యూటర్ ద్వారా జెనరేట్ చేయబడిన నగ్నత్వం.
  • ఫోకస్ చేసి చూపబడే, పరోక్ష లైంగిక చర్య లేదా ప్రవర్తన.
    • వస్తువులను కదిలించడం, లైంగిక సంపర్క సమయంలో వచ్చే శబ్దాలను వినిపించడం వంటి సంకేతాల ద్వారా లైంగిక యాక్టివిటీ జరుగుతోందని సూచించడమే వీడియో ప్రధాన ఉద్దేశం.
  • లైంగిక యాక్టివిటీని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన శృంగార ఉపకరణాలు, లైంగిక పరికరాలు, లేదా ఇతర ప్రోడక్ట్‌లను చూపించడం, వాటి వాడకాన్ని నేరుగా చూపించకపోయినా సరే ఇది వర్తిస్తుంది.
    • లైంగిక టాపిక్‌లకు సంబంధం లేని వీడియోలో యాదృచ్ఛికంగా లైంగిక పరికరాన్ని ప్రదర్శించడం (బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రదర్శించడం వంటివి).
    • చర్చ సమయంలో జననేంద్రియాలను పోలి ఉండే వైద్య వస్తువును పరిచయం చేయడం.
  • లైంగికంగా స్పష్టంగా చూపే డ్యాన్స్‌లు, తడమడం లేదా ప్రేక్షకులను లైంగికంగా ప్రేరేపించే సీన్‌లు.
    • సుదీర్ఘమైన కథనంలో భాగంగా, లైంగిక యాక్టివిటీలకు సంబంధించిన చిన్న సీన్‌లను (పరోక్ష లైంగిక చర్యలతో సహా) చూపడం.
    • లైంగిక ఉద్రిక్తతను ప్రదర్శించడమే ముఖ్య ఉద్దేశంగా ఉండే సీన్‌లు.
  • శృంగారాన్ని ప్రేరేపించని వస్తువులను ఉపయోగించి చేసే పరోక్ష లైంగిక వ్యాఖ్యలు:
    • వాస్తవికంగా కనిపించే జననేంద్రియాలను కలిగిన మానవాకారపు చిన్న బొమ్మల వంటి జననేంద్రియాలను పోలి ఉండే వస్తువులు.
    • జననేంద్రియాలను పోలి ఉండేలా అలాగే ప్రేక్షకులను లైంగికంగా ప్రేరేపించడానికి ఉద్దేశించిన రోజువారీ వస్తువులను (వంకాయలు వంటివి) లేదా ఎమోజీలను ఉపయోగించడం.
  • అందరికీ తగని లైంగికపరమైన ఆడియో, టెక్స్ట్, లేదా డైలాగ్:
    • అశ్లీలత లేదా ఇతర లైంగిక సర్వీస్‌ల వంటి లైంగిక సంబంధిత వినోదం (పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ అవసరమయ్యే, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లకు లింక్‌లతో సహా).
    • రెచ్చగొట్టే ఉద్దేశంతో రూపొందించిన తీవ్ర అశ్లీలత ఉన్న లైంగిక చర్యలు లేదా ప్రేరేపణలు.
    • అసాధారణ లైంగిక కోరికలకు సంబంధించిన వర్ణనలు (గైడ్‌లు లేదా సూచనల వంటివి).
    • లైంగిక కుంభకోణాలు లేదా లైంగిక అంశాలు గల ప్రైవేట్ మెటీరియల్‌ను లీక్ చేయడంపై ఫోకస్ చేయడం.
    • లైంగిక యాక్టివిటీలను అనుకరించడం (అశ్లీలమైన మీడియా వంటివి).
    • పరిహారానికి ప్రతిఫలంగా లైంగిక చర్యలను ప్రమోట్ చేయడం.
    • లైంగిక ఉపకరణాలను వినియోగిస్తూ ఉండటాన్ని చూపడం (లేదా లైంగిక యాక్టివిటీని మెరుగుపరిచేందుకు రూపొందించిన ఇతర ప్రోడక్ట్‌లను చూపడం).
    • తప్పుదారి పట్టించే లైంగిక ప్రవర్తన లేదా నగ్నత్వానికి సంబంధించిన కంటెంట్.
      • సాధారణ ఆబ్జెక్ట్‌లను లేదా సీన్‌లను లైంగికపరంగా చూపుతూ వీక్షకులను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో రూపొందించబడిన థంబ్‌నెయిల్స్, ఇలాంటి సందర్భాలలో, సాధారణంగా వీడియోలో నిజంగా ఉన్న టాపిక్‌కు థంబ్‌నెయిల్స్‌లో ఉన్న వాటికి సంబంధమే ఉండదు.
    • లైంగికంగా ప్రేరేపించే ఉద్దేశంతో ఎడిట్ చేయబడిన సీన్‌లు.
      • లైంగిక చర్యల సీన్‌లు లేదా హంపింగ్ సీన్‌ల వంటి లైంగికంగా ప్రేరేపించే చర్యలకు సంబంధించిన క్లిప్‌ల కంపైలేషన్‌లు.
      • లైంగికంగా ప్రేరేపించేలా ఉన్న టైటిల్స్ (“ఉద్రేకపరిచే లైంగిక చర్య” వంటివి).
    • ఈ కింది అంశాలు గల జంతువులతో ముడిపడి ఉన్న లైంగికత:
      • జననేంద్రీయాలను ఫోకస్ చేస్తూ చూపే జంతువుల సంపర్కానికి సంబంధించిన వీడియోలు.
      • లైంగికంగా ప్రేరేపించే విధంగా జంతువుల జననేంద్రియాలను లేదా సంపర్కాన్ని చూపడం.
  • హస్త ప్రయోగం, సంభోగం, భావప్రాప్తి, సంభోగం, చిట్కాలు లేదా ఇతర లైంగిక చర్యల వంటి సన్నిహితమైన లైంగిక అనుభవాలపై చర్చలు. ఇందులో పరోక్ష లైంగిక వ్యాఖ్యలు లేదా వివరంగా లైంగిక చర్య గురించి మాట్లాడే సంభాషణల వంటి లైంగికపరంగా అందరికీ తగని విధంగా ఉండే లేదా అశ్లీల టెక్స్ట్ లేదా ఆడియో కూడా ఉండవచ్చు.
    • లైంగిక చర్యకు సంబంధించిన చిట్కాలు లేదా లైంగిక చర్య ఎలా చేయాలి అనే దానిపై జరిగే అందరికీ తగని చర్చలు.
    • లైంగిక చర్యలకు సంబంధించి ఫోటోలను లేదా విజువల్ సీన్‌లను చేర్చకుండా, వాటికి సంబంధించిన ఆడియో లేదా సౌండ్ కంపైలేషన్‌లు (చెవిని ముద్దు పెట్టుకోవడం, ఇంకా ఇతర శృంగారభరితమైన సౌండ్‌లు వంటివి).
    • ప్రేక్షకులను లైంగికంగా ప్రేరేపించే ఉద్దేశం గల లైంగిక యాక్టివిటీలకు సంబంధించిన వివరణలు.
    • ఎక్కువ వివరంగా వర్ణించనప్పటికీ, లైంగిక కోరికలను ప్రస్తావించడం.
    • విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ సందర్భంలో మినహా 18+, 21+, ‘పెద్దలకు మాత్రమే’, ‘పోర్న్’ వంటి, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్‌ను సూచించే టైటిల్స్ లేదా థంబ్‌నెయిల్స్.
    • వీక్షకులను ప్రేరేపించడానికి లైంగిక శరీర భాగాలు లేదా చర్యలను సూచిస్తూ, టెక్స్ట్‌లో ఎమోటికాన్‌లు లేదా ఎమోజీలను వినియోగించడం.
  • పెద్దవారిని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన లైంగికపరమైన వీడియో గేమ్‌లు లేదా ప్రేక్షకుల్లో లైంగిక ప్రేరేపణలను కలిగించాలనే ఉద్దేశంతో వీడియో గేమ్ పాత్రలను లైంగికంగా చూపడం.

డ్యాన్స్

  • డ్యాన్స్ చేసేవారు తమ పార్ట్‌నర్ జననాంగాల వైపునకు తమ జననాంగాలను నెడుతూ లైంగిక ప్రేరణ కలిగించే విధంగా చేసే కదలికలు.
  • శృంగార చర్యలో పాల్గొంటున్నట్లుగా కాళ్లను ఎడంగా పెట్టి డ్యాన్స్ పార్ట్‌నర్‌తో డ్యాన్స్ చేయడం.
  • కొరియోగ్రాఫ్ చేసిన డ్యాన్స్, మ్యూజిక్ వీడియో లేదా ప్రొఫెషనల్ సెట్టింగ్‌లో ప్రదర్శించిన సందర్భాలలో మినహా; ల్యాప్ డ్యాన్స్ లేదా బట్టలు విప్పుతూ లైంగికంగా ప్రేరేపించే స్ట్రిప్ టీజ్‌లు.

నగ్నత్వం

  • పిక్సెలేట్ లేదా సెన్సార్ చేసినప్పటికీ, లైంగిక శరీర భాగాలను గుర్తించగలిగేలా ఉన్న నగ్నత్వం.
    • నగ్నంగా ఉన్న సీన్‌లలో, ఆ శరీరాలను స్టార్ లేదా బ్లర్ చేసినప్పటికీ, వాటి నీడల ఆధారంగా గుర్తించదగినవిగా ఉన్న సీన్‌లు.
  • నగ్నత్వాన్ని ఎక్కువ సమయం పాటు చూపడం (యానిమేషన్ రూపంలోనైనా, నిజ జీవితానికి చెందినదైనా, లేదా నాటకీయ రూపంలోనైనా).
    • వక్షోజాలు, జననేంద్రియ ప్రదేశాలను (ఫోకస్ చేయడం ద్వారా లేదా పదే పదే చూపించడం ద్వారా) ఫీచర్ చేసే కంటెంట్ (ఒక వ్యక్తికి చెందిన "ఉబ్బెత్తు" జననేంద్రియ ప్రదేశం వారి లోదుస్తులు లేదా ఈత దుస్తుల నుండి పొడుచుకురావడాన్ని ఫీచర్ చేసే కంటెంట్ వంటివి).
  • ప్రేక్షకులను లైంగికంగా ప్రేరేపించే ఉద్దేశంతో లైంగిక శరీర భాగాలను చూపడం, ఉదాహరణకు, వక్షోజాల చీలికను లేదా ఒంపులను పదే పదే చూపడం లేదా ఫోకస్ చేయడం.
    • స్పష్టంగా కనిపించే జననేంద్రియాలకు సంబంధించిన క్లిప్‌ల కంపైలేషన్‌లు.
    • చాలా కొద్దిగా కప్పబడిన (థాంగ్స్ వంటి వాటితో) లైంగిక శరీర భాగాలు (వక్షోజాలు, వక్షోజాల చీలిక, పిరుదులు, మొదలైనటువంటివి) తరచుగా కనిపించడం.
  • లైంగిక శరీర భాగాలను లేదా లైంగిక చర్యలను పూర్తిగా చూపడం వంటి నిజమైన లేదా యానిమేట్ చేయబడిన నగ్నత్వం. 
  • చిన్నారులతో కూడిన నగ్నత్వం
    • స్పష్టంగా కనబడే జననేంద్రియాలను చూపే కంటెంట్, ఉదాహరణకు, డైపర్‌ను మారుస్తున్నప్పుడు లేదా శిశువులు నగ్నంగా ఈత కొడుతున్నప్పుడు.

పాలు ఇస్తున్న తల్లి వక్షోజాల నగ్నత్వం

  • చనుమొనలు కనిపిస్తూ ఉండి, సన్నివేశంలో పాలు తాగే బిడ్డ లేకుండా ఉండి, బ్రెస్ట్ పంప్‌ను ఎలా ఉపయోగించాలో తెలిపే విద్యాపరమైన కంటెంట్.
  • సన్నివేశంలో పాలు తాగే బిడ్డ లేకుండా, చనుమొనలు కనిపించే హ్యాండ్ ఎక్స్‌ప్రెషన్ ట్యుటోరియల్స్.
  • సన్నివేశంలో పాలు తాగే బిడ్డ లేకుండా, కప్పులో చనుబాలు నింపుతున్న స్త్రీని చూపడం.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

షాకింగ్ కంటెంట్

వీక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసే, జుగుప్స కలిగించే లేదా షాక్‌కు గురి చేసే కంటెంట్ అడ్వర్టయిజింగ్‌కు తగినది కాకపోవచ్చు. సెన్సార్ చేయబడని షాక్‌కు గురి చేసే ఎలిమెంట్‌లను ఉపయోగించినంత మాత్రాన మీ వీడియో అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు అని భావించవలసిన అవసరం లేదు, కానీ సందర్భం అనేది ముఖ్యమైనది.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

విద్యా సంబంధిత, డాక్యుమెంటరీ లేదా ఇతర ప్రయోజనాల కోసం సెన్సార్ చేయబడిన లేదా సందర్భోచితంగా చూపబడే తేలికపాటి లేదా కొద్దిగా షాకింగ్ కంటెంట్.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

శరీర భాగాలు, శరీర ద్రవాలు, శరీరం నుండి వెలువడే వ్యర్థాలు

  • శరీర భాగాలు, శరీర ద్రవాలు, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలను 'పిల్లల కోసం రూపొందించిన' కంటెంట్‌లో చూపించడం లేదా వాటిని విద్యాపరమైన, శాస్త్రీయ, డాక్యుమెంటరీ లేదా కళాత్మకమైన సందర్భంలో ప్రదర్శించడం, ఇక్కడ ఉద్దేశం షాక్‌కు గురి చేయడం కాదు.
  • వినోదభరితమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని (మ్యాజిక్ ట్రిక్ వంటివి), శరీర భాగాలు, శరీర ద్రవాలు, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలను నాటకీయంగా ప్రదర్శించే, ఆశ్చర్యపరచాలనే ఉద్దేశంతో రూపొందించిన కంటెంట్, అయితే ఇటువంటి కంటెంట్‌ను ప్రదర్శించేటప్పుడు చట్టపరమైన సందర్భాన్ని తప్పక అందించాల్సి ఉంటుంది.

వైద్య, అలాగే కాస్మెటిక్ పద్ధతులు

  • శరీర భాగాలు, శరీర ద్రవాలు లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలపై కాకుండా కేవలం పద్ధతిపై మాత్రమే ఫోకస్ చేసే విద్యా సంబంధితమైన వైద్య లేదా కాస్మెటిక్ పద్ధతులు.
    • స్వల్ప రక్తపాతంతో కూడిన పచ్చబొట్టు, దుద్దులు కుట్టించుకోవడం లేదా బోటాక్స్ పద్ధతులు.
  • వైద్య లేదా కాస్మెటిక్ పద్ధతులు జరిగే సమయంలో శరీర భాగాలు, శరీర ద్రవాలు, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలను సెన్సార్ చేసి చూపడం లేదా కొద్ది సమయం పాటు చూపడం.
  • శరీర భాగాలు, శరీర ద్రవాలు లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలపై ఎక్కువ ఫోకస్ చేయకుండా వీక్షకులకు అవగాహన పెంచే, మనిషి పుట్టుకకు, అలాగే జంతువుల పుట్టుకకు సంబంధించిన వీడియోలు.

ప్రమాదాలు, గాయాలు

  • గాయం బయటకు కనపడని ప్రమాదాలు (అంతర్గత టిష్యూ, నెత్తుటి గాయాల లాంటివి).
  • తాకిడి మధ్యస్థంగా మాత్రమే తగిలిన కారణంగా, మరీ అంతగా దిగ్భ్రాంతికి గురి చేయని ప్రమాదాలు (ఉదాహరణకు, మోటర్ సైకిల్ నుండి పడిపోవడం).
  • ప్రమాదం కారణంగా క్షోభ లేదా వేదన వంటి వాటికి బాధితులు గురి కాకుండా ఉండే ప్రమాదాలు (ఏడవడం లేదా అరవడం చూపబడదు).
  • దీర్ఘకాలిక వైద్య చికిత్స అవసరం లేని ప్రమాదాలు.
  • వార్తలు, డాక్యుమెంటరీ లేదా కళాత్మక సందర్భంలో (సినిమా లేదా మ్యూజిక్ వీడియో వంటివి) ప్రదర్శించబడే ప్రమాదాలు, గాయాలు.

