మీ కంటెంట్ మేనేజర్‌కు యూజర్‌ను ఆహ్వానించండి

ఈ ఫీచర్‌లు YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించే పార్ట్‌నర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. యాక్సెస్ పొందడానికి మీ YouTube పార్ట్‌నర్ మేనేజర్‌ను సంప్రదించండి.
మీ సంస్థ కంటెంట్ మేనేజర్‌ను క్రియేట్ చేసినప్పుడు, ఒక యూజర్ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తారు. కంటెంట్‌ను మేనేజ్ చేయడానికి ఈ అడ్మినిస్ట్రేటర్, ఇతర వ్యక్తులను ఆహ్వానించవచ్చు. 

ఏ యూజర్‌కు ఏ ఫీచర్‌లు అందుబాటులో ఉండాలో, అలాగే ఏ పరిమితులు వర్తింపజేయబడాలో పేర్కొనే వివిధ రోల్స్‌ను కూడా అడ్మినిస్ట్రేటర్‌లు క్రియేట్ చేయగలరు. రోల్స్‌ను క్రియేట్ చేయడం గురించి, అలాగే మీ కంటెంట్ మేనేజర్‌ను సెటప్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

ఆహ్వానం పంపబడ్డాక, 30 రోజుల తర్వాత దాని గడువు ముగుస్తుంది.

ఒక ఆహ్వానాన్ని పంపండి

ఆహ్వానాన్ని పంపే ముందు మీరు ఆహ్వానించాలనుకుంటున్న యూజర్‌కు Google ఖాతా ఉందని నిర్ధారించుకోండి. Google ఖాతాలతో ఉన్న ఈమెయిల్ అడ్రస్‌లను మాత్రమే ఆహ్వానించడం సాధ్యపడుతుంది.

  1. Studio కంటెంట్ మేనేజర్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. అనుమతులు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. కంటెంట్ మేనేజర్‌కు యాక్సెస్ ఉన్న యూజర్‌ల లిస్ట్‌ను, అలాగే వారికి కేటాయించబడి ఉన్న రోల్‌ను ఈ పేజీ చూపుతుంది.
  4. ఆహ్వానించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఈమెయిల్ ఫీల్డ్‌లో, మీరు ఏ యూజర్‌ను అయితే ఆహ్వానించాలనుకుంటున్నారో, వారి ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
  6. యాక్సెస్ ఫీల్డ్‌లో, ఆహ్వానించబడిన యూజర్‌కు మీరు కేటాయించాలనుకుంటున్న రోల్‌ను ఎంచుకోండి. రోల్స్ గురించి మరింత తెలుసుకోండి.
  7. పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  8. ఆహ్వానాన్ని పంపడానికి, తిరిగి అనుమతుల పేజీలో సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఆహ్వానాల గడువు 30 రోజుల తర్వాత ముగుస్తుందని గుర్తుంచుకోండి.

ఆహ్వానం పంపబడినట్లు నిర్ధారించుకోండి

ఆహ్వానం పంపబడ్డాక, అనుమతుల పేజీకి దిగువున, ఆహ్వానం పంపబడిందని నిర్ధారిస్తూ ఒక మెసేజ్ కనిపిస్తుంది. మీరు తర్వాత ఎప్పుడైనా కూడా తిరిగి అనుమతుల పేజీకి వెళ్లి, ఆహ్వానం పంపారో లేదో నిర్ధారించుకోవచ్చు:

  1. ఫిల్టర్‌ను ఎంచుకోండి ని క్లిక్ చేయండి.
  2. కీవర్డ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. ఆహ్వానించబడిన యూజర్‌కు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
  4. వర్తింపజేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. వారి ఈమెయిల్ అడ్రస్ పక్కన ఆహ్వానించబడ్డారు చిహ్నం  ఉందో లేదో చెక్ చేయండి.
    • ఆహ్వానించబడ్డారు చిహ్నం ఉంటే, మీరు విజయవంతంగా ఆహ్వానాన్ని పంపారని అర్థం. ఇప్పుడు ఆ వ్యక్తి, వారి ఈమెయిల్‌లోని లింక్‌ను ఉపయోగించి ఆహ్వానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
    • ఒకవేళ ఆహ్వానించబడ్డారు చిహ్నం లేకపోతే, ఆ వ్యక్తి ఇప్పటికే ఆహ్వానాన్ని ఆమోదించారని, వారు ఇప్పుడు కంటెంట్‌ను మేనేజ్ చేయగలరని అర్థం.
    • లిస్ట్‌లో వారి ఈమెయిల్ అడ్రస్ లేకపోతే, ఆహ్వానం విజయవంతంగా పంపబడి ఉండకపోవచ్చని అర్థం. మీ వద్ద సరైన ఈమెయిల్ అడ్రస్ ఉందని నిర్ధారించుకొని, ఆహ్వానాన్ని మళ్లీ పంపండి.
గమనిక: కొన్ని థర్డ్-పార్టీ ఎక్స్‌టెన్షన్‌లు, యూజర్‌లు లేదా రోల్స్ లిస్ట్‌ను వక్రీకరించవచ్చు. అనుమతులతో మీకు ఏవైనా సమస్యలు ఉంటే, థర్డ్-పార్టీ ఎక్స్‌‌టెన్షన్‌లను ఆఫ్ చేసి, మీరు చేయాలనుకుంటున్న మార్పులను మళ్లీ చేయడానికి ట్రై చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14442233313783180184
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false