YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియమాలకు సంబంధించిన మార్పులు

YouTubeలో మానిటైజ్ చేయడాన్ని కొనసాగించడానికి కొత్త YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియమాలను తప్పనిసరిగా జూలై 10, 2023లోపు అంగీకరించాలి. ఫిబ్రవరి 1, 2023 నుండి, లేదా ఆమోదించబడిన తేదీ నుండి Shorts యాడ్ ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించడానికి పార్ట్‌నర్‌లు కొత్త నియమాలను కూడా అంగీకరించాల్సి ఉంటుంది.

Shortsకు సంబంధించి కొత్త అర్హత ప్రమాణాలను ప్రవేశపెట్టడం, YouTubeలో సంపాదించడానికి కొత్త మార్గాలు (Shortsకు సంబంధించిన యాడ్ ఆదాయ షేరింగ్‌తో సహా), ఇంకా Creator Musicకు యాక్సెస్‌ను తెరవడం ద్వారా మేము YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)ను ఎలా విస్తరింపజేస్తున్నామో, అభివృద్ధి చేస్తున్నామో ఇటీవల అనౌన్స్ చేశాము

ఈ మార్పులను అమలు చేయడానికి, మేము కొత్త YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియమాలను రూపొందించాము. ఈ నియమాలకు సంబంధించిన తాజా మార్పులను అర్థం చేసుకోవడానికి వాటిని చదవండి, అలాగే మీ ఛానెల్ మానిటైజ్ చేయడాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోండి.

మాడ్యూల్స్‌ను పరిచయం చేస్తున్నాము

మేము కొత్త మాడ్యూల్స్‌ను చేర్చడానికి YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియమాలను పునర్నిర్మించాము, ఇవి క్రియేటర్‌లు తమ కంటెంట్ ద్వారా సంపాదించగలిగే మార్గాల్లో మరింత సౌలభ్యాన్ని అందిస్తాయి. ప్లాట్‌ఫామ్‌లో మానిటైజ్ చేయాలనుకునే క్రియేటర్‌లందరికీ ఫౌండేషనల్ ఒప్పంద నియమాలైన ప్రాథమిక నియమాలపై సంతకం చేసిన తర్వాత, సంపాదన అవకాశాలను అన్‌లాక్ చేయడానికి క్రియేటర్‌లు ఒప్పంద మాడ్యూల్స్ నుండి ఎంపిక చేసుకుని, ఎంచుకోవచ్చు. 

ప్రాథమిక నియమాలు

ప్రాథమిక నియమాలలో ఫౌండేషనల్ ప్రోగ్రామ్ నియమాలు చేర్చబడి ఉంటాయి, ఉదాహరణకు మేము మీకు ఎలా పేమెంట్ చేస్తాము, మా కంటెంట్ పాలసీలు, ఇంకా దేశం వారీ పాస్-త్రూలు, హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీల వంటి కొత్త నియమాలు. YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో ఉన్న వారు, అలాగే చేరాలనుకునే క్రియేటర్‌లందరూ ప్రాథమిక నియమాలను అంగీకరించాలి. 

వీక్షణ పేజీ మానిటైజేషన్ మాడ్యూల్

వీక్షణ పేజీ అనేది YouTube, YouTube Music, ఇంకా YouTube Kidsలోని పేజీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ వీక్షణ పేజీ, మీ వీడియోలలో నిడివి ఎక్కువ గల వాటికి లేదా లైవ్ స్ట్రీమింగ్ వీడియోలకు సంబంధించిన వివరణ కోసం, ప్లేబ్యాక్ కోసం ఉద్దేశించినది. వీక్షణ పేజీలోని నిడివి ఎక్కువ ఉన్న వీడియోల నుండి, లేదా లైవ్ స్ట్రీమింగ్ వీడియోల నుండి యాడ్ ఆదాయంతో పాటు YouTube Premium ఆదాయాన్ని సంపాదించడానికి, లేదా YouTube వీడియో ప్లేయర్ ద్వారా ఇతర సైట్‌లలో పొందుపరచబడినప్పుడు, మీరు వీక్షణ పేజీ మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించాల్సి ఉంటుంది. YPPలో ఇప్పటికే ఉన్న క్రియేటర్‌లకు సంబంధించి, వీక్షణ పేజీ నుండి యాడ్ ఆదాయాన్ని సంపాదించడం కొనసాగించడానికి మీరు ఈ మాడ్యూల్‌ను అంగీకరించాల్సి ఉంటుందని అర్థం. 