వంట కోసం మాంసాన్ని సిద్ధం చేయడం, తినడం

  • జంతువుల శరీర భాగాలను సంచలనాత్మకంగా కాకుండా మామూలుగా హ్యాండిల్ చేయడం.
    • మాంసం, అలాగే చేపను పచ్చిగా లేదా తినడానికి సిద్ధంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు చూపడం, ఉదాహరణకు, వండటానికి లేదా వంట కోసం సిద్ధం చేయడానికి సంబంధించిన టెక్నిక్‌లను ప్రదర్శించేటప్పుడు.
  • జంతువుల శరీర భాగాలను పోలి ఉండని జంతు ఆధారిత ఆహార ప్రోడక్ట్‌లను సంచలనాత్మకమైన పద్ధతిలో తినడం లేదా వాటిని తయారు చేయడం.
    • బతికి ఉన్న లేదా ఇంకా కదులుతూ ఉన్న షెల్‌ఫిష్‌లను రెస్టారెంట్‌లో తినడం.
    • "మక్‌బ్యాంగ్" లేదా ASMR ప్రదర్శనలో భాగంగా వండిన ఆహారాన్ని తినడం (ఉదాహరణకు, రొయ్యలు).
  • ముఖ లక్షణాలు స్పష్టంగా కనబడేలా జంతువుల శరీర భాగాలను కొద్ది సమయం పాటు ప్రదర్శించడం (చేపలు, మొలస్కా, లేదా క్రస్టేషియన్‌లను మినహాయించి, ఎందుకంటే వీటిని ఫోకస్ చేస్తూ ప్రదర్శించవచ్చు).

నిర్వచనాలు

  • "ఆశ్చర్యపరిచే ఉద్దేశం గల కంటెంట్" అనేది వీడియో ఆశ్చర్యపరిచే లక్ష్యంతో రూపొందించబడిందని సూచిస్తుంది, వీడియోలోని సందర్భం ఏమిటి, అలాగే అందులో ఏయే అంశాలు ఫోకస్ చేయబడ్డాయి వంటి వాటి ఆధారంగా అది నిర్ణయించబడుతుంది.
  • "ప్రమాదాలు" అంటే దురదృష్టకర సంఘటనలు. వీటి వల్ల సాధారణంగా నష్టం జరుగుతుంది లేదా గాయం ఏర్పడుతుంది. వీటిలో గాయం స్పష్టంగా కనపడని సందర్భాలు (వాహనాల ప్రమాదాల వంటివి) కూడా ఉంటాయి.
  • "బహిర్గతం" అంటే శరీర భాగాలు, శరీర ద్రవాలు, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలు కనబడేలా ప్రదర్శించడం (టిష్యూ లేదా రక్తం వంటివి).
  • "దిగ్భ్రాంతి” అంటే సహేతుకంగా అంచనా వేయగలిగే లేదా కనిపించే బలమైన దెబ్బ లేదా గాయం కారణంగా ఏర్పడిన కలవరపెట్టే లేదా ఆశ్చర్యకరమైన భావోద్వేగం.
  • "క్షోభ" అంటే నొప్పి కారణంగా లేదా అపస్మారక స్థితి కారణంగా కూడా మనిషి బాధపడే పరిస్థితిని విజువల్‌గా, ఆడియో రూపంలో లేదా ప్రెజెంటేషన్ రూపంలో చూపడం. ఈ సందర్భంలో, ఇది ప్రమాదాలకు గురైన వ్యక్తులు, వైద్య లేదా సౌందర్యాలంకరణ పద్ధతులలో (పుట్టుకలతో సహా) పాల్గొన్న వ్యక్తులకు సంబంధించినది.
  • “సంచలనాత్మకం కానిది” (స్పష్టంగా కనబడే జంతువుల శరీర భాగాలు లేదా జంతువులను/పురుగులను తినడానికి సంబంధించిన సందర్భంలో) అంటే, జంతువు గురించి ఉత్సుకతను కలిగించాలనే ఉద్దేశంతో కాకుండా ఆహార ప్రోడక్ట్ వినియోగాన్ని చూపే విధానం. జంతువు లేదా దాని మాంసం తినడం, ఆశ్చర్యపరిచే ఉద్దేశంతో కాకుండా మామూలుగా చూపబడుతుంది, అలాగే అందులో స్పష్టంగా కనబడే వివరాలు, అతిశయోక్తిగా అనిపించే వివరాలు ఉండవు.
  • "తప్పుగా హ్యాండిల్ చేయడం" అంటే జంతువును వండటం లేదా తినడాన్ని భయంకరంగా లేదా క్రూరంగా చూపడం. ఉదాహరణకు, విసిరేయడం, పడేయడం, వినోదాత్మకంగా ఆడటం, పొడవడం, లేదా తలను నరకడం. తప్పుగా హ్యాండిల్ చేయబడటానికి, ఆ జంతువు బతికే ఉండాల్సిన అవసరం లేదు, టూల్స్, పనిముట్లు, లేదా ఉత్త చేతులతో కూడా తప్పుగా హ్యాండిల్ చేయవచ్చు.
  • "ప్రొఫెషనల్ సందర్భం" అంటే, మాంసం లేదా చేపలు అమ్మే వారి వృత్తికి సంబంధించి, వారు చనిపోయిన జంతువులను కోయడం, అలాగే హ్యాండిల్ చేయడాన్ని చూపడం.
  • "స్పష్టంగా కనబడే ముఖ లక్షణాలు" అంటే, చూపబడే ముఖ లక్షణాలు నిజంగా ఒక జంతువుకు (అది చనిపోయినా లేదా ఇంకా సజీవంగానే ఉన్నా) సంబంధించినవి అని నిర్ధారించే వీలును ప్రేక్షకులకు కల్పించేవి. లక్షణాల్లో ముక్కులు, చెవులు, నోరు, కళ్లు మొదలైనవి ఉంటాయి.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

సెన్సార్ చేయకుండా లేదా షాక్‌కు గురి చేసే ఉద్దేశంతో రూపొందించినప్పటికీ సాధారణ సందర్భాన్ని అందించే షాకింగ్ కంటెంట్, ఉదాహరణకు స్పష్టంగా చూపబడే మానవ లేదా జంతువుల శరీర భాగాల ఇమేజ్‌లు.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

శరీర భాగాలు, శరీర ద్రవాలు, శరీరం నుండి వెలువడే వ్యర్థాలు

  • ఆశ్చర్యపరిచే ఉద్దేశంతో నిజమైన శరీర భాగాలు, శరీర ద్రవాలు, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలపై ఫోకస్ చేయడం.
  • భయంకరమైన, అలాగే రక్తపాతంతో కూడిన వివరాలపై ఫోకస్ చేసి శరీర భాగాలు, శరీర ద్రవాలు, శరీరం నుండి వెలువడే వ్యర్థాలను నాటకీయంగా ప్రదర్శించడం.
    • స్క్రిప్ట్ చేయబడిన కంటెంట్‌లో అధిక రక్తంతో కూడిన సర్జరీ సీన్‌లు.

వైద్య, అలాగే కాస్మెటిక్ పద్ధతులు

  • సెన్సార్ చేయబడని శరీర భాగాలు, శరీర ద్రవాలు, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలను వివరంగా చూపడంపై ఫోకస్ చేసే వైద్య లేదా కాస్మెటిక్ పద్ధతులతో కూడిన విద్యాపరమైన లేదా కళాత్మక కంటెంట్, కానీ కంటెంట్ యొక్క ఫోకల్ సబ్జెక్ట్, ఈ సెన్సార్ చేయబడని ఎలిమెంట్‌లను చూపడం కాదు.
    • అవయవాలు కనబడే విధంగా ఫోకస్ చేసి చూపే సెన్సార్ చేయబడని సర్జరీ, కానీ ఇందులో వీడియో యొక్క సబ్జెక్ట్ కేవలం ఆ అవయవాలు మాత్రమే కాకపోవచ్చు.
    • గులిబిని తీయడం లేదా మొటిమలను తీయడం వంటి వాటిని, ఆ పరిస్థితికి సంబంధించిన వివరణలతో సహా చూపుతున్న వైద్య నిపుణులు.

ప్రమాదాలు, గాయాలు

  • దిగ్భ్రాంతికి గురి చేసే అవకాశం ఉన్న అత్యంత ఘోరమైన ప్రమాదాలు.
  • గాయమైనట్టు స్పష్టంగా కనబడుతున్నప్పటికీ (రక్తం వస్త్రాల నుండి బయటకు కనబడటం లేదా వ్యక్తి వాహనం నుండి బయట పడటం వంటివి), బాధితులకు నొప్పి లేదా బాధ కలుగుతున్నట్టుగా అనిపించని విధంగా జరిగిన ప్రమాదాలు.
  • బాధితులకు గాయాలు లేదా బాధ కలుగుతున్నట్టుగా చూపబడని పెద్ద కారు ప్రమాదం.

వంట కోసం మాంసాన్ని సిద్ధం చేయడం, తినడం

  • వంట కోసం సిద్ధం చేయబడని జంతువుల శరీర భాగాలను చూపడం లేదా వాటిని ఆటవిక పద్ధతిలో లేదా మరీ అతిగా తినడం వంటి వాటిని కలిగిన సంచలనాత్మక "మక్‌బ్యాంగ్" లేదా ASMR జంతువుల మాంసం తినడం.
  • ఒక ప్రాణికి సంబంధించిన శరీర భాగాలను గుర్తుపట్టే విధంగా స్పష్టంగా ఫోకస్ చేసి చూపడం (ఉదాహరణకు, వండేటప్పుడు జంతువుకు సంబంధించిన కళ్లపై ఫోకస్ చేయడం).
  • భయంకరమైన, అలాగే రక్తపాతంతో కూడిన అంశాలతో ఉన్న చర్మం తీసివేయబడ్డ జంతువుల శరీర భాగాలను చూపడం, కానీ ఇందులో వాటిని తప్పుగా హ్యాండిల్ చేస్తున్నట్లుగా కనిపించదు (ఉదాహరణకు, వండటానికి సిద్ధం చేయడంలో భాగంగా రక్తం కారుతున్న మాంసంపై, అలాగే కండరాలపై ఫోకస్ చేయడం).
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వీక్షకులను షాక్‌కు గురి చేయడమే అయి ఉండి, అత్యంత ఎక్కువగా షాక్ కలిగించే కంటెంట్. సాధారణంగా, ఇందులో నిజమైన సందర్భం అందించబడదు, కానీ భయంకరమైన, అలాగే రక్తపాతంతో కూడిన అంశాలు, క్షోభ, లేదా తప్పుగా హ్యాండిల్ చేయబడటం అనేది చాలా స్పష్టంగా, కళ్లకు కట్టినట్టుగా కనబడుతుంది.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

శరీర భాగాలు, శరీర ద్రవాలు, శరీరం నుండి వెలువడే వ్యర్థాలు

  • సందర్భం గురించి తక్కువగా వివరిస్తూ లేదా అసలు సందర్భమే లేకుండా శరీర భాగాలు, శరీర ద్రవాలు, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలను అసహ్యంగా, భయంకరంగా లేదా వాటి నుండి రక్తం కారుతుండగా ప్రదర్శించడం.
    • పద్ధతి గురించి వివరంగా తెలియజేయకుండా గులిబిని లేదా మొటిమలను తీసివేయడాన్ని చూపడం, ఈ సందర్భంలో, కంటెంట్ విద్యాపరమైనదే అయినా కూడా, వీడియోలో ఎక్కువగా శరీర భాగాలు, శరీర ద్రవాలు, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలపై ఫోకస్ చేయడం జరుగుతుంది.
  • ముఖ్యమైన సందర్భం లేకపోయినా, కేవలం ఆశ్చర్యపరచాలనే ఉద్దేశంతోనే ప్రదర్శించబడిన నాటకీయమైన ఆశ్చర్యపరిచే అంశాలు.

వైద్య, అలాగే కాస్మెటిక్ పద్ధతులు

  • సందర్భం అందించినప్పటికీ, భయంకరంగా, అలాగే రక్తం కారుతుండగా సెన్సార్ చేయబడని శరీర భాగాలను, శరీర ద్రవాలను, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలను వీడియోలో ఎక్కువ సమయం చూపడం.
    • ఒక నిర్దిష్ట శస్త్ర చికిత్సను ఎలా చేయాలో వివరిస్తున్న వైద్య నిపుణులు.
  • సందర్భం ఏదీ లేకుండా లేదా తప్పుదారి పట్టించే సందర్భంతో ప్రదర్శించబడే వైద్య పద్ధతులు, ఈ సందర్భంలో, వీడియోలో ఎక్కువ సేపు శరీర భాగాలను, శరీర ద్రవాలను, లేదా శరీరం నుండి వెలువడే వ్యర్థాలను భయంకరంగా లేదా వాటి నుండి రక్తం కారుతుండగా చూపడం జరుగుతుంది.

ప్రమాదాలు, గాయాలు

  • శరీర భాగాలను స్పష్టంగా బయటకు చూపే లేదా గాయం ఎంత తీవ్రమైనదో సులభంగా ఊహించే అవకాశం ఉన్న ప్రమాదాలను, అలాగే తీవ్రమైన గాయాలను దిగ్భ్రాంతికి గురి చేసేలా చూపే ప్రదర్శనలు.
    •  రక్తం కారుతున్న, అలాగే బయటకు స్పష్టంగా కనిపిస్తున్న టిష్యూ.
  • సందర్భం లేకుండా చూపబడే అత్యంత తీవ్రమైన ప్రమాదాలు.

వంట కోసం మాంసాన్ని సిద్ధం చేయడం, తినడం

  • వీక్షకులను ఆశ్చర్యపరచడమే ఏకైక ఉద్దేశంగా బతికి ఉన్న జంతువులను చూపడం, వంట కోసం సిద్ధం చేయడం లేదా తినడం, ఈ సందర్భంలో, తరచుగా ఆ జంతువులను భయంకరంగా, అలాగే వాటి నుండి రక్తం కారుతుండగా చూపడం జరుగుతుంది.
  • సందర్భం ఏదీ లేకుండా, ఏదైనా జంతువుకు చెందిన స్పష్టంగా కనబడే ముఖ లక్షణాలపై ఫోకస్ చేసి చూపే లేదా ఆ జంతువును తప్పుగా హ్యాండిల్ చేశారని స్పష్టంగా చూపే వీడియోలు.
  • తీవ్రమైన బాధ అనుభవిస్తున్నాయని స్పష్టంగా కనపడేలా జంతువులను దారుణంగా లేదా స్పష్టంగా కనబడే విధంగా వంట కోసం సిద్ధం చేయడాన్ని (చర్మం తీయడం) లేదా చంపడాన్ని చూపడం.
  • బాధ అనుభవిస్తున్నాయని స్పష్టంగా కనబడుతున్న, బతికి ఉన్న జంతువులను తినడం కోసం సిద్ధం చేయడాన్ని విద్యేతర సందర్భాలలో చూపడం.
  • స్పష్టంగా కనబడే ముఖ లక్షణాలపై ఫోకస్ చేస్తూ, జంతువులను తినడాన్ని విద్యేతర సందర్భాలలో చూపడం.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

హానికరమైన చర్యలు, నమ్మదగని కంటెంట్

తీవ్రమైన శారీరక, భావావేశపూరిత లేదా మానసిక గాయానికి దారి తీసే, హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యలను ప్రమోట్ చేసే కంటెంట్, అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

నిపుణుల పర్యవేక్షణలో, నియంత్రిత వాతావరణంలో ఎవరూ తీవ్రంగా గాయపడకుండా చేసిన స్వల్ప ప్రమాదకర స్టంట్‌లు లేదా చర్యలు. విద్యా సంబంధిత లేదా స్క్రిప్ట్ చేయబడిన కంటెంట్‌లోని ప్రమాదకరమైన సంస్థలకు సంబంధించిన క్లుప్తమైన రెఫరెన్స్‌లు.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

సాధారణ హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యలు

  • ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ఈ కింద పేర్కొన్న యాక్టివిటీలు, వీటిలో గాయాలు అయినట్టుగా కనబడదు:
    • ప్రొఫెషనల్ స్టంట్‌లు లేదా రెక్కలు ఉన్న సూట్ వేసుకుని ఎగిరేటటువంటి ప్రమాదకరమైన క్రీడలు.
    • వాహనం ముందు చక్రాన్ని గాలిలో ఉంచి నడిపే లేదా చాలా ఎత్తు నుండి దూకుతున్న వ్యక్తి ఫుటేజ్.
    • ప్రమాదకరమైన స్టంట్‌లు చేయకుండా మోటర్ వాహనాలను వేగంగా నడపడం లేదా అకస్మాత్తుగా తిప్పడం (బండి మీద నిలబడి లేదా చేతులు వదిలేసి డ్రైవ్ చేయడం వంటివి) లేదా ఇతరులకు తరచుగా అంతరాయాలు కలిగించడం (మార్గాల మధ్యలో డ్రైవ్ చేయడం వంటివి).

