పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లను, స్పాన్సర్‌షిప్‌లను, ఎండార్స్‌మెంట్‌లను జోడించండి

మీ వీడియోలలో పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లను, ఎండార్స్‌మెంట్‌లను, స్పాన్సర్‌షిప్‌లను, లేదా ఇతర కంటెంట్‌ను చేర్చవచ్చు, అలా చేర్చిన దానిని వీక్షకులకు బహిర్గతం చేయాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న వాటిలో దేనినైనా చేర్చితే, మీ వీడియో వివరాలలో పెయిడ్ ప్రమోషన్ బాక్స్‌ను ఎంచుకోవడంద్వారా మాకు తెలియజేయాల్సి ఉంటుంది. 

అన్ని పెయిడ్ ప్రమోషన్‌లు Google యాడ్‌ల పాలసీలను, YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవ్వాలి. మీరు, మీరు పని చేసే బ్రాండ్లు, సంయుక్తంగా బ్రాండ్ల కంటెంట్‌కు సంబంధించి 'పెయిడ్ ప్రమోషన్‌'ను బహిర్గతం చేసే విషయంలో స్థానికంగా ఉన్న, చట్టపరమైన బాధ్యతలను అర్థం చేసుకొని, ఆ మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలలో ఎప్పుడు, ఎలా, ఎవరికి బహిర్గతం చేయాలి వంటి కొన్ని అంశాలు కూడా ఉంటాయి.

క్రియేటర్ పెయిడ్ ప్రమోషన్‌ను ప్రకటించిన నిర్దిష్ట వీడియోల కోసం మీరు సెర్చ్ చేయాలనుకుంటే, ఈ లింక్‌ను ఉపయోగించండి. మీరు మొబైల్ పరికరాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, వెబ్ అడ్రస్‌ను కాపీ చేయడానికి లింక్‌ను నొక్కి, పట్టుకోండి, ఆపై దాన్ని మీ బ్రౌజర్ నావిగేషన్ బార్‌లో పేస్ట్ చేయండి.
ఎక్కడ పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌లు & ఎండార్స్‌మెంట్‌లను చేర్చకూడదు

Google యాడ్‌ల పాలసీలను ఫాలో అవ్వడం అంటే కింద పేర్కొన్న ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లకు సంబంధించిన పెయిడ్ ప్రమోషన్‌లను మీ కంటెంట్‌లో చేర్చకూడదని అర్థం:

  • చట్టవిరుద్ధమైన ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు
  • సెక్స్ లేదా ఎస్కార్ట్ సర్వీస్‌లు
  • పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్
  • మెయిల్-ఆర్డర్ బ్రైడ్స్
  • మత్తు పదార్థాలు
  • ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధాలు
  • Google లేదా YouTube ద్వారా ఇంకా రివ్యూ చేయబడని ఆన్‌లైన్ జూదం సైట్‌లు
  • పరీక్షలలో మోసం చేయడానికి సంబంధించిన సర్వీస్‌లు
  • హ్యాకింగ్, ఫిషింగ్ లేదా స్పైవేర్
  • పేలుడు పదార్ధాలు
  • మోసపూరిత లేదా తప్పుదారి పట్టించే బిజినెస్‌లు

ఈ పాలసీ, వీడియోలకు, వీడియో వివరణలకు, కామెంట్‌లకు, లైవ్ స్ట్రీమ్‌లకు, Shortsకు, ఏ ఇతర YouTube ప్రోడక్ట్‌కు లేదా ఫీచర్‌కు అయినా వర్తిస్తుంది. ఈ లిస్ట్ అసంపూర్ణమైనది. కంటెంట్ ఈ పాలసీని ఉల్లంఘించవచ్చని మీరు భావిస్తే దాన్ని పోస్ట్ చేయవద్దు. 

ఉదాహరణలు

YouTubeలో అనుమతించబడని కంటెంట్‌కు సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి.

