అర్హత ఉన్న కవర్ వీడియోలను మానిటైజ్ చేయడం

మ్యూజిక్ పబ్లిషర్‌లు తమ వీడియోలను క్లెయిమ్ చేసిన తర్వాత YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే క్రియేటర్‌లు అర్హత కలిగిన కవర్ సాంగ్ వీడియోల నుండి పొందిన ఆదాయాన్ని షేర్ చేయవచ్చు. ఈ వీడియోలకు సంబంధించి దామాషా పద్ధతిలో మీకు పేమెంట్ జరుగుతుంది.

మానిటైజేషన్‌కు మీ కవర్ సాంగ్ వీడియో అర్హత కలిగి ఉందా, లేదా అని తెలుసుకోవడం ఎలా

మీ కవర్ సాంగ్ వీడియో ఈ కింద పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ఉందని మీ YouTube Studioలోని కంటెంట్ పేజీ వెల్లడిస్తే, ఆ వీడియో మానిటైజేషన్‌కు అర్హత కలిగి ఉంటుంది:

  • పరిమితుల నిలువు వరుసలో కాపీరైట్ ఉండటం
  • వీడియో మానిటైజేషన్ స్టేటస్  ఆఫ్‌కు సెట్ చేసి ఉండటం
  • మౌస్ కర్సర్ ఉంచితే కనిపించే టెక్స్ట్ యాడ్ ఆదాయం షేర్ చేయడానికి అర్హత కలిగి ఉంది అని తెలియజేయడం
గమనిక: వీడియో కాపీరైట్ సమాచార పేజీలో, అలాగే మీకు పంపిన క్లెయిమ్ నోటిఫికేషన్ ఈమెయిల్‌లో కూడా ఈ సమాచారం కనిపిస్తుంది.

ప్రదర్శించిన మ్యూజికల్ కంపొజిషన్‌లో కాపీరైట్ కలిగిన మ్యూజిక్ పబ్లిషర్ లేదా పబ్లిషర్‌ల ద్వారా కంటెంట్ ID సిస్టమ్‌తో క్లెయిమ్/మానిటైజ్ చేసిన వీడియోలకు సంబంధించి ఈ మెసేజ్ కనిపిస్తుంది. కొత్త అప్‌లోడ్‌లు, అలాగే ఇంతకుముందు చేసిన అప్‌లోడ్‌లు రెండూ అర్హత కలిగి ఉండవచ్చని గమనించండి.

మీ కవర్ సాంగ్ వీడియోకు ఆదాయ షేరింగ్‌ను ఆన్ చేయడం ఎలా

  1. మీ ఖాతాకు సంబంధించి మానిటైజేషన్‌ను ఇంతకుముందు చేయకపోతే ఇప్పుడు ఆన్ చేయండి, మీ ఖాతా సెట్టింగ్స్‌లో మానిటైజేషన్ ట్యాబ్‌కు వెళ్లండి.
  2. మీ కంటెంట్ పేజీలో అర్హత కలిగిన కవర్ సాంగ్ వీడియోను కనుగొనండి.
  3. మానిటైజేషన్ స్టేటస్‌ను ఆన్‌కు మార్చండి.
  4. మీరు వీడియో మానిటైజేషన్ వివరాలకు కూడా వెళ్లి కూడా మానిటైజేషన్‌ను ఆఫ్ నుండి ఆన్‌కు మార్చవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2337983895436301922
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false