Shorts మానిటైజేషన్ మాడ్యూల్

Shorts మానిటైజేషన్ మాడ్యూల్ అనేది Shorts ఫీడ్‌లో వీడియోల మధ్య చూసిన యాడ్‌ల నుండి వచ్చే ఆదాయాన్ని షేర్ చేయడానికి మీ ఛానెల్‌ను అనుమతిస్తుంది. మీరు ఈ మాడ్యూల్‌ను అంగీకరించిన తర్వాత, ఫిబ్రవరి 1, 2023 నుండి మీ అర్హత గల Shorts వీక్షణల ద్వారా Shorts ఫీడ్ యాడ్‌లు, YouTube Premium నుండి ఆదాయాన్ని పొందడం ప్రారంభిస్తారు. మీరు ఫిబ్రవరి 1, 2023 తర్వాత ఆమోదిస్తే, మీరు అంగీకరించిన తేదీ నుండి Shorts యాడ్‌ల ఆదాయ షేరింగ్ ప్రారంభమవుతుంది. Shorts విషయంలో యాడ్‌ల ఆదాయ షేరింగ్ ఎలా పని చేస్తుందనే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, మా YouTube Shorts మానిటైజేషన్ పాలసీలను చూడండి. 

వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్ 

ఈ వాణిజ్యపరమైన ప్రోడక్ట్ మాడ్యూల్‌ను గతంలో వాణిజ్య ప్రోడక్ట్ అనుబంధ ఒప్పందం అని పిలిచే వారు. ఇది, ఛానెల్ మెంబర్‌షిప్‌లు, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ వంటి ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్లను అన్‌లాక్ చేస్తుంది. తద్వారా మీరు ఫ్యాన్స్‌తో కనెక్ట్ అయినప్పుడు సంపాదనకు అవకాశం లభిస్తుంది. ఈ నియమాలు అలాగే కొనసాగుతాయి, కాబట్టి మీరు ఇప్పటికే అంగీకరించి ఉంటే, వాటిని మళ్లీ అంగీకరించాల్సిన అవసరం లేదు.

YouTubeలో ఆదాయ షేరింగ్ గురించి, మానిటైజేషన్ ఫీచర్‌లను ఎలా ఆన్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

అప్‌డేట్ చేయబడిన నియమాలను మీరు అంగీకరించకపోతే ఏమి జరుగుతుంది

పార్ట్‌నర్‌లందరూ కొత్త YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియమాలను రివ్యూ చేసి, అర్థం చేసుకోవడం ముఖ్యం. YPPలో చేరడానికి లేదా కొనసాగడానికి ప్రాథమిక నియమాలను అంగీకరించాలి. 

Shorts యాడ్ ఆదాయ షేరింగ్ ఫిబ్రవరి 1, 2023న ప్రారంభమయింది. Shorts వీక్షణల ద్వారా యాడ్ ఆదాయాన్ని సంపాదించడాన్ని ప్రారంభించడానికి, మానిటైజింగ్ పార్ట్‌నర్‌లు ప్రాథమిక నియమాలను, Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించాలి. మీరు అంగీకరించనంత వరకు Shorts ఫీడ్ యాడ్‌ల నుండి ఆదాయాన్ని పొందలేరు. Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను అంగీకరించడానికి ముందు వచ్చిన Shorts వీక్షణలకు Shorts యాడ్ ఆదాయ షేరింగ్‌కు అర్హత ఉండదు.

