వీడియోకు సమాచార కార్డ్‌లను జోడించండి

మీ వీడియోలను మరింత ఇంటరాక్టివ్‌గా మలచడానికి మీరు సమాచార కార్డ్‌లను ఉపయోగించవచ్చు. సమాచార కార్డ్‌లలో వీడియో, ప్లేలిస్ట్, ఛానెల్ లేదా లింక్‌ను ప్రదర్శించవచ్చు. పిల్లల కోసం రూపొందించినవిగా సెట్ చేసిన వీడియోల్లో కార్డ్‌లు అందుబాటులో ఉండవు.

వీడియోకు కార్డ్‌లను జోడించండి

వీడియోకు కార్డ్‌లను జోడించడానికి, కింది దశలను అనుసరించండి.

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్ చేయండి.
  4. ఎడమ వైపు మెనూ నుండి ఎడిటర్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. సమాచార కార్డ్‌లు ను ఎంచుకొని, ఆపై మీరు జోడించాలనుకుంటున్న కార్డ్‌ను ఎంచుకోండి. గమనిక: మీరు ఒక వీడియోకు గరిష్ఠంగా 5 కార్డ్‌లను జోడించవచ్చు.
    • వీడియో: మీ వీక్షకులు ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఈ సమాచార కార్డ్ పబ్లిక్ YouTube వీడియోకు లింక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 
    • ప్లేలిస్ట్: మీ వీక్షకులు చూడటం కోసం ఈ సమాచార కార్డ్ పబ్లిక్ YouTube ప్లేలిస్ట్‌కు లింక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
    • ఛానెల్: మీ వీక్షకులు ఎంగేజ్ అవ్వడం కోసం ఈ సమాచార కార్డ్ YouTube ఛానెల్‌కు లింక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఉదాహరణకు, మీ వీడియో కోసం సహాయం అందించిన ఛానెల్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు లేదా మరొక ఛానెల్‌ను వీక్షకులకు సిఫార్సు చేసేందుకు మీరు సమాచార కార్డ్‌ను ఉపయోగించవచ్చు.
    • లింక్: మీరు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉంటే, మీ ప్రేక్షకులతో షేర్ చేయడం కోసం బయటి వెబ్‌సైట్‌ను లింక్ చేయడానికి ఈ సమాచార కార్డ్ మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మీ వీడియోలకు ఎండ్ స్క్రీన్‌లు కూడా జోడించవచ్చు. గమనిక: మీ లింక్ చేయబడిన బయటి వెబ్‌సైట్, మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ,ఇంకా సర్వీస్ నియమాలతో సహా, మా పాలసీలను పాటిస్తుందని నిర్ధారించుకోండి. ఉల్లంఘనలు, కార్డ్ లేదా లింక్ తీసివేతకు, స్ట్రయిక్‌లకు, లేదా మీ Google ఖాతా రద్దుకు దారి తీయవచ్చు.
  6. వీడియో కింద కార్డ్‌కు సంబంధించిన ప్రారంభ సమయాన్ని మార్చండి.
  7. వీడియో గురించి ఆప్షనల్ మెసేజ్, అలాగే టీజర్‌ను జోడించండి. గమనిక: ఛానెల్ కార్డ్‌లకు సంబంధించి మెసేజ్, అలాగే టీజర్ టెక్స్ట్ అవసరం.
  8.  సేవ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

కార్డ్‌లతో వీక్షకులు ఎలా ఇంటరాక్ట్ అవ్వగలరు

వీడియోలకు అభినందనలు తెలపడానికి, అలాగే సంబంధిత సమాచారంతో వీక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కార్డ్‌లు రూపొందించబడ్డాయి. సిస్టమ్ పరిణామం చెందుతున్న క్రమంలో మేము పనితీరు, వీక్షకుల ప్రవర్తన, అలాగే వారు ఉపయోగిస్తున్న పరికరం ఆధారంగా అత్యంత సంబంధిత టీజర్‌లను, కార్డ్‌లను చూపించడానికి దాన్ని మెరుగుపరచాలనుకుంటున్నాము.

వీక్షకులకు కార్డ్‌లు ఎలా కనిపిస్తాయి

  • వీక్షకులు మీ వీడియోను చూస్తున్నప్పుడు, మీరు కేటాయించిన సమయం వరకు వారికి ఒక టీజర్ కనిపిస్తుంది.
  • టీజర్ కనిపించనప్పుడు, వీక్షకులు ప్లేయర్‌పై కర్సర్ ఉంచి, కార్డ్ చిహ్నం పై క్లిక్ చేయవచ్చు. మొబైల్‌లో, ప్లేయర్ కంట్రోల్స్ ప్రదర్శించబడినప్పుడు వీక్షకులు కార్డ్ చిహ్నాన్ని చూడవచ్చు.
  • వారు టీజర్ లేదా చిహ్నాన్ని క్లిక్ చేసినప్పుడు, వీడియోలో కార్డ్‌లను బ్రౌజ్ చేయవచ్చు.

మీ కంటెంట్‌ను కార్డ్‌లు ఎలా మారుస్తాయి

వీడియోల్లో కార్డ్‌లు ఎలా కనిపిస్తాయి

కార్డ్‌లు వీడియో వివరణ కింద కనిపిస్తాయి వీడియోలో పలు కార్డ్‌లు ఉంటే, వీడియో ప్లే అవుతున్నప్పుడు వీక్షకులు వాటిని స్క్రోల్ చేయవచ్చు.

కార్డ్‌లను ఎవరు చూడగలరు?

ఈ ఫీచర్ కంప్యూటర్‌లలో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ Adobe Flashలో అందుబాటులో లేదు.

“పిల్లల కోసం రూపొందించినవి”గా సెట్ చేసిన వీడియోలలో వీక్షకులు కార్డ్‌లను చూడలేరు.
 

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6072343765483795676
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false