వైఫల్యాల చిత్రీకరణలు

  • తీవ్రమైన గాయాలపై ఫోకస్ చేయని, వైఫల్యాలకు సంబంధించిన వీడియోల చిత్రీకరణ (కనిపించకపోవడం వల్ల గ్లాస్ డోర్‌కు గుద్దుకోవడం వంటివి). 

ప్రాంక్‌లు, సవాళ్లు

  • అయోమయం, గందరగోళం లేదా అసౌకర్యం ఉన్నప్పటికీ ఐస్ బకెట్ సవాలు వంటి ప్రమాదం లేదా దీర్ఘకాలిక హాని కలుగజేయని ప్రాంక్‌లు లేదా సవాళ్లు.
  • హానికరమైన సంఘటనకు సంబంధించిన ఫుటేజ్ లేదా ఆడియో లేకుండానే హానికరమైన ప్రాంక్‌లు లేదా సవాళ్ల గురించి చర్చలు జరపడం లేదా రిపోర్ట్ చేయడం (సంఘటన వివరాలు లేకుండా అగ్ని ప్రమాద సవాలు గురించి రిపోర్ట్ చేయడం వంటివి).
  • తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసే ప్రాంక్‌లు లేదా సవాళ్లను ప్రదర్శించే విద్యా, డాక్యుమెంటరీ లేదా వార్తలను రిపోర్ట్ చేసే కంటెంట్ (భౌతిక హాని, దుర్భాష, అలాగే “మీరు తొలగించబడ్డారు!” వంటి అవమానాలతో కూడిన ప్రాంక్‌ల వంటివి).

వైద్యపరమైన, అలాగే శాస్త్రీయపరమైన తప్పు సమాచారం

  • వైరస్‌లు, అంటు వ్యాధులు, COVID-19 గురించి భయాన్ని కలిగించే ఉద్దేశం లేని తటస్థ కంటెంట్ (వైరస్‌లు, బ్యాక్టీరియాల మధ్య భేదాలను చిన్నపిల్లలకు తెలిపే వీడియో వంటివి).

హానికరమైన తప్పు సమాచారం

  • హానికరమైన తప్పు సమాచారాన్ని ప్రచారం చేసే గ్రూప్‌లు ఎలా ప్రజల్లోకి చొచ్చుకెళ్తూ, ప్రాచుర్యం పొంది, అలాగే/లేదా తప్పు సమాచారాన్ని వ్యాపింపజేస్తాయో వివరణాత్మకంగా తెలియజేసే విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ కంటెంట్.
  • Pizzagate, QAnon, StopTheSteal తదితరాల వంటి హానికరమైన తప్పు సమాచారం కలిగించే అపోహలను తొలగించడమే ప్రధానమైన ఉద్దేశంగా రూపొందించిన విద్యా సంబంధిత లేదా డాక్యుమెంటరీ కంటెంట్.
  • వాతావరణ మార్పుల గురించి తప్పు సమాచారం అసత్యమని నిరూపించడానికి ఉద్దేశించిన విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ కంటెంట్.

వేపింగ్, పొగాకు 

  • నివారణ చర్యల కోసం పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్‌లు.
  • వినియోగంపై ఫోకస్ చేసే నాటకీయ కంటెంట్.
  • వేపింగ్/పొగాకు పరిశ్రమలను చూపే విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ కంటెంట్.

మద్యం

  • బాధ్యతారహితమైన మద్యపానాన్ని పోత్సహించడం లేదా గొప్పగా వర్ణించడం అనేవి చేయకుండా కంటెంట్‌లో ఆల్కహాల్ లేదా పెద్దవారు ఆల్కహాల్ తాగడం అనేవి ఉండటం.

విదేశీ ఉగ్రవాద సంస్థలు (FTO)

  • ఉగ్రవాద దాడిని ప్రధాన సబ్జెక్ట్‌గా తీసుకుని చర్చించే విద్యాపరమైన, పాత్రికేయ రిపోర్ట్‌లు, లేదా మ్యూజిక్ వీడియోలు.
  • ఉగ్రవాద దాడుల ఫుటేజ్ ఏదీ లేకుండా ఒక సాధారణ విషయంగా ఈ గ్రూప్‌ల గురించి విద్యాపరమైన, లేదా నాటకీయ కంటెంట్‌ను కలిగి ఉండే వీడియోలు.
  • హాస్యపూరిత ఉద్దేశంతో, FTOలు లేదా ఉగ్రవాదాన్ని ఫీచర్ చేసే పాత్రికేయ రిపోర్టింగ్‌లు.
  • కంటెంట్‌కు సంబంధించిన ప్రధాన టాపిక్‌గా పేర్కొనకుండా FTO ఇమేజ్‌లను ఫీచర్ చేసిన విద్యాపరమైన, నాటకీయ, పాత్రికేయ రిపోర్ట్‌లు, లేదా మ్యూజిక్ వీడియోలు. 

మాదక ద్రవ్యాల వ్యాపార సంస్థలు (DTO)

  • అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని మొత్తంగా ఫోకస్ చేసే విద్యాపరమైన, నాటకీయమైన, పాత్రికేయ రిపోర్ట్‌లు లేదా మ్యూజిక్ వీడియోలు.
  • DTOలు, నినాదాల వంటి సంబంధించిన ఇమేజ్‌లను ప్రదర్శించే విద్యాపరమైన, నాటకీయ, పాత్రికేయ రిపోర్ట్‌లు, లేదా మ్యూజిక్ వీడియోలు.
  • DTOలు లేదా అంతర్జాతీయ మాదకద్రవ్యాల ట్రేడింగ్‌ను సబ్జెక్ట్‌గా కవర్ చేసే హాస్య కంటెంట్ ఉన్న ఏవైనా వీడియోలు.
  • మాదక ద్రవ్యాల వ్యాపారంతో సంబంధం ఉన్న సంస్థల గురించి పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్‌లను గురించిన సమాచారం అందించబడిన అటువంటి వార్తా రిపోర్ట్‌లు.
  • DTOలు చేసే నిర్బంధాలు లేదా విచారణ వంటి హింసాత్మక ఘటనలు అలాగే చర్యలకు సంబంధించిన సీన్‌లను కలిగి ఉన్న పాత్రికేయ రిపోర్ట్‌లు.

నిర్వచనాలు:

  • “తీవ్రంగా గాయపడటం” అంటే, సరైన వైద్య చికిత్స లేకుండా నయం చేయలేని లేదా ఇంటి వద్ద చికిత్స చేయలేని గాయాలు, ఉదాహరణకు, విరిగిన ఎముకలు, స్పష్టంగా కనిపించే స్థానం తప్పిన ఎముకలు, లేదా భారీగా రక్తం పోవడం.
  • శరీరానికి మార్పులు చేయడం అంటే, అందులో పచ్చబొట్టు, దుద్దులు కుట్టించుకోవడం, లేదా వైద్యపరమైన శస్త్ర చికిత్స వంటివి ఉండవచ్చు.
  • “నాటకీయమైనది” అంటే స్క్రిప్ట్ చేయబడిన కంటెంట్, ఉదాహరణకు, సినిమాలు, లేదా కల్పిత కథాంశాలు.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

నిపుణుల పర్యవేక్షణ లేకుండా, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా చేసే సాహస చర్యలతో పాటు, భౌతికపరమైన హానిని లేదా నొప్పిని ప్రదర్శించే (వీటిని ప్రదర్శించడం మాత్రమే జరుగుతుంది, వాటిపైనే ఫోకస్ చేయడం జరగదు) కంటెంట్. ప్రమాదకరమైన సంస్థ లీడర్ లేదా సంబంధిత పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్‌లకు సంబంధించిన టాపిక్‌లు.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

సాధారణ హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యలు

  • ఎత్తైన భవనంపై నుండి దూకడం లేదా స్కేటింగ్ చేస్తూ పడి తీవ్రంగా గాయపడటాన్ని చూపడం వంటి ప్రమాదకరమైన యాక్టివిటీలతో కూడిన చర్యలు.
  • ఈ కింది వాటికి సంబంధించిన విద్యాపరమైన, డాక్యుమెంటరీ లేదా వార్తల రిపోర్ట్: 
    • గాయాలను స్పష్టంగా చూపించే హానికరమైన లేదా భయానకమైన చర్యలు.
    • పెద్దవారి కోసం రూపొందించిన వాహనాలను పిల్లలు నడుపుతున్నట్లు లేదా పిల్లలు జూదం ఆడుతున్నట్లు చూపించే కంటెంట్. 
  • మోటర్ వాహనాలను వేగంగా నడపడం లేదా అకస్మాత్తుగా తిప్పడం, అలాగే ప్రమాదకరమైన స్టంట్‌లు చేయడం (ఉదా. బండి మీద నిలబడి లేదా చేతులు వదిలేసి డ్రైవ్ చేయడం) లేదా ఇతరులకు తరచుగా అంతరాయాలు కలిగించడం (ఉదా. మార్గాల మధ్యలో డ్రైవ్ చేయడం). 
  • మైనర్‌ను పాల్గొనే వ్యక్తిగా లేదా బాధితునిగా చేర్చి, ప్రమాదకరమైన చర్యలను ప్రదర్శించే విద్యాపరమైన, నాటకీయమైన లేదా మ్యూజిక్ వీడియో కంటెంట్.

ఫెయిల్ కంపైలేషన్‌లు

  • మరణం లేదా మరణం అంచుల వరకు వెళ్లే పరిస్థితికి దారి తీయని స్పష్టంగా చూపే గాయాలు చోటుచేసుకొన్న సంఘటనలను ఫోకస్ చేసి చూపడం (ఉదా. రోడ్డు మీద జరిగిన బైక్ ప్రమాదాలకు సంబంధించిన వీడియో కంపైలేషన్).

ప్రాంక్‌లు, సవాళ్లు

  • వీటిని కలిగి ఉన్న ప్రాంక్ లేదా సవాలు కంటెంట్‌కు సంబంధించిన విద్యాపరమైన, డాక్యుమెంటరీ లేదా వార్తల రిపోర్ట్‌లు:
    • ఎవరైనా ఒక వ్యక్తి, తనకు తాను లేదా ఇతరులకు శారీరక లేదా మానసిక హానిని కలుగజేసే బెదిరింపులకు లేదా అటువంటి చర్యలకు సపోర్ట్ చేయడం, ఉదాహరణకు, రైలు పట్టాల మధ్య పడుకోవడం. 
    • వ్యక్తి ఆరోగ్యానికి తక్షణమే లేదా తీవ్రమైన హానిని కలిగించే అవకాశం ఉండి, ఎవరూ అనుకరించకూడని చర్యలు, ఉదాహరణకు బ్లీచ్‌ను తాగాల్సిందిగా చేసే సవాళ్లు, మొదలైనవి.
  • భౌతిక హాని, దుర్భాష, అవమానాల వంటి తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేసే ప్రాంక్‌లు లేదా సవాళ్లు. పనిలో నుండి తీసివేసే ప్రాంక్‌లు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధంలో భాగంగా ఒకరిని మానసికంగా ప్రేరేపించడం లేదా బెదిరించడం వంటి ఒక వ్యక్తి జీవితానికి నష్టం కలిగించే విషయాలు (ఉదా. ఒక వ్యక్తిని మానసికంగా కృంగిపోయేలా చేసే బ్రేక్ అప్ ప్రాంక్‌లు, లేదా బంధువులను అరెస్ట్ చేసే ప్రాంక్‌లు మొదలైనవి) కూడా వీటిలో ఉండవచ్చు.
  • శరీర ద్రవాలు లేదా స్పష్టంగా చూపే హింసను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న ప్రాంక్‌లు.
  • జిగురు లేదా పెంపుడు జంతువుల ఆహారం వంటి విషపూరితం కాని, తినకూడని పదార్థాలను తినమని చేసే సవాళ్లు. తినదగిన పదార్థాలే అయినప్పటికీ, ఎక్కువ పరిమాణంలో తిన్నప్పుడు ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని తినడం, ఉదాహరణకు అత్యంత కారంగా ఉండే మిరపకాయలను తినడం. లేదా స్వల్ప శారీరక ప్రతిస్పందన కలిగించే పదార్థాలను తినడం. 

వేపింగ్, పొగాకు

  • పొగాకు ప్రోడక్ట్‌లను పోల్చడం లేదా ప్రోడక్ట్ రివ్యూలను అందించడం (ఉదా. వేపింగ్ జ్యూస్‌లను పోల్చడం).
  • విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ సందర్భంలో భాగంగా వ్యసనాల నివారణ సర్వీస్‌ల గురించి పేర్కొనడం.

మద్యం

  • మద్యం లేదా మద్యం ఆధారిత ప్రోడక్ట్‌లను వినియోగిస్తున్నట్లుగా మైనర్‌లను ఫీచర్ చేసే విద్యాపరమైన, డాక్యుమెంటరీ, లేదా నాటకీయమైన కంటెంట్. 

విదేశీ ఉగ్రవాద సంస్థలు (FTO)

  • FTOలు లేదా ఉగ్రవాదానికి సంబంధించిన కామెడీ వీడియోల రెఫరెన్స్‌లు.
  • FTOలకు సంబంధించిన కామెడీ రెఫరెన్స్‌లను ఫీచర్ చేసే విద్యాపరమైన, డాక్యుమెంటరీ, లేదా మ్యూజిక్ వీడియోలు. 
  • కంటెంట్‌కు సంబంధించిన ప్రధాన టాపిక్ లేదా థీమ్ కాకపోయినా, FTO సంబంధ ఇమేజ్‌లను షేర్ చేయడం. 

మాదక ద్రవ్యాల వ్యాపార సంస్థలు (DTO)

  • సంబంధిత గ్రూప్‌లపై చేసే పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్‌లను సందర్భం లేకుండా షేర్ చేయడం.
  • DTOలపై విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ కంటెంట్ లేదా పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్‌లు.
    • నిర్దిష్ట DTOలు లేదా DTO లీడర్‌ల మీద ప్రధానంగా ఫోకస్ చేసి చూపే విద్యాపరమైన కంటెంట్.
    • దాడులు లేదా వాటి తర్వాతి పరిణామాలు, నిర్బంధంలోకి తీసుకునే పరిస్థితులు మొదలైనటువంటి హింసాత్మకంగా ఉండని పరిస్థితులు కూడా ఈ కోవకు చెందే అవకాశం ఉంది.
    • సంబంధిత గ్రూప్‌లపై పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్‌లు.
    • DTOలు చేసే నిర్బంధాలు లేదా విచారణ వంటి హింసాత్మక పరిస్థితులు అలాగే చర్యలు. 

నిర్వచనాలు:

  • “స్వల్ప శారీరక ప్రతిస్పందన” అంటే వాంతి వచ్చినట్లు ఉండటం, దగ్గు వల్ల వాంతి వచ్చినట్లు ఉండటం వంటివి.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

ప్రమాదాలు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి సంబంధించిన చర్యలు, ప్రాంక్‌లు లేదా ఆరోగ్యానికి హాని కలిగించే ప్రయోగాలు లేదా స్టంట్‌ల వంటి ప్రమాదకరమైన చర్యలు (తినకూడని పదార్థాలను తినడం/తాగడం వంటివి); ఇలాంటి కంటెంట్‌ను చూపే ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలపై జరిగే చర్చలు. ప్రమాదకరమైన సంస్థల గురించి గొప్పగా వర్ణించడం, వాటిలో నియామకాలు లేదా వాటిని స్పష్టంగా చూపే కంటెంట్.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

సాధారణ హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యలు

  • హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యలను లేదా ప్రమాదకరమైనవిగా భావించే చర్యలను గొప్పగా వర్ణించడం.
    • మోటర్ వాహనాలతో షాక్‌కు గురి చేసే సీన్‌లు, గాయాలు (ఉదా. రోడ్డు మీద ట్రక్కు గుద్ది, అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని లేదా ఆ ప్రమాదం జరిగిన క్షణాన్ని చూపడం).
  • పిల్లలు జూదం ఆడుతున్నట్లు లేదా పెద్దవారి కోసం రూపొందించిన మోటర్ వాహనాలను పిల్లలు నడుపుతున్నట్లు చూపించే కంటెంట్.
  • మైనర్‌ను పాల్గొనే వ్యక్తిగా లేదా బాధితునిగా చేర్చే ప్రమాదకరమైన చర్యలు.