  • విద్యా రంగంలో వ్యాసాలు రాసే సర్వీస్‌కు సంబంధించిన పెయిడ్ ప్రమోషన్
  • నకిలీ పాస్‌పోర్ట్‌లను విక్రయించే వెబ్‌సైట్ లేదా 'నకిలీ అధికారిక డాక్యుమెంట్‌ల'ను క్రియేట్ చేయడానికి సంబంధించి సూచనలను అందించే వెబ్‌సైట్‌కు చెందిన పెయిడ్ ప్రమోషన్
  • నకిలీ క్రెడిట్ కార్డ్ నంబర్‌లను జనరేట్ చేసే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పెయిడ్ ప్రమోషన్
  • ప్రిస్క్రిప్షన్‌లు లేకుండా నియంత్రిత ఔషధాలను విక్రయించే ఆన్‌లైన్ ఫార్మసీకి సంబంధించిన పెయిడ్ ప్రమోషన్

మీ కంటెంట్ ఈ పాలసీని ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుంది

మీ కంటెంట్ ఈ పాలసీని ఉల్లంఘిస్తే, మేము కంటెంట్‌ను తీసివేసి, మీకు ఆ విషయాన్ని తెలియజేయడానికి ఈమెయిల్‌ను పంపుతాము. మీరు మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి అయితే, మీ ఛానెల్‌కు ఎలాంటి జరిమానా లేకుండా ఒక హెచ్చరిక అందుతుంది. హెచ్చరిక గడువు, 90 రోజుల తర్వాత ముగిసేలా చేయడానికి, మీరు పాలసీ ట్రయినింగ్‌ను తీసుకోవాలి. అయితే మీ కంటెంట్ అదే పాలసీని 90 రోజుల వ్యవధిలో ఉల్లంఘిస్తే, హెచ్చరిక గడువు ముగియదు, మీ ఛానెల్ స్ట్రయిక్‌ను అందుకుంటుంది. మీరు ట్రయినింగ్‌ను పూర్తి చేసిన తర్వాత, వేరొక పాలసీని ఉల్లంఘిస్తే, మీకు మరొక హెచ్చరిక వస్తుంది. పదే పదే పాలసీలను ఉల్లంఘించే వారిని భవిష్యత్తులో పాలసీ ట్రయినింగ్‌లను తీసుకోకుండా మేము నిరోధించే అవకాశం ఉంది.

మీరు 3 స్ట్రయిక్‌లను పొందితే, మీ ఛానెల్ రద్దు చేయబడుతుంది. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రయిక్‌ల గురించి YouTubeలో మీరు మరింత తెలుసుకోవచ్చు. 

అదనంగా, ప్రమోట్ చేయబడిన ప్రోడక్ట్ లేదా సర్వీస్ అన్ని వయస్సుల వారికి తగిన విధంగా లేకపోతే మేము కంటెంట్‌పై వయోపరిమితిని విధించవచ్చు.

పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్‌మెంట్‌లు అంటే అర్థం ఏమిటి?

పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు అంటే ఆర్థికంగా, ఇతరత్రా ప్రయోజనాలు పొందుతూ థర్డ్ పార్టీ కోసం క్రియేట్ చేయబడే కంటెంట్ భాగాలు. కంటెంట్‌లో నేరుగా ఇంటిగ్రేట్ చేయబడిన థర్డ్ పార్టీ బ్రాండ్‌ను, మెసేజ్‌ను లేదా ప్రోడక్ట్‌ను కూడా ఈ కంటెంట్ సూచిస్తుంది.

ఎండార్స్‌మెంట్‌లు అనేవి, అడ్వర్టయిజర్ కోసం (లేదా క్రియేటర్/బ్రాండ్ మధ్య సంబంధం స్పష్టంగా లేని పక్షంలో, క్రియేటర్ స్వంత బ్రాండ్‌ల కోసం) క్రియేట్ చేయబడే కంటెంట్. వీటిలోని కంటెంట్, క్రియేటర్ అభిప్రాయాలను ప్రతిబింబిస్తుందని యూజర్లు విశ్వసించే అవకాశం ఉన్న మెసేజ్ ఉంటుంది.

స్పాన్సర్‌షిప్‌లు అనేవి థర్డ్ పార్టీ ద్వారా పూర్తిగా గానీ లేదా కొంత మొత్తంలో గానీ ఫైనాన్స్ చేయబడిన కంటెంట్ భాగాలు. స్పాన్సర్‌షిప్‌లు సాధారణంగా బ్రాండ్‌ను, మెసేజ్‌ను లేదా ప్రోడక్ట్‌ను నేరుగా కంటెంట్‌లో ఇంటిగ్రేట్ చేయవు. థర్డ్ పార్టీకి సంబంధించిన బ్రాండ్‌ను, మెసేజ్‌ను లేదా ప్రోడక్ట్‌ను విడిగా ప్రమోట్ చేస్తాయి.

