క్రియేటర్ అవార్డులకు సంబంధించిన FAQలు

YouTube క్రియేటర్ అవార్డులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు అందించడంలో, సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేయడానికి మేము కొన్ని తరచుగా అడిగే ప్రశ్నలను కలిపి అందించాము.

 YouTube క్రియేటర్ అవార్డులు

YouTube క్రియేటర్ అవార్డును మీరు అందుకోగలరో, లేదో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా? మీ ఛానెల్‌కు అర్హత ఉందో, లేదో చెక్ చేసి, ఒకవేళ అర్హత ఉంటే, మీ అవార్డు రిడెంప్షన్ కోడ్‌ను పొందండి:

నేను సబ్‌స్క్రయిబర్ మైలురాళ్లలో ఒక దాన్ని చేరుకున్నాను. నాకు నా క్రియేటర్ అవార్డు గురించిన నోటిఫికేషన్ ఎందుకు రాలేదు?

అవార్డును జారీ చేయడానికి ముందు, మేము మీ ఛానెల్‌ను రివ్యూ చేసి, అది అన్ని అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకుంటాము. మీరు గత వారం సబ్‌స్క్రయిబర్ మైలురాయిని చేరుకొని ఉంటే, క్రియేటర్ అవార్డుకు మీ ఛానెల్ అర్హత ఇంకా రివ్యూలోనే ఉండే అవకాశముంది ఎందుకంటే మా రివ్యూలకు 10 రోజుల వరకు పట్టవచ్చు.

మీ క్రియేటర్ అవార్డును మీరు రిడీమ్ చేసుకోవడం ప్రారంభించగలిగినప్పుడు, మేము మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా సంప్రదిస్తాము. మీరు ఆ నోటిఫికేషన్‌ను YouTube Studioలో బ్యానర్‌గా కూడా పొందవచ్చు.

నాకు నోటిఫికేషన్ వచ్చింది, కానీ రిడెంప్షన్ కోడ్‌ను కనుగొనలేకపోతున్నాను. అది ఎక్కడ ఉంటుంది?

మీకు YouTube Studioలో నోటిఫికేషన్ వచ్చి ఉండి, కోడ్ కనిపించకపోతే (లేదా అనుకోకుండా దాన్ని విస్మరించి ఉంటే), మా ఇంటరాక్టివ్ అర్హత చెక్‌లో ప్రాంప్ట్‌లను ఫాలో అయ్యి, మీ అవార్డు రిడెంప్షన్ కోడ్‌ను పొందండి. రిడెంప్షన్ కోడ్ దక్కిన తర్వాత, క్రియేటర్ అవార్డుల రిడెంప్షన్ వెబ్‌సైట్‌కు వెళ్లి, దాన్ని ఎంటర్ చేసి, మీ అవార్డును రిడీమ్ చేసుకోండి.

నేను నా క్రియేటర్ అవార్డును రిడీమ్ చేసుకున్నాను, కానీ అది నాకు ఎప్పుడు డెలివరీ అవుతుంది?

మీ క్రియేటర్ అవార్డును రిడీమ్ చేసిన తర్వాత, మీరు ఆటోమేటిక్‌గా ఒక నిర్ధారణ ఈమెయిల్‌ను అందుకుంటారు. సుమారు రెండు వారాల్లో, మీ అవార్డు షిప్ అయిన తర్వాత, కొరియర్ నుండి షిప్‌మెంట్ నిర్ధారణ ఈమెయిల్ మీకు వస్తుంది. మీ అవార్డు స్టేటస్‌ను, డెలివరీ తేదీని నిర్ధారించడానికి మీ షిప్‌మెంట్ నిర్ధారణ ఈమెయిల్‌ను రెఫర్ చేయండి. ప్రారంభంలో మీ ఆర్డర్ ఈమెయిల్ లేదా షిప్పింగ్ నిర్ధారణ ఈమెయిల్ మీకు కనిపించకపోతే, తప్పక మీ స్పామ్ ఫోల్డర్‌ను చెక్ చేయండి.