ఫెయిల్ చిత్రీకరణలు

  • కొన్ని యాక్టివిటీల ఫలితంగా ఏర్పడే మరణం లేదా దారుణమైన నష్టాన్ని కలిగించే ఫెయిల్ క్లిప్‌ల కంపైలేషన్‌లు (కోలుకోలేని స్థితి లేదా వ్యక్తిని కోమా, మూర్ఛ, పక్షవాతం మొదలైన వాటికి గురి చేసేవి). 

ప్రాంక్‌లు, సవాళ్లు

  • వ్యక్తి ఆరోగ్యానికి వెనువెంటనే తీవ్రమైన హానిని కలిగించే అవకాశం కలిగి ఉండి, ఎవరూ అనుకరించకూడని ప్రాంక్‌లు లేదా సవాళ్లు. ఉదాహరణకు క్లోరిన్‌ను తాగమని చేసే సవాళ్లు, మొదలైనవి.
  • కింద పేర్కొన్న వాటికి సంబంధించిన ప్రాంక్‌లు లేదా సవాళ్లు: 
    • ఆత్మహత్య, మరణం, నకిలీ బాంబు బెదిరింపు ప్రాంక్‌ల వంటి ఉగ్రవాద చర్యలు లేదా ప్రాణాంతక ఆయుధాలతో బెదిరించడం వంటివి.
    • బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, తడమడం, లైంగిక హింస, దుస్తులు మార్చుకునే రూమ్‌లో స్పై కెమెరాలు పెట్టడం వంటి అవాంఛితమైన లైంగిక చర్యలు.
    • భౌతిక హాని లేదా బాధను చూపడం, కానీ వీడియో ఉద్దేశం బాధను చూపించడం మాత్రమే కాదు.
    • ఎవరైనా ఒక మైనర్ సుదీర్ఘ కాలం పాటు మానసిక క్షోభకు లోను కావడం, ఉదాహరణకు, ఎక్కువ కాలం పాటు కొనసాగిన ప్రాంక్ కారణంగా చిన్నారి తీవ్రంగా భయపడటం లేదా దిగ్భ్రాంతి చెందడం. ఇందులో చిన్నారులను వారి తల్లిదండ్రులు మరణించారని నమ్మించే ప్రాంక్‌లు కూడా ఉండవచ్చు.
    • ఎవరైనా ఒక వ్యక్తి, తనకు తాను లేదా ఇతరులకు శారీరక లేదా మానసిక హానిని కలుగజేసే బెదిరింపులకు లేదా అటువంటి చర్యలకు సపోర్ట్ చేయడం, ఉదాహరణకు, రైలు పట్టాల మధ్య పడుకోవడం.
    • COVID-19కు సంబంధించి ఉద్దేశపూర్వకంగా వైరస్ సోకేలా చేసుకోవడం లేదా భయాందోళనలకు గురి చేయడం వంటి ప్రమాదకరమైన యాక్టివిటీలను ప్రమోట్ చేయడం (ఉదా. క్వారంటైన్‌ను వ్యతిరేకించడం లేదా పబ్లిక్ ప్రదేశంలో ఉన్నప్పుడు వ్యాధి ఉన్నట్లు నటించడం).
    • ఇతరులకు హాని కలిగించడానికి ఆయుధాల వాడకాన్ని ప్రమోట్ చేయడం.
    • అత్యంత కారంగా ఉన్న మిరపకాయను తిన్న తర్వాత వాంతి చేసుకోవడం వంటి షాక్‌కు గురి చేసే తీవ్రమైన శారీరక ప్రతిస్పందనను కలిగించేంత పరిమాణంలో పదార్థాలను సేవించడాన్ని చూపడం.
    • మంటల సవాలు లేదా బర్డ్ బాక్స్ సవాలు వంటి, అనుకరిస్తే తీవ్రమైన హాని కలిగే అవకాశమున్న సవాళ్లు.
    • మోసపూరిత లేదా చట్టవిరుద్ధ యాక్టివిటీలను ప్రోత్సహించడం (ఉదా. ఏదైనా ఇంట్లోకి లేదా భవనంలోకి చొరబడటం).

వైద్యపరమైన, అలాగే శాస్త్రీయపరమైన తప్పు సమాచారం

  • హానికర ఆరోగ్యపరమైన లేదా వైద్యపరమైన క్లెయిమ్‌లను లేదా విధానాలను ప్రమోట్ చేయడం:
    • శాస్త్రీయంగా ధృవీకరించబడిన వ్యాధుల ఉనికిని తిరస్కరించడం, ఉదాహరణకు HIV.
    • వ్యాధులకు శాస్త్రీయంగా నిరూపితం కాని నివారణ పద్ధతులను ప్రోత్సహించే లేదా ఆ పద్ధతులకు సూచనలను అందించే వీడియోలు (ఉదాహరణకు, తీసుకొనే ఆహారంలో మార్పులు చేయడం ద్వారా క్యాన్సర్‌ను నయం చేయవచ్చు అని తెలిపే వీడియోలు).
    • వైద్యపరంగా, అలాగే శాస్త్రీయపరంగా నిరూపితమైన వాస్తవాలను బూటకమైనవిగా కొట్టి పారేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, ఉదాహరణకు, వ్యాక్సినేషన్ మంచిది కాదని ప్రచారం చేయడం.
    • గే మార్పిడి చికిత్స ప్రోగ్రామ్‌లు లేదా సర్వీస్‌లను ప్రమోట్ చేసే, లేదా సమర్థించేలా ఉన్న కంటెంట్.
  • COVID-19 విషయంలో హానికర తప్పుడు సమాచారాన్ని ప్రమోట్ లేదా సపోర్ట్ చేయడం:
    • COVID-19 వ్యాక్సిన్‌ను తీసుకోకూడదని ప్రజలను నిరుత్సాపరిచే కంటెంట్.
    • వ్యాక్సిన్ ప్రభావాలు లేదా పంపిణీ గురించి అవాస్తవమైన లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు. వీటిలో ఇవి ఉండవచ్చు:
      • వ్యాక్సిన్ తీసుకోవడం వలన సంతాన సాఫల్య సమస్యలు తలెత్తుతాయని చేసే ప్రకటనలు. 
      • వ్యాక్సిన్‌లో మైక్రోచిప్ ఉంటుందని చేసే ప్రకటనలు. 
      • జనాభాలో కొంత భాగాన్ని చంపడానికి వ్యాక్సిన్‌లను ఉపయోగించవచ్చు అని చేసే ప్రకటనలు.
    • COVID-19 సోకడాన్ని లేదా వ్యాప్తిని మాస్క్‌లు గానీ లేదా సామాజిక దూరం గానీ తగ్గించదు అని చేసే ప్రకటనలు.
    • వైద్యపరంగా, అలాగే శాస్త్రీయపరంగా నిరూపితమైన వాస్తవాల ఆధారంగా కాకుండా COVID-19 వ్యాప్తి గురించి వేరే విధంగా చేసే ప్రకటనలు (ఉదాహరణకు, అది 5G వైర్‌లెస్ సిగ్నల్స్ ద్వారా వ్యాప్తి చెందుతుందని చేసే ప్రకటనలు).
    • COVID-19కు శాస్త్రీయంగా నిరూపితం కాని నివారణ పద్ధతులను ప్రోత్సహించే లేదా ఆ పద్ధతులకు సూచనలను అందించే వీడియోలు (ఉదాహరణకు, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఇంజెక్ట్ చేసుకోమని చెప్పే వీడియోలు).

హానికరమైన తప్పు సమాచారం

  • ఏవైనా విషయాలు తప్పుడు సమాచారమని స్పష్టంగా తెలిసినప్పటికీ వాటిని నిజాలుగా ప్రకటించడం, అలాగే ఎన్నికల లేదా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడాన్ని లేదా వాటిపై ఉన్న నమ్మకాన్ని గణనీయంగా తగ్గించడం.
    • పబ్లిక్ ఓటింగ్ విధానాలు, వయస్సు లేదా జన్మస్థలం ఆధారంగా రాజకీయ అభ్యర్థి అర్హత, ఎన్నికల ఫలితాలు, లేదా జన గణనలో పాల్గొనడం మొదలైన వాటి గురించి, అధికారిక ప్రభుత్వ రికార్డ్‌లకు విరుద్ధంగా ఉండేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.
  • హానికరమైన తప్పుడు సమాచారాన్ని ప్రమోట్ చేయడం (ఉదా. Pizzagate, QAnon, StopTheSteal).
  • హానికరమైన తప్పుడు సమాచారాన్ని ప్రమోట్ చేసే గ్రూప్‌లకు సపోర్ట్ చేయడం.
  • వాతావరణ మార్పు జరుగుతోందనే విషయంలో, అలాగే దానికి కారణమైన అంశాల విషయంలో అధికారిక శాస్త్రీయ ఏకాభిప్రాయానికి విరుద్ధమైన ప్రచారం చేయడం.

వేపింగ్, పొగాకు 

  • పొగాకు, పొగాకు సంబంధిత ప్రోడక్ట్‌లు, అలాగే వాటి వినియోగాన్ని ప్రమోట్ చేయడం.
  • మైనర్‌లు వేపింగ్/పొగాకు ప్రోడక్ట్‌లను వినియోగిస్తున్న ఫుటేజ్.
  • వేపింగ్/పొగాకు ప్రోడక్ట్‌ల అమ్మకాలను సులభతరం చేయడం.
  • తయారీదారు ఉద్దేశించని రీతిలో వేపింగ్/పొగాకు ప్రోడక్ట్‌లను వినియోగించడం (ఉదా. వేప్ జ్యూస్ తాగడం). 

మద్యం

  • మైనర్‌లు మద్యం తాగడాన్ని చిత్రీకరించడం (వీడియోలో అది ముఖ్యమైన సబ్జెక్ట్ కాకపోయినా కూడా). 
  • మైనర్‌లు ఆల్కహాల్ సేవించడాన్ని ప్రమోట్ చేయడం.

విదేశీ ఉగ్రవాద సంస్థలు (FTO)

  • FTOలు లేదా ఉగ్రవాద సబ్జెక్ట్‌పై ఫోకస్ చేసే విద్యా సంబంధితం కాని వీడియోలు, ఉదాహరణకు: 
    • ఉగ్రవాద దాడిని ప్రధాన సబ్జెక్ట్‌గా తీసుకుని చేసే చర్చలు.
    • కంటెంట్‌లో ఎక్కడైనా (థంబ్‌నెయిల్ వంటి వాటిలో) సంబంధిత ఇమేజ్‌లు లేదా గ్రూప్/లీడర్ పేర్లు ఉండటం.
  • షాక్‌కు గురిచేసే, స్పష్టంగా చూపే, అలాగే/లేదా హింసాత్మక ఇమేజ్‌లను ఫీచర్ చేసే కంటెంట్, లేదా హింసను ప్రేరేపించే లేదా గొప్పగా వర్ణించే సీన్‌లు.
  • ఉగ్రవాద సంస్థలు అందించిన లేదా వారికి సపోర్ట్‌గా చేసిన కంటెంట్.
  • ఉగ్రదాడుల సందర్భంగా సంబరాలు చేసే, లేదా అటువంటి దాడులు జరగలేదు అనే కంటెంట్.

మాదక ద్రవ్యాల వ్యాపార సంస్థలు (DTO)

  • నిర్దిష్ట DTOలు, DTO లీడర్‌లు, లేదా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యాపారంపై ఫోకస్ చేసే విద్యా సంబంధితం కాని వీడియోలు.
    • ఈ టాపిక్ గురించి వీడియోలో యాదృచ్ఛికంగా, అనుకోకుండా చర్చ జరిగినప్పుడు, అది "విద్యా సంబంధితం కానిది"గా పరిగణించబడుతుంది, ఎందుకంటే, వీడియో ఉద్దేశం ఆ టాపిక్ గురించి వివరించడమని స్పష్టంగా ఎక్కడా ప్రకటించలేదు కాబట్టి.
  • విద్యకు సంబంధించిన సందర్భంలో కాకుండా జెండాలు, నినాదాలు, బ్యానర్‌లు మొదలైన DTO సంబంధిత ఇమేజ్‌లను ప్రదర్శించడం.
  • గ్రూప్ మెంబర్‌ల నియామకం.
  • “నార్కోకోరిడోస్” లేదంటే DTOలను కీర్తించడం లేదా ప్రమోట్ చేయడానికి సంబంధించిన మ్యూజిక్.
  • DTOలు చేసే నిర్బంధాలు లేదా విచారణ వంటి హింసాత్మక ఘటనలు, చర్యలు.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

ద్వేషపూరితమైన, అవమానకరమైన కంటెంట్

ఎవరైనా ఒక వ్యక్తి, లేదా వ్యక్తుల గ్రూప్ పట్ల విద్వేషాలను ప్రేరేపించే, వివక్షను ప్రోత్సహించే, అగౌరవపరిచే, లేదా అవమానపరిచే విధంగా ఉండే కంటెంట్, అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు. వ్యంగం లేదా కామెడీని పంచాలనే ఉద్దేశంతో రూపొందించిన కంటెంట్‌కు మినహాయింపు ఉండవచ్చు. మీరు హాస్యం పంచాలనే ఉద్దేశంతోనే రూపొందించారని తెలిపినా, అది సరిపోదు, అప్పటికీ ఆ కంటెంట్ అడ్వర్టయిజింగ్‌కు తగినది కాకపోవచ్చు.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

ప్రత్యేక హక్కులు గల గ్రూప్‌లు లేదా ఒక వ్యక్తి అభిప్రాయాలు లేదా చర్యలను కించపరచకుండా వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించే కంటెంట్.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • ప్రత్యేక హక్కులు గల గ్రూప్ గురించి వివరించే, లేదా అటువంటి గ్రూప్ ఎదుర్కోగల వివక్షను ద్వేషపూరితం కాని రీతిలో రిపోర్ట్ చేసే వార్తల కంటెంట్, ఉదా. హోమోఫోబియాపై వార్తల రిపోర్ట్.
  • ప్రత్యేక హక్కులు గల గ్రూప్‌లకు వ్యతిరేకంగా చేసే ఎగతాళి, అవమానం లేదా కించపరిచే విధంగా ఉన్న ఇతర కామెంట్‌లను ఖండించే లేదా సూచించే కామెడీ కంటెంట్.
  • ద్వేషాన్ని, హింసాత్మక ఘర్షణను ప్రేరేపించకుండా ప్రత్యేక హక్కులు గల గ్రూప్‌లపై చేసే బహిరంగ చర్చలు.
  • జనాదరణ పొందిన మ్యూజిక్ వీడియోలలో ఉపయోగించిన విధంగా, ద్వేషపూరితం కాని రీతిలో సున్నితమైన పరిభాషను లేదా గుర్తులను ఉపయోగించే కళాత్మక కంటెంట్.
  • విద్యాపరమైన లేదా డాక్యుమెంటరీ కంటెంట్:
    • ప్రేక్షకులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సెన్సార్ చేసిన 'జాతి ఆధారంగా కించపరిచేలా ఉన్న పదాల'ను లేదా అవమానకరమైన పదాలను ఉపయోగించడం (ఉదా. n***er).
    • ద్వేషపూరితమైన ఇమేజ్‌లపై ఫోకస్ చేసే కంటెంట్.
  • రెచ్చగొట్టే లేదా కించపరిచే ఉద్దేశం లేకుండా ఒక వ్యక్తి లేదా గ్రూప్ అభిప్రాయాన్ని, ఆలోచనలను, లేదా చర్యలను విమర్శించడం.