మీకు వర్తించే చట్టాలు పెయిడ్ ప్రమోషన్‌లను విభిన్నంగా నిర్వచించవచ్చు అని గమనించండి. క్రియేటర్‌లు, బ్రాండ్‌లు వారి అధికారిక ప్రదేశంలో అమలవుతున్న చట్టాల ప్రకారం వారి కంటెంట్‌లో పెయిడ్ ప్రమోషన్‌ను బహిర్గతం చేయడానికి సంబంధించి చట్టపరమైన బాధ్యతలను అర్థం చేసుకుని, వాటిని పూర్తిగా ఫాలో అవ్వడానికి బాధ్యత తీసుకోవాలి. చట్టపరమైన బాధ్యతలలో ఎప్పుడు, ఎలా బహిర్గతం చేయాలి, అలాగే ఎవరికి బహిర్గతం చేయాలి అనే అంశాలు ఉండవచ్చు.

క్రియేటర్‌లు, బ్రాండ్‌లు తమ స్థానిక చట్టాల ప్రకారం నిర్దిష్ట రకాల పెయిడ్ ప్రమోషన్‌లు అనుమతించబడతాయా లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు, UK, EUలో, ఆడియో విజువల్ మీడియా సర్వీసెస్ డైరెక్టివ్ ప్రకారం "పిల్లల ప్రోగ్రామ్‌లు"గా వర్గీకరించబడిన కొన్ని వీడియోలలో స్పాన్సర్‌షిప్‌లు లేదా పెయిడ్ కంటెంట్ ప్రస్తావనలను చేర్చడం నిషేధించబడవచ్చు.
నా వీడియోలో, పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్, ఎండార్స్‌మెంట్ లేదా ఇతర వాణిజ్యపరమైన అనుబంధం ఉంటే, ఆ విషయాన్ని నేను YouTubeకు తెలియజేయాలా?
మీ కంటెంట్‌లో, పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్, ఎండార్స్‌మెంట్ లేదా ఇతర వాణిజ్యపరమైన అనుబంధం ఉంటే, ఆ విషయాన్ని YouTubeకు తెలియజేయాలి. తద్వారా మేము దాన్ని యూజర్‌లకు బహిర్గతం చేయగలము. మీ అధికారిక ప్రదేశంలోని చట్టాలను బట్టి మీకు మరిన్ని బాధ్యతలు ఉండవచ్చని గమనించండి. మీరు ఆ బాధ్యతలను ఫాలో అవ్వకపోతే, మేము మీ కంటెంట్‌పై లేదా ఖాతాపై చర్య తీసుకోవచ్చు. YouTubeకు తెలియజేయడానికి:
  1. కంప్యూటర్‌లో, YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు విభాగంలో, కంటెంట్‌ను ఎంచుకోండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను క్లిక్ చేయండి.
  4. మరిన్ని ఆప్షన్‌లను ఎంచుకోండి. 
  5. "నా వీడియోలో ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్, స్పాన్సర్‌షిప్ లేదా ఎండార్స్‌మెంట్ వంటి పెయిడ్ ప్రమోషన్ ఉంది" పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
  6. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

నేను "నా వీడియోలో ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్, స్పాన్సర్‌షిప్ లేదా ఎండార్స్‌మెంట్ వంటి పెయిడ్ ప్రమోషన్ ఉంది" అనే బాక్స్‌ను ఎంచుకున్నప్పుడు ఏమి జరుగుతుంది?
మీ అధునాతన సెట్టింగ్‌లలో "కంటెంట్ డిక్లరేషన్" విభాగం కింద "వీడియోలో పెయిడ్ ప్రమోషన్ ఉంది" అనే బాక్స్‌ను ఎంచుకున్నప్పుడు, వీక్షకులకు ఉత్తమ అనుభవాన్ని అందించడానికి మీరు మాకు సహాయపడుతున్నారని అర్థం.
మేము ఇప్పటికీ ఈ వీడియోలలో యాడ్‌లను ప్రదర్శిస్తాము. వీడియోలో పెయిడ్ ప్రమోషన్ ఉంది అని మీరు మాకు తెలియజేసినప్పుడు, ఏదైనా యాడ్ మీ బ్రాండ్ పార్ట్‌నర్‌తో విభేదించే విధంగా ఉంటే, దాన్ని మేము ప్రత్యామ్నాయ యాడ్‌తో రీప్లేస్ చేయవచ్చు. అంతే కాకుండా, మీరు మాకు తెలియజేసినప్పుడు, మా ప్రస్తుత పాలసీలకు అనుగుణంగా మేము మీ వీడియోను YouTube Kids యాప్ నుండి తీసివేస్తాము.
ఈ వీడియోలలో YouTube ఇప్పటికీ యాడ్‌లను ప్రదర్శిస్తుందా?
అవును, ఈ వీడియోలలో YouTube ఇప్పటికీ యాడ్‌లను ప్రదర్శిస్తుంది.
 
