ఛానెల్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి

మీరు YouTube Studioలో మీ ఛానెల్ సెట్టింగ్‌లను మేనేజ్ చేయవచ్చు. మీ దేశం/ప్రాంతం నుండి మీ ఛానెల్ విజిబిలిటీ వరకు ప్రతిదీ మార్చండి.

  1. YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, సెట్టింగ్‌లును ఎంచుకోండి.
  3. ఎడమ వైపు మెనూలో, ఛానెల్‌ను ఎంచుకోండి.
  4. ఛానెల్ సెట్టింగ్‌లను సెట్ చేసి, సేవ్‌ను ఎంచుకోండి.

ప్రాథమిక సమాచారం

నివాస దేశం

కింది వైపు బాణాన్ని ఉపయోగించి మీ YouTube ఛానెల్ కోసం మీరు దేశం/ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ కోసం అర్హత అనేది, మీరు ఇక్కడ ఎంచుకున్న దేశం/ప్రాంతం సెట్టింగ్‌పై ఆధారపడి ఉంటుంది.

కీవర్డ్‌లు

మీరు ఈ సెట్టింగ్‌తో మీ ఛానెల్‌కు సంబంధించిన కీవర్డ్‌లను జోడించవచ్చు.

అధునాతన సెట్టింగ్‌లు

మీ ఛానెల్ ప్రేక్షకులను సెట్ చేయండి

ఏదైనా ఒక ఛానెల్ సెట్టింగ్‌ను ఎంచుకోవడం ద్వారా మీ వర్క్‌ఫ్లోను సులభతరం చేసుకోండి. ఇప్పటికే ఉన్న, అలాగే భవిష్యత్తులో అప్‌లోడ్ చేయబోయే వీడియోలకు ఈ సెట్టింగ్ వర్తిస్తుంది. సెట్టింగ్‌ను ఎంచుకోకూడదని మీరు నిర్ణయించుకుంటే, మీ ఛానెల్‌లో ఉన్న పిల్లల కోసం రూపొందించిన ప్రతి వీడియోను మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఒక్కో వీడియోకు విడివిడిగా సెట్ చేసిన సెట్టింగ్‌లు, ఛానెల్ సెట్టింగ్‌లను ఓవర్‌రైడ్ చేస్తాయి.
అంతే కాకుండా, మీ ఛానెల్‌లో కొన్ని ఫీచర్‌లను యాక్సెస్ చేయకుండా మీపై పరిమితి కూడా విధించబడుతుంది. మీ వీడియోలు పిల్లల కోసం రూపొందించినవా, కాదా అనేది మీకు ఖచ్చితంగా తెలియకపోతే, ఈ సహాయ కేంద్రం ఆర్టికల్‌ను చూడండి.

Google Ads ఖాతాను లింక్ చేయడం

యాడ్‌లు ప్రదర్శించబడేలా చేయడానికి, మీ YouTube ఛానెల్‌ను Google Ads ఖాతాకు మీరు లింక్ చేయవచ్చు. మీ ఛానెల్ వీడియోలతో ఇంటరాక్షన్‌ల ఆధారంగా ఈ యాడ్‌లు అందించబడతాయి, అలాగే ఇవి మీకు గణాంకాలకు యాక్సెస్‌ను అందిస్తాయి. మరింత తెలుసుకోండి.

ఆటోమేటిక్ క్యాప్షన్‌లు

ఆటోమేటిక్ క్యాప్షన్‌ల సహాయంతో, అనుచితం అయ్యే అవకాశం ఉన్న పదాలను ఓపెన్ బ్రాకెట్, రెండు అండర్‌స్కోర్‌లు, అలాగే క్లోజ్డ్ బ్రాకెట్ "[ __ ]"తో ఆటోమేటిక్‌గా రీప్లేస్ చేయడాన్ని మీరు ఎంచుకోవచ్చు.

అడ్వర్టయిజ్‌మెంట్‌లు

మీరు ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే, వీక్షకుల ఆసక్తుల ఆధారంగా అందించబడే వ్యక్తిగతీకరించిన యాడ్‌లు లేదా రీమార్కెటింగ్ యాడ్‌లు ఆఫ్ చేయబడతాయి. ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేయడం వలన మీ ఛానెల్ ఆదాయం తగ్గవచ్చు. అంతే కాకుండా, పొందిన చర్యల రిపోర్ట్‌లు, అలాగే రీమార్కెటింగ్ లిస్ట్‌లు మీ ఛానెల్ విషయంలో పని చేయడం ఆగిపోతాయి.
ఛానెల్ మళ్లింపు

మీ ప్రేక్షకులను మరొక ఛానెల్‌కు మళ్లించడానికి మీరు మీ అనుకూల URL కుదించిన వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. మళ్లింపు URL ఫీల్డ్‌లో, మీ మళ్లింపు URL దారితీసే వెబ్‌సైట్ URLను ఎంటర్ చేయండి.

గమనిక: ఈ ఫీచర్‌ను తమ పార్ట్‌నర్ మేనేజర్ లేదా సేల్స్ రెప్రెజెంటేటివ్ ద్వారా ఆన్ చేసిన పార్ట్‌నర్‌లు అలాగే అడ్వర్టయిజర్‌లకు 'మళ్లింపు URLలు' అందుబాటులో ఉంటాయి.

ఉదాహరణకు, మీ URL www.youtube.com/c/YouTubeCreators అయినట్లయితే, మీరు మీ కుదించిన URL (www.youtube.com/YouTubeCreators)ను కలిగి ఉండవచ్చు, మళ్లింపు URL ఫీల్డ్‌లో www.youtube.com/user/youtubenationను లేదా www.youtube.com/channel/UCUD4yDVyM54QpfqGJX4S7ngను ఎంటర్ చేయడం ద్వారా వీక్షకులను YouTube Nation ఛానెల్‌కు పంపవచ్చు.

 
ఛానెల్ విజిబిలిటీ

ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు మీ ఛానెల్‌ను తాత్కాలికంగా దాచవచ్చు. మీ వీడియోలు, ప్లేలిస్ట్‌లు, అలాగే ఛానెల్ వివరాలు ఇకపై వీక్షకులకు కనిపించవు. 

ఛానెల్ ఓనర్‌గా, మీరు వీటిని ఇప్పటికీ చూడవచ్చు:

  • మీ ఛానెల్ పేజీ
  • మీ ఛానెల్ బ్యానర్, చిహ్నం
  • మీ వీడియోలు, ప్లేలిస్ట్‌లు
  • మీ కామెంట్‌లు, ఎనలిటిక్స్
  • మీ కమ్యూనిటీ పోస్ట్‌లు

మీరు ఎప్పుడైనా మళ్లీ మీ ఛానెల్‌ను కనిపించేలా చేయవచ్చు అలాగే మీ కంటెంట్ వీక్షకులకు పబ్లిక్‌గా కనిపిస్తుంది.

గమనిక: ఏ పార్ట్‌నర్, అడ్వర్టయిజర్ అయితే ఈ ఫీచర్‌ను తమ పార్ట్‌నర్ మేనేజర్ లేదా సేల్స్ రెప్రెజెంటేటివ్ ద్వారా ఆన్ చేయించుకుంటారో, వారికే ఆ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

ఇతర సెట్టింగ్‌లు

మీరు YouTubeలో మీ ఉనికిని మేనేజ్ చేయవచ్చు అలాగే ఈ సెట్టింగ్‌లతో శాశ్వతంగా మీ కంటెంట్‌ను తీసివేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5731382711046117804
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false