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో కొనసాగడానికి, అలాగే YouTubeలో మానిటైజ్ చేయడాన్ని కొనసాగించడానికి, మానిటైజింగ్ పార్ట్‌నర్‌లందరూ జూలై 10, 2023లోపు కొత్త నియమాలను రివ్యూ చేసి, అంగీకరించాలి. పేర్కొన్న తేదీలోపు మీరు కనీసం ప్రాథమిక నియమాలను కూడా అంగీకరించకపోతే, మీ ఛానెల్ YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నుండి తీసివేయబడుతుంది, ఇంకా మీ మానిటైజేషన్ ఒప్పందం ముగించబడుతుంది. అది జరిగిన తర్వాత, మీరు తిరిగి చేరడానికి మళ్లీ అర్హతను సాధించి, మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

మీ ఛానెల్ YPP నుండి తీసివేయబడిన తర్వాత, YouTube సర్వీస్ నియమాలు ఇప్పటికీ వర్తిస్తాయని, ఇంకా మీ YouTube వినియోగం పర్యవేక్షించబడుతుందని గుర్తుంచుకోండి. మీ కంటెంట్‌ను మానిటైజ్ చేయడానికి, దానిపై యాడ్‌లను ప్రదర్శించడానికి YouTubeకు హక్కు ఉంటుంది అన్న అంశం కూడా ఇందులో ఉంటుంది. మీరు ఇంతకుముందు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉండి, ప్రస్తుతం అందులో లేకపోయినట్లయితే, మీకు ఇప్పటికీ మీ కంటెంట్‌లో యాడ్‌లు కనిపించే అవకాశం ఉంది. అయితే మీకు పేమెంట్‌ను పొందడానికి అర్హత ఉండదు. 

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు నియమాలను మాడ్యులరైజ్ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియమాలకు మాడ్యూల్స్‌ను పరిచయం చేయడం అంటే, మొత్తం మానిటైజేషన్ ఒప్పందాన్ని అప్‌డేట్ చేయకుండా లేదా మార్చకుండానే భవిష్యత్తులో కొత్త మానిటైజేషన్ అవకాశాలను జోడించవచ్చని అర్థం.

ఈ విధానం, క్రియేటర్‌లకు పారదర్శకతను, ఇంకా వారి ఛానెల్‌కు ఏ మానిటైజేషన్ అవకాశాలు సరైనవో నిర్ణయించడంలో ఫోకస్‌ను పెంచుతుంది.

నేను నిర్దిష్ట మాడ్యూల్స్‌ను అంగీకరించిన తర్వాత వాటిని నిలిపివేయవచ్చా?

అవును. మీరు క్రియేటర్ సపోర్ట్‌ను సంప్రదించడం ద్వారా ఏ సమయంలోనైనా నిర్దిష్ట మానిటైజేషన్ మాడ్యూల్స్‌ను నిలిపివేయడానికి ఎంచుకోవచ్చు.

మల్టీ ఛానెల్ నెట్‌వర్క్ (MCN)లోని ఛానెల్స్ విషయంలో ఇది ఎలా పని చేస్తుంది?

మానిటైజింగ్ పార్ట్‌నర్‌లందరూ మానిటైజ్ చేయడాన్ని కొనసాగించడానికి జూలై 10, 2023లోపు, అప్‌డేట్ చేయబడిన ప్రాథమిక నియమాలను అంగీకరించాలి. MCNను మేనేజ్ చేసే ఛానెల్ జూలై 10లోపు అంగీకరించకుండా, వారి అనుబంధ ఛానెల్ అంగీకరించినట్లయితే, అప్పుడు ఆ అనుబంధ ఛానెల్ వారి MCN నుండి రిలీజ్ చేయబడుతుంది, అలాగే వారి మానిటైజేషన్ స్టేటస్ మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఇతర YPP పార్ట్‌నర్ మాదిరిగానే పరిగణించబడుతుంది.

