మీ బ్రాండెడ్ కంటెంట్‌ను అడ్వర్టయిజర్‌కు లింక్ చేయండి

మీరు బ్రాండెడ్ కంటెంట్ క్యాంపెయిన్‌లో అడ్వర్టయిజర్‌కు పార్ట్‌నర్‌గా చేరి ఉంటే, అడ్వర్టయిజర్ ఇప్పుడు క్యాంపెయిన్ నుండి కంటెంట్‌ను వారి Google Ads ఖాతాకు లింక్ చేయడానికి రిక్వెస్ట్‌ను పంపవచ్చు. మీరు వారి రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే, అడ్వర్టయిజర్‌లు Google Adsలో కంటెంట్ పనితీరు కొలమానాలను చూడగలరు. Google Ads ప్లాట్‌ఫామ్‌లు ద్వారా అనుమతించిన మీ YouTube వీడియో వీక్షకులకు యాడ్‌లను టార్గెట్ చేసుకోవడానికి కుడా YouTube, అడ్వర్టయిజర్‌ను (ఇంకా అడ్వర్టయిజర్ Google Adsల ఖాతాకు లింక్ చేసి ఉన్న ఏవైనా సంస్థలను) అనుమతిస్తుంది.

మీ బ్రాండెడ్ కంటెంట్‌ను మీ అడ్వర్టయిజర్‌కు లింక్ చేయడం వల్ల మీకు లభించగల సహాయం:

  • బ్రాండ్‌లతో పార్ట్‌నర్‌షిప్‌లను మేనేజ్ చేయవచ్చు
  • ఆర్గానిక్ వీడియో కొలమానాలను షేర్ చేయవచ్చు
  • అడ్వర్టయిజర్‌లు మీ కంటెంట్‌ను ప్రమోట్ చేసే అవకాశాన్ని పెంచుకోవచ్చు

మీరు గతంలో పనిచేసిన అడ్వర్టయిజర్‌ల నుండి చాలా లింక్ రిక్వెస్ట్‌లు వస్తాయి, కానీ మీరు పార్ట్‌నర్‌గా చేరని బ్రాండ్‌ల నుండి మీరు రిక్వెస్ట్‌లను పొందవచ్చు. అడ్వర్టయిజర్ లింక్ రిక్వెస్ట్‌ను అంగీకరించడం, మీరు వారితో కలిసి పనిచేసినా చేయకున్నా, పూర్తిగా మీ ఇష్టం. మీరు ఎల్లప్పుడూ మీ ఛానెల్‌కు ఏది ఉత్తమమైనదో అదే చేయాలి.

మీరు వారి రిక్వెస్ట్‌ను అంగీకరిస్తే, అడ్వర్టయిజర్‌కు తగిన హక్కులను మంజూరు చేయవలసి ఉంటుందని గుర్తుంచుకోండి, తద్వారా వారు మీ వీడియోను వారి అడ్వర్టయిజింగ్‌లో ఉపయోగించగలరు, ఆ ఒప్పందంలో YouTube ప్రమేయం ఉండదు. మీరు అడ్వర్టయిజర్‌తో ఏదైనా ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు, నియమాలను అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి.

లింక్ రిక్వెస్ట్‌ను ఆమోదించండి

అడ్వర్టయిజర్ మీ కంటెంట్‌ను వారి Google Ads ఖాతాకు లింక్ చేయాలనుకున్నప్పుడు, మేము YouTube, YouTube Studioలో ఈమెయిల్ ద్వారా, అలాగే నోటిఫికేషన్‌ల ద్వారా మీకు తెలియజేస్తాము. మీరు YouTube Studio, YouTube Studio మొబైల్ యాప్, ఇంకా YouTube మొబైల్ యాప్‌లో రిక్వెస్ట్‌లను రివ్యూ చేయవచ్చు, వాటికి సమాధానం ఇవ్వవచ్చు.

మీ ఈమెయిల్‌లోని లింక్‌ను ఎంచుకుంటే, మీరు నేరుగా "బ్రాండ్ లింక్ రిక్వెస్ట్" పేజీకి వెళ్తారు, అక్కడ మీ వీడియోను లింక్ చేయవచ్చు లేదా రిక్వెస్ట్‌ను తిరస్కరించవచ్చు.