నిర్వచనాలు:

"ప్రత్యేక హక్కులు గల గ్రూప్" అంటే, ఈ కింద ఉన్న లక్షణాలు గల గ్రూప్‌లను సూచిస్తుంది. ఈ దిగువనున్న లక్షణాల ఆధారంగా ఎవరైనా ఒక వ్యక్తి, లేదా వ్యక్తుల గ్రూప్ పట్ల విద్వేషాలను ప్రేరేపించడం, వివక్ష చూపడం, అగౌరవపరచడం, లేదా అవమానపరచడం అనేది అడ్వర్టయిజర్-ఫ్రెండ్లీగా పరిగణించబడదు.

  • జాతి
  • జాతి లేదా జాతి మూలం
  • జాతీయత
  • మతం
  • వైకల్యం
  • వయస్సు
  • వెటరన్ స్టేటస్
  • లైంగిక ధోరణి
  • లింగం గుర్తింపు
  • వ్యవస్థాగత వివక్ష లేదా అణగదొక్కడంతో సంబంధం ఉన్న ఏదైనా ఇతర లక్షణం.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

వ్యక్తులు లేదా గ్రూప్‌లకు అభ్యంతరకరంగా అనిపించే అవకాశం ఉన్న కంటెంట్ కావచ్చు కానీ విద్యా, వార్తలు లేదా డాక్యుమెంటరీ కోసం వినియోగించబడుతోంది.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • అభ్యంతరకరమైన భాషను కలిగి ఉండే అవకాశమున్నా కానీ, అవగాహన కల్పించే ఉద్దేశం ఉన్న రాజకీయ ప్రసంగం లేదా చర్చ, ఉదాహరణకు, ట్రాన్స్‌జెండర్ హక్కులపై రాజకీయ చర్చ.
  • విద్యా సంబంధిత కంటెంట్:
    • ప్రేక్షకులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సెన్సార్ చేయని 'జాతి ఆధారంగా కించపరిచేలా ఉన్న పదాల'ను లేదా అవమానకరమైన పదాలను ఉపయోగించడం (ఉదా. ఎన్-పదాన్ని సెన్సార్ చేయకుండా పలకడం లేదా పూర్తిగా ఉచ్చరించడం).
    • ఈ కింద పేర్కొన్న చర్యలకు పాల్పడుతున్న ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాసెస్ చేయని ఫుటేజ్‌ను కలిగి ఉండటం, కానీ ఆ కంటెంట్ ఉద్దేశం ఆ చర్యలను బహిరంగంగా ప్రమోట్ చేయడం లేదా గొప్పగా వర్ణించడం కాదు:
      • ఒక వ్యక్తి లేదా గ్రూప్‌ను అవమానించడం లేదా కించపరచడంపై ఫోకస్ చేయడం.
      • దుర్వినియోగం లేదా పీడించటానికి ఎవరినైనా వేరు చేసి మాట్లాడటం.
      • విషాద సంఘటనలు జరిగాయని ఒప్పుకోకపోవడం, అవి కప్పిపుచ్చే ప్రయత్నాలని చెప్పడం.
      • వ్యక్తిగతంగా హానికరమైన దాడులు చేయడం, పరువు నష్టం కలుగజేయడం.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

వ్యక్తులు లేదా గ్రూప్‌ల పట్ల ద్వేషం లేదా వేధింపులు.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • ప్రత్యేక హక్కులు గల ఏదైనా గ్రూప్‌ను అగౌరవపరచడానికి ఉద్దేశించబడిన లేదా ఆ గ్రూప్ హీనమైనదని సూచించే/పేర్కొనే ప్రకటనలు, ఉదాహరణకు, "ఈ దేశ ప్రజలందరినీ చూస్తే నాకు ఎక్కడ లేని చిరాకు వస్తుంది," అనే ప్రకటన.
  • జాతి ఆధారంగా కించపరిచేలా ఉన్న పదాలను లేదా అవమానకరమైన పదాలను ఫీచర్ చేసే విద్యేతర కంటెంట్.
  • ఇతరులకు వ్యతిరేకంగా హింసను ప్రమోట్ చేయడం, గొప్పగా వర్ణించడం లేదా అనుమతించడం.
    • ప్రత్యేక హక్కులు గల గ్రూప్‌లపై వివక్షను ప్రేరేపించడం, ఉదాహరణకు, "ఈ దేశానికి చెందిన వైకల్యమున్న వాళ్లని అందరినీ మీరు చీదరించుకోవాలి," అని ప్రకటించడం.
  • విద్వేషకరమైన గ్రూప్‌లను, ద్వేషపూరిత గుర్తులను లేదా విద్వేషకరమైన గ్రూప్‌లకు సంబంధించిన సామాగ్రిని ప్రమోట్ చేయడం.
  • ఒక వ్యక్తి లేదా గ్రూప్ మనోభావాలను తీవ్రంగా కించపరచడం లేదా అవమానపరచడం.
  • దుర్వినియోగం లేదా పీడించటానికి ఒక వ్యక్తిని లేదా గ్రూప్‌ను వేరు చేసి మాట్లాడటం.
  • విషాద సంఘటనలు జరిగాయని ఒప్పుకోకపోవడం లేదా వాటిని గొప్పగా వర్ణించడం, బాధితులను లేదా ఆ సంఘటనల నుండి బయటపడిన వారిని సంక్షోభ నటులుగా ఫ్రేమ్ చేయడం.
  • హానికరమైన వ్యక్తిగత దాడులు, దూషణలు, అపనిందలు.
  • సిద్ధాంతాలను లేదా నమ్మకాలను సాధారణీకరించడం లేదా అవమానపరచడం ద్వారా వాటిని హానికరమైన విధంగా చూపడం.
    • వ్యక్తులు, గ్రూప్‌లు, సిద్ధాంతాలు, లేదా నమ్మకాల గురించి విష ప్రచారం చేయడం, ఉదాహరణకు, "స్త్రీవాదమంటేనే రోత పుట్టించేది," అని ప్రకటించడం.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

మాదక ద్రవ్యాలు, వాటికి సంబంధించిన కంటెంట్

చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు, నియంత్రిత చట్టబద్ధమైన మాదక ద్రవ్యాలు లేదా పదార్థాలు, లేదా ఇతర ప్రమాదకరమైన ప్రోడక్ట్‌ల అమ్మకాన్ని, వినియోగాన్ని లేదా దుర్వినియోగాన్ని ప్రమోట్ గానీ లేదా ఫీచర్ గానీ చేసే కంటెంట్, అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రమోట్ చేసే, లేదా హైలైట్ చేసి చూపే ఉద్దేశం లేకుండా, మాదక ద్రవ్యాలు లేదా వాటికి సంబంధించిన సామాగ్రి గురించి ప్రస్తావించే విద్యా సంబంధిత, సరదాభరితమైన లేదా మ్యూజిక్ సంబంధిత రెఫరెన్స్‌లు. గేమింగ్ కంటెంట్‌లో మాదక ద్రవ్యాల‌కు సంబంధించిన వ్యవహారాలను చూపించడం. మాదక ద్రవ్యాలను ఉపయోగించి నాటకీయమైన కంటెంట్‌ను చిత్రీకరించే డాక్యుమెంటరీ లేదా పాత్రికేయ రిపోర్ట్‌లు.

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • మాదక ద్రవ్యాల వాడకానికి సంబంధించి శాస్త్రీయపరంగా కలిగే ప్రభావాలు లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన చరిత్ర వంటి అంశాలు గల, మాదక ద్రవ్యాలు లేదా వాటికి సంబంధించిన సామాగ్రి గురించి విద్యాపరమైన కంటెంట్.
  • మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడిన వారి వ్యక్తిగత అనుభవాలు.
  • మాదక ద్రవ్యాల గురించి సంక్షిప్త వర్ణనతో ఉన్న మ్యూజిక్ వీడియోలు.
  • మాదక ద్రవ్యాలకు సంబంధించిన వ్యవహారాలను ప్రదర్శించే గేమింగ్ కంటెంట్. 
  • మాదక ద్రవ్యాల కొనుగోలు, తయారీ, వినియోగం, లేదా పంపిణీకి సంబంధించిన డాక్యుమెంటరీ లేదా పాత్రికేయ రిపోర్ట్‌లు, ఉదాహరణకు, మాదక ద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలు జరిగే చోటును పోలీసులు స్వాధీనం చేసుకొన్న ఘటనపై కథనం.
  • మాదక ద్రవ్యాల వినియోగం లేదా వాడకం (ఇంజెక్ట్ చేసుకోవడం వంటివి)తో కూడిన గేమింగ్ సీన్‌లతో సహా నాటకీయమైన, డాక్యుమెంటరీ, లేదా పాత్రికేయ రిపోర్ట్.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వినియోగాన్ని (ఇంజెక్ట్ చేసుకోవడంతో సహా) ప్రమోట్ చేసే, లేదా హైలైట్ చేసి చూపే ఉద్దేశం లేకుండా, చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వినియోగంపై లేదా తయారీపై ఫోకస్ చేసే విద్యేతర, అలగే సమాచారేతర కంటెంట్.

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • మ్యూజిక్ అలాగే వీడియో గేమ్‌లు, మాదక ద్రవ్యాల వినియోగాన్ని చూపించడంతో సహా, నాటకీయ కంటెంట్.
    • స్క్రిప్ట్ చేయబడిన కంటెంట్‌లో, మత్తు పొందడానికి మాదక ద్రవ్యాలను ఇంజెక్ట్ చేసుకోవడాన్ని చూపే సీన్‌లు.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

ఉల్లాసభరితమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలు లేదా వాటికి సంబంధించిన సామాగ్రిని కొనడం, తయారు చేయడం, అమ్మడం లేదా కనుగొనడం గురించి సూచనలను అందించడం వంటి, మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రమోట్ చేసే లేదా హైలైట్ చేసి చూపే కంటెంట్.

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • మాదక ద్రవ్యాలకు సంబంధించిన రివ్యూలను, అలాగే ముఖ్యమైన సమాచారాన్ని షేర్ చేయడం.
    • మాదక ద్రవ్యాల వినియోగానికి లేదా వాటిని తయారు చేయడానికి (ఉదాహరణకు, గంజాయి పెంపకం) చిట్కాలు లేదా సిఫార్సులు.
    • గంజాయిని అమ్మే కాఫీ షాపులు, ప్రధాన షాపులు, డీలర్‌లు, పంపిణీ స్థలాల టూర్‌లు మొదలైన వాటికి సంబంధించిన రివ్యూలు.
    • మాదక ద్రవ్యాలను ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో కొనడం లేదా అమ్మడం.
      • మాదక ద్రవ్యాలను అమ్మే సైట్‌లకు లింక్‌లను లేదా వాటిని అమ్మే లొకేషన్‌లకు సంబంధించిన భౌతిక అడ్రస్‌లను షేర్ చేయడం.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

తుపాకులకు సంబంధించిన కంటెంట్

నిజమైన లేదా నకిలీ తుపాకులకు సంబంధించిన అమ్మకం, విడిభాగాలను కలపడం, తప్పుడు వినియోగం లేదా దుర్వినియోగంపై ఫోకస్ చేసి చూపే కంటెంట్, అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

బాటసారులకు లేదా ఇతరుల ప్రాపర్టీకి హాని కలిగేలా కాకుండా, షూటింగ్ రేంజ్ లాంటి సురక్షితమైన వాతావరణంలో లేదా బహిరంగ ప్రదేశంలో నాన్ లేదా సెమీ-ఆటోమేటిక్, మార్చబడని తుపాకులను చూపించడం. రిపేర్ లేదా నిర్వహణ కోసం తుపాకీకి, అలాగే పెయింట్‌బాల్ గన్‌కు సంబంధించి విడిభాగాలను కలపడం లేదా విడదీయడం. ఎయిర్‌సాఫ్ట్ లేదా బాల్ బుల్లెట్ (BB) గన్‌లను బాధ్యతాయుతంగా వాడటం.

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • తుపాకీ చట్టం లేదా తుపాకీ కంట్రోల్‌ను జారీ చేయడంపై చర్చలు.
  • తుపాకీ రివ్యూలు, ప్రదర్శనలు.
  • ఆప్టికల్ స్కోప్‌లు, సైలెన్సర్‌లను ఫీచర్ చేస్తున్న కంటెంట్.
  • వ్యక్తి లేదా ప్రాపర్టీకి హాని కలిగించకుండా ఉపయోగించే నకిలీ తుపాకులు.

నిర్వచనాలు:

  • “సురక్షితమైన ప్రదేశం” అంటే, లక్ష్య సాధన కోసం ప్రత్యేకంగా నిర్మించిన షూటింగ్ రేంజ్‌లు లేదా ఆవరణం ఏర్పరచబడ్డ ప్రదేశాల వంటి లొకేషన్‌లు.
  • "సవరణలు" ప్రోడక్ట్‌కు సంబంధించిన అంతర్గత పనితీరుకు ఆటంకం కలిగించే, మెరుగుపరిచే లేదా మార్చడానికి సంబంధించిన అంశాలను సూచిస్తాయి, అలాగే హెయిర్ ట్రిగ్గర్‌లు, బంప్ స్టాక్స్, పేలుడు/దాహక మందుగుండు సామగ్రి లేదా థర్మల్/ఇన్‌ఫ్రారెడ్ దృశ్యాలు లేదా భారీ సామర్థ్యంతో కూడిన మ్యాగజైన్‌ల వంటి ఇతర అటాచ్‌మెంట్‌లను సూచిస్తాయి. 
  • "నకిలీ తుపాకీ" అనేది డిజైన్ పరంగా పని చేయని తుపాకీ. ఈ నిర్వచనం బుల్లెట్ లేకుండా ఖాళీగా ఫైర్ చేయడం కోసం (బుల్లెట్ లేకుండా ఖాళీగా ఫైర్ చేసే తుపాకులు) మాత్రమే రూపొందించబడిన తుపాకులకు కూడా వర్తిస్తుంది. 
     
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

నియంత్రిత పరిసరాల వెలుపల తుపాకుల వాడకం; రక్షణా సామాగ్రి లేకుండా ఇతరులపై ఎయిర్‌సాఫ్ట్ లేదా బాల్ బుల్లెట్ (BB) తుపాకులను ఉపయోగించడం.

