ప్లేలిస్ట్‌లలో సహకరించుకోండి

మీ ప్లేలిస్ట్‌కు వీడియోలను జోడించే వెసులుబాటును మీ ఫ్రెండ్స్‌కు మీరు కల్పించవచ్చు. మీరు ఈ ఫీచర్‌ను ఆన్ చేసినప్పుడు, ప్లేలిస్ట్ లింక్‌ను ఎవరితో అయితే మీరు షేర్ చేస్తారో, వారందరూ ఆ ప్లేలిస్ట్‌కు వీడియోలను జోడించగలరు.

మీరు ప్రారంభించడానికి ముందు, ఒక ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయండి. మీకు సహాయం అవసరం అయితే, ఈ దశలను ఫాలో అయ్యి, ప్లేలిస్ట్‌ను క్రియేట్ చేయండి.

ప్లేలిస్ట్‌కు సహకారులను జోడించండి

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. ప్లేలిస్ట్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు ఏ ప్లేలిస్ట్‌కు అయితే సహకారులను జోడించాలనుకుంటున్నారో, ఆ ప్లేలిస్ట్‌కు పక్కన, ఎడిట్ చేయండి ను క్లిక్ చేయండి.
  5. ప్లేలిస్ట్ టైటిల్ దిగువున ఉన్న మరిన్ని ని క్లిక్ చేయండి.
  6. సహకరించండి ని క్లిక్ చేయండి.
  7. "ఈ ప్లేలిస్ట్‌కు సహకారులు వీడియోలను జోడించవచ్చు" అనే ఆప్షన్‌కు పక్కన ఉన్న స్లయిడర్‌ను క్లిక్ చేయండి.
  8. "కొత్త సహకారులను అనుమతించండి"ని ఆన్ చేయండి.
  9. ప్లేలిస్ట్ లింక్‌ను కాపీ చేసి, మీరు సహకరించుకోవాలనుకుంటున్న వ్యక్తులకు దాన్ని షేర్ చేయండి.

ప్లేలిస్ట్ మారినప్పుడు, లేదా కొత్త సహకారులు చేరినప్పుడు, ప్లేలిస్ట్ ఓనర్‌కు నోటిఫికేషన్ వస్తుంది.

ప్లేలిస్ట్‌కు వీడియోలను జోడించండి

ప్లేలిస్ట్‌కు వీడియోలను జోడించడానికి మీకు ఆహ్వానం అందాక, మీరు వీడియోలను జోడించగలరు లేదా గతంలో మీరు జోడించిన వీడియోలను మీరు తీసివేయగలరు.

వీడియోలను జోడించండి
  1. ప్లేలిస్ట్ పేజీకి వెళ్లడానికి, ఆ ప్లేలిస్ట్ ఓనర్ నుండి మీకు అందిన లింక్‌ను ఉపయోగించండి.
  2. మీరు కంట్రిబ్యూటర్‌గా ఉండాలనుకుంటున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. ప్లేలిస్ట్ ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది.
  3. మీ కంప్యూటర్ నుండి గానీ లేదా మొబైల్ పరికరం నుండి గానీ వీడియోలను జోడించడానికి, మీరు జోడించాలనుకుంటున్న వీడియో వద్దకు వెళ్లి, ఆ వీడియో నుండి సేవ్ చేయండి ని ఎంచుకోండి.

మీరు వీడియోను జోడించిన తర్వాత, ప్లేలిస్ట్‌లో ఆ వీడియో పక్కన మీ పేరు కనిపిస్తుంది. ప్లేలిస్ట్‌కు కొత్త వీడియోలను జోడించినప్పుడు, సహకారులందరికీ నోటిఫికేషన్ అందుతుంది.

వీడియోలను తీసివేయండి
  1. ప్లేలిస్ట్ పేజీకి వెళ్లడానికి, ఆ ప్లేలిస్ట్ ఓనర్ నుండి మీకు అందిన లింక్‌ను ఉపయోగించండి.
  2. మరిన్ని ని ఎంచుకోండి.
  3. ప్లేలిస్ట్ నుండి తీసివేయండి ని ఎంచుకోండి.

గమనిక: మీరు ఏ వీడియోలను అయితే ప్లేలిస్ట్‌కు జోడించారో, వాటిని మాత్రమే మీరు తీసివేయగలరు (ఇతర సహకారులు జోడించినవి తీసివేయలేరు).

కంట్రిబ్యూషన్‌లను మేనేజ్ చేయండి

ప్లేలిస్ట్‌కు కంట్రిబ్యూషన్‌లను స్వీకరించడాన్ని ఆపివేయండి

మీరు షేర్ చేసిన ప్లేలిస్ట్‌లకు, మీరు ఏ సమయంలోనైనా కంట్రిబ్యూషన్‌లను ఆఫ్ చేయవచ్చు:

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. ప్లేలిస్ట్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  4. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్‌కు పక్కన ఉన్న ఎడిట్ చేయండి ని క్లిక్ చేయండి.
  5. ప్లేలిస్ట్ టైటిల్ దిగువున ఉన్న మరిన్ని ని క్లిక్ చేయండి.
  6. సహకరించండి ని క్లిక్ చేయండి.
  7. "కొత్త సహకారులను అనుమతించండి"ని ఆఫ్ చేయండి.
  8. "ఈ ప్లేలిస్ట్‌కు సహకారులు వీడియోలను జోడించవచ్చు"కు పక్కన ఉన్న స్లయిడర్‌ను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1477882353100172593
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false