వీడియోను లైక్ చేయండి లేదా డిస్‌లైక్ చేయండి

వీడియోను లైక్ చేయడం ద్వారా, వీడియో క్రియేటర్‌కు, వారి పని మీకు నచ్చిందని వేగంగా తెలియజేయవచ్చు. మీరు సైన్ ఇన్ చేసి ఉన్నట్లయితే, వీడియోను లైక్ చేయడం వలన, ఆ వీడియో మీ "లైక్ చేసిన వీడియోల" ప్లేలిస్ట్‌కు జోడించబడుతుంది.

మీకు వీడియో అంతగా నచ్చకపోతే, దాన్ని డిస్‌లైక్ చేయడం ద్వారా మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయవచ్చు. మీరు అనుచితమైన కంటెంట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటే, డిస్‌లైక్ చేయడానికి బదులుగా, వీడియోను రిపోర్ట్ చేయాలి అని గుర్తుంచుకోండి.

డిసెంబర్ 5, 2019 తర్వాత, పబ్లిక్‌గా ఉన్న మీ "లైక్ చేసిన వీడియోల" ప్లేలిస్ట్ ప్రైవేట్‌గా సెట్ చేయబడుతుంది, అంటే ఈ ప్లేలిస్ట్‌ను కేవలం మీరు మాత్రమే చూడగలుగుతారు. మీరు ఇప్పటికీ వీడియోలను లైక్ చేయవచ్చు, అలాగే వీడియోలు ఇప్పటికీ లైక్‌ల సంఖ్యను చూపిస్తాయి.

వీడియోలను లైక్ చేయడం లేదా డిస్‌లైక్ చేయడం

వీడియోను లైక్ చేయడానికి, వీడియో ప్లేయర్ దిగువున ఉన్న, బాగుంది ని ఉపయోగించండి. వీడియోను డిస్‌లైక్ చేయడానికి, బాగా లేదు ను ఉపయోగించండి. మీ ఎంపికను రద్దు చేయడానికి, చిహ్నాన్ని మళ్లీ ఎంచుకోండి.

కామెంట్‌లకు ప్రశంసలు తెలియజేయడానికి హార్ట్‌లు

మీరు కమ్యూనిటీ ట్యాబ్ లేదా వీక్షణా పేజీపై కామెంట్ చేస్తే, మీ కామెంట్‌కు ప్రశంసలు తెలియజేయడానికి క్రియేటర్‌లు హార్ట్ చిహ్నాన్ని ఉపయోగించవచ్చు.

మీ కామెంట్‌పై క్రియేటర్ హార్ట్ చిహ్నాన్ని ఉపయోగిస్తే, ఆ విషయం మీకు రెండు విధాలుగా తెలుస్తుంది:

  • మీ కామెంట్‌పై, మీరు క్రియేటర్‌కు చెందిన అవతార్‌తో చిన్న హార్ట్ చిహ్నాన్ని చూస్తారు.
  • ఛానెల్ ఓనర్ "మీ కామెంట్‌ను ఇష్టపడుతున్నారు" అని మీకు నోటిఫికేషన్ (డెస్క్‌టాప్, అలాగే మొబైల్‌లో మీ సమ్మతి సెట్టింగ్‌ల ఆధారంగా) వస్తుంది.

మీరు లైక్ చేసిన వీడియోలను చూడండి

మీరు వీడియోను లైక్ చేసినప్పుడు, అది ఆటోమేటిక్‌గా ప్లేలిస్ట్‌కు జోడించబడుతుంది, తద్వారా మీరు లైక్ చేసిన అన్ని వీడియోలను సులభంగా మళ్లీ చూడవచ్చు. మీరు లైక్ చేసిన వీడియోలను చూడటం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి:

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపున ఉన్న మెనూలో, లైక్ చేసిన వీడియోలు  ఆప్షన్‌ను ఎంచుకోండి.

'లైక్ చేసిన వీడియోలు' అనే ప్లేలిస్ట్‌లో గరిష్ఠంగా 5,000 వీడియోలు ప్రదర్శించబడతాయి.

లైక్ చేసిన వీడియోలను తీసివేయండి

మీరు వీడియోల నుండి "లైక్"లను తీసివేయవచ్చు, అలాగే మీ లైక్ చేసిన వీడియోల ప్లేలిస్ట్‌ను మేనేజ్ చేయవచ్చు.

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపున ఉన్న మెనూలో, లైక్ చేసిన వీడియోలు  ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. వీడియో పక్కన, మరిన్ని  ఆ తర్వాత లైక్ చేసిన వీడియోల నుండి తీసివేయండి  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3512143945152716584
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false