1 జూన్ 2023 తర్వాత రిడీమ్ చేసిన కోడ్‌ల విషయంలో, మీ ఆర్డర్ స్టేటస్‌ను మీరు ఇక్కడ ట్రాక్ చేయవచ్చు.

డెలివరీ కంపెనీ మీ నుండి అదనంగా ఏదైనా డాక్యుమెంటేంషన్‌ను లేదా సమాచారాన్ని రిక్వెస్ట్ చేస్తే, వారికి రిప్లయి ఇవ్వడం మర్చిపోకండి. మీ క్రియేటర్ అవార్డు కస్టమ్స్ దశను అధిగమించడంలో లేదా డెలివరీ చేయబడటంలో ఇది సహాయపడవచ్చు.

కింద పేర్కొన్న సాధారణ సమస్యలు ఉండవచ్చు:

  • ఆశించినదాని కంటే ఎక్కువ మొత్తంలో రిడెంప్షన్‌లు జరిగితే, ఆర్డర్‌ను పూర్తి చేయడంలో ఆలస్యం జరగవచ్చు.
  • డెలివరీ జరగడానికి మీరు పూర్తి లేదా సరైన షిప్పింగ్ సమాచారాన్ని ఇచ్చి ఉండకపోవచ్చు. సమస్య అదే అయితే, సంస్థ అవార్డుల నుండి ఈమెయిల్ కోసం చూడండి.
  • కస్టమ్స్ క్లియరెన్స్‌లు, ప్రతికూల వాతావరణం లేదా అధిక హాలిడే వాల్యూమ్ వంటి సమస్యల కారణంగా షిప్పింగ్ ప్రాసెస్‌లో ఆలస్యాలు జరగవచ్చు.

నేను నా క్రియేటర్ అవార్డును రిడీమ్ చేసుకున్నాను, కానీ దాన్ని నేను ఇంకా పొందలేదు?

మీ క్రియేటర్ అవార్డు ఇంకా డెలివరీ చేయబడకపోతే, కింది వాటిని ట్రై చేయండి:

  • మీ షిప్పింగ్ నిర్ధారణ ఈమెయిల్ ద్వారా మీకు ఈమెయిల్ చేసిన ట్రాకింగ్ నంబర్‌ను ఉపయోగించి షిప్పింగ్ స్టేటస్‌ను చెక్ చేసి, రిక్వెస్ట్ చేసిన డాక్యుమెంటేషన్ మొత్తాన్ని పూర్తి చేయండి.
  • మీ కోడ్ 1 జూన్ 2023 తర్వాత రిడీమ్ చేయబడితే, మీరు ఇక్కడ మీ ఆర్డర్ స్టేటస్‌ను ట్రాక్ చేయవచ్చు, మీ ట్రాకింగ్ నంబర్‌ను పొందవచ్చు.
  • డెలివరీ సర్వీస్‌కు మీ నుండి ఏదైనా మరింత సమాచారం లేదా డాక్యుమెంట్‌లు అవసరం ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వారిని సంప్రదించండి.

నేను ఇప్పటికే ఒక క్రియేటర్ అవార్డును కలిగి ఉన్నాను. నేను మరిన్నింటిని కొనుగోలు చేయవచ్చా?

ఒక ఛానెల్‌కు, ఒక మైలురాయికి అభినందనపూర్వకంగా ఒక అవార్డు మాత్రమే ఇవ్వబడుతుంది కాబట్టి, మీరు లేదా మీ టీమ్ మరిన్ని అవార్డులను కొనుగోలు చేయవచ్చు. అవార్డులను కొనుగోలు చేయడానికి మీ YouTube ఛానెల్‌తో అనుబంధించబడిన ఈమెయిల్‌ను ఉపయోగించి ఇక్కడ సొసైటీ అవార్డులను సంప్రదించండి. మరిన్ని అవార్డులను కొనుగోలు చేయడానికి ముందు మీ ఛానెల్, అలాగే అవార్డు స్థాయి మళ్లీ రివ్యూ చేయబడవచ్చు.