కొన్నిసార్లు, పెయిడ్ ప్రమోషన్‌లు ఉన్న వీడియోలలో మీ బ్రాండ్ పార్ట్‌నర్‌కు సంబంధించిన యాడ్‌తో విభేదించే విధంగా ఉండే యాడ్‌ను వేరే యాడ్‌తో మేము రీప్లేస్ చేయవచ్చు. అడ్వర్టయిజర్‌ల ప్రయోజనాలను సంరక్షించడానికి, ఈ రీప్లేస్‌మెంట్‌ను అమలు చేస్తాము.
 
ఉదాహరణకు, మీరు కంపెనీ Aకి సంబంధించిన బ్రాండ్‌ను పేర్కొంటూ, ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లతో ఉన్న ఒక వీడియోను అప్‌లోడ్ చేశారు అనుకుందాం. అప్పుడు ఆ వీడియోకు సంబంధించిన యాడ్ స్పేస్‌ను కంపెనీ Bకి అమ్మడం అనేది అర్థరహితంగా ఉంటుంది.
నా వీడియోకు కనెక్ట్ చేయబడి ఉన్న ఏదైనా వాణిజ్యపరమైన సంబంధం గురించి నేను ఎవరికైనా చెప్పాల్సిన అవసరం ఉందా?
మీరు తెలియజేయాల్సిన అవసరం ఉండవచ్చు. పెయిడ్ ప్రమోషన్‌లో భాగమైన క్రియేటర్‌లు, బ్రాండ్‌ల విషయంలో, వేర్వేరు అధికారిక ప్రదేశాలలో వేర్వేరు ఆవశ్యకతలు ఉంటాయి. 
 
మీ కంటెంట్‌లో పెయిడ్ ప్రమోషన్ ఉన్నప్పుడు, కొన్ని అధికారిక ప్రదేశాలకు, కొందరు బ్రాండ్ పార్ట్‌నర్‌లకు అనుగుణంగా, మీ కంటెంట్‌పై ఏదైనా "వాణిజ్య సంబంధం" ప్రభావం ఉంటే, దాని గురించి వీక్షకులకు తెలియజేయాల్సి ఉంటుంది. మీకు వర్తించే పెయిడ్ ప్రమోషన్ కంటెంట్‌కు సంబంధించిన చట్టాలను, నియంత్రణలను పరిశీలించి వాటిని పాటించడం మీ బాధ్యత. 
నా వీడియోలలో పెయిడ్ ప్రమోషన్ గురించి వీక్షకులకు తెలియజేయడానికి నాకు సహాయపడే ఫీచర్ ఉందా?

ఉంది. మీ వీడియో పెయిడ్ ప్రమోషన్‌లను కలిగి ఉన్నట్లు మీరు మార్క్ చేసినప్పుడల్లా, వీడియో ప్రారంభంలో మేము ఆటోమేటిక్‌గా 10 సెకన్ల పాటు బహిర్గత మెసేజ్‌ను వీక్షకులకు చూపుతాము. ఇందులో పెయిడ్ ప్రమోషన్‌లు ఉన్నాయని వీక్షకులకు ఈ బహిర్గత మెసేజ్ తెలియజేస్తుంది, అలాగే పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్‌మెంట్‌ల గురించి అవగాహన కల్పించే ఈ పేజీకి యూజర్‌లను మళ్లిస్తుంది.

పెయిడ్ ప్రమోషన్‌లో భాగమైన క్రియేటర్‌లు, బ్రాండ్‌ల విషయంలో, వేర్వేరు అధికారిక ప్రదేశాలలో వేర్వేరు ఆవశ్యకతలు ఉంటాయి, వాటి ప్రకారం మీరు మరిన్ని ఎక్కువ పనులను చేయాల్సి రావచ్చు అని గమనించండి. కాబట్టి, వర్తించే చట్టాలను చెక్ చేసి, ఫాలో అయ్యేలా చూసుకోండి. 