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • తగిన విధంగా సిద్ధం చేయని లేదా అనియంత్రిత పరిసరాల్లో తుపాకులు ఉపయోగించడాన్ని చూపడం (ఉదా. ఇంటి బయట ఉన్న వీధిలో, లేదా బాటసారులు లేదా ఇతర వ్యక్తుల ప్రాపర్టీ ప్రమాదంలో పడే ప్రదేశంలో).
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

తుపాకుల తయారీ లేదా వాటికి మార్పులు చేయడం (విడిభాగాలను కలపడం లేదా విడదీయడంతో సహా), తుపాకీ తయారీదారులు లేదా విక్రేతలను ప్రమోట్ చేయడం, లేదా తుపాకీ విక్రయ సదుపాయాలను కల్పించడం, పెద్దల పర్యవేక్షణ లేకుండా మైనర్‌లు తుపాకులను ఉపయోగించడాన్ని చూపించే కంటెంట్. బంప్ స్టాక్‌లు లేదా హెయిర్ ట్రిగ్గర్‌లు, థర్మల్ నైట్ విజన్ లేదా ఇన్‌ఫ్రారెడ్ సైట్‌లతో మార్చబడిన తుపాకులను, లేదా థర్మల్ పేలుడు పదార్థాన్ని, లేదా దాహక మందుగుండు సామాగ్రిని ఉపయోగించడాన్ని చూపించే కంటెంట్. ఒక తుపాకీకి జోడించబడిన లేదా విడిగా ఉన్న, ఎక్కువ రౌండ్‌ల సదుపాయంతో కూడిన మ్యాగజైన్‌లను (30 రౌండ్లు లేదా అంతకు మించి) చూపించే కంటెంట్. ఒకే ట్రిగ్గర్ పుల్‌లో ఒకటి కంటే ఎక్కువ రౌండ్‌లలో కాల్పులు జరిపేందుకు పూర్తిగా ఆటోమేటిక్ తుపాకులు లేదా తుపాకులను కలిగి ఉన్న కంటెంట్.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • తుపాకీకి బంప్ స్టాక్‌లను ఎలా జోడించాలో తెలిపే గైడ్‌లు.
  • తుపాకులను కొనుగోలు చేయడానికి, వాటికి సంబంధించిన టాప్ తయారీదారులను లేదా సంస్థలను సిఫార్సు చేసే కంటెంట్ (ఉదా. “తుపాకులు దొరికే 15 ఉత్తమ షాపులు”).
  • నేరుగా తుపాకుల అమ్మకాలకు వీలు కల్పించే సైట్‌ను యూజర్‌లకు సూచించడం.
  • ఈ కింది వాటితో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా తుపాకీ లేదా వాటి భాగాల విక్రయాన్ని ప్రమోట్ చేయడం:
    • ఈ కింది వాటితో సహా, తుపాకీ ఫంక్షనాలిటీకి ముఖ్యమైన లేదా దాన్ని మెరుగుపరిచే తుపాకీకి సంబంధించిన విడిభాగాన్ని లేదా భాగాన్ని అమ్మడం:
    • 80% తయారీ పూర్తయిన తుపాకీ భాగాలు
    • మందుగుండు సామాగ్రి
    • మందుగుండు సామాగ్రికి సంబంధించిన క్లిప్‌లు
    • సైలెన్సర్లు
    • మందుగుండు సామాగ్రి బెల్టులు
    • స్టాక్‌లు
    • మార్పిడి కిట్‌లు
    • గన్-గ్రిప్పులు
    • స్కోప్‌లు
    • సైట్‌లు
  • తుపాకులు అమ్మే స్టోర్‌లకు సంబంధించిన కంటెంట్‌ను ప్రమోట్ చేసే వీడియోలు.
  • తుపాకుల తయారీదారులను లేదా వాటిని అమ్మే స్టోర్‌ల కోసం డిస్కౌంట్ కోడ్‌లను ప్రమోట్ చేసే వీడియోలు.
  • తుపాకులను ఎలా తయారు చేయాలో సూచనలు ఉన్న వీడియోలు (ఉదా. తుపాకీ భాగాలను జోడించడం/విడదీయడం లేదా తుపాకీ మార్పుల గురించి వివరించే దశలు), గైడ్‌లు లేదా సాఫ్ట్‌వేర్ లేదా తుపాకులు లేదా తుపాకీ భాగాల 3D ప్రింటింగ్‌కు సంబంధించిన పరికరాలను కలిగి ఉన్న వీడియోలు.
  • మార్పులు చేసే ఉద్దేశంతో తుపాకీ విడిభాగాలను కలపడం/విడదీయడం.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

వివాదాస్పద టాపిక్‌లు

'వివాదాస్పదమైన టాపిక్‌లు' అనేవి మా వీక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసే అవకాశం ఉన్న టాపిక్‌లను సూచిస్తాయి, సాధారణంగా ఇవి మనిషి జీవితంతో ముడిపడి ఉన్న విషాదాల కారణంగా ఏర్పడతాయి. కంటెంట్ ఆద్యంతం కామెంటరీ ఉన్నా లేదా కంటెంట్‌లో హింస, రక్తం, శృంగారం లాంటి వాటిని స్పష్టంగా చూపే ఇమేజ్‌లు ఏవీ లేకపోయినా కూడా ఈ పాలసీ వర్తిస్తుంది.

పిల్లలపై హింస, పెద్దల లైంగిక హింస, లైంగిక వేధింపులు, స్వీయ హాని, ఆత్మహత్య, ఆహార సంబంధిత వ్యాధులు, గృహ హింస, గర్భస్రావం, రోగిని నొప్పిలేకుండా చంపడం అనేవి వివాదాస్పద టాపిక్‌ల కిందకు వస్తాయి.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

వివాదాస్పద టాపిక్‌లను నివారించడానికి సంబంధించిన కంటెంట్. ఎటువంటి స్పష్టంగా చూపే దృశ్యాలు లేదా వివరణ లేకుండా వీడియోలో వివాదాస్పద టాపిక్‌ల గురించి తాత్కాలికంగా ప్రస్తావించిన కంటెంట్. గృహ హింస, స్వీయ హాని, పెద్దల లైంగిక హింస, గర్భస్రావం, లైంగిక వేధింపులకు సంబంధించిన ఎటువంటి స్పష్టంగా చూపే దృశ్యాలు, వివరణ లేని కంటెంట్.

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు: 

  • స్ఫష్టంగా లేని, వివరణాత్మకం కాని, వివాదాస్పద టాపిక్‌ల గురించి ప్రధాన టాపిక్‌కు సంబంధించిన వార్తల కవరేజీ.
  • వ్యక్తిగత అనుభవాలు, అభిప్రాయాలు, లేదా వైద్య విధాన కంటెంట్‌తో కూడిన స్పష్టంగా లేని గర్భస్రావానికి సంబంధించిన కంటెంట్.
  • గర్భస్రావం గురించి చారిత్రక లేదా చట్టపరమైన వాస్తవాలను వివరించే కంటెంట్.
  • ఆత్మహత్య/స్వీయ హాని, పెద్దల లైంగిక హింస, గృహ హింస, లైంగిక వేధింపులు, లేదా రోగిని నొప్పిలేకుండా చంపడానికి సంబంధించిన స్పష్టంగా లేని, వివరణాత్మకంగా లేని కంటెంట్‌ను పాత్రికేయ వృత్తిలో భాగంగా టాపిక్‌ను రిపోర్ట్ చేయడం.
  • వివాదాస్పద సమస్యలకు సంబంధించిన నాటకీయ లేదా ఆర్ట్ సంబంధిత అంశాలను స్పష్టంగా చూపకపోవడం.
    • ఎవరైనా వంతెనపై నుండి దూకడం వంటి అంశాలను చూపించే సినిమా, అయితే చనిపోయిన బాడీ స్పష్టంగా చూపబడదు.
  • ప్రేరేపించే లేదా అనుకరించదగిన సంకేతాలు లేకుండా ఆహార సంబంధిత వ్యాధులకు సాధారణ సూచన.  

టైటిల్ & థంబ్‌నెయిల్: 

  • స్పష్టంగా చూపబడని' వివాదాస్పదమైన టాపిక్‌లుకు సంబంధించిన రెఫరెన్స్‌లు.
    • రేజర్‌కు సంబంధించిన టెక్స్ట్ లేదా ఇమేజ్.

నిర్వచనాలు: 

  • 'కొద్ది సమయం పాటు వచ్చే రెఫరెన్స్‌లు' అనేవి కంటెంట్‌లో ప్రధానాంశాలు కావు (అప్రధానమైనవి), వాటిలో వివాదాస్పదమైనవి లేదా సున్నితమైనవిగా లిస్ట్ చేసిన టాపిక్‌లకు సంబంధించి యధాలాపంగా వచ్చే రెఫరెన్స్‌లు ఉంటాయి. ఉదాహరణకు, వివాదాస్పదమైన లేదా సున్నితమైన టాపిక్‌ను క్లుప్తంగా ధృవీకరించడం అనేది ఫోకల్‌గా కాకుండా తాత్కాలిక సూచనగా పరిగణించబడుతుంది. 
    • ఉదాహరణకు, “వచ్చే వారం వీడియోలో, ఆత్మహత్యల సంఖ్య తగ్గుదల గురించి మేము చర్చిస్తాము.”
  • ప్రేరేపించే లేదా అనుకరించదగిన సంకేతాలు:   
    • అత్యల్ప BMI లేదా బరువు.
    • మరీ బక్క పలచగా, లేదా కృశించిన శరీరాన్ని చూపడం.
    • బరువు లేదా శరీర ఆకృతికి సంబంధించిన ఇతర అంశాల ఆధారంగా అవమానించడం లేదా జులుం చలాయించడం.
    • ఆహారాన్ని అతిగా తినడం, ఆహారాన్ని దాచడం లేదా నిల్వ చేయడాన్ని సూచించడం.
    • కేలరీల లోటును చేరుకోవడానికి వ్యాయామం చేయడం.
    • వాంతి చేసుకోవడం లేదా విరోచనాల మందుల దుర్వినియోగం.
    • బరువు తగ్గడంలో ప్రోగ్రెస్‌ను చెక్ చేయడం.
    • పై ప్రవర్తనలలో దేనినైనా దాచడాన్ని సూచించేవి.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయం పరిమితంగా రావచ్చు లేదా అసలు ఆదాయమే రాకపోవచ్చు

దృశ్యపరంగా అంతరాయం కలిగించినప్పటికీ వివరణాత్మక భాషను కలిగి ఉండే వివాదాస్పద టాపిక్‌లకు సంబంధించిన కంటెంట్. వివాదాస్పదమైన టాపిక్‌లకు సంబంధించిన ఆర్ట్, డాక్యుమెంటరీ, లేదా సైన్స్ సంబంధిత ప్రెజెంటేషన్‌లు. పిల్లలపై హింసకు సంబంధించిన ఎటువంటి స్పష్టంగా చూపే దృశ్యాలు, వివరణ లేని ప్రధాన టాపిక్. పెద్దల లైంగిక హింస, లైంగిక వేధింపులు, లేదా గృహ హింసకు సంబంధించి ఎటువంటి స్పష్టంగా చూపే దృశ్యాలు లేకుండా, వివరణను కలిగి ఉన్న కంటెంట్.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు: 

  • వివరణాత్మక వర్ణనలు లేదా స్పష్టంగా చూపే అంశాలు లేకుండా పిల్లలపై హింసను ప్రధాన అంశంగా కలిగి ఉండే కంటెంట్.
  • ప్రేరేపించే లేదా అనుకరించదగిన సంకేతాలతో కూడిన ఆహార సంబంధిత వ్యాధుల నాటకీయ లేదా కళాత్మక చిత్రీకరణ. 
  • విద్యాపరమైన లేదా కళాత్మక సందర్భం లేకుండా వివాదాస్పద టాపిక్‌లకు సంబంధించిన నాటకీయ లేదా యానిమేట్ చేసిన చిత్రీకరణలు. 
  • వివాదాస్పద టాపిక్‌లకు సంబంధించిన నాటకీయ లేదా కళాత్మక అంశాలను కొద్దిగా స్పష్టంగా చూపడం. 
    • ఎవరైనా వారి మణికట్టును కోసుకుంటున్నప్పుడు రక్తం కారుతున్నట్లుగా చూపే సినిమా.
  • బులీమియాను అధిగమించడానికి ఒక వ్యక్తి జీవిత ప్రయాణానికి సంబంధించిన ఆహార రుగ్మత రికవరీ కథనాలు.

టైటిల్ & థంబ్‌నెయిల్: 

  • నిజమైన, నాటకీయమైన, కళాత్మక అంశాలతో సహా థంబ్‌నెయిల్‌లో వివాదాస్పద టాపిక్‌లకు సంబంధించిన అంశాలను స్పష్టంగా చూపడం. 
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

వివాదాస్పద టాపిక్‌లు ప్రధాన టాపిక్‌గా ఉన్న స్పష్టంగా చూపబడిన చిత్రీకరణలు లేదా వివరణాత్మక వర్ణణలు. కింద పేర్కొన్న ఏవైనా రెఫరెన్స్‌లు లేదా సందర్భం ఉన్న కంటెంట్ ఆహారపు రుగ్మతలకు సంబంధించిన స్పష్టమైన రెఫరెన్స్‌గా పరిగణించబడుతుంది: కనిష్ఠ BMI లేదా బరువు, శరీర బరువు తక్కువగా ఉండటం లేదా చాలా సన్నగా ఉండటం, బరువు లేదా శరీరానికి సంబంధించి అవమానించడం లేదా జులుం చలాయించడం, అతిగా తినడం, ఆహారాన్ని దాచడం, లేదా ఆహారాన్ని నిల్వ ఉంచడానికి సంబంధించిన రెఫరెన్స్, కేలరీల లోటును పూడ్చటానికి వ్యాయామం చేయడం, వాంతులు లేదా మలబద్ధకాన్ని తగ్గించే ఔషదాల దుర్వినియోగం, బరువు తగ్గడానికి సంబంధించిన ప్రోగ్రెస్‌ను చెక్ చేయడం, పైన పేర్కొన్న ప్రవర్తనలలో దేనినైనా దాచిపెట్టాలనుకునే రెఫరెన్స్.

ఇదే కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • వివరమైన, దిగ్భ్రాంతిని కలిగించే, మొదటి వ్యక్తి ఖాతా లేదా ప్రాణాలతో బయటపడిన వారి జీవిత చరిత్రను, వారు తమ గత అనుభవాలను వీటి ద్వారా చర్చించారు:
    • పిల్లలపై హింస
    • పిల్లల పట్ల లైంగిక ఆకర్షణ
    • స్వీయ హాని
    • ఆత్మహత్య
    • గృహ హింస
    • రోగిని నొప్పిలేకుండా చంపడం
  • కంటెంట్, టైటిల్ లేదా థంబ్‌నెయిల్‌లో వివాదాస్పద అంశాల గురించి ప్రచారం చేయడం లేదా గొప్పగా చెప్పడం, ఉదా. "ఆత్మహత్య చేసుకుని, పరువుగా ప్రాణాలు వదలడం ఎలా.”
  • గాట్లు, రక్తం, లేదా గాయాలు కనిపించే విధంగా స్వీయ హానికి సంబంధించిన స్పష్టంగా చూపే చిత్రీకరణ. 
  • వివాదాస్పద టాపిక్ జరుగుతున్న సందర్భం యొక్క స్పష్టమైన ఆడియో.
  • ప్రేరేపించే లేదా అనుకరించదగిన సంకేతాలతో కూడిన ఆహార సంబంధిత వ్యాధుల స్పష్టమైన సూచన.
  • విద్యాపరమైన, కళాత్మక సందర్భం లేని కొద్దిగా స్పష్టంగా చూపే వివాదాస్పద టాపిక్‌ల చిత్రీకరణలు.
    • ఎవరైనా వారి మణికట్టును కోసుకుంటున్నప్పుడు రక్తం కారుతూ చూపే ప్రాసెస్ చేయని ఫుటేజ్.
  • సంచలనాత్మక రీతిలో అందించిన వివాదాస్పద టాపిక్‌ల యానిమేటెడ్ చిత్రీకరణ.   
    • ఇతరులపై జులుం చలాయించే పాత్రలను చూపడం.

నిర్వచనాలు:

ఫోకస్" లేదా "ఫోకస్ చేసి చూపడం" అంటే, వీడియోలో ఏదైనా ఒక భాగంలో లేదా ఇచ్చిన వివాదాస్పద టాపిక్ గురించి నిరంతరం ఫోకస్ చేయడం జరుగుతుంది. వివాదాస్పద టాపిక్‌లకు సంబంధించి క్లుప్తంగా చర్చించడం అనేది సంబంధిత సమస్యపై ఫోకస్ చేయడంగా పరిగణించబడదు. ఉదాహరణకు, వివాదాస్పదమైన లేదా సున్నితమైన టాపిక్‌ను క్లుప్తంగా ధృవీకరించడం (ఉదా. “వచ్చే వారం వీడియోలో, ఆత్మహత్యల సంఖ్య తగ్గుదల గురించి మేము చర్చిస్తాము.”) ఫోకల్‌గా కాకుండా అటువంటి టాపిక్ గురించి ప్రత్యేకించి చూపే వీడియోలో ఒక భాగం ఫోకల్‌గా పరిగణించబడుతుంది. ఫోకస్ పదాల రూపంలో ఉండకూడదు. సున్నితమైన సమస్యను ఫోకస్ చేసే ఇమేజ్ లేదా టెక్స్ట్ ఉంటే, అది కూడా ఫోకస్‌గానే పరిగణించబడుతుంది.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

సున్నితమైన సంఘటనలు

సున్నితమైన సంఘటన అనేది అధిక క్వాలిటీ గల, సందర్భోచితమైన సమాచారాన్ని, గ్రౌండ్ ట్రూత్‌ను అందించే Google సామర్థ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగించగల సంఘటన లేదా డెవలప్‌మెంట్, ఇది ప్రముఖ, మానిటైజ్ చేసే ఫీచర్‌లలో సున్నితమైనది కాని లేదా దుర్వినియోగపూరితమైన కంటెంట్‌ను తగ్గిస్తుంది. సున్నితమైన సంఘటన సమయంలో, ఈ ప్రమాదాలను పరిష్కరించడానికి మేము అనేక రకాల చర్యలు తీసుకోవచ్చు.