నేను Studio కంటెంట్ మేనేజర్‌ను (CMS) ఉపయోగిస్తున్నట్లయితే, నేను ఏ విషయాలను తెలుసుకోవాలి?

Studio కంటెంట్ మేనేజర్‌కు (CMS) యాక్సెస్ ఉన్న పార్ట్‌నర్‌లు మానిటైజేషన్ సవరణను అంగీకరించాల్సి ఉంటుంది. ఈ సవరణలో, నిడివి ఎక్కువ ఉన్న మీ కంటెంట్‌ను వీక్షణా పేజీలో మానిటైజ్ చేయడం గురించిన నియమాలు చేర్చబడి ఉంటాయి. దీనిలో ఫౌండేషనల్ ప్రోగ్రామ్ నియమాలు కూడా ఉంటాయి, ఉదా., మేము మీకు ఎలా పేమెంట్ చేస్తాము, మా కంటెంట్ పాలసీలు, ఇంకా దేశం వారీ పాస్-త్రూలు, హక్కుల క్లియరెన్స్ సర్దుబాటు ఛార్జీలు, ఇంకా రీమిక్స్ చేయడానికి అర్హత ఉన్న కంటెంట్ వంటి కొత్త నియమాలు ఉంటాయి. Shorts యాడ్ ఆదాయ షేరింగ్‌ను అన్‌లాక్ చేయాలనుకునే పార్ట్‌నర్‌లు, Shorts మానిటైజేషన్ మాడ్యూల్‌ను కూడా అంగీకరించాల్సి ఉంటుంది. 

YouTube Studio కంటెంట్ మేనేజర్‌ను ఉపయోగించే పార్ట్‌నర్‌లు కూడా జూలై 10, 2023 లోపు కొత్త నియమాలను రివ్యూ చేసి, అంగీకరించాల్సి ఉంటుంది. పేర్కొన్న తేదీలోపు మీరు కనీసం మానిటైజేషన్ సవరణను కూడా అంగీకరించకపోతే, మీ మానిటైజేషన్ ఒప్పందం ముగించబడుతుంది, అలాగే మీ ఛానెల్స్ ఇకపై YouTubeలో మానిటైజ్ చేయబడవు.
“అర్హత లేని ఆదాయాలకు” సంబంధించిన కొత్త నియమాలు మానిటైజేషన్‌ను ఎలా ప్రభావితం చేస్తాయి?

YouTube నియమాలు మేము అడ్వర్టయిజర్‌లకు, యూజర్‌లకు విలువను అందించగల ఎకో-సిస్టమ్‌ను అందిస్తున్నామని నిర్ధారించుకోవడంలో, అలాగే క్రియేటర్‌లకు బాధ్యతాయుతంగా, న్యాయంగా రివార్డ్‌ను అందించడంలో సహాయపడతాయి. నకిలీ వీక్షణల నుండి, లేదా దొంగిలించబడిన క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోళ్లు జరపడం ద్వారా అన్యాయంగా ఆదాయాన్ని పొందే ఆర్థిక మోసానికి సంబంధించిన సందర్భాలు, అడ్వర్టయిజర్‌ల, క్రియేటర్‌ల, ఇంకా వీక్షకుల నమ్మకాన్ని కోల్పోయేలా చేయడం ద్వారా ఎకో-సిస్టమ్‌ను దెబ్బతీస్తాయి. 

మేము అటువంటి దుర్వినియోగాన్ని గుర్తించినప్పుడు, సముచితమైన, సాధ్యమైన చోట, అడ్వర్టయిజర్‌లు లేదా యూజర్‌ల వంటి ప్రతికూలంగా ప్రభావితమైన పార్టీలకు రీఫండ్ చేస్తాము. YouTube ఈ ఆదాయాన్ని ఉంచుకోదు, అలాగే క్రియేటర్‌లు కూడా రీఫండ్ చేసిన ఆదాయంలో షేర్‌ను పొందకూడదు. సంబంధిత పాలసీలలో పేర్కొన్న విధంగా, మేము తీసుకునే ఏవైనా చర్యలు, పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. ఉదాహరణకు, ఆర్థిక మోసం ఫలితంగా వచ్చే ఆదాయాన్ని మేము తిరిగి పొందవచ్చు, రీఫండ్ చేయవచ్చు, అయితే వీడియోలు, మా అడ్వర్టయిజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా లేవని తర్వాత గుర్తించినట్లయితే, మేము ఆదాయాన్ని తిరిగి పొందాలని భావించము.

