బ్రాండ్ ఖాతాతో ఛానెల్ ఓనర్‌లను, మేనేజర్‌లను మార్చండి

 
విశ్వసనీయ యూజర్‌లకు మాత్రమే యాక్సెస్‌ను మంజూరు చేయడం ఛానెల్ ఓనర్ బాధ్యత. అలా చేయడం వల్ల ఛానెల్ మేనేజ్‌మెంట్‌తో సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

నిర్దిష్ట రోల్స్ ద్వారా ఇతర యూజర్లకు మీ ఛానెల్ యాక్సెస్‌ను అందించే సామర్థ్యాన్ని ఛానెల్ అనుమతులు మీకు అందిస్తాయి. రోల్స్‌ను నియమించడం (అసైన్ చేయడం) అనేది సరైన స్థాయి యాక్సెస్‌ను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. పాస్‌వర్డ్ షేరింగ్ వంటి భద్రతా ప్రమాదాలను నివారించడానికి, గోప్యతకు సంబంధించిన ఆందోళనలను తగ్గించడానికి ఛానెల్ అనుమతులకు తరలించండి.

YouTube ఛానెల్ బ్రాండ్ ఖాతాకు లింక్ అయి ఉంటే, పలువురు మెంబర్లు తమ Google ఖాతాల నుండి ఆ ఛానెల్‌ను మేనేజ్ చేయవచ్చు. బ్రాండ్ ఖాతాతో YouTube ఛానెల్‌లను మేనేజ్ చేయడానికి మీకు ప్రత్యేక యూజర్‌నేమ్ లేదా పాస్‌వర్డ్ అవసరం లేదు. బ్రాండ్ ఖాతా YouTube ఛానెల్‌కు లింక్ చేయబడవచ్చు కానీ ఇతర Google సర్వీస్‌లకు లింక్ అయి ఉండకూడదు.

ముందుగా, మీ ఛానెల్, బ్రాండ్ ఖాతాకు కనెక్ట్ చేయబడిందో లేదో చెక్ చేయండి. కనెక్ట్ అయి లేకుంటే, మీరు ఛానెల్ మేనేజర్‌లను మార్చుకోవచ్చు, కానీ ఓనర్‌లను మార్చలేరు. ఛానెల్ యాజమాన్య హక్కును బదిలీ చేయడానికి, అనుమతుల సెటప్‌లో అన్ని రోల్స్‌ను తీసివేయడం ద్వారా బ్రాండ్ ఖాతాకు మార్చండి.

బ్రాండ్ ఖాతాకు రోల్స్‌ను జోడించడాన్ని పరిష్కరించండి

మీ ఛానెల్‌కు యూజర్ యాక్సెస్‌ను మేనేజ్ చేయడానికి మీరు ఛానెల్ అనుమతులను ఉపయోగించాలి.

మీరు బ్రాండ్ ఖాతా రోల్స్‌ను (సిఫార్సు చేయబడనివి) ఉపయోగించాల్సినప్పుడు, ఇతరులను జోడించడంలో సమస్య ఉంటే, మీరు ఛానెల్ అనుమతులను నిలిపివేసి, తర్వాత తిరిగి ప్రారంభించాల్సి రావచ్చు. మీ బ్రాండ్ ఖాతాకు తిరిగి మారడానికి, మీరు తప్పనిసరిగా అందరినీ మళ్లీ బ్రాండ్ ఖాతాకు ఆహ్వానించాలి.

సమ్మతిని నిలిపివేయడానికి, YouTube Studioకు చెందిన సెట్టింగ్‌లు ఆ తర్వాత అనుమతులు కింద “YouTube Studioలో అనుమతులను నిలిపివేయండి”ని ఎంచుకోండి. ఛానెల్ అనుమతులకు సంబంధించిన సమ్మతిని ఎలా నిలిపివేయాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.

మీ బ్రాండ్ ఖాతాకు రోల్స్‌ను చూడండి లేదా జోడించండి

అవసరమైతే మాత్రమే బ్రాండ్ ఖాతా రోల్స్‌ను ఉపయోగించండి. సెక్యూరిటీ సమస్యలను నివారించడం కోసం యూజర్‌లకు తగిన యాక్సెస్ స్థాయిని మంజూరు చేయడం ముఖ్యం. పాస్‌వర్డ్‌లను షేర్ చేయడం వంటి సురక్షితం కాని ప్రాక్టీసులను నివారించండి.  

తమ బ్రాండ్ ఖాతా యాజమాన్య హక్కు వివరాలను తెలుసుకోవడం ఛానెల్ ఓనర్ బాధ్యత. ఖాతా సెక్యూరిటీని కొనసాగించడానికి మీరు బ్రాండ్ ఖాతా అనుమతులను క్రమం తప్పకుండా చెక్ చేయాలని సిఫార్సు చేయబడింది.