సున్నితమైన సంఘటనల ఉదాహరణలలో అత్యవసర పౌర సంబంధ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, అత్యవసర ప్రజారోగ్య పరిస్థితులు, ఉగ్రవాదం ఇంకా సంబంధిత యాక్టివిటీలు, సంఘర్షణ, లేదా సామూహిక హింసాత్మక చర్యలు ఉంటాయి. కంటెంట్‌లో హింస, రక్తం, శృంగారం లాంటి వాటిని స్పష్టంగా చూపే ఇమేజ్‌లు ఏవీ లేకపోయినా కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. 

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

మోసపూరితంగా లేదా కించపరిచేలా లేని, ప్రాణ నష్టం లేదా విషాదంపై చేసే చర్చలు. 

కొన్ని సందర్భాలలో, బాధితులను ఇబ్బంది పెట్టే లేదా వారిపై దాడి చేసే ఘటనలను నివారించడం కోసం సున్నితమైన సంఘటనకు సంబంధించిన ఏ కంటెంట్‌ను అయినా మేము మానిటైజ్ చేయకుండా నిరోధించవచ్చు. సందర్భం ముఖ్యం: ఉదాహరణకు, సున్నితమైన సంఘటనకు సంబంధించిన అధికారిక వార్తల రిపోర్టింగ్‌ను, డాక్యుమెంటరీ కంటెంట్‌ను లేదా చర్చలను కంటెంట్ ఫీచర్ చేస్తే, యాడ్ ఆదాయాన్ని సంపాదించడానికి మేము దానిని అనుమతించవచ్చు.

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

సున్నితమైన సంఘటన నుండి లాభాన్ని పొందే లేదా దానిని దుర్వినియోగం చేసే కంటెంట్‌ను క్రియేటర్‌లు మానిటైజ్ చేయలేరు.

ఉదాహరణలు (ఇవి అసంపూర్ణం): 

  • యూజర్‌లకు ఎటువంటి స్పష్టమైన ప్రయోజనం లేకుండా విషాద సంఘటన నుండి లాభం పొందడం, సంబంధిత పర్యవేక్షణ సంస్థల (ఉదాహరణకు, అత్యవసర సహాయ సంస్థలు, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, లేదా అంతర్జాతీయ సంస్థలు) స్టాండర్డ్‌లకు మరియు/లేదా గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేకుండా ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లను విక్రయించడం. 
  • సున్నితమైన సంఘటనకు సంబంధించిన కీవర్డ్‌లను ఉపయోగించి అదనపు ట్రాఫిక్‌ను పొందడానికి ప్రయత్నించడం.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

నిజాయితీ లేని చర్యలను ప్రోత్సహించడం

మోసపూరిత ప్రవర్తనను ప్రోత్సహించే లేదా ప్రమోట్ చేసే కంటెంట్, ఇందులో అక్రమంగా ప్రవేశించడం, మోసం చేయడం, లేదా కంప్యూటర్ హ్యాకింగ్ (వ్యక్తిగతంగా చేసినది అయినా లేదా పెయిడ్ సర్వీస్ అయినా) వంటి చర్యలు ఉండవచ్చు.

పాలసీ వివరాలు
యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

మోసపూరిత ప్రవర్తనకు సంబంధించిన విద్యా సంబంధిత, హాస్య సంబంధిత లేదా మ్యూజిక్ సంబంధిత రెఫరెన్స్‌లు లేదా స్టేట్‌మెంట్‌లు. ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా దుష్ప్రవర్తనకు సంబంధించి పాత్రికేయ రిపోర్ట్‌ల వంటి నిజాయితీ లేని చర్యలను ప్రమోట్ చేసే మోసపూరిత ప్రవర్తనను ప్రమోట్ చేయని కంటెంట్.

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

అక్రమంగా ప్రవేశించడం

  • ప్రేక్షకులకు షేర్ చేయడానికి లేదా వారికి అవగాహన కల్పించడానికి నిర్మానుష్యమైన భవనాలను లేదా ప్రస్తుతం వినియోగించని సైట్‌లను అన్వేషించడం, ఈ సందర్భంలో వారికి సంబంధిత అనుమతి ఉందని వారు తెలియజేస్తారు.
    • అవసరమైన అనుమతులతో చెర్నోబిల్ సైట్‌లోని నియంత్రిత ప్రదేశాలలో చేసిన పర్యటనలు.
  • వీటిపై పాత్రికేయ రిపోర్ట్‌లు:
    • రిటైల్ స్టోర్ లేదా వాణిజ్యపరమైన భవనానికి సంబంధించిన ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే కంటెంట్ (స్టోర్ ముగింపు వేళల తర్వాత అందులో రాత్రిపూట ఉండటం వంటివి). 
    • యజమాని సమ్మతి లేకుండా స్టోర్‌లోని రిటైల్ స్టోర్ ఉద్యోగిలా నటించడం (స్టోర్ యూనిఫామ్ ధరించడం అలాగే క్లయింట్‌లకు అమ్మకపు వస్తువుల విషయంలో గైడెన్స్ అందించడం వంటివి). 

హ్యాకింగ్

  • పెనెట్రేషన్ టెస్టింగ్ (ఫిజికల్, అలాగే సమాచార సెక్యూరిటీ లోపాలను టెస్ట్ చేయడానికి ఎథికల్ హ్యాకర్‌లు కంపెనీలకు విక్రయించే సర్వీస్).
  • బగ్ రివార్డ్‌లు (సిస్టమ్‌లలో లేదా ప్రోగ్రామ్‌లలో కంప్యూటర్ బగ్‌లను కనిపెట్టినందుకు అందించబడే రివార్డ్‌లు).
  • డిజిటల్ హ్యాక్‌లు, రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే చిట్కాలు, చిట్కాలు మరియు సూచనలు (ఉదా. ఫోన్‌ను జైల్‌బ్రేక్ చేయడం, గేమ్ చీట్ కోడ్‌లు, గేమ్ మోడ్‌లు, VPN సర్వీస్‌లు).
  • పోటీ తరహా ఈ-స్పోర్ట్స్‌లో హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ వినియోగంపై లేదా దానికి ప్రోత్సాహంపై విద్యాపరమైన, డాక్యుమెంటరీ లేదా పాత్రికేయ రిపోర్ట్‌లు. 

క్రైమ్

  • నేరానికి సంబంధించిన డాక్యుమెంటరీలు.
  • నేరాల ద్వారా ప్రభావితమైన వారి వ్యక్తిగత అనుభవాలు.
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

సిస్టమ్‌లు, పరికరాలు లేదా ప్రాపర్టీకి అనధికార యాక్సెస్‌ను ఎలా పొందాలి లేదా హానికరమైన రీతిలో అనధికారిక మార్పులను ఎలా చేయాలి అనే దాని గురించి వీక్షకులకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన కంటెంట్. ప్రాపర్టీ ప్రవర్తన నియమావళికి విరుద్ధమైన చర్యలను ప్రదర్శించడం. తప్పుదారి పట్టించడం లేదా మోసం చేయడంలో సహాయపడే ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లను ప్రదర్శించడం, ఉదాహరణకు, విద్యా సంబంధిత వ్యాస రచన సర్వీస్‌లు లేదా పోటీ తరహా ఈ-స్పోర్ట్స్‌లో గెలవడానికి హ్యాకింగ్ విధానాలు

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

అక్రమంగా ప్రవేశించడం

  • అక్రమంగా ప్రవేశించడాన్ని ప్రమోట్ చేయడం లేదా ప్రోత్సహించడం, ఉదాహరణకు, ఒక సురక్షిత భవనంలో రాత్రి వేళ స్టంట్‌లు చేయడాన్ని ప్రమోట్ చేయడం లేదా ప్రోత్సహించడం.
  • రిటైల్ స్టోర్ లేదా వాణిజ్యపరమైన భవనానికి సంబంధించిన ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం.
  • ప్రాపర్టీ ఓనర్ సమ్మతి లేకుండా స్టోర్‌లో రిటైల్ స్టోర్ ఉద్యోగుల లాగా నటించడం.
  • అదనపు సందర్భం లేకుండా, ఇంట్లోకి చొరబడటాన్ని ప్రదర్శించడం, ఉదాహరణకు, ఒక ఇంట్లోకి చొరబడటాన్ని చూపే CCTV ఫుటేజ్.

హ్యాకింగ్

  • ఎవరైనా ఒక వ్యక్తిని లేదా వారి యాక్టివిటీలను, వారి సమ్మతి లేకుండానే డిజిటల్‌గా ట్రాక్ చేయమని లేదా మానిటర్ చేయమని వీక్షకులను ప్రోత్సహించడం లేదా పురిగొల్పడం.
  • ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించిన ఫోన్‌ను, వారి సమ్మతి లేకుండానే ఎలా వైర్‌ట్యాప్ చేయాలి అనే దానికి సంబంధించిన చిట్కాలు.
  • పోటీతత్వం ఉండే ఈ-స్పోర్ట్స్‌లో హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడం లేదా వినియోగాన్ని ప్రోత్సహించడం

అనైతికమైన ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లు

  • విద్యా సంబంధిత వ్యాస రచనా సర్వీస్‌లు.
  • మాదక ద్రవ్యాల టెస్ట్‌లను చేయించుకోకుండా తప్పించుకోవడం.
  • నకిలీ పాస్‌పోర్ట్‌లను లేదా ఇతర గుర్తింపు డాక్యుమెంట్‌లను ఫోర్జరీ చేయడం లేదా క్రియేట్ చేయడం.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

పిల్లలు, ఫ్యామిలీల కోసం అనుచితమైన కంటెంట్

YouTubeలో “పిల్లల కోసం రూపొందించబడిన” కంటెంట్‌ను మానిటైజ్ చేయాలంటే, తప్పనిసరిగా అది ఫ్యామిలీ ప్రేక్షకులకు తగిన విధంగా ఉండాలి. అంటే, అది YouTube నిర్దేశించిన 'చిన్నారులకు, ఫ్యామిలీ కంటెంట్‌కు సంబంధించిన క్వాలిటీ గైడ్‌లైన్స్'‌ను, మా ప్రోగ్రామ్ పాలసీలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలని అర్థం.

పాలసీ వివరాలు

ప్రతికూల ప్రవర్తనను ప్రోత్సహించే కంటెంట్

పిల్లలను ప్రతికూలంగా ప్రభావితం చేసే ప్రతికూల ప్రవర్తనలను ప్రోత్సహించడం.

యాడ్‌ల గైడెన్స్ ప్రశ్నావళి ఆప్షన్‌లు, వివరాలు

ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించగలరు

సానుకూల ప్రవర్తనను ప్రోత్సహించే, పిల్లలకు హాని కలిగించని కంటెంట్.

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • ప్రతికూల ప్రవర్తనకు సంబంధించిన విద్యా కంటెంట్
  • పబ్లిక్ సర్వీస్ అనౌన్స్‌మెంట్‌లు (PSAలు) లేదా పిల్లలను బెదిరించడం లేదా అవమానించడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావానికి సంబంధించిన వీడియోలు
  • ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రదర్శన
  • క్రీడలు, ఫిట్‌నెస్ గురించిన వీడియోలు
  • తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉండే, పిల్లలకు తీవ్రమైన శారీరక లేదా మానసిక హాని కలిగించని DIY, సవాళ్లు లేదా ప్రాంక్‌లు, అవి:
    • సురక్షితమైన, సముచితమైన మార్గాల్లో ఉపయోగించే పాత్రలతో బేకింగ్ లేదా వంట చేయడం వంటి DIYలు, డెమోలు లేదా 'ఎలా చేయాలి' కంటెంట్
    • పిల్లలు గాయపడని లేదా శారీరకంగా హాని చేయని ప్రాంక్‌లు
 
ఈ కంటెంట్ ద్వారా యాడ్ ఆదాయాన్ని అస్సలు సంపాదించలేరు

మోసం, జులుం చలాయించడం వంటి ప్రతికూల ప్రవర్తనను ప్రోత్సహించడం ద్వారా పిల్లలను ప్రభావితం చేసే కంటెంట్ లేదా పిల్లలకు తీవ్రమైన శారీరక లేదా మానసిక హాని కలిగించే కంటెంట్.

ఈ కేటగిరీకి చెందిన కంటెంట్‌కు కొన్ని ఉదాహరణలు:

  • పిల్లల ప్రతికూల ప్రవర్తనను ప్రోత్సహించే లేదా ప్రమోట్ చేసే కంటెంట్, లేదా పిల్లలను ప్రతికూలంగా ప్రభావితం చేసే సామాజిక సమస్యల గురించిన కంటెంట్.
    • పరీక్షల్లో మోసం చేయడం వంటి నిజాయితీ లేని చర్యలు
    • పిల్లల కంటెంట్‌లో నిజమైన లేదా వాస్తవిక తుపాకుల ప్రదర్శన
    • అధిక చక్కెర లేదా అధిక కొవ్వు పదార్ధాలను నిర్విరామంగా తినడానికి సంబంధించిన కంటెంట్
    • పిల్లల విషయంలో జులుం చలాయించడం, పీడించడం, లేదా అవమానించడం
    • శరీరాన్ని సన్నగా, మరింత వంపులు లేదా కండలు తిరిగినట్లుగా మార్చడం, కేలరీలను పరిమితం చేయడం లేదా పెంచడం మొదలైన వాటికి సంబంధించిన కంటెంట్.
    • తీవ్రమైన శారీరక లేదా మానసిక హాని కలిగించే DIYలు లేదా సవాళ్లకు సంబంధించిన చిత్రణలు, అవి: 
      • అగ్నిపర్వత DIY కంటెంట్ కోసం నిషేధిత రసాయనాలు, పేలుడు పదార్థాలు, అగ్గిపుల్లలు మొదలైనవి ఉపయోగించడం. 
      • ఊపిరాడకుండా చేసే ఫుడ్ స్టఫింగ్ సవాళ్లు 
      • తినదగని ప్రోడక్ట్‌లను తినడాన్ని ప్రోత్సహించడం
 

పిల్లల కోసం ఉద్దేశించిన పెద్దలకు సంబంధించిన కంటెంట్

నగ్నత్వం, శృంగారం, వాస్తవిక హింస, మాదకద్రవ్యాలు, మద్యం, లేదా వీడియో, థంబ్‌నెయిల్ లేదా టైటిల్‌లో అసభ్య పదజాలం వంటి, టీనేజర్‌లకు లేదా పెద్దవారికి ఎక్కువగా తగిన విధంగా ఉండే థీమ్‌లు.

కేటగిరీ పరిమిత యాడ్‌లు ప్రదర్శించబడతాయి లేదా యాడ్‌లు ప్రదర్శించబడవు
పిల్లలు, ఫ్యామిలీలకు సముచితంగా కనిపించేలా తయారు చేయబడి ఉండి, పెద్దవారి కోసం ఉద్దేశించిన థీమ్‌లు గల కంటెంట్.
  • సెక్స్, లైంగిక ప్రేరేపణలు
  • హింస, వాస్తవిక ఆయుధాలు 
  • మితమైన, బలమైన లేదా అత్యంత అసభ్య పదజాలం
  • మాదక ద్రవ్యాలు, మద్యం 
  • పిల్లలు, ఫ్యామిలీలకు అనుచితమైన పిల్లలు లేదా ప్రసిద్ధ పిల్లల పాత్రల ఇతర చిత్రణలు

పిల్లల కోసం ఉద్దేశించిన ఆశ్చర్యపరిచే కంటెంట్

పెద్దవారికి తగిన విధంగా ఉండి, పిల్లలను ఆశ్చర్యపరిచే లేదా భయపెట్టే కంటెంట్, ఉదాహరణకు, పెద్దవారు పోషించిన హారర్ పాత్రలు, లేదా కిడ్నాపింగ్, హారర్ సినిమాలు మొదలైన భయపెట్టేసే థీమ్‌లు గల కంటెంట్.

కేటగిరీ పరిమిత యాడ్‌లు ప్రదర్శించబడతాయి లేదా యాడ్‌లు ప్రదర్శించబడవు
పిల్లలు, ఫ్యామిలీలకు సముచితంగా కనిపించేలా తయారు చేయబడి ఉండి, పిల్లలను భయపెట్టే లేదా ఆశ్చర్యపరిచే అంశాలు గల కంటెంట్.
  • మోమో లేదా పెద్దలకు భయానక పాత్రలు వంటి పిల్లలను భయపెట్టడానికి ఉద్దేశించిన పాత్రలు 
  • రక్తపాతం లేదా ఇతర స్పష్టంగా చూపే హింసాత్మక కంటెంట్‌ను వర్ణించే కంటెంట్
  • కిడ్నాప్, భయానక సీన్‌లు, సిరంజిలు ఆయుధాలుగా ఉపయోగించడం మొదలైన పిల్లలను భయపెట్టే వాస్తవిక కంటెంట్.