కొత్త YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ నియామాలలోని “అర్హత లేని ఆదాయాలు” విభాగం కొత్త పాలసీలను ప్రతిబింబించదు. బదులుగా, ఈ విభాగం ఆర్థిక మోసం వంటి సందర్భాల్లో చేసే పేమెంట్‌లలో మార్పులు లేదా ఆలస్యాల గురించి మా ప్రస్తుత ప్రోగ్రామ్ పాలసీలలో మరింత పారదర్శకతను తీసుకురావడానికి ఉద్దేశించబడింది. “అర్హత లేని ఆదాయాలు” 2 విభిన్న సందర్భాలను కవర్ చేస్తాయి, ఇందులో చెల్లని ట్రాఫిక్ వంటి నిర్దిష్ట ఉల్లంఘనల సందర్భంలో మేము ఆదాయాన్ని తిరిగి పొందవచ్చు:

  1. నియమాల ఉల్లంఘనతో సంబంధం ఉన్న ఏదైనా పార్ట్‌నర్ నికర ఆదాయాన్ని YouTube విత్‌హోల్డ్ చేయవచ్చు లేదా సర్దుబాటు చేయవచ్చు.
    1. ఉదాహరణకు, పేమెంట్ చేయడానికి ముందు మేము ఆర్థిక మోసాన్ని గుర్తిస్తే, మేము మోసం గురించి పరిశోధిస్తున్నప్పుడు ఆ విభాగానికి సంబంధించి అనుబంధిత ఆదాయాన్ని తీసివేయడానికి లేదా పేమెంట్‌ను విత్‌హోల్డ్ చేయడానికి పేమెంట్‌ను సర్దుబాటు చేయవచ్చు. 
  2. అటువంటి మొత్తాలను భవిష్యత్తులో మీకు పేమెంట్ చేయాల్సిన పార్ట్‌నర్ నికర ఆదాయం నుండి YouTube డిడక్ట్ చేయవచ్చు లేదా ఆఫ్‌సెట్ చేయవచ్చు.
    1. ఉదాహరణకు, మేము పేమెంట్ చేసిన తర్వాత ఆర్థిక మోసాన్ని గుర్తించినట్లయితే, అప్పుడు సంబంధిత మోసపూరిత ఆదాయం, ఇంకా పంపిణీ చేయకుండా ఉన్న ఏదైనా 'YouTube కోసం AdSense' బ్యాలెన్స్ నుండి డిడక్ట్ చేయబడుతుంది, లేదా భవిష్యత్తులో వచ్చే నికర ఆదాయానికి ఆఫ్‌సెట్ చేయబడుతుంది లేదా దాని నుండి డిడక్ట్ చేయబడుతుంది. ఇలా జరిగినప్పుడు, రీఫండ్‌లు మీ 'YouTube కోసం AdSense' బ్యాలెన్స్ నుండి డిడక్ట్ చేయబడతాయి, మీ బ్యాంక్ ఖాతా నుండి కాదు.
మానిటైజ్ చేసే పార్ట్‌నర్‌ల మధ్య కంటెంట్ ID క్లెయిమ్‌ల కోసం మేము ఆదాయాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాము అనే విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ సందర్భాలలో, వివాదం కొనసాగుతున్నప్పుడు మేము ఆదాయాన్ని విత్‌హోల్డ్ చేయడాన్ని కొనసాగిస్తాము.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6001534753429670912
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false