మీరు చూసే YouTube వీడియోలలో లేదా Shortsలో ప్లే అయ్యే యాడ్‌లు మీ ఆసక్తులకు అనుగుణంగా ఉంటాయి. అవి Google Ads సెట్టింగ్‌లు, మీరు చూసిన కంటెంట్, అలాగే మీరు సైన్ ఇన్ చేశారా లేదా అనే వాటిపై ఆధారపడి ఉంటాయి.
How to personalize the ads you see on YouTube and Google
తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube Viewers ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.
మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, మీకు ఏ యాడ్‌లు కనిపిస్తాయి అనే దానిని ఈ అనామక సిగ్నల్‌లు నిర్ణయించవచ్చు:
- మీరు చూసిన వీడియోల రకాలు
- మీ పరికరంలోని యాప్‌లు, మీ యాప్‌ల వినియోగం
- మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు
- మీ మొబైల్ పరికరాలతో అనుబంధించబడి ఉన్న అనామక ఐడెంటిఫయర్‌లు
- Google యాడ్‌లు లేదా అడ్వర్టయిజింగ్ సర్వీస్‌లతో మునుపటి ఇంటరాక్షన్‌లు
- మీ లొకేషన్
- వయస్సు పరిధి
- లింగం
- YouTube వీడియో ఇంటరాక్షన్‌లు
మీరు సైన్ ఇన్ చేసినా లేదా చేయకపోయినా, ఈ యాడ్‌లు మీరు చూసిన వీడియోల కంటెంట్ ఆధారంగా ఉంటాయి.
యాడ్‌లకు గోప్యతా సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి
మీ Google ఖాతా యాడ్ సెట్టింగ్‌ల ఆధారంగా మీకు కనిపించే యాడ్‌లను మీరు కంట్రోల్ చేయవచ్చు. మీరు మీ YouTube వీక్షణ హిస్టరీని చూడవచ్చు, తొలగించవచ్చు, లేదా పాజ్ చేయవచ్చు కూడా.
యాడ్‌లను ఆఫ్ చేయండి
మీరు YouTube యాడ్‌లను ఆఫ్ చేయాలనుకుంటే, యాడ్స్-లేని ఎక్స్‌పీరియన్స్ కోసం మా పెయిడ్ మెంబర్‌షిప్‌లను చూడండి.
ఏదైనా యాడ్‌ను రిపోర్ట్ చేయకుండానే దానిని చూపకుండా ఆపివేయడానికి, యాడ్ పై మరిన్ని లేదా సమాచారం యాడ్‌ను బ్లాక్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మీకు కనిపించే యాడ్‌లను నా యాడ్‌ల కేంద్రంలో అనుకూలంగా మార్చడానికి మీరు ఎంచుకుంటే మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
యాడ్‌ను రిపోర్ట్ చేయండి
మీకు నచ్చని యాడ్ ఒకవేళ మీకు కనిపించినట్లయితే, మీ యాడ్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయడానికి పైన ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. అనుచితమైనది లేదా Google యాడ్ పాలసీలను ఉల్లంఘిస్తున్న యాడ్ ఏదైనా మీకు కనిపిస్తే, దాన్ని మీరు రిపోర్ట్ చేయవచ్చు.
యాడ్‌ను రిపోర్ట్ చేయడానికి, మరిన్ని లేదా సమాచారం యాడ్‌ను రిపోర్ట్ చేయండి లేదా ఈ ఫారమ్‌ను పూరించి, సబ్మిట్ చేయడానికి ఎంచుకోండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. మా టీమ్ మీ యాడ్ రిపోర్ట్‌ను రివ్యూ చేసి, అది సమంజసమనిపిస్తే ఆ రిపోర్ట్‌పై చర్య తీసుకుంటుంది.
యాడ్‌లను రిపోర్ట్ చేయడం YouTube మొబైల్‌లో, కంప్యూటర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
లీడ్ ఫారమ్‌లలో పూరించండి
మీరు YouTubeలోని వీడియో క్యాంపెయిన్‌లో లీడ్ ఫారమ్‌ను తెరిచినప్పుడు, మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు కొన్ని ఫీల్డ్‌లు ముందే పూరించబడి ఉంటాయి.