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

పొగాకు సంబంధిత కంటెంట్

పొగాకును, అలాగే పొగాకు సంబంధిత ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేసే కంటెంట్, అడ్వర్టయిజింగ్‌కు తగినది కాదు. ఈ పాలసీ YouTube Studioలోని సొంత సర్టిఫికేషన్ ప్రశ్నావళిలో హానికరమైన లేదా ప్రమాదకరమైన చర్యల కిందికి వస్తుంది, కాబట్టి వివరణాత్మక గైడెన్స్ కోసం దాన్ని కూడా తప్పక చెక్ చేయండి.

ఉదాహరణలు (ఇవి అసంపూర్ణమైనవి)
కేటగిరీ పరిమిత యాడ్‌లు ప్రదర్శించబడతాయి లేదా యాడ్‌లు ప్రదర్శించబడవు
పొగాకును ప్రమోట్ చేయడం
  • సిగరెట్‌లు, సిగార్‌లు, పొగాకును నమలడం
పొగాకు సంబంధిత ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేయడం
  • పొగాకు పైపులు, రోలింగ్ పేపర్‌లు, వేప్ పెన్‌లు
ధూమపానం చేసే అనుభూతిని అందించేలా రూపొందించబడిన ప్రోడక్ట్‌లను ప్రమోట్ చేయడం
  • హెర్బల్ సిగరెట్‌లు, ఇ-సిగరెట్‌లు, వేపింగ్

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

రెచ్చగొట్టే, కించపరిచే కంటెంట్

నిష్కారణంగా రెచ్చగొట్టే, కోపం పుట్టించే, లేదా కించపరిచే ఉద్దేశంతో రూపొందించబడిన కంటెంట్ అడ్వర్టయిజింగ్‌కు తగినది కాకపోవచ్చు. ఈ పాలసీ YouTube Studioలోని సొంత సర్టిఫికేషన్ ప్రశ్నావళిలో రెచ్చగొట్టే, అలాగే కించపరిచే కంటెంట్ కిందికి వస్తుంది, కాబట్టి వివరణాత్మక గైడెన్స్ కోసం దాన్ని కూడా తప్పక చెక్ చేయండి.

ఉదాహరణలు (ఇవి అసంపూర్ణమైనవి)
కేటగిరీ పరిమిత యాడ్‌లు ప్రదర్శించబడతాయి లేదా యాడ్‌లు ప్రదర్శించబడవు
రెచ్చగొట్టేలా, అలాగే కించపరిచేలా ఉండే కంటెంట్
  • ఒక వ్యక్తిని లేదా గ్రూప్‌ను అవమానించడం లేదా కించపరచడంపై ఫోకస్ చేసే కంటెంట్
వ్యక్తులను లేదా వ్యక్తుల గ్రూప్‌ను పీడించే, భయపెట్టే లేదా జులుం చలాయించే విధంగా ఉండే కంటెంట్
  • ఒక వ్యక్తి పట్ల ప్రత్యేకంగా వివక్ష చూపి, వారిని దూషించే లేదా వేధించే కంటెంట్
  • ఏదైనా ఒక విషాద సంఘటన జరగలేదని, లేదా ఆ బాధితులు లేదా వారి ఫ్యామిలీలు నటులని, లేదా ఆ సంఘటనను కప్పిపుచ్చడంలో వారు భాగస్థులని సూచించే కంటెంట్
  • హానికరమైన వ్యక్తిగత దాడులు, దూషణలు, అపనిందలు

ఈ గైడ్‌లైన్స్ అంతటా ఉపయోగించిన ముఖ్యమైన పదాల గురించి మరింత తెలుసుకోవడానికి, మా నిర్వచనాల టేబుల్‌ను చూడండి.

నిర్వచనాలు

మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్ అంతటా సాధారణంగా ఉపయోగించబడిన పదాలను మరింత బాగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి, వాటి నిర్వచనాలను ఒక టేబుల్ రూపంలో సెట్ చేసి మీకు అందిస్తున్నాము.

నిర్వచనాలు
పదాలు నిర్వచనాలు
మ్యూజిక్ ఇది అధికారిక మ్యూజిక్ వీడియోలు, ఆర్ట్ ట్రాక్‌లు, బ్యాకింగ్ ట్రాక్‌లు, ఇంట్రో/అవుట్రో మ్యూజిక్, మ్యూజిక్ వీడియోలకు ప్రతిస్పందనలు, డ్యాన్స్ ట్యుటోరియల్స్ సమయంలో ప్లే చేయబడిన మ్యూజిక్, YouTube టూల్స్ ద్వారా జోడించబడిన లేదా పొందిన మ్యూజిక్ లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయబడిన మ్యూజిక్ వంటి మ్యూజిక్‌ను కలిగి ఉన్న ఏ వీడియోను అయినా ఇది సూచిస్తుంది. ఇది కవిత్వం, ప్రదర్శనలలో పలికిన పదాలకు వర్తించదు.
విద్యా సంబంధితం

"విద్యా సంబంధితమైనది" అంటే, ప్రేక్షకులకు కావాలని తప్పుడు సమాచారం అందించకుండా, ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి వారికి తెలియజేయడం లేదా నేర్పడం. విద్యా సంబంధిత కంటెంట్, అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటప్పుడు తటస్థ వైఖరిని అనుసరిస్తుంది, ఉదాహరణకు, సురక్షిత సెక్స్ ప్రాక్టీసులకు సంబంధించిన చర్చలో భాగంగా. ఈ కింద పేర్కొన్న పదాలు, సందర్భోచితంగా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి:

  • "డాక్యుమెంటరీ" అంటే, ఒరిజినల్ డాక్యుమెంట్‌లను కోట్ చేయడం లేదా వాస్తవాలను వివరించడం ద్వారా చారిత్రక సంఘటనలను స్మరించుకోవడం, ఇంకా పరిరక్షించడం, ఉదాహరణకు, ప్రాచీన ఈజిప్ట్‌కు సంబంధించిన చరిత్ర గురించి చెప్పే కంటెంట్.
  • "శాస్త్రీయమైనది" అంటే, శాస్త్రీయపరమైన ప్రయోగాలు, అలాగే సిద్ధాంతం ద్వారా పరిశోధనల్లో పురోగతి సాధించడం, ఉదాహరణకు, మనిషి సైకాలజీ మీద డేటాను ప్రెజెంట్ చేసేటప్పుడు.
కళాత్మకమైనది "కళాత్మకమైనది" అంటే, మానవ సృజనాత్మకతను వ్యక్తపరచడానికి ఉద్దేశించబడిన కళను సూచిస్తుంది, ఉదాహరణకు, పెయింటింగ్, డ్రాయింగ్‌లు, ఆర్కిటెక్చర్, శిల్పకళ, సాహిత్యం, కవిత్వం, మ్యూజిక్, ప్రదర్శించడం, ఇంకా స్క్రిప్ట్ చేయబడిన కంటెంట్. కవిత్వం చదువుతూ ఉండటాన్ని ప్రదర్శించే వీడియోను ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
నాటకీయమైనది

“నాటకీయమైనది” అంటే, యానిమేషన్ కంటెంట్‌తో సహా సినిమాలు లేదా కల్పిత కథాంశాల వంటి స్క్రిప్ట్ చేయబడిన కంటెంట్.

హింస, రక్తం, శృంగారం లాంటి వాటిని స్పష్టంగా చూపే కంటెంట్, హింస, రక్తం, శృంగారం లాంటి వాటిని స్పష్టంగా చూపడం

"హింస, రక్తం, శృంగారం లాంటి వాటిని స్పష్టంగా చూపే కంటెంట్” లేదా “హింస, రక్తం, శృంగారం లాంటి వాటిని స్పష్టంగా చూపడం” అంటే, ఈ కింద ఉన్న వాటిని స్పష్టంగా, అలాగే వాస్తవికంగా చూపడం:

  • వీధి పొట్లాటల వంటి హింసాత్మక చర్యల కారణంగా తగిలే హింసాత్మకమైన లేదా బయటకు కనిపించే గాయాలు.
  • జంతువులపై పాల్పడే హింసాత్మక చర్యలు, ఉదాహరణకు తన్నడం.
  • లైంగిక చర్యలు, లైంగిక శరీర భాగాలు, ఇంకా ద్రవాలకు సంబంధించిన విజువల్స్.
వాస్తవికత

"వాస్తవికత" మూడు తీవ్రతా స్థాయిలను సూచిస్తుంది:

  • “తక్కువ వాస్తవికత”: వాస్తవికతకు చాలా దూరంగా ఉంటుంది, ఉదాహరణకు, మాట్లాడే పిల్లి.
  • “మధ్యస్థ వాస్తవికత”: వాస్తవికతకు తక్కువ దూరంలో ఉంటుంది, ఉదాహరణకు, మానవుల వంటి నిజ ప్రపంచపు జీవులను లేదా వీడియో గేమ్‌లలోని యానిమేషన్ పాత్రలను మరీ ఎక్కువ గ్రాఫిక్స్‌ను ఉపయోగించి చూపడం.
  • “అధిక వాస్తవికత”: మానవులు ప్రధాన పాత్రలుగా నిజ ప్రపంచపు సంఘటనలను (ఉదాహరణకు, వీధి పొట్లాట) చూపడం.
స్పష్టత, స్పష్టంగా చూపడం

"స్పష్టత" లేదా "స్పష్టంగా చూపడం" అంటే, కంటెంట్‌లో అభ్యంతరకరమైన సబ్జెక్ట్‌ను ఎంత స్పష్టంగా లేదా కళ్ళకు కట్టినట్టుగా కనబడేలా ప్రదర్శించారో సూచిస్తుంది. కొన్ని ఉదాహరణలు:

  • గర్భస్రావ విధానాన్ని చూపే లేదా ప్రదర్శించే వీడియో.
  • ఎవరైనా వేధింపులకు గురవుతున్నప్పుడు వినిపించే ఆడియో లేదా సౌండ్‌లు.
పరోక్షత, పరోక్షంగా సూచించడం

"పరోక్షత" లేదా "పరోక్షంగా సూచించడం" అంటే, అభ్యంతరకరమైన సబ్జెక్ట్ ఉనికిని లేదా విజిబిలిటీని సూచనాత్మకంగా, పరోక్షంగా సూచించడం. కొన్ని ఉదాహరణలు:

  • లైంగిక చర్య జరుగుతోందని సూచించే లైంగిక సంపర్క సమయంలో వచ్చే శబ్దాలతో పాటు ఊగే బెడ్‌లను చూపే లేదా ప్రదర్శించే వీడియో.
  • మరణం సంభవించిన క్షణాన్ని సూచించడానికి, వాహనాలు పేలిపోవడాన్ని చూపే లేదా ప్రదర్శించే వీడియో.
ఫోకస్, ఫోకస్ చేసి చూపడం

"ఫోకస్" లేదా "ఫోకస్ చేసి చూపడం" అంటే, వీడియోలో ఏదైనా ఒక భాగంలో లేదా పూర్తి వీడియోలో ప్రధానంగా ఒక టాపిక్‌పై ఫోకస్ చేయడం జరుగుతుంది, అంటే ఆ టాపిక్‌ను పదే పదే ప్రస్తావించడం, ఫోకస్ చేయడం జరుగుతుంది. వివాదాస్పదమైన లేదా సున్నితమైన టాపిక్‌లుగా లిస్ట్ చేసిన వాటిలో ఏదైనా ఒక దాని గురించి క్లుప్తంగా చర్చించడం, యాడ్‌లు చూపకపోవడానికి కారణం కాదు. ఉదాహరణకు, వివాదాస్పదమైన లేదా సున్నితమైన టాపిక్‌ను క్లుప్తంగా ధృవీకరించడం (ఉదా. “వచ్చే వారం వీడియోలో, ఆత్మహత్యల సంఖ్య తగ్గుదల గురించి మేము చర్చిస్తాము.”) ఫోకల్‌గా కాకుండా అటువంటి టాపిక్ గురించి ప్రత్యేకించి చూపే వీడియోలో ఒక భాగం ఫోకల్‌గా పరిగణించబడుతుంది. ఫోకస్ పదాల రూపంలో ఉండకూడదు. సున్నితమైన సమస్యను ఫోకస్ చేసే ఇమేజ్ లేదా టెక్స్ట్ ఉంటే, అది కూడా ఫోకస్‌గానే పరిగణించబడుతుంది. కొన్ని ఉదాహరణలు:

  • స్వీయ హాని ఎలా చేసుకోవాలి అనే దాన్ని ప్రధానంగా చూపే వీడియో.
  • ఇతర సందర్భం లేదా కారణం ఏదీ లేకుండా కేవలం తీవ్రమైన అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపైనే పోకస్ చేసే కంటెంట్.
కొద్ది సమయం పాటు ప్రస్తావించబడేవి

"కొద్ది సమయం పాటు ప్రస్తావించబడేవి" కంటెంట్‌లో ప్రధానాంశాలు కావు (అప్రధానమైనవి), వాటిలో వివాదాస్పదమైనవి లేదా సున్నితమైనవిగా లిస్ట్ చేసిన టాపిక్‌లకు సంబంధించి యధాలాపంగా వచ్చే రెఫరెన్స్‌లు ఉంటాయి. ఉదాహరణకు, వివాదాస్పదమైన లేదా సున్నితమైన టాపిక్‌ను క్లుప్తంగా ధృవీకరించడం (ఉదా. “వచ్చే వారం వీడియోలో, ఆత్మహత్యల సంఖ్య తగ్గుదల గురించి మేము చర్చిస్తాము.”) ఫోకల్‌గా కాకుండా తాత్కాలిక సూచనగా పరిగణించబడుతుంది.

సంచలనాత్మకమైన కంటెంట్

ప్రత్యేకించి అతిశయోక్తి చేసి, స్పష్టంగా చూపే, లేదా గోప్యమైన వివరాలను చూపడం ద్వారా ఉత్సుకతను లేదా ఆసక్తిని కలిగించడం జరుగుతుంది.

  • బతికి ఉన్న లేదా ఇంకా కదులుతూ ఉన్న జంతువులను లేదా జంతువుల శరీర భాగాలను తినడం వంటి “సంచలనాత్మకమైన పద్ధతిలో తినడం”.
  • “మక్‌బ్యాంగ్” లేదా ప్రదర్శనలో భాగం వంటి “సంచలనాత్మకమైన పద్ధతిలో తినడం లేదా వాటిని తయారు చేయడం” అనేది నాటకీయంగా మారుతుంది.
  • “వివాదాస్పద టాపిక్‌ల యొక్క సంచలనాత్మక విషయాలను చూపడం”, ముఖ్యంగా ప్రతికూల పాత్రల ఇంటరాక్షన్‌ల ద్వారా జులుం చలాయించడం వంటి గోప్యమైన టాపిక్‌లు వినోదానికి సంబంధించి ప్రధాన టాపిక్ అవ్వడం.

YouTubeకు అప్‌లోడ్ అయ్యే వీడియోలన్నీ తప్పనిసరిగా YouTube సర్వీస్ నియమాలను, కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పాటించాలి. యాడ్‌ల ద్వారా మానిటైజేషన్ చేయగలగాలంటే, మీరు YouTube మానిటైజేషన్ పాలసీలను, ప్రోగ్రామ్ పాలసీలను ఫాలో అవ్వాలి.

మీ కంటెంట్ చాలావరకు అడ్వర్టయిజర్‌కు తగినవిగా లేని సందర్భాలలో లేదా పదేపదే తీవ్రమైన ఉల్లంఘనలు జరిగినప్పుడు, మీ మొత్తం ఛానెల్‌లో యాడ్‌లను డిజేబుల్ చేసే హక్కును మేము కలిగి ఉండవచ్చు (ఉదాహరణకు, ఆకతాయిగా అనిపించే, అగౌరవపరిచే లేదా ద్వేష పూరితమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం).

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18420479358892626150
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false