అంటే నేను నా వీడియోలలో "వీడియో యాడ్‌లను (ముందస్తు యాడ్‌లు, మధ్యలో వచ్చే యాడ్‌లు, అలాగే అనంతర యాడ్‌లను)" బర్న్ చేయాలా?
లేదు. YouTubeకు సంబంధించిన యాడ్‌ల పాలసీల ప్రకారం, అడ్వర్టయిజర్ క్రియేట్ చేసిన, సరఫరా చేసిన వీడియో యాడ్‌లను లేదా ఇతర కమర్షియల్ బ్రేక్‌లను మీ కంటెంట్‌లో బర్న్ చేయడానికి లేదా పొందుపరచడానికి మీకు అనుమతి లేదు. 
 
ప్రత్యేకించి మీ కంటెంట్‌కు యాడ్‌లను అందించడానికి ఎవరైనా అడ్వర్టయిజర్ ఆసక్తిగా ఉంటే, మీ పార్ట్‌నర్ మేనేజర్‌తో కలిసి పని చేయండి. థర్డ్-పార్టీ పొందుపరిచిన స్పాన్సర్‌షిప్‌లకు సంబంధించిన మా పాలసీలలో మరింత సమాచారాన్ని చూడండి.
 
బ్రాండ్‌లు క్రియేట్ చేసిన లేదా బ్రాండ్‌ల కోసం క్రియేట్ చేసిన వీడియోలకు, అలాగే బ్రాండ్ యొక్క YouTube ఛానెల్‌కు అప్‌లోడ్ చేసిన వీడియోలకు ఈ పాలసీ వర్తించదు. 
మార్కెట్ చేసే వ్యక్తి లేదా స్పాన్సర్ బ్రాండ్ పేరు, ప్రోడక్ట్ సమాచారంతో ఉన్న టైటిల్ కార్డ్‌ను వీడియో ప్రారంభంలో/ముగింపులో నేను ఉపయోగించవచ్చా?
అవును. పెయిడ్ ప్రమోషన్ ఉన్న వీడియోలో నిశ్చలంగా ఉండే టైటిల్ కార్డ్‌లు, ముగింపు కార్డ్‌లను మేము అనుమతిస్తాము. ఈ టైటిల్ కార్డ్‌ల్లో, ముగింపు కార్డ్‌ల్లో గ్రాఫిక్స్‌ను, స్పాన్సర్‌కు లేదా మార్కెట్ చేసే వ్యక్తికి చెందిన లోగోను, ప్రోడక్ట్ బ్రాండింగ్‌ను కూడా చేర్చవచ్చు.
  • టైటిల్ కార్డ్‌లు: 5 సెకన్లు లేదా తక్కువ నిడివి ఉంటాయి, నిశ్చలంగా ఉంటాయి. అవి వీడియో ప్రారంభంలో (0:01సె) ఉంచబడితే, కార్డ్ తప్పనిసరిగా క్రియేటర్ పేరు/లోగోతో కో-బ్రాండింగ్ చేయబడాలి.
  • ముగింపు కార్డ్‌లు: వీడియో చివరి 30 సెకన్లలో ఉంచబడుతుంది, అవి తప్పనిసరిగా నిశ్చలంగా ఉండాలి. 
మరిన్ని రిసోర్స్‌లు
మరింత సమాచారం కోసం, యునైటెడ్ స్టేట్స్‌లో ఫెడరల్ ట్రేడ్ కమీషన్ (FTC), యునైటెడ్ కింగ్‌డమ్‌లో, అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ASA), ఫ్రాన్స్‌లో డైరెక్టరేట్ జనరల్ ఫర్ కాంపిటీషన్, కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ (DGCCRF), జర్మనీలో మీడియా అధికారులు మీడియా సంస్థలు, లేదా కొరియాలో కొరియా ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (KFTC) వంటి మీ స్థానిక చట్టపరమైన రిసోర్స్‌లను క్రమం తప్పకుండా చూడాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
ఈ సహాయ కేంద్రం ఆర్టికల్‌లో అందించిన సమాచారం చట్టపరమైన సలహా కాదు. మీ చట్టపరమైన ప్రతినిధుల ద్వారా చెక్ చేసుకొనే వెసులుబాటును మీకు కల్పించాలనే ఉద్దేశంతో, దీన్ని సమాచార ప్రయోజనాల కోసం అందిస్తున్నాము.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7889856339070852367
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false