మీ బ్రాండ్ ఖాతాను ఎవరు మేనేజ్ చేస్తున్నారో కనుగొనడానికి:

  1. మీ Google ఖాతాకు సంబంధించిన బ్రాండ్ ఖాతాల విభాగానికి వెళ్లండి.
  2. "మీ బ్రాండ్ ఖాతాలు" కింద, మీరు చూడాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
  3. అనుమతులను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి. ఓనర్‌లతో సహా, ఖాతాను మేనేజ్ చేయగల వ్యక్తుల లిస్ట్‌ను మీరు కనుగొంటారు.

మీ బ్రాండ్ ఖాతాకు కొత్త వ్యక్తులను ఆహ్వానించడానికి:

  1. కొత్త వ్యక్తులను ఆహ్వానించడానికి, కొత్త యూజర్‌లను ఆహ్వానించండి Invite new users ఆప్షన్‌ను ఎంచుకోండి.
  2. వారి ఈమెయిల్ అడ్రస్‌లను ఎంటర్ చేయండి.
  3. వారి పేర్ల కింద, వారి రోల్‌ను ఎంచుకోండి:
    1. ఓనర్‌లు చాలా వరకు చర్యలు తీసుకోగలరు, అలాగే ఖాతాను ఎవరు మేనేజ్ చేయాలనే దాన్ని వారు కంట్రోల్ చేస్తారు. ఖాతాకు తప్పనిసరిగా ఒక ప్రధాన ఓనర్ ఉండాలి.
    2. మేనేజర్‌లు బ్రాండ్ ఖాతాలను సపోర్ట్ చేసే Google సర్వీస్‌లను ఉపయోగించగలరు (ఉదాహరణకు, Google Photosలో ఫోటోలను షేర్ చేయడం లేదా YouTubeలో వీడియోలను పోస్ట్ చేయడం).
    3. మేనేజర్‌లు చేసే చర్యలనే కమ్యూనికేషన్స్ మేనేజర్‌లు చేయగలరు, కానీ వారు YouTubeను ఉపయోగించలేరు.
  4. ఆహ్వానించండి ఆ తర్వాత పూర్తయింది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీరు ఆహ్వానించిన వారు ఎవరైనా మీ ఆహ్వానాన్ని ఆమోదించగల ఈమెయిల్‌ను అందుకుంటారు.

మీ బ్రాండ్ ఖాతాకు సంబంధించిన ప్రధాన ఓనర్‌గా మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి

బ్రాండ్ ఖాతా ఓనర్‌గా, మిమ్మల్ని మీరు బ్రాండ్ ఖాతాకు సంబంధించిన ప్రధాన ఓనర్‌గా కేటాయించుకోవచ్చు. అలా చేయడానికి, మీరు తప్పనిసరిగా 7 రోజులు అంత కంటే ఎక్కువ కాలం పాటు ఓనర్‌గా ఉండాలి. ఈ షరతును పాటించకపోతే, మీకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది.

బ్రాండ్ ఖాతాలో ఒక ప్రధాన ఓనర్‌ను కలిగి ఉండటంతో పాటు, మీరు మీ బ్రాండ్ ఖాతాతో అనుబంధించబడిన కనీసం ఒక ఇతర ఓనర్‌ను కలిగి ఉండాలని సిఫార్సు చేయబడింది.

మీరు కొత్త ప్రధాన ఓనర్‌ను పేర్కొనలేకపోతే, మీరు ఛానెల్ అనుమతులకు సంబంధించిన సమ్మతిని నిలిపివేసినట్లు వెరిఫై చేసుకోండి. ప్రధాన ఓనర్ రోల్‌ను మార్చే ఆప్షన్ మేనేజర్‌లకు ఉండదు.

  1. మీ కంప్యూటర్‌లో, మీ Google ఖాతాకు సంబంధించిన బ్రాండ్ ఖాతాల విభాగానికి వెళ్లండి.
  2. "మీ బ్రాండ్ ఖాతాలు" కింద, మీరు మేనేజ్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
  3. అనుమతులను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. లిస్ట్ చేయబడిన మీ పేరును కనుగొనండి.
    • చిట్కా: మీరు మీ పేరును కొనుగొనలేకపోతే, మీరు మరొక ఛానెల్ ఓనర్ ద్వారా తప్పనిసరిగా ఓనర్‌గా జోడించబడాలి. ఆహ్వానాన్ని ఆమోదించి, 7 రోజులు వేచి ఉన్న తర్వాత, 1వ దశ నుండి మళ్లీ ట్రై చేయండి.
  5. మీ పేరు పక్కన, కింది వైపు బాణం గుర్తు ఆ తర్వాత ప్రధాన ఓనర్ ఆ తర్వాత బదిలీ చేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16740841054081101049
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false