లాభం కోసం నేను నా అవార్డును అమ్మడం లేదా వేలం వేయడం చేయవచ్చా?

లేదు. క్రియేటర్ అవార్డులు వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే, మీ ఛానెల్ టీమ్ సభ్యులకు కాకుండా ఇతరులకు అమ్మడం లేదా పంపిణీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. క్రియేటర్‌లు ఈ పాలసీని ఉల్లంఘించినట్టు తేలితే, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబడవచ్చు.

క్రమశిక్షణా చర్యల్లో ఇవి ఉండవచ్చు:

  • అవార్డును వెనక్కి తీసుకోవడం
  • భవిష్యత్తు అవార్డుల కోసం అనర్హత
  • మీ YouTube లేదా Google ఖాతాను రద్దు చేసే అవకాశం

నా క్రియేటర్ అవార్డు వచ్చింది, కానీ అది పాడైంది. దాన్ని మీరు రీప్లేస్ చేయగలరా?

క్రియేటర్ అవార్డులు చేతితో తయారు చేయబడతాయి, కాబట్టి తయారీ విధానంలో చిన్న చిన్న లోపాలు, అవకతవకలు ఉండవచ్చు. ఈ చిన్న చిన్న లోపాలకు, అలాగే షిప్పింగ్ ప్రక్రియలో అవార్డులు కొద్దిగా పాడైతే, వాటికి YouTube బాధ్యత వహించదు.

మీరు పొందిన అవార్డు ఎక్కువగా దెబ్బతిని ఉంటే, అవార్డును అందుకున్న 7 రోజుల లోపు మా ప్రొడక్షన్ టీమ్‌ను ఇక్కడ సంప్రదించండి. మీరు దెబ్బతిన్న అవార్డును తిరిగి ఇచ్చిన తర్వాత వారు దానిని రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తారు.

కస్టమ్స్ డ్యూటీలు మరియు/లేదా ట్యాక్స్‌లను పే చేయాల్సిందిగా నన్ను ఎందుకు అడుగుతున్నారు?

క్రియేటర్ అవార్డును డెలివరీ చేయడానికి కొన్ని దేశాలు/ప్రాంతాలలో కస్టమ్స్ డ్యూటీలు మరియు/లేదా ట్యాక్స్‌లను పే చేయాల్సి రావచ్చు. చట్టపరంగా ఈ ఖర్చులను YouTube భరించడం సాధ్యం కాదు. అందులో కింది దేశాలు ఉంటాయి:

  • ఆర్మీనియా
  • అజర్‌బైజాన్
  • కిర్గిజ్‌స్తాన్
  • మోల్డోవా
  • ఉజ్బెకిస్థాన్

నేను అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్‌ కలిగి ఉన్న ఆర్టిస్ట్‌ను. క్రియేటర్ అవార్డు పొందడానికి నాకు అర్హత ఉందా?

అధికారిక ఆర్టిస్ట్ ఛానెల్ (OAC)గా, ఈ పేజీ ఎగువున పేర్కొన్న సబ్‌స్క్రయిబర్ మైలురాయిని, కావలసిన అర్హతలను మీరు సంపాదించినప్పుడు, మీకు క్రియేటర్ అవార్డు దక్కుతుంది. ఒక ఆర్టిస్ట్‌కు (అది కూడా ఒక మైలురాయికి మాత్రమే) అభినందనపూర్వకంగా ఒక అవార్డును మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.

మీరు ఇంతకుముందు అవార్డును పొందిన సంబంధిత ఆటోమేటిక్‌గా జెనరేట్ చేసిన టాపిక్ ఛానెల్‌ను లేదా పార్ట్‌నర్ అందించిన ఛానెల్‌ను కలిగి ఉంటే, మీ సబ్‌స్క్రయిబర్‌ల సంఖ్యలు మీ OACతో విలీనమైనప్పుడు మీరు మళ్లీ ఆ అవార్డును పొందలేరు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13764956702863186891
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false