మీరు YouTube Studioలో రిక్వెస్ట్‌లను రివ్యూ చేయవచ్చు, వాటికి సమాధానం ఇవ్వవచ్చు:

  1. కంప్యూటర్‌లో, YouTube Studioకు వెళ్లండి.
  2. ఎడమ వైపు మెనూలో, కంటెంట్ ను క్లిక్ చేయండి.
  3. సంబంధిత వీడియోను కనుగొని, వీడియో థంబ్‌నెయిల్ పక్కన, వివరాలు ను క్లిక్ చేయండి.
  4. “బ్రాండ్ లింకింగ్” విభాగంలో, అడ్వర్టయిజర్ పక్కన, లింక్ రిక్వెస్ట్‌ను రివ్యూ చేయండిని క్లిక్ చేయండి.
  5. మీ వీడియోను మీరు లింక్ చేయాలనుకుంటున్నారా లేదా ఆ రిక్వెస్ట్‌ను తిరస్కరించాలనుకుంటున్నారా అనేదాన్ని ఎంచుకోండి.

మీ కంటెంట్‌ను అన్‌లింక్ చేయండి

లింక్ చేసిన వీడియోను మీరు గాని లేదా అడ్వర్టయిజర్ గాని ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్‌లింక్ చేయవచ్చు. అడ్వర్టయిజర్ నుండి వీడియోను అన్‌లింక్ చేయడానికి, మీ వీడియో కోసం “బ్రాండ్ లింకింగ్” విభాగానికి నావిగేట్ చేయండి, అడ్వర్టయిజర్ పక్కన ఉన్న అన్‌లింక్‌ను ఎంచుకోండి.

FAQలు

లింకింగ్ రిక్వెస్ట్‌లు ఎంతకాలం ఉంటాయి?

నిర్దిష్ట సమయం తర్వాత వీడియో లింక్ రిక్వెస్ట్‌ల గడువు ముగియనప్పటికీ, అడ్వర్టయిజర్ పెండింగ్‌లో ఉన్న లింక్ రిక్వెస్ట్‌ను ఉపసంహరించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వీడియోను అన్‌లింక్ చేయవచ్చు. మీ కంటెంట్‌ను అన్‌లింక్ చేయడం వలన అడ్వర్టయిజర్ వీటిని కోల్పోతారు:
  • కంటెంట్ పనితీరు కొలమానాలకు యాక్సెస్
  • లింక్ చేసిన కంటెంట్ వీక్షకులకు యాడ్‌లను టార్గెట్ చేసే సామర్థ్యం
అంతే కాకుండా, రిక్వెస్ట్ చేసిన వీడియోను తొలగించినా లేదా దాన్ని ప్రైవేట్‌గా మార్క్ చేసినా, లింక్ చేసే రిక్వెస్ట్ గడువు ముగుస్తుంది.

అడ్వర్టయిజర్ ఇప్పటికే నా వీడియోలను వారి అడ్వర్టయిజింగ్‌లో ఉపయోగిస్తుంటే, నేను నా బ్రాండ్ కంటెంట్‌ను వారి Google Ads ఖాతాకు లింక్ చేయాల్సి ఉంటుందా?

యాడ్‌లను రన్ చేయడానికి అడ్వర్టయిజర్‌లు తమ ఖాతాను మీ కంటెంట్‌కు లింక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ బ్రాండెడ్ కంటెంట్‌ను వారి ఖాతాకు లింక్ చేయమని మేము సిఫార్సు చేస్తున్నాము. లింక్ చేయడం వలన మీ బ్రాండ్ పార్ట్‌నర్‌షిప్‌ను మరింత సమర్ధవంతంగా నిర్వహించడంలో మీకు సహాయం లభిస్తుంది, ఇది అడ్వర్టయిజర్ వీడియో తాలూకు ఆర్గానిక్ పనితీరును చూసే వీలు కల్పిస్తుంది. అంతే కాకుండా, మీరు వ్యక్తిగత వీడియోను మాత్రమే లింక్ చేయడం ద్వారా మీ ఛానెల్ కంటెంట్‌కు యాక్సెస్‌ను పరిమితం చేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7427646817295445840
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false