ఆర్ట్ ట్రాక్స్ అప్‌లోడ్ స్ప్రెడ్‌షీట్‌ని ఉపయోగించడం

ఈ ఫీచర్‌లు, YouTube కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించి, కాపీరైట్ చేసిన వారి కంటెంట్‌ను మేనేజ్ చేస్తున్న పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మీ రికార్డింగ్‌ల కోసం ఆర్ట్ ట్రాక్స్‌ను క్రియేట్ చేయడానికి, మీరు రికార్డింగ్‌ల మీడియా ఫైల్స్‌ను, మెటాడేటాను డెలివర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆర్ట్ ట్రాక్ అస్సెట్‌లను, YouTube Music DDEX ఫీడ్‌ను లేదా "ఆడియో - ఆర్ట్ ట్రాక్స్" బల్క్ అప్‌లోడ్ స్ప్రెడ్‌షీట్‌ను ఉపయోగించి, ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా క్రియేట్ చేయవచ్చు.

మీరు అనువాదం చేయబడిన టైటిల్‌లను గాని, ఆర్టిస్ట్‌ల పేర్లను గాని స్ప్రెడ్‌షీట్‌ను ఉపయోగించి అందిచలేరు, అలాగే కంట్రిబ్యూటర్‌ల లిస్ట్‌ను కూడా అందించలేరు. ఈ అంశాలను చేర్చడనికి మీరు DDEX ఫీడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

స్ప్రెడ్‌షీట్‌ను ఉపయోగించి ఆర్ట్ ట్రాక్స్‌ను క్రియేట్ చేయడానికి:

  1. Studio కంటెంట్ మేనేజర్‌కు సైన్ ఇన్ చేయండి.

  2. ఎడమ వైపు మెనూలో కంటెంట్ డెలివరీ ని ఎంచుకోండి.

  3. టెంప్లేట్‌ల ట్యాబ్‌ను క్లిక్ చేయండి.

  4. ఆడియో - ఆర్ట్ ట్రాక్ లను టెంప్లేట్‌ను కనుగొని, డౌన్‌లోడ్  చిహ్నాన్ని క్లిక్ చేయండి.

  5. మీ సౌండ్ రికార్డింగ్ మెటాడేటాను, అడ్డువరుసకి ఒక రికార్డింగ్ చొప్పున, స్ప్రెడ్‌షీట్‌లోకి ఎంటర్ చేయండి.

    స్ప్రెడ్‌షీట్ టెంప్లేట్‌లో ఒక్కో నిలువు వరుసలో జోడించాల్సిన డేటాకు సంబంధించిన సూచనలు ఉంటాయి. ఫలితంగా రూపొందే ఆర్ట్ ట్రాక్‌లోని మెటాడేటాను YouTube ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే దానిని గురించిన సమాచారాన్ని ఆర్ట్ ట్రాక్స్‌ను క్రియేట్ చేయడంలో చూడండి. సరైన స్ప్రెడ్‌షీట్‌కు ఫార్మాట్‌కు సంబంధించిన సమాచారం కోసం, 'స్ప్రెడ్‌షీట్‌ను ఫార్మాట్ చేయడానికి గైడ్ లైన్స్'ను చూడండి.

    తేదీలు, ప్రత్యేకంగా అంకెల విలువలు ఉన్న ఫీల్డ్‌లతో (UPC వంటివి) సహా, అన్ని ఫీల్డ్‌లను సాదా టెక్స్ట్‌గా ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది.
  6. మీరు పూర్తి చేసిన స్ప్రెడ్‌షీట్‌ను, రెఫరెన్స్ ద్వారా అందించబడిన మీడియా ఫైల్స్‌ను కలిగి ఉన్నప్పుడు, ప్యాకేజీ అప్‌లోడర్‌తో కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడంలో దశలను అనుసరించడం ద్వారా కొనసాగించండి.

    ఆర్ట్ వర్క్, రికార్డింగ్ ఫైల్స్‌కు సంబంధించిన ఆవశ్యకతల గురించి వివరాలను తెలుసుకోవడానికి, రిసోర్స్‌ల కోసం ఫైల్ ఫార్మాట్‌ను చూడండి.

     

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18